Tags Posts tagged with "Telugu Association of Greater Sacramento"

Telugu Association of Greater Sacramento

0 142

కాలిఫోర్నియా రాష్ట్రం లో ఉన్న శాక్రమెంటో తెలుగు సంఘం (టాగ్స్) 15 వ వార్షికోత్సవం మరియు సంక్రాంతి సంబరాలసందర్భం గా “మనం” సంస్థ సహకారంతో రూపుదిద్దిన “రంగస్థలం” నాటకం ఆహుతులను విశేషం గా ఆకట్టుకొన్నది. రంగవల్లులు,సంక్రాంతి జట్కా బండి, పాలవెల్లి సెట్టింగ్, మరియు 450 కు పైగా ఉన్నకళాకారులు చేసిన సందడితో సంక్రాంతి వేడుకల ప్రాంగణం లోఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. స్థానిక ఫోల్సోం నగరం లోఉన్న ఫాల్సం హై స్కూల్ ధియేటర్ లో శనివారం జనవరి 19 వతేది 2019 మధ్యాన్నం 12 గం కు మొదలైన సంక్రాంతి సంబరాలు రాత్రి 11 గం వరకు కొనసాగాయి.

శాక్రమెంటో తెలుగు సంఘం సంక్రాంతి సంబరాల లోప్రదర్శించిన ముఖ్యాంశాలు:

1.మనం సంస్థ సహకారంతో టాగ్స్ రూపుదిద్దిన “రంగస్థలం” నాటకం

 1. వేదిక పై రాధా సమేత కృష్ణ, బృందావనం లో గోపాలుడు, అన్నమాచార్య గీతా మాధురి, సాంప్రదాయ తెలుగు జానపదాలు మరెన్నొ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతోఆకట్టుకున్న450 మందికి పైగా స్థానిక కళాకారులు
 2. ప్రతిభావంతులైన స్థానిక తెలుగు బాలలకు పురస్కారాలు
 3. స్థానిక డేవిస్ నగరంలో ఉన్న ప్రీతి ఇండియన్ రెస్టారెంట్ వారిచే తెలుగు పండుగ భోజనం

సంక్రాంతి వేడుకల సందర్భం గా టాగ్స్ అధర్వంలో జరిగినసాంస్కృతిక కార్యక్రమాలు,  స్థానిక డేవిస్ నగరం లో ఉన్న స్థానిక ప్రీతి ఇండియన్ రెస్టారెంట్ వారు వండిన నొరూరుంచే గోంగూర, అరిసె, బొబ్బట్టు, గారెలతో కూడిన పసందైన తెలుగు వంటకాలు, మరి ఇంకెన్నోవిశేషాలతో ఆహుతులను అలరించాయి. కదలి రండి, కలసి రండి, సంక్రాంతి సంబరాన్ని ఉమ్మడిగా జరుపుకొందాము అని టాగ్స్ఇచ్చిన పిలుపుకు స్పందించిన స్థానిక తెలుగు కుటుంబాలు 1500 మందికి పైగా వేదిక కు తరలి వచ్చారు. ఈ సందర్భంగా గృహహింస కు బలైన అతివలను ఆదరించే కాలిఫోర్నియా లో ఉన్న స్థానిక “మై సిస్టర్స్” స్వచ్చంద సంస్థ అధికారి “సిత్రా త్యాగరాజయ్య”, 100 కు పైగా తెలుగు పుస్థకాలు రచించిన స్థానిక తెలుగు రచయిత “శ్రీ వంశీ మోహన్ మాగంటి”, సిలికానాంధ్ర  యువత సేవల ఉప అధ్యక్షురాలు శ్రీమతి స్నేహ వేదుల , సిలికానాంధ్ర వాగ్గేయకారుల సేవల విభాగం డైరక్టర్ శ్రీ వంశీ కృష్ణ నాదెళ్ళ, ప్రియమైన అతిధులు గా విచ్చేసి ఆహుతులకు వారి సంక్రాంతి సందేశం మరియూ  శుభాకాంక్షలు అందజేశారు. వారందరూ స్థానిక తెలుగుకళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలకు అచ్చెరువొందారు. టాగ్స్ కార్యవర్గ సభ్యులు వారందరినీ వేదిక పై ఆహ్వానించి ఘనం గా సన్మానం గావించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా “శ్రీ వంశీ మోహన్ మాగంటి” మాట్లాడుతూ   మనదైన తెలుగు కధ, కవిత్వం, సాహిత్యం, సంప్రదాయాలను తరువాతి తరం బాలబాలికలకు  అందజేయాలని నొక్కి చెప్పారు. సిలికానాంధ్ర గ్లోబల్ టీం సభ్యులు శ్రీ వాసు కూడుపూడి మాట్లాడుతూ  కూచిపూడి గ్రామం లో శరవేగంగా నిర్మాణమౌతున్న మల్టి స్పెషాలిటీ ఆసుపత్రి “సంజీవిని” రెండవ దశ నిర్మాణంలో పాలుపంచుకోవాలని ఆయన స్థానిక తెలుగు వారికి విజ్ఞప్తి చేశారు. కూచిపూడి గ్రామం చుట్టుపక్కల ఉన్న 150 గ్రామాలకు ఆరోగ్య సమస్యలు తీర్చే ఉద్దేశ్యంతో “సంజీవిని” ఆసుపత్రి బృహుత్ యజ్ఞానికి శ్రీకారం చుట్టామని ఆయన చెప్పారు. దాదాపు 500 కుటుంబాలకు పైగా ఉద్యోగ అవకాశాలనుకల్పించడమే కాకుండా చిన్న పిల్లలకు, మహిళలకు ఉపయోగపడే రీతిలో “సంజీవిని” ఆసుపత్రి ని తీర్చి దిద్దుతామని, ఇందుకు సహాయం చేయదలచినవారు నేరుగా సిలికానాంధ్ర ను సంప్రదించాలని శ్రీ వాసు కూడుపూడి విజ్ఞప్తి చేశారు.

 

టాగ్స్ చైర్మన్ అనిల్ మండవ, వైస్ చైర్మన్ మల్లిక్ సజ్జనగాండ్ల,  ప్రెసిడెంట్ నాగ్ దొండపాటి, సెక్రటరీ దుర్గా చింతల, కోశాధికారి మోహన్ కాట్రగడ్డ , సమాచార అధికారి రాఘవ చివుకుల  నేతృత్వంలో టాగ్స్ కార్యవర్గం ఈ సందర్భంగా  ప్రియమైన అతిధులందరికీ జ్ఞాపికలు అందజేసి ఘనసన్మానం గావించింది. శ్రీ శ్రీనివాస కళ్యాణోత్సవం సంధానకర్త శ్రీమతి ఉష మందడి ని టాగ్స్ కార్యవర్గం ఘనంగా సత్కరించింది. అనంతరం రంగస్థలం నాటికలో పల్లెటూరి రచ్చబండ సమావేశం సెట్టింగ్, పాత్రధారుల  వేషధారణ, నటన, నృత్యాలతో 50 మందికి పైగా మనం సంస్థ, స్థానిక కళాకారులు చేసిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకొంది.

ఈ సందర్భం గాప్రతిభావంతులైన పిల్లలను పోత్సహించే గత సంప్రదాయాన్నిపాటిస్తూ, టాగ్స్ కార్యవర్గ సభ్యులు ఎంపిక చేసిన స్థానికప్రతిభావంతులైన హైస్కూల్ పిల్లలు “విశృత్ నాగం, తనూష తొల్లా, ఆష్మిత రెడ్డి, హర్షిత మదుగంటి, శ్రేయ నాగులపల్లి” లకు జ్ఞాపికలు అందజేశారు. టాగ్స్ సౌజన్యం తో జరుగుతున్న శాక్రమెంటో శివారు నగరాలైన స్థానిక ఫాల్సం, రోసివిల్లి, నాటోమాస్, ఎల్ డోరాడొ  సెంటర్లలో చదువుతున్న సిలికానాంధ్ర మనబడి విద్యార్థులు చక్కని తెలుగు పద్యాలు, కధలు, పాటలు వేదికపై ప్రదర్శించారు. స్థానిక వీఎంబ్రేస్స్వచ్చంద సంస్థ వద్ద శిక్షణ పొందుతున్న ఆటిజం ఆరిన పడ్డ దివ్యాంగులైన చిన్నారులచే ప్రదర్శించబడ్డ నృత్యప్రదర్శన కు  ఆహుతులు అందరూ చప్పట్లతో ప్రోత్సహించారు. అలేఖ్య పెన్మత్స, శృతి సేథి ఈ చిన్నారులకు నృత్య శిక్షణ ఇచ్చారు.  టాగ్స్ సమాచార అధికారి రాఘవ చివుకుల సమర్పణ గావించారు. అంతకు మునుపు శనివారంజనవరి 12న శ్రీ శ్రీనివాస కల్యాణోత్సవాన్ని అదే వేదిక ప్రాంగణంలో ఉదయం 9 గం కు టాగ్స్ ఘనంగా నిర్వహించింది. .  ఈ కార్యక్రమం కోసం స్టాక్ టన్ శివ విష్ణు దేవాలయం నుండి విచ్చేసిన పూజారులు  శ్రీ శ్రీనివాస కళ్యాణోత్సవం పూజ ను నిర్వహించారు. పూజానంతరం  ప్రత్యేకంగా తయారుచేసిన తీర్ధ ప్రసాదాలను భక్తులకు టాగ్స్ కార్యకర్తలు అందజేశారు. అనంతరం జరిగిన చిన్నారులకు  భోగిపళ్లు కార్యక్రమం లో పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. రేగిపళ్ళు, పూలు, అక్షంతలతో చిన్నారులను పూజకు విచ్చేసిన  అందరూ ఆశీర్వదించారు.  

కాలిఫోర్నియా శాక్రమెంటోలో సంక్రాంతి సంబరాలు, శ్రీ శ్రీనివాస కల్యాణోత్సవ విజయవంతం కు  అహర్నిశలు కృషి చేసిన వారిలో టీఏజిఎస్ కార్యవర్గ సభ్యులు, మరియు టాగ్స్ కార్యకర్తలు ఉన్నారు

ఈ సందర్భం గా టాగ్స్ కార్యనిర్వాహక సభ్యులు అనాధ భారతీయ బాలబాలికలకు సహాయార్ధం హోప్ ఎబయ్డ్స్, ఆరతి స్వచ్ఛంద సంస్థ, హైదరాబాద్ లో ఉన్న వేగేశ్న ఫౌండేషన్, రెండు తెలుగు రాష్ట్రాల గ్రామాలలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్న సువిధా ఇంటర్నేష్నల్ ఫౌండేషన్, మరియు “వీఎంబ్రేస్” స్వచ్ఛంద సంస్థ కు టాగ్స్ ప్రత్యేకం గా విరాళాలుఅందజేస్తుంది అని, ఈ సంస్థలకు సహాయార్ధం విరాళం ఇవ్వదలచిన వారు మరింత సమాచారం కోసం [email protected] కు ఈమెయిలు లో సంప్రదించాలని టాగ్స్ కార్యనిర్వాహక సభ్యులు కోరారు.

0 655

తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ శాక్రమెంటో (TAGS) ఆధ్వర్యంలో శాక్రమెంటో శివారు నగరం ఫోల్సోం  లో  డిసెంబర్ 11, 2016 న రాంచో కార్దోవ లో  డిసెంబర్ 17 మరియు  18, 2016 న పలు  ఆటల పోటీలు ఉత్సాహంగా జరిగాయి. అమెరికా లో కాలిఫోర్నియా రాష్ట్రం శాక్రమెంటో శివారు నగరాలకు చెందిన తెలుగు కుటుంబాలకు చెందిన పిల్లలు, పెద్దలు పెద్దఎత్తున పలు ఆటల పోటీలలో పాల్గొన్నారు. ఆటలో గెలిచి తీరాలన్న లక్ష్యమే వారిని విజేతలుగా నిలిపింది. తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ శాక్రమెంటో (TAGS) ఆధ్వర్యంలో జరిగిన ఈ క్రీడా పోటీల్లో 200 మందికి పైగా  పిల్లలు, పెద్దలు పాల్గొని  సత్తా చాటారు. ఈ పోటీలను అసోసియేషన్ అధ్యక్షుడు మనోహర్ మందడి   ప్రారంభించారు. మోహన్ కాట్రగడ్డ, సందీప్ గుడుపెల్లి, శ్రీదేవి మాగంటి, కీర్తి సురం, సురేంద్రనాథ్ కొప్పారపు, శ్రీరామ్ అకిన, మమతా దాసి, నాగేశ్వరరావు దొండపాటి,  నాగేంద్రనాథ్ పగడాల, శ్రీనివాస రావు యనపర్తి, వెంకట్ నాగం, అశ్విన్ తిరునాహరి  ల పర్యవేక్షణలో చదరంగం, తెలుగు ప్రశ్నావళి, తెలుగు కధ చెప్పడం, క్యారమ్స్, గాలిపటాల తయారీ, చిత్ర లేఖనం, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, లెక్కల పోటీలు,  మరియు ముగ్గుల పోటీలు నిర్వహించారు. కాలిఫోర్నియా శాక్రమెంటో లో TAGS ఆటల పోటీలు విజయవంతం కావడానికి అహర్నిశలు కృషి చేసిన వారిలో టీఏజిఎస్ కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలు: సత్యవీర్ సురభి, అనుదీప్  గుడిపెల్లి,ధీరజ్ మద్దిని, పరాగ్ వేదపాథక్,శ్రీ రామ్ గౌర, శివ రామిశెట్టి, సందీప్ గొర్లె, కూశాలి సురేష్ కుమార్, రాకేష్ రెడ్డి  గుర్రాల, దివ్య రెడ్డి కుంభం, దర్శన్ దేవాచ, పవన్  దగ్గుబాటి, అనిత వినయ్, గోపి, కొల్లి, పూజ, శిరీష మారేపల్లి తదితరులు ఉన్నారు. చదరంగం పోటీల నిర్వహణకు విశేష సహకారం అందించిన చదరంగం గురు “బ్రహ్మ మొహంతి” కు  TAGS కార్యవర్గ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక “చికాగో పిజ్జా విత్ ఎ ట్విస్ట్” రెస్టారెంట్ వారు అందించిన నోరూరించే ఇండియన్  పిజ్జాలు అందరినీ అలరించాయి. విజేతల వివరాలను అసోసియేషన్ అధ్యక్షుడు మనోహర్ మందడి  ప్రకటించారు. విజేతలకు జనవరి 14, 2017 న జరుగబొనున్న TAGS 13 వ వార్షికోత్సవం మరియు సంక్రాంతి సంబరాల సందర్భంగా బహుమతులు అందజేయడం జరుగుతుందని నిర్వాహకులు ప్రకటించారు.

 

అమెరికా లో కాలిఫోర్నియా రాష్ట్రం లో ఉన్న శాక్రమెంటో తెలుగు సంఘం (TAGS) 13 వ వార్షికోత్సవం మరియు సంక్రాంతి సంబరాల కు ఏర్పాట్లు శరవేగంగా  జరుగుతున్నాయి. స్థానిక కళాకారులు సంక్రాంతి వేడుకల ప్రాంగణం ను తమ ఆట పాటలతో అలరించబోతున్నారు. స్థానిక ఫోల్సోం నగరం లో ఉన్న ఫోల్సోం హై స్కూల్ ధియేటర్ లో శనివారం జనవరి 14 వ తేది 2017 మధ్యాన్నం 12 గంటలకు శాక్రమెంటో తెలుగు సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబారాలు మొదలయ్యి, రాత్రి 10 గంటలకు ముగుస్తాయి. వివిధ సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనకు 250 మందికి పైగా స్థానిక కళాకారులు సంసిద్ధులు అవుతున్నారు. ఈ సందర్భం గా వివిధ  కళా రూపాల ప్రదర్శన  తో ప్రేక్షకులను అలరింప జేయడానికి శాక్రమెంటో తెలుగు సంఘం కార్యవర్గ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మరుగునపడిన కళల వికాసానికి శాక్రమెంటో తెలుగు సంఘం చేస్తున్న సాంస్కృతిక కృషి కి అందరు పెద్ద ఎత్తున హాజరై సహకరించాలని కార్యవర్గ సభ్యులు ఈ సందర్భం గా విజ్ఞప్తి చేసారు. TAGS సంక్రాంతి సంబరాల  కార్యక్రమాలకు సంబంధించి మరిన్ని వివరాలను తెలుసు కోవాలనుకునే వారు http://www.sactelugu.org లేదా https://www.facebook.com/SacTelugu ను సందర్శించాలని లేదా [email protected] కు ఈమెయిలు లో సంప్రదించాలని ఈ సందర్భంగా  TAGS కార్యనిర్వాహక సభ్యులు కోరారు.

 

tags-telugu-association-sports-event-2016-1 tags-telugu-association-sports-event-2016-2 tags-telugu-association-sports-event-2016-3 tags-telugu-association-sports-event-2016-4 tags-telugu-association-sports-event-2016-5 tags-telugu-association-sports-event-2016-6 tags-telugu-association-sports-event-2016-7 tags-telugu-association-sports-event-2016-8 tags-telugu-association-sports-event-2016-9 tags-telugu-association-sports-event-2016-10 tags-telugu-association-sports-event-2016-11 tags-telugu-association-sports-event-2016-12

0 1186

కాలిఫోర్నియా రాష్ట్రం లో ఉన్న శాక్రమెంటో తెలుగు సంఘం 12 వ వార్షికోత్సవం మరియు సంక్రాంతి సంబరాల సందర్భం గా సిలికానాంధ్ర వారి సహకారం తో రూపొందించిన పూర్తి నిడివి జానపద రూపకం “మన జానపద జాతర” ఆహుతులను విశేషం గా ఆకట్టుకొన్నది. హరిదాసులు, గంగిరెద్దులు, రంగవల్లులు, ఎద్దులబండి, పల్లె సెట్టింగ్, మరియు జానపద కళాకారులు చేసిన సందడితో సంక్రాంతి వేడుకల ప్రాంగణం లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. స్థానిక ఫోల్సోం నగరం లో ఉన్న ఫాల్సం హై స్కూల్ ధియేటర్ లో శనివారం జనవరి 30 వ తేది 2016 మధ్యాన్నం 12 గంటలకు మొదలైన సంక్రాంతి సంబరాలు రాత్రి 11 గం వరకు కొనసాగాయి.

 

శాక్రమెంటో తెలుగు సంఘం సంక్రాంతి సంబరాల లో ప్రదర్శించిన ముఖ్యాంశాలు:

 1. శాక్రమెంటో లో పూర్తి నిడివి జానపద రూపకం “మన జానపద జాతర”.
 2. జానపద రూపకం లో “ప్రత్యక్ష గానం, మరియు డప్పు తో” అలరించిన జానపద కళా ప్రపూర్ణ “డా. లింగా శ్రీనివాస్“
 3. జానపద గీతాలతో, నృత్యాలతో ఆకట్టుకున్న నిరుపమ చేబియం బృందం
 4. జానపద నృత్య రూపకర్త స్నేహ వేదుల రూపొందించిన బోనాలు ,లంబాడి నృత్యాలు
 5. సిద్ధార్థ్ మార్గదర్శకత్వం లో మానస రావు బృందం చే అల్ట్రా వయోలేంట్ సాంస్కృతిక ప్రదర్శన
 6. గ్రామీణ మరియు గిరిజన నృత్య రూపాలైన లంబాడి, కోయ, కోలాటం, చెక్కభజన, హరిదాసులు, గంగిరెద్దులు, రంగవల్లులు తో కలిపిన జానపద నృత్యాలతో, పాటలతో సందడి చేసిన 50 మందికి పైగా స్థానిక కళాకారులు.
 7. డోలక్ తో ఉర్రూతలూగించిన”బాలాజీ”, కీబోర్డ్ వాద్య సంగీతం తో ఆకట్టుకొన్న “సందీప్ మాండలిక”.
 8. వేదిక పై వివిధ ఇతర సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్న300 మందికి పైగా స్థానిక కళాకారులు.
 9. భోజన విరామ సమయం లో 1000 మందికి పైగా ఆహుతులను లలిత సంగీతం, సినీ గీతాలతో ఆకట్టుకున్న చిన్నారులు, పెద్దలు.

 

సంక్రాంతి వేడుకల సందర్భం గా TAGS అధర్వంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు, పూర్తి నిడివి జానపద రూపకం “మన జానపద జాతర”, వేదిక పై ఉన్న 300 మందికి పైగా స్థానిక కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు,స్థానిక రుచి రెస్టారెంట్ వారు వండిన నొరూరుంచే పసందైన తెలుగు వంటకాలు, మరి ఇంకెన్నో విశేషాలతో ఆహుతులను అలరించాయి. కదలి రండి, కలసి రండి, సంక్రాంతి సంబరాన్ని ఉమ్మడిగా జరుపుకొందాము అని TAGS ఇచ్చిన పిలుపుకు స్పందించిన స్థానిక తెలుగు కుటుంబాలు 1000 మందికి పైగా వేదిక కు తరలి వచ్చారు. ఈ సందర్భం గా అవంతీ కల్యాణం, మేఘ నవలా రచయిత్రి, దేవులపల్లి కృష్ణ శాస్త్రి మనవరాలు శ్రీమతి లలిత రామ్ ముఖ్య అతిధి గా విచ్చేసి ఆహుతులకు సంక్రాంతి సందేశాన్ని అందజేశారు. మనదైన తెలుగు సంస్కృతి, కవిత్వం, సాహిత్యం, సంప్రదాయాలను తరువాతి తరం వారికి అందజేయాలని వారు నొక్కి చెప్పారు. టాగ్స్ తరపున చైర్మన్ రాంబాబు బావిరిశెట్టి, అధ్యక్షులు వెంకట్ నాగం, మరియు కార్యవర్గం సభ్యులు శ్రీమతి లలిత రామ్ గారికి వేదిక పై ఘనం గా సన్మానం గావించి జ్ఞాపిక ను అందజేశారు. ప్రియమైన అతిధి గా విచ్చేసిన స్క్రీన్ ప్లే రైటర్, నిర్మాత, సంభాషణ రచయిత, దర్శకుడు, శ్రీ కోన వెంకట్ స్థానిక తెలుగు కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలకు అచ్చెరువొందారు. శాక్రమెంటో తెలుగు సంఘం కార్యవర్గ సభ్యులు శ్రీ కోన వెంకట్ ను వేడుక పై సాదరంగా ఆహ్వానించి కు వేదిక పై ఘనం గా సన్మానం గావించారు. అపజయాలతో క్రుంగిపోకుండా నేను చేసిన నిరంతర ప్రయత్నమే నన్ను ఈస్థాయి కి నిలబెట్టింది అని, ప్రయత్నిస్తే విజయం తధ్యమని శ్రీ కోన వెంకట్ సందేశం ఇచ్చారు. శాక్రమెంటో తెలుగు సంఘం సభ్యులకు శ్రీ కోన వెంకట్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసారు. మరో ప్రియమైన అతిధి గా విచ్చేసిన సిలికానాంధ్ర వైస్ చైర్మన్ శ్రీ దిలీప్ కొండిపర్తి గారిని TAGS అధక్షులు వెంకట్ నాగం సభికులకు పరిచయం చేసారు. ఈ సందర్భం దిలీప్ కొండిపర్తి గారు మాట్లాడుతూ 2004 లో మొట్టమొదటి సారిగా TAGS శాక్రమెంటో లో సంక్రాంతి సంబరాలను జరిపిందని, ఇప్పుడు వరుసగా 12వ సారి సంక్రాంతి సంబరాలను జరుపుకోవడం ఆనందంగా ఉందని, ఈ రెండు వేడుకల్లో కుడా సిలికానాంధ్ర బృందం TAGS వారి సంక్రాంతి సంబరాల సాంస్కృతిక కార్యక్రమాలలో పాలుపంచుకోవడం మరింత ఆనందం గా ఉందని, మనదైన సంస్కృతి, సంప్రదాయాన్ని పిల్లలకు అందించడానికి ఇటువంటి వేడుకలు అవసరం అని నొక్కి చెప్పారు. తెలుగు వారి కూచిపూడి నాట్యానికి పుట్టినిల్లు అయినటువంటి కూచిపూడి గ్రామం దీనావస్థ లో ఉందని, దీనికి మెరుగుపరచడానికి జయహో కూచిపూడి కార్యక్రమానికి, స్థానిక మనబడి కి చేయుతనివ్వాలని శ్రీ దిలీప్ కొండిపర్తి నొక్కి చెప్పారు.

TAGS Sankranti Sambaraalu 2016 (5) TAGS Sankranti Sambaraalu 2016 (15)

ఈ సందర్భం గా TAGS రూపొందించిన 5వ సమాచార పత్రిక ను శ్రీమతి లలిత రామ్, శ్రీ కోన వెంకట్,   స్థానిక తెలుగు ప్రముఖులు శ్రీ శివాజీ వల్లూరుపల్లి గారు ఆవిష్కరించారు. TAGS సౌజన్యం తో జరుగుతున్న సిలికానాంధ్ర మనబడి కి మూడు ఏండ్లగా ఉపాధ్యాయులుగా ఉండి శాక్రమెంటో లో తెలుగు భాషా వ్యాప్తి కి కృషి చేస్తున్న శ్రీ ప్రసాద్ పన్నాల, శ్రీమతి విజయలక్ష్మి పన్నాల గార్లు శాక్రమెంటో లో జరుగుతున్న స్థానిక మనబడి పిల్లలతో చక్కని తెలుగు పద్యాలు, కధలు, పాటలు పాడించారు. ఈసందర్భం గా ప్రతిభావంతులైన పిల్లలను పోత్సహించే గత సంప్రదాయాన్ని పాటిస్తూ, టాగ్స్ కార్యవర్గ సభ్యులు స్థానిక ప్రతిభావంతులైన పిల్లలు సుకీర్త్ మందడి, తేజ స్నర్ర, విజయ్ రావి లకు జ్ఞాపికలు అందజేశారు. బోర్డు సభ్యులు మోహన్ కాట్రగడ్డ వందన సమర్పణ గావించారు. జగిత్యాల నుండి TAGS సంక్రాంతి సంబరాలకు ప్రత్యేకంగా విచ్చేసిన డా. లింగా శ్రీనివాస్ డప్పు తో, జానపద పాటలతో, స్థానిక కళాకారులతో చేసిన నృత్యాలతో వేదిక దద్దరిల్లింది. ఈ సందర్భం గా TAGS తరపున అధ్యక్షులు వెంకట్ నాగం డా. లింగా శ్రీనివాస్ కు జ్ఞాపిక ను ప్రదానం చేసారు. శాక్రమెంటో తెలుగు సంఘం సభ్యులను ఉద్దేశించి ప్రసంగించిన ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గౌ. కె .ఈ. కృష్ణ మూర్తి గారి వీడియో , మరియు తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ గౌ. శ్రీ మామిడి హరికృష్ణ గారి సంక్రాంతి అభినందనల వీడియో ను వేదిక పై ప్రదర్శించారు. కాలిఫోర్నియా శాక్రమెంటో లో సంక్రాంతి సంబరాలు విజయవంతం కావడానికి అహర్నిశలు కృషి చేసిన వారిలో టీఏజిఎస్ కార్యవర్గ సభ్యులు మనోహర్ మందడి, శ్రీదేవి మాగంటి, రాజా రామ్ ముమ్మడవరపు, వనిత ఆలపాటి, మోహన్ కాట్రగడ్డ, దుర్గా చింతల, స్వర్ణ కంభంపాటి,అశ్విన్ తిరునాహరి, గిరి టాటిపిగారి, సుధాకర్ వట్టి, రాంబాబు బావిరిశెట్టి, మల్లిక్ సజ్జనగాండ్ల, గిరిధర్ టాటిపిగారి, కీర్తి సురం, వాసు కుడుపూడి, భాస్కర్ దాచేపల్లి, వెంకట్ నాగం, TAGS కార్యకర్తలు తదితరులు పాల్గోన్నారు. ఈ సందర్భం గా TAGS కార్యనిర్వాహక సభ్యులు వికలాంగుల సహాయార్ధం తిరుపతి లో ఉన్న అభయ క్షేత్రం అనే సంస్థ కు, అనాధ భారతీయ బాలబాలికలకు సహాయార్ధం హోప్ ఎబయ్డ్స్, వేగేశ్న ఫౌండేషన్ హైదరాబాద్, మరియు నా ఇటుక – నా అమరావతి కి TAGS ప్రత్యేకం గా విరాళాలు అందజేస్తుంది అని, ఈ సంస్థలకు సహాయార్ధం విరాళం ఇవ్వదలచిన వారు మరింత సమాచారం కోసం [email protected] కు ఈమెయిలు లో సంప్రదించాలని TAGS కార్యనిర్వాహక సభ్యులు కోరారు. సంక్రాంతి సంబరాల ఫోటోలను ఫేస్ బుక్ https://www.facebook.com/SacTelugu/photos_stream లో చూడవచ్చు. TAGS చేపట్టబోయే కార్యక్రమాలకు సంబంధించి మరిన్ని వివరాలను తెలుసుకోవాలనుకునేవారు http://www.sactelugu.org , https://www.facebook.com/SacTelugu ను సందర్శించాలని లేదా [email protected] కు ఈమెయిలు లో సంప్రదించాలని TAGS కార్యనిర్వాహక సభ్యులు కోరారు.

TAGS Sankranti Sambaraalu 2016 (1) TAGS Sankranti Sambaraalu 2016 (2) TAGS Sankranti Sambaraalu 2016 (3) TAGS Sankranti Sambaraalu 2016 (4) TAGS Sankranti Sambaraalu 2016 (6) TAGS Sankranti Sambaraalu 2016 (7) TAGS Sankranti Sambaraalu 2016 (8) TAGS Sankranti Sambaraalu 2016 (9) TAGS Sankranti Sambaraalu 2016 (10) TAGS Sankranti Sambaraalu 2016 (12) TAGS Sankranti Sambaraalu 2016 (13) TAGS Sankranti Sambaraalu 2016 (14) TAGS Sankranti Sambaraalu 2016 (16) TAGS Sankranti Sambaraalu 2016 (17) TAGS Sankranti Sambaraalu 2016 (18) TAGS Sankranti Sambaraalu 2016 (20) TAGS Sankranti Sambaraalu 2016 (21) TAGS Sankranti Sambaraalu 2016 (22) TAGS Sankranti Sambaraalu 2016 (23) TAGS Sankranti Sambaraalu 2016 (24) TAGS Sankranti Sambaraalu 2016 (25) TAGS Sankranti Sambaraalu 2016 (26) TAGS Sankranti Sambaraalu 2016 (28) TAGS Sankranti Sambaraalu 2016 (29) TAGS Sankranti Sambaraalu 2016 (31) TAGS Sankranti Sambaraalu 2016 (32)

0 951

తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ శాక్రమెంటో (TAGS) ఆధ్వర్యంలో శాక్రమెంటో శివారు నగరం రాంచో కార్దోవ లో నార్త్ కాలిఫోర్నియా బాడ్మింటన్ క్లబ్ క్రీడా ప్రాంగణంలో శనివారం జనవరి 9, 2016 న ఆటల పోటీలు ఉత్సాహంగా జరిగాయి. అమెరికా లో కాలిఫోర్నియా రాష్ట్రం శాక్రమెంటో శివారు నగరాలకు చెందిన తెలుగు కుటుంబాలకు చెందిన పిల్లలు, పెద్దలు పెద్దఎత్తున పలు ఆటల పోటీలలో పాల్గొన్నారు. ఆటలో గెలిచి తీరాలన్న లక్ష్యమే వారిని విజేతలుగా నిలిపింది. తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ శాక్రమెంటో (TAGS) ఆధ్వర్యంలో జరిగిన క్రీడా పోటీల్లో పిల్లలు, పెద్దలు పాల్గొని సత్తా చాటారు. ఈ పోటీలను అసోసియేషన్‌ అధ్యక్షుడు వెంకట్ నాగం ప్రారంభించారు. శ్రీదేవి మాగంటి, వనిత ఆలపాటి, మనోహర్ మందడి, మోహన్ కాట్రగడ్డ, దుర్గ చింతల, మల్లిక్ సజ్జనగాండ్ల, కీర్తి సురం, గిరి టాటిపిగారి, అశ్విన్ తిరునాహరి ల పర్యవేక్షణలో చదరంగం, తెలుగు ప్రశ్నావళి, తెలుగు కధ చెప్పడం, క్యారమ్స్, గాలిపటాల తయారీ, చిత్ర లేఖనం, బ్యాడ్మింటన్, మరియు ముగ్గుల పోటీలు నిర్వహించారు. కాలిఫోర్నియా శాక్రమెంటో లో TAGS ఆటల పోటీలు విజయవంతం కావడానికి అహర్నిశలు కృషి చేసిన వారిలో టీఏజిఎస్ చైర్మన్ వాసు కుడుపూడి, అధ్యక్షులు వెంకట్ నాగం, కార్యవర్గ సభ్యులు మనోహర్ మందడి, గిరిధర్ టాటిపిగారి, శ్రీదేవి మాగంటి, వనిత ఆలపాటి, రాజా రామ్ ముమ్మడవరపు, వనిత ఆలపాటి, మోహన్ కాట్రగడ్డ, అబ్దుల్ షైక్, దుర్గా సాయి చింతల, స్వర్ణ కంభంపాటి,అశ్విన్ తిరునాహరి, గిరి టాటిపిగారి, సుధాకర్ వట్టి, రాంబాబు బావిరిశెట్టి, మల్లిక్ సజ్జనగాండ్ల, భాస్కర్ దాచేపల్లి, కీర్తి సురం తదితరులు, మరియు TAGS కార్యకర్తలు ఉన్నారు. చదరంగం పోటీల నిర్వహణకు విశేష సహకారం అందించిన చదరంగం గురు “బ్రహ్మ మొహంతి” కు, తెలుగు కధ చెప్పడం పోటీ ని ప్రోత్సహించిన వంశీ మాగంటి కు TAGS కార్యవర్గ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక “చికాగో పిజ్జా విత్ ఎ ట్విస్ట్” రెస్టారెంట్ వారు అందించిన నోరూరించే ఇండియన్ పిజ్జాలు అందరినీ అలరించాయి. విజేతల వివరాలను అసోసియేషన్‌ అధ్యక్షుడు వెంకట్ నాగం ప్రకటించారు.

 

విజేతలకు జనవరి 30, 2016 న జరుగబొనున్న TAGS 12 వ వార్షికోత్సవం మరియు సంక్రాంతి సంబరాల సందర్భంగా బహుమతులు అందజేయడం జరుగుతుందని నిర్వాహకులు ప్రకటించారు. అమెరికా లో కాలిఫోర్నియా రాష్ట్రం లో ఉన్న శాక్రమెంటో తెలుగు సంఘం (TAGS) 12 వ వార్షికోత్సవం మరియు సంక్రాంతి సంబరాల కు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. స్థానిక కళాకారులు, మరియు పలు జానపద కళాకారులు సంక్రాంతి వేడుకల ప్రాంగణం ను తమ ఆట పాటలతో అలరించబోతున్నారు. స్థానిక ఫోల్సోం నగరం లో ఉన్న ఫోల్సోం హై స్కూల్ ధియేటర్ లో శనివారం జనవరి 30 వ తేది 2016 మధ్యాన్నం 12 గంటలకు శాక్రమెంటో తెలుగు సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబారాలు మొదలయ్యి, రాత్రి 10 గంటలకు ముగుస్తాయి. వివిధ సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనకు 250 మందికి పైగా స్థానిక కళాకారులు సంసిద్ధులు అవుతున్నారు. ఈ సందర్భం గా జానపద కళా రూపాల జాతర తో ప్రేక్షకులను అలరింప జేయడానికి శాక్రమెంటో తెలుగు సంఘం కార్యవర్గ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మరుగునపడిన కళల వికాసానికి శాక్రమెంటో తెలుగు సంఘం చేస్తున్న సాంస్కృతిక కృషి కి అందరు పెద్ద ఎత్తున హాజరై సహకరించాలని కార్యవర్గ సభ్యులు ఈ సందర్భం గా విజ్ఞప్తి చేసారు. TAGS సంక్రాంతి సంబరాల కార్యక్రమాలకు సంబంధించి మరిన్ని వివరాలను తెలుసు కోవాలనుకునే వారు http://www.sactelugu.org లేదా https://www.facebook.com/SacTelugu ను సందర్శించాలని లేదా [email protected] కు ఈమెయిలు లో సంప్రదించాలని ఈ సందర్భంగా TAGS కార్యనిర్వాహక సభ్యులు కోరారు.

Telugu Association of Greater Sacramento (TAGS) Sports event 2 Telugu Association of Greater Sacramento (TAGS) Sports event 3 Telugu Association of Greater Sacramento (TAGS) Sports event 4 Telugu Association of Greater Sacramento (TAGS) Sports event 5 Telugu Association of Greater Sacramento (TAGS) Sports event 6 Telugu Association of Greater Sacramento (TAGS) Sports event 7 Telugu Association of Greater Sacramento (TAGS) Sports event 8 Telugu Association of Greater Sacramento (TAGS) Sports event

0 1487

Telugu Association of Greater Sacramento (TAGS) is celebrating its 12th Anniversary and Sankranti Celebrations are on January 30th 2016 in Folsom. TAGS is inviting members & friends of our community to perform their talent at this wonderful event. If you are interested in participating in the cultural programs, please send in your entries no later than November 1st, 2015 to [email protected] with the following information:​

1)Performance Type (Classical/Semi-classical/Folk songs/Instrumental/Skit etc.):
2)Performance Duration (4 – 6 minutes):
3)Number of Participants:
4)Age Group (Children/Adult/Mix):
5)Contact Person Name:
6)Phone:
7)Email:​

Selection of cultural programs will be based on the following criteria: ​

1)Performance Type (Classical/Semi-classical/Folk songs/Instrumental/Skit etc.);
2) Performance Duration (4 – 6 minutes);
3)Minimum number of participants: 6;
4)Minimum Age: 5 Years ​

Entries in each category are limited and will be accepted on a first-come-first-serve basis. Individuals who are interested to perform but do not have a group formed can send their name and contact info to us. TAGS Cultural Committee will coordinate with you and do its best to accommodate you into an appropriate program.​

Cultural Committee will review all entries and will notify you by November 9th, 2015. For cultural program entry registration, volunteering and any other questions, please send us an email to [email protected] We look forward to your participation in this mega event.​

Interested in Event Sponsorship or Stalls Information? ​Pl contact Mohan @480-299-9474 or email [email protected]

TAGS 12th Anniversary & Sankranti Sambaraalu Sat January 30th, 2016​ TAGS 12th Anniversary & Sankranti Sambaraalu Sat January 30th, 2016​

0 1129

తెలుగు అసోసియేషన్ శాక్రమెంటో (టీఏజీఎస్) సౌజన్యంతో కాలిఫోర్నియా శాక్రమెంటో శివారు నగరం ఫాల్సోం గోల్డ్ రిడ్జ్ స్కూల్ లో ఉన్న‌ కాన్ఫరెన్స్‌ హాలు లో శనివారం సెప్టెంబర్ 12, 2015 న సిలికానాంధ్ర మనబడి తెలుగు తరగతులు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ప్రియ అతిధులు సిలికానాంధ్ర మనబడి ఆర్ధిక వ్యవహారాల కార్యదర్శి దీనబాబు కొండుభట్ల మాట్లాడుతూ, కాలిఫోర్నియా శాక్రమెంటోలో మనబడి ప్రారంభించాలన్న సిలికానాంధ్ర చిరకాల కోరిక టీఏజీఎ సౌజన్యంతో 2 ఏండ్ల క్రితం నెరవేరింది అన్నారు. పిల్లలతో ఎటువంటి సమస్యలేదని, వారు త్వరగా తెలుగు నేర్చుకొంటారు అని, అయితే వారి కృషికి తల్లిదండ్రులు కూడా తోడ్పడాలని వారు విజ్ఞప్తి చేసారు. శాక్రమెంటో లో ఉన్న తెలుగు కుటుంబాలకు చెందినా చిన్నారులకు తెలుగు భాష నేర్పించాలన్న టీఏజీఎస్ ఆశయానికి తమ తోడ్బాటు సదా ఉంటుందని చెప్పారు. వారితో పాటు సిలికానాంధ్ర మనబడి పరిపాలన విభాగ కార్యదర్శి శ్రీవల్లి కొండుభట్ల 2015-2016 సంవత్సరానికి మనబడి తరగతులలో చేరిన విద్యార్ధులకు శుభాకాంక్షలు తెలిపారు.

మరొ ప్రియమైన అతిధి స్థానిక కాలిఫోర్నియా యూనివర్సిటీ డేవిస్ కాంపస్ ప్రొఫెసర్ డా శివాజీ రావు వల్లురుపల్లి ఈసందర్భంగా పిల్లలకు తెలుగు నేర్పడానికి టీఏజీఎస్ చేస్తున్న ఈచిన్న ప్రయత్నానికి ప్రోత్సాహం ఇవ్వాలని శాక్రమెంటో తెలుగువారందరికీ విజ్ఞప్తి చేసారు.

స్థానిక కాలిఫోర్నియా యూనివర్సిటీ డేవిస్ కాంపస్ కు చెందిన మరో ప్రొఫెసర్ డా వేమూరి వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా విచ్చేశారు. డా వేమూరి ఈ సందర్భంగా మాట్లాడుతూ మనబడి తో పాటుగా కాలిఫోర్నియా యూనివర్సిటీ బెర్కేలీ కాంపస్ లో కాలేజి స్థాయి లో జరుగుతున్న తెలుగు క్లాసులకు కుడా ప్రోత్సాహం ఇవ్వాలని శాక్రమెంటో తెలుగువారందరికీ విజ్ఞప్తి చేసారు. ఇక్కడ మనబడి లో తెలుగు క్లాసులు హాజరు అయిన తెలుగు పిల్లలకు, భవిష్యత్తు లో బెర్కేలీ కాంపస్ లో తెలుగు క్లాసులు కు ప్రవేశం సులభం గా లభిస్తుంది అని చెప్పారు. బెర్కేలీ కాంపస్ లో తెలుగు క్లాసులకు శాశ్వత నిధి కి అవసరం అయిన 500 వేల డాలర్లకు గాను 400 వేల డాలర్లు వసూలు అయ్యాయని, ఇంకో 100 వేల డాలర్లు సమకూరితే, తెలుగు క్లాసులు శాశ్వతంగా అందుబాటులో ఉంటాయి అని చెప్పారు. డా వేమూరి వారి పిలుపుకు స్పందించి స్థానిక తెలుగు వారు శ్రీమతి ఆది లింగం, శ్రీనివాస లింగం గార్లు అప్పటికప్పుడు 1,116 డాలర్ల విరాళాన్ని ప్రకటించారు.

టీఏజీఎస్ అధ్యక్షులు వెంకట్ నాగం ఈసందర్భంగా మాట్లాడుతూ కాలిఫోర్నియా శాక్రమెంటోలో నివాసం ఉంటున్న తెలుగు కుటుంబాలకు చెందిన పిల్లలకి తెలుగు నేర్పాలన్న ఆలోచనతో సిలికానాంధ్ర సహకారంతో ‘మనబడి’ ని శాక్రమెంటోలో ప్రారంభించడం జరిగినది అని అన్నారు. ఈసందర్భంగా పిల్లలకు తెలుగు నేర్పడానికి రెండు ఏండ్లుగా టీఏజీఎస్ చేస్తున్న ప్రయత్నానికి ప్రోత్సాహం ఇవ్వాలని శాక్రమెంటో తెలుగువారందరికీ విజ్ఞప్తి చేసారు.

టీఏజీఎస్ అధ్యక్షులు వాసు కుడిపూడి ఈసందర్భంగా మాట్లాడుతూ, 2007 లో బెర్కేలీ కాంపస్ లో తెలుగు క్లాసులకు 5,000 డాలర్ల నిధి టీఏజీఎస్ సమకూర్చినట్లు తెలిపారు. శాక్రమెంటో లో తెలుగు క్లాసులకు పెద్ద ఎత్తున తరలివచ్చిన స్థానిక తెలుగు వారికి అభినందనలు తెలిపారు.

కాలిఫోర్నియా శాక్రమెంటోలో మనబడికి స్వచ్ఛందంగా పనిచేస్తున్న స్థానిక అధ్యాపకులు “ప్రసాద్‌ పన్నాల, విజయలక్ష్మిపన్నాల, మోహన్ పెంటా, సాంబశివరావు, భాస్కర్ వెంపటి”, మనబడి ప్రణాళిక బృందాన్ని మరియు, కార్యకర్తలను టీఏజీఎస్ అధ్యక్షులు వెంకట్ నాగం అందరికీ పరిచయం చేశారు. ఈసందర్భంగా స్థానిక మనబడి పిల్లలు మా తెలుగు తల్లికి మల్లెపూదండ తో పాటు పలు గీతాలు, పద్యాలు, కమ్మనైన కధలతో అందరినీ ఆకట్టుకున్నారు.

స్థానిక రుచి రెస్టారెంట్‌ వారు పసందైన తెలుగు భోజనం సమకూర్చి, వడ్డించి అందరి మన్ననలను చూరగొన్నారు. కాలిఫోర్నియా శాక్రమెంటోలో మనబడి ప్రారంభ కార్యక్రమం విజయవంతం కావడానికి అహర్నిశలు కృషిచేసిన వారిలో మనబడి సంధానకర్త మరియు టి ఏ జీ ఎస్ ట్రస్టీ మల్లిక్ సజ్జనగాండ్ల, అధ్యాపకులు ప్రసాద్‌ పన్నాల, టీఏజిఎస్ కార్యవర్గ సభ్యులు మనోహర్ మందడి, గిరిధర్ టాటిపిగారి, శ్రీదేవి మాగంటి, రాజా రామ్ ముమ్మడవరపు, వనిత ఆలపాటి, మోహన్ కాట్రగడ్డ, అబ్దుల్ షైక్, దుర్గా చింతల, స్వర్ణ కంభంపాటి,అశ్విన్ తిరునాహరి, గిరి టాటిపిగారి, సుధాకర్ వట్టి, రాంబాబు బావిరిశెట్టి, మల్లిక్ సజ్జనగాండ్ల, వాసు కుడుపూడి, భాస్కర్ దాచేపల్లి, వెంకట్ నాగం, కీర్తి సురం, TAGS కార్యకర్తలు, అధ్యాపకులు తదితరులు ఉన్నారు. వెంకట్ నాగం వందన సమర్పణ గావించారు. ఫోటోగ్రఫీ కు సహకారం అందించిన చంద్ర గాజుల, మరియు ఫణి డోగిపర్తి లకు టీఏజిఎస్ కార్యవర్గ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

రాబోవు వారాలలో ఫాల్సం పాటు మరిన్ని శాక్రమెంటో శివారునగరాలలో కూడా మనబడి తరగతులు జరుగుతాయి అని, శాక్రమెంటోలో మనబడి తరగతిలో పిల్లలను చేర్పించదలచుకున్నవారు మరింత సమాచారం కోసం టీఏజీస్‌ సమన్వయ కర్త మల్లిక్ సజ్జనగాండ్ల ను ఫోన్ 916 673 8352 లేదా ఈమెయిలు [email protected] లో సంప్రదించగలరు అని టీఏజీఎ కార్యవర్గం ప్రకటించింది. టీఏజీస్‌ సమన్వయ కర్త మల్లిక్ సజ్జనగాండ్ల మరియు అధ్యాపకులు ప్రసాద్ పన్నాల, శాక్రమెంటోలో సిలికానాంధ్ర మనబడి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియచేసారు.
Manabadi Inauguration Event at California - Sacramento 1

Manabadi Inauguration Event at California - Sacramento 2

Manabadi Inauguration Event at California - Sacramento 3

Manabadi Inauguration Event at California - Sacramento 4

Manabadi Inauguration Event at California - Sacramento 5

Manabadi Inauguration Event at California - Sacramento 6

0 1796

ETV Abhiruchi has been offering delicious and mouthwatering cuisines through a daily cookery show for a long time. On ETV Abhiruchi one can learn the best dishes from top chefs from local Telugu families in “Vantalu – pindi vantalu” and relish with a variety of sweets and snacks and other authentic Telugu dishes. TAGS is excited to announce “ETV Abhiruchi” cookery show in Sacramento area during Thursday Aug 13th, Friday Aug 14th, and Monday Aug 17th. No entry fee for this event, all you have to do is prepare to cook your favorite dish in front of ETV Abhiruchi team, and this recording will be telecasted in worldwide ETV Abhiruchi program. Only limited seats are available during the cookery show for these these dates. To avoid last minute disappointment, please reserve your dish now by

 RSVP: http://goo.gl/forms/jBwD39GoJh

ETV Abhiruchi Cookery Show in Sacramento Area Aug 13th, 14th and 17th

0 1628

కాలిఫోర్నియా రాష్ట్రం లో ఉన్న శాక్రమెంటో తెలుగు సంఘం 11 వ వార్షికోత్సవం మరియు సంక్రాంతి సంబరాల సందర్భం గా సిలికానాంధ్ర  వారి సహకారం తో రూపొందించిన పూర్తి నిడివి  జానపద రూపకం “మన పల్లె, మన సంక్రాంతి” ఆహుతులను విశేషం గా  ఆకట్టుకొన్నది. హరిదాసులు, గంగిరెద్దులు, రంగవల్లులు, జానపద కళాకారులు చేసిన సందడితో సంక్రాంతి వేడుకల ప్రాంగణం లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. స్థానిక ఫోల్సోం నగరం లో ఉన్న  హారిస్ ధియేటర్ లో శనివారం జనవరి 17 వ తేది 2015 మధ్యాన్నం 1:30 గంటలకు మొదలైన సంక్రాంతి సంబరాలు రాత్రి 11 గం వరకు కొనసాగాయి.

 

శాక్రమెంటో తెలుగు సంఘం సంక్రాంతి సంబరాల లో ప్రదర్శించిన ముఖ్యాంశాలు:

 1. శాక్రమెంటో లో మొట్ట మొదటిసారిగా పూర్తి నిడివి జానపద రూపకం “మన పల్లె ….. మన సంక్రాంతి…..“.
 2. జానపద రూపకం లో “ప్రత్యక్ష గానం, మరియు డప్పు తో” అలరించిన డా.లింగా శ్రీనివాస్.
 3. జానపద గీతాలతో ఆకట్టుకొన్న  నిరుపమ చేబియం, వంశీ నాదెళ్ళ, నారాయణన్ రాజు.
 4. జానపద నృత్య రూపకర్త స్నేహ వేదుల రూపొందించిన ఆట పాటలతో సందడి చేసిన 50 మందికి పైగా స్థానిక నృత్యకారులు.
 5. డోలక్ తో ఉర్రూతలూగించిన “బాలాజీ మహదేవన్”.
 6. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్న 250 మందికి పైగా స్థానిక కళాకారులు

 

 TAGS Sankranti 2015 _7 TAGS Sankranti 2015 _8 TAGS Sankranti 2015 _9
TAGS Sankranti 2015 _1 TAGS Sankranti 2015 _2 TAGS Sankranti 2015 _3 TAGS Sankranti 2015 _4 TAGS Sankranti 2015 _5 TAGS Sankranti 2015 _6

సంక్రాంతి వేడుకల సందర్భం గా TAGS  అధర్వంలో జరిగిన సాంస్కృతిక  కార్యక్రమాలు, పూర్తి  నిడివి జానపద రూపకం, వేదిక పై ఉన్న 250 మందికి పైగా స్థానిక కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు,స్థానిక పీకాక్ రెస్టారెంట్ వారు రూపొందించిన నొరూరుంచే పసందైన తెలుగు వంటకాలు, మరి ఇంకెన్నో విశేషాలతో  ఆహుతులను అలరించాయి. కదలి రండి, కలసి రండి, సంక్రాంతి సంబరాన్ని ఉమ్మడిగా జరుపుకొందాము అని TAGS  ఇచ్చిన పిలుపుకు స్పందించిన స్థానిక తెలుగు కుటుంబాలు 800 మందికి పైగా వేదిక కు తరలి వచ్చారు. ఈ సందర్భం గా ముఖ్య అతిధి, స్థానిక తెలుగు కుటుంబానికి చెందిన నరేంద్ర ప్రత్తిపాటి ని TAGS  అధ్యక్షుడు వెంకట్ నాగం సభకు పరిచయం చేసారు. నరేంద్ర ప్రత్తిపాటి గారు సట్టర్ హెల్త్, మరియు డ్రిక్సెల్ యూనివర్సిటీ వంటి ప్రతిష్టాన సంస్థలకు బోర్డు మెంబెర్ గా ఉండడం తెలుగు వారికి గర్వకారణం అని పేర్కొన్నారు. ఈ సందర్భం గా నరేంద్ర ప్రత్తిపాటి  గారు ఆహుతులకు సంక్రాంతి సందేశాన్ని అందించి, చెస్ కప్ గెలుచుకున్న స్థానిక తెలుగు పిల్లలకు ట్రోఫీ లను అందజేశారు. ప్రియమైన అతిధి గా విచ్చేసిన స్థానిక ఫోల్సోం నగర మేయర్ “ఆండీ మొరిన్” స్థానిక తెలుగు కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలకు అచ్చెరువొందారు. ఫోల్సోం సిటీ హాల్ సమావేశం లో ఈ  సంక్రాంతి వేడుకను ప్రత్యేకంగా ప్రస్తావిస్తానని ఈ సందర్భం గా చెప్పారు. మరో ప్రియమైన అతిధి గా విచ్చేసిన సిలికానాంధ్ర  చైర్మన్ ఆనంద్ కూచిభొట్ల ను TAGS  చైర్మన్ వాసు కుడుపూడి సభికులకు పరిచయం చేసారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ సిలికానాంధ్ర  చైర్మన్ ఆనంద్ కూచిభొట్ల గారు  2004 లో మొట్టమొదటి సారిగా TAGS శాక్రమెంటో లో సంక్రాంతి సంబరాలను జరిపిందని, ఇప్పుడు వరుసగా 11వ సారి సంక్రాంతి సంబరాలను జరుపుకోవడం ఆనందంగా ఉందని, మన సంస్కృతి, సంప్రదాయాన్ని పిల్లలకు అందించడానికి ఇటువంటి వేడుకలు అవసరం అని నొక్కి చెప్పారు.

 

ఈ సందర్భం గా TAGS రూపొందించిన సమాచార పత్రిక ను స్థానిక తెలుగు ప్రముఖులు శ్రీ శివాజీ వల్లూరుపల్లి గారు ఆవిష్కరించారు. TAGS సౌజన్యం తో జరుగుతున్న సిలికానాంధ్ర మనబడి కి రెండు ఏండ్లగా  ఉపాధ్యాయులుగా ఉండి శాక్రమెంటో లో  తెలుగు భాషా వ్యాప్తి కి కృషి చేస్తున్న శ్రీ ప్రసాద్ పన్నాల, శ్రీమతి విజయలక్ష్మి పన్నాల గార్లను TAGS కార్యవర్గ సభ్యులు ఘనం గా  సన్మానించారు. ఈసందర్భం గా ప్రతిభావంతులైన పిల్లలను పోత్సహించే గత సంప్రదాయాన్ని పాటిస్తూ, టాగ్స్ కార్యవర్గ సభ్యులు స్థానిక ప్రతిభావంతులైన పిల్లలు:  వినీత్ సోమంచి, ఆరతి బొబ్బాల, శివాని బొబ్బాల, అర్నావ్ మామిడి, మరియు  వంశీ గంగారం లకు వేదికపై జ్ఞాపికలు అందజేశారు.

 

మనోహర్ మందాడి వందన సమర్పణ గావించారు. జగిత్యాల నుండి TAGS సంక్రాంతి సంబరాలకు ప్రత్యేకంగా విచ్చేసిన డా. లింగా శ్రీనివాస్ డప్పు తో, జానపద పాటలతో, స్థానిక కళాకారులతో చేసిన నృత్యాలతో వేదిక దద్దరిల్లింది. ఈ సందర్భం గా TAGS తరపున అధ్యక్షులు వెంకట్ నాగం డా. లింగా శ్రీనివాస్ కు “జానపద కళా ప్రపూర్ణ” బిరుదును ప్రదానం చేసారు. డా. లింగా శ్రీనివాస్ ప్రదర్శించిన కోడి బాయె లచ్చమ పాటతో కార్యక్రమం విజయవంతం గా ముగిసింది. ఇంకా కాసేపు ఉంటే బాగుండెను అనే భావనతో ఆహుతులు వెనుదిరిగారు. కాలిఫోర్నియా శాక్రమెంటో లో “మాతృ దేవో భవ, పితృ దేవో భవ” విజయవంతం కావడానికి అహర్నిశలు కృషి చేసిన వారిలో టీఏజిఎస్ కార్యవర్గ సభ్యులు మనోహర్  మందాడి, గిరిధర్ టాటిపిగారి, శ్రీదేవి మాగంటి, రాజా రామ్ ముమ్మడవరపు, వనిత ఆలపాటి, మోహన్ కాట్రగడ్డ, అబ్దుల్ షైక్, దుర్గా చింతల, స్వర్ణ కంభంపాటి,అశ్విన్ తిరునాహరి, గిరి టాటిపిగారి, సుధాకర్ వట్టి, రాంబాబు బావిరిశెట్టి, మల్లిక్ సజ్జనగాండ్ల, వాసు కుడుపూడి, భాస్కర్ దాచేపల్లి, వెంకట్ నాగం, TAGS కార్యకర్తలు తదితరులు పాల్గోన్నారు. ఈ సందర్భం గా TAGS కార్యనిర్వాహక సభ్యులు విశాఖ లో హుదుద్ తుపాను బారిన పడిన CBM పాఠశాల విద్యార్ధుల సహాయార్ధం, అలాగే వికలాంగుల సహాయార్ధం  తిరుపతి లో ఉన్న అభయ క్షేత్రం అనే సంస్థ కు (http://www.abhayakshethram.org/), అలాగే అనాధ భారతీయ బాలబాలికలకు సహాయార్ధం హోప్ ఎబయ్డ్స్ http://www.hopeabides.org/ కు  TAGS ప్రత్యేకం గా విరాళాలు అందజేస్తుంది  అని, ఈ సంస్థలకు  సహాయార్ధం విరాళం ఇవ్వదలచిన వారు మరింత సమాచారం కు [email protected] కు ఈమెయిలు లో సంప్రదించాలని TAGS కార్యనిర్వాహక సభ్యులు కోరారు. TAGS చేపట్టబోయే కార్యక్రమాలకు సంబంధించి మరిన్ని వివరాలను తెలుసుకోవాలనుకునేవారు http://www.sactelugu.org లేదా https://www.facebook.com/SacTelugu ను సందర్శించాలని లేదా [email protected] కు ఈమెయిలు లో సంప్రదించాలని TAGS కార్యనిర్వాహక సభ్యులు కోరారు.

 

0 1154

తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ శాక్రమెంటో (TAGS) ఆధ్వర్యంలో ఫోల్సోం కరాటే అకాడమి క్రీడా ప్రాంగణంలో ఆదివారం జనవరి 4, 2015 న ఆటల పోటీలు ఉత్సాహంగా జరిగాయి. అమెరికా లో కాలిఫోర్నియా రాష్ట్రం శాక్రమెంటో శివారు నగరాలకు చెందిన తెలుగు కుటుంబాలకు చెందిన పిల్లలు, పెద్దలు పెద్దఎత్తున పలు ఆటల పోటీలలో పాల్గొన్నారు. ఆటలో గెలిచి తీరాలన్న లక్ష్యమే వారిని విజేతలుగా నిలిపింది. తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ శాక్రమెంటో (TAGS) ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో 5 ఏండ్ల పిల్లల నుండి 70 ఏండ్ల సీనియర్ సిటిజన్స్ సైతం క్రీడా పోటీల్లో సత్తా చాటారు. ఈ పోటీలను అసోసియేషన్‌ అధ్యక్షుడు వెంకట్ నాగం  ప్రారంభించారు. శ్రీదేవి మాగంటి, మనోహర్ మందడి, మోహన్ కాట్రగడ్డ, దుర్గ చింతల, రాజారాం ముమ్మడవరపు, మల్లిక్ సజ్జనగాండ్ల పర్యవేక్షణలో చదరంగం, తెలుగు ప్రశ్నావళి, తెలుగు కధ చెప్పడం, క్యారమ్స్, గాలిపటాల తయారీ, చిత్ర లేఖనం, మరియు ముగ్గుల  పోటీలను పోటీలను నిర్వహించారు.

 

కాలిఫోర్నియా శాక్రమెంటో లో TAGS ఆటల పోటీలు విజయవంతం కావడానికి అహర్నిశలు కృషి చేసిన వారిలో టీఏజిఎస్ చైర్మన్ వాసు కుడుపూడి, అధ్యక్షులు వెంకట్ నాగం, కార్యవర్గ సభ్యులు మనోహర్ మందడి, గిరిధర్ టాటిపిగారి, శ్రీదేవి మాగంటి, రాజా రామ్ ముమ్మడవరపు, వనిత ఆలపాటి, మోహన్ కాట్రగడ్డ, అబ్దుల్ షైక్, దుర్గా సాయి చింతల, స్వర్ణ కంభంపాటి,అశ్విన్ తిరునాహరి, గిరి టాటిపిగారి, సుధాకర్ వట్టి, రాంబాబు బావిరిశెట్టి, మల్లిక్ సజ్జనగాండ్ల, భాస్కర్ దాచేపల్లి, తదితరులు, మరియు TAGS కార్యకర్తలు ఉన్నారు. చదరంగం పోటీల నిర్వహణకు విశేష సహకారం అందించిన చదరంగం గురు “బ్రహ్మ మొహంతి” కు, తెలుగు కధ చెప్పడం పోటీ  ని ప్రోత్సహించిన వంశీ మాగంటి కు  TAGS కార్యవర్గ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విజేతల వివరాలను అసోసియేషన్‌ అధ్యక్షుడు వెంకట్ నాగం  ప్రకటించారు. విజేతలకు జనవరి 17 న జరుగబొనున్న TAGS 11 వ వార్షికోత్సవం మరియు సంక్రాంతి సంబరాల సందర్భంగా బహుమతులు అందజేయడం జరుగుతుందని నిర్వాహకులు ప్రకటించారు. TAGS సంక్రాంతి సంబరాల  కార్యక్రమాలకు సంబంధించి మరిన్ని వివరాలను తెలుసుకోవాలనుకునేవారు http://www.sactelugu.org లేదా https://www.facebook.com/SacTelugu ను సందర్శించాలని లేదా [email protected] కు ఈమెయిలు లో సంప్రదించాలని TAGS కార్యనిర్వాహక సభ్యులు కోరారు.

TAGS IndoorSports 2TAGS IndoorSports 3TAGS IndoorSports

SOCIAL

3,871FansLike
8FollowersFollow

SPECIALS

SHORT FILMS