దక్షిణ కాలిఫోర్నియా తెలుగు సంఘం వారి ‘ప్రధమ పూజ’ గత శనివారం Jan-03వ తేదిన ఇర్విన్ మందిర్ లో ఆహుతుల సమక్షంలో అట్టహాసంగా జరిగింది. ఈ సందర్బంగా సాయి బాబా మరియు బాలాజీ వెంకటేశ్వర్లకు టాస్క్ కార్యవర్గ సభ్యులు ప్రత్యేక పూజలు చేసారు. ఈ కార్యక్రమానికి పలువురు పుర ప్రముఖులు, వాలంటీర్స్ హాజరై టాస్క్ నూతన కార్య వర్గాన్ని అభినందించి ఆశీర్వదించారు. టాస్క్ AC & BoT సభ్యులు, నూతన కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు.

అలాగే ‘ప్రధమ పూజ ‘ రోజున , TASC కి విరాళం అందించే సత్ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ శ్రీ ధర్మా రెడ్డి గారు, తన ప్రధమ విరాళం టాస్క్ నూతన కార్యవర్గానికి అందించారు.

ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిధులందరికి, Dr. Prem Reddy గారికి , Sri Dharma Reddy గారికి, మరియు ఇతర AC & BOT సభ్యులకి మరియు వాలంటీర్స్ అందరికి టాస్క్ నూతన కార్యవర్గం ధన్యవాదములు తెలిపి, తదుపరి కార్యాచరణను ప్రారంభించారు.

విందు భోజనం తో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది

TASC EC 2015 Inaugural Pooja Updates 1 TASC EC 2015 Inaugural Pooja Updates