Tags Posts tagged with "telangana"

telangana

తెలంగాణ కెనడా సంఘం ఆధ్వర్యంలో 12 జనవరి 2019  శనివారం రోజున కెనడా దేశం గ్రేటర్ టోరొంటో లోని  పోర్టుక్రెడిట్ సెకండరి పాఠశాల ఆడిటోరియంలో 800 మందికి పైగా ప్రవాస తెలంగాణా వాసులు  సంక్రాంతి పండుగ మరియు తీన్మార్ సాంస్కృతిక ఉత్సవాలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు.

ఈ పండుగ సంబురాలు తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ రమేశ్ మునుకుంట్ల  ఆధ్వర్యంలో జరుగగా తెలంగాణ కెనడా అసోసియేషన్ ఫౌండేషన్ కమీటీ అధ్యక్షులు శ్రీ శ్రీనివాసు తిరునగరి, ట్రుస్టీ బోర్డు అధ్యక్షులు శ్రీ హరి రావుల్, ఉపాధ్యక్షులు శ్రీ విజయకుమార్ తిరుమలాపురం , కార్యదర్షి శ్రీ శ్రీనివాస్ మన్నెం, కోషాధికారి శ్రీ దామోదర్ రెడ్డి మాది, సాంస్కృతిక కార్యదర్షి శ్రీమతి దీప గజవాడ,  డైరెక్టర్లు శ్రీ మనోహర్ భొగా, శ్రీ  శ్రీనివాస్ చంద్ర, శ్రీమతి మంగ వాసం, శ్రీ మూర్తి కలగోని, శ్రీ గణేశ్ తెరాల, ట్రస్టీలు శ్రీ సురేశ్ కైరోజు, శ్రీ వేనుగోపాల్ రెడ్డి ఏళ్ళ, శ్రీ కిరణ్ కుమార్ కామిశెట్టి మరియు శ్రీ నవీన్ ఆకుల ,   ఫౌండర్లు  శ్రీ కోటేశ్వరరావు చిత్తలూరి,  శ్రీ చంద్ర స్వర్గం, శ్రీ దేవేందర్ రెడ్డి గుజ్జుల, శ్రీ రాజేశ్వర్ ఈద, అథీక్ పాష , శ్రీ ప్రభాకర్ కంబాలపల్లి, కలీముద్దిన్, శ్రీ వేణుగోపాల్ రోకండ్ల, శ్రీ సంతోష్ గజవాడ, శ్రీ నవీన్ సూదిరెడ్డి, శ్రీ ప్రకాశ్ రెడ్డి చిట్యాల పాల్గొన్నారు.

ఈ సంక్రాంతి సంబరాలలో పిల్లలకు భోగిపండ్ల కార్యక్రమముతో ఆశీర్వదించారు మరియు సంస్థ నిర్వహించిన ముగ్గుల పోటీలలో మొదటి బహుమతి శ్రీమతి అనుపమ పబ్బ గారు గెలుచుకున్నారు. ఈ సందర్బంగా సాంస్కృతిక కార్యదర్షి శ్రీమతి దీప గజవాడ మరియు ఉపాధ్యక్షులు శ్రీ విజయకుమార్ తిరుమలాపురం ఆద్వర్యంలో మూడు గంటలపాటు చక్కటి సాంస్కృతిక కార్యక్రమములను నిర్వహించగా సభా సమయం మొత్తానికి ఆంకర్లుగా కుమారి మేఘ స్వర్గం మరియు శ్రీమతి హారిక నిర్వహించారు.

ఈ సందర్బంగా తెలుగు తిధి లతో కూడిన టోరొంటో సమయముతో అసోషియేషన్ 2019 క్యాలెండరును ఆవిష్కరించారు.

ఈ ఉత్సవాలలో తెలంగాణ కెనడా సంఘం అత్యంత రుచికరమైన భోజనాలను ఏర్పాటు చేసింది. చివరగా అధ్యక్షులు శ్రీ రమేశ్ మునుకుంట్ల వందన సమర్పణతో బతుకమ్మ ఉత్సవాలు ముగిసాయి.

తెలంగాణ కెనడా సంఘం (Telangana Canada Association –TCA) ఆద్వ్యర్యంలో తేది  జూన్ 3  2017 శనివారం రోజున మిస్సిస్సౌగలోని పోర్టుక్రెడిట్  సెకండరీ పాఠశాల ఆడిటోరియంలో  తెలంగాణ కెనడా ధూంధాం పేరుతో తెలంగాణ ఆవిర్బావాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సంబురాల్లో దాదాపు 500 పైగా కెనడా తెలంగాణ వాసులు పాల్గొని విజయవంతం చేసారు.

 

మొదటగా కార్యదర్శి శ్రీమతి రాధిక బెజ్జంకి గారు అందరికి ఆహ్వానం పలికారు అధ్యక్షులు శ్రీ కోటేశ్వరరావు చిత్తలూరి గారు సభ ప్రారంబానికి జెండా ఊపగా జ్యోతి ప్రజ్వలన తో కార్యక్రమాలను ప్రారంభించారు. ఫౌండేషన్ కమిటి అధ్యక్షులు శ్రీ దేవేందర్ రెడ్ది గుజ్జుల  గారు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి సభకువిచ్చేసిన వారందరితో మౌనం పాటింప చేసిన తర్వాత ఉత్సవాలను ప్రారంభించారు.

 

ఈ కార్యక్రమానికి ముఖ్యఅథితిగా  కెనడాలో భారత ప్రభుత్వ ఉప రాయబారి  మరియు తెలంగాణ జాగృతి ఉత్తర అమెరికా అధ్యక్షులు శ్రీ శ్రీధర్ భండారు గారు విచ్చెసి నూతన తెలంగాణ నిర్మాణంలో కెనడా లోని తెలంగాణ ప్రవాసులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

 

తెలంగాణ కెనడా సంఘం ఫౌండర్ శ్రీ రమేశ్ మునుకుంట్ల గారు తెలంగాణ జాగృతి కెనడాకు ప్రధమ అధ్యక్షులుగా నియమింపబడినందులకు శ్రీ రమేశ్ మునుకుంట్ల గారిని & శ్రీమతి ధనలక్ష్మి మునుకుంట్ల గారిని కమీటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.

 

ఈ వేడుక లు కల్చరల్  సెక్రటరీ శ్రీ విజయకుమార్ తిరుమలాపురం గారి ఆద్వైర్యంలో  ఎన్నోవివిద సాంస్క్రుతిక కార్యక్రమాలతొ దాదాపు 6 గంటలపాటు సభికులను అలరించాయి.  పోతరాజు వేషంలో శ్రీ గిరిధర్ క్రొవిడి గార్లు అద్బుతమైన లష్కర్ బోనాల ఊరేగింపు మరియూ పీరీల ప్రదర్శన సభికులందర్ని విషేషంగా ఆకర్సించాయి.

 

ఈ కార్యక్రమాలన్నీ స్తానిక తెలంగాణ వారు చక్కటి తెలంగాణ భాని లో ప్రదర్శించటం విశేషం. సభికులందరికి  తెలంగాణ కెనడా అసోసియేషన్  రుచికరమైన తెలంగాణ  వంటకాలతో  భోజనాలు  ఏర్పాటు చేశారు

ఈ సంబురాలను తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ కోటేశ్వరరావు చిత్తలూరి  గారి ఆధ్వర్యంలో జరుగగా, ట్తస్టీ అధ్యక్షులు శ్రీ ప్రభాకర్ కంభాలపల్లి , ఫౌండేషన్ కమిటి అధ్యక్షులు శ్రీ దేవేందర్ రెడ్ది గుజ్జుల, ఉపాధ్యక్షులు శ్రీ రాజేశ్వర్ ఈద, సెక్రటరీ శ్రీమతి రాధిక బెజ్జంకి , కల్చరల్  సెక్రటరీ శ్రీ విజయకుమార్ తిరుమలాపురం , ట్రెజరర్ శ్రీ సంతోష్ గజవాడ మరియు డైరక్టర్లు శ్రీ శ్రీనివాస్ మన్నెం, శ్రీ దామోదర్ రెడ్ది మాది, శ్రీ మురళి కాందివనం, శ్రీమతి భారతి కైరోజు, శ్రీ మల్లికార్జున్ మదపు, ట్రుస్టీలు శ్రీ సమ్మయ్య వాసం, శ్రీ శ్రీనివాస్ తిరునగరి, ఫౌండర్లు శ్రీ రమేశ్ మునుకుంట్ల, శ్రీ చంద్ర స్వర్గం, శ్రీ నవీన్ రెడ్ది సూదిరెడ్ది,  శ్రీ హరి రావుల, శ్రీ అఖిలేశ్ బెజ్జంకి, శ్రీ వేణు రోకండ్ల మరియు  ఇతర వాలంటీర్సు సహకారంతో నిర్వహిం చారు.

ఈ కార్యక్రమానికి వ్యాక్యాతలుగా శ్రీమతి స్నిగ్ద గుల్లపల్లి, మనస్విణి బెజ్జంకి, ఐశ్వర్య ఈద మరియు మేఘ స్వర్గం లు వ్యవహరించారు.

 

ఆఖరున ఉపాధ్యక్షులు శ్రీ రాజేశ్వర్ ఈద  గారు వందన సమర్పణతో కార్యక్రమాలు ముగిసాయి.

చేనేత పరిశ్రమ అబివృద్ది కి తమ వంతు కృషి చేద్దాం ,బాధ్యత వహిద్దాం అనే నినాదం తో TELANGANA NRI FORUM    మహిళలు  ముందుకొచ్చారు .  సిరిసిల్ల నుండి ప్రత్యేకం గ తెప్పించిన వస్త్రాలను ధరించి  లండన్ బ్రిడ్జి వద్ద ప్రదర్శించి .  WE SUPPORT TELANGANA WEAVERS    అనే నినాదం తో మద్దతు తెలిపారు .    TS NRI శాఖా మంత్రి వర్యులు  K .Rama rao   వారానికి ఒక రోజు చేనేత  దరిస్తా  అన్న స్ఫూర్తి గా మేము సైతం అంటున్నారు లండన్ మహిళా .   త్వరలో  సిరిసిల్ల హ్యాండ్లూమ్ ,ప్రభుత్వ సహకారం తో  వచ్చే నెల లో  చేనేత చీరలు  మరియు  షర్ట్స్ ,  గృహావసరాల నిమిత్త బట్టలు మొదలైనవి  తెలంగాణ నుండి తెప్పించి లండన్ లో ఒక వస్త్ర నిలయం ఏర్పాటు చేసి  మార్కెటింగ్ కి కృషి చేస్తామని  ప్రతినిధులు  కాసర్ల జ్యోతి రెడ్డి , శ్రీ లక్ష్మి ,అంతటి  మీనాక్షి తెలిపారు . 
యూరోప్ లో కాటన్ వస్త్రాల  ఉపయోగం ఎక్కువ గ ఉంటుంది . కొంత సమయం తీసుకొని  మొదట  ఇక్కడి  ప్రవాస భారతీయులకు పరిచయం చేస్తామని  మార్కెటింగ్  సన్నాహాలు చేస్తామని గోలి కవిత తెలిపారు .  ఇతర  తెలంగాణ /తెలుగు   సంఘాల మహిళ ల సహాయం తీసుకొని రాబోయే బోనాలు ,బతుకమ్మ  సంబరాల్లో  చేనేత కు పూర్తి స్థాయి గుర్తింపు తెచ్చే ప్రయత్నం తెస్తామని  సిక్కా ప్రీతీ  తెలిపారు .    

సిరిసిల్ల నుండి ప్రత్యేకం గ తెప్పించిన చేనేత వస్త్రాలను   లండన్ చారిత్రిక ప్రదేశాల్లో  ధరించి  ఫోటో ,వీడియో షూట్ నిర్వహించి సోషల్ మీడియా ద్వారా ప్రవాస భారతీయులను కదిలించే దిశ వా మా ప్రయత్నం మొదలు పెట్టామని అనసూరి  వాణి తెలిపారు . ఈ కార్యక్రమం లో  రంగుల శౌరి ,గంప జయశ్రీ ,హేమలత గంగసాని, పాల్గొన్నారు . 
 
ప్రవాస తెలంగాణ మహిళ లు చేనేత కు మద్దతు ఇవ్వడం పై చేనేత బంధు ,పద్మ శ్రీ , శ్రీ చింతకింది మల్లేశం గారు ప్రశంసించారు .వీడియో ద్వారా తన సందేశాన్ని అందచేస్తూ తమ సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని  తెలిపారు.
 op1a5909

తెలంగాణ కెనడా సంఘం Telangana Canada Association (TCA) అద్వ్యర్యంలో  తేది 14 జనవరి  2017 శనివారం రోజున మిస్సిస్సౌగ నగరంలోని గ్లెన్ ఫారెస్టు సెకండరీ   సెకండరీ పాఠశాల ఆడిటోరియంలో  తెలంగాణ కెనడా తీన్మార్ సంక్రాంతి సాంస్కృతిక   ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు.

ఈ సంబురాల్లో  దాదాపు 400 పైగా కెనడా తెలంగాణ వాసులు పాల్గొని విజయవంతం చేసారు. మొదటగా తెలంగాణ అమరవీరులకు శ్రద్దాంజలి ఘటించిన తర్వాత ఉత్సవాలను ప్రారంభించారు.

 

ఈ వేడుకలో ఎన్నోవివిద సాంస్క్రుతిక కార్యక్రమాలతో దాదాపు 4 గంటలపాటు సభికులను అలరించాయి. సంక్రాంతి పండుగ విషిష్టతను తెలిపే రూపకం  ప్రద ర్శించిన తీరు సభికులందరిని విపరీతంగా ఆకర్షించాయి.

telangana-2017-teenmar-sankranthi-celebrations-1 telangana-2017-teenmar-sankranthi-celebrations-2 telangana-2017-teenmar-sankranthi-celebrations-3 telangana-2017-teenmar-sankranthi-celebrations-4

పిల్లలకు భొగిపల్లు, బొమ్మలకొలువు మరియు మహిళలకు పసుపుకుంకుమ పంచారు.  ఈ కార్యక్రమాలన్నీ స్థానిక తెలంగాణ వారు  ప్రదర్శించటం విశేషం. సభికులందరికి  తెలంగాణ కెనడా అసోసియేషన్  రుచికరమైన శాఖాహార వంటకాలతో భోజనాలు ఏర్పాటు చేశారు

ఈ సంబురాలను తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ కోటెశ్వరరావు చిత్తలూరి గారి ఆధ్వర్యంలో జరుగగా, ట్తస్టీ అధ్యక్షులు  శ్రీ ప్రభాకర్ కంబాలపల్లి, ఉపాధ్యక్షులు శ్రీ రాజేశ్వర్ ఈద , సెక్రటరీ శ్రీమతి రాధిక బెజ్జంకి , కల్చరల్  సెక్రటరీ శ్రీ విజయ కుమార్ తిరుమలాపురం, ట్రెజరర్ శ్రీ సంతోష్ గజవాడ ,  డైరక్టర్లు శ్రీ శ్రీనివాస్ మన్నెం, శ్రీ మురళి కాందివనం, శ్రీ దామొదర్ రెడ్డి మాది, శ్రీ మల్లిఖార్జున్ మదపు, శ్రీమతి భారతి కైరోజు మరియు  ట్రుస్టీలు సయ్యద్ అతీక్  పాషా, శ్రీ సమ్మయ్య వాసం లతో పాటు

వ్యవస్తాపక సభ్యలు శ్రీ రమేశ్ మునుకుంట్ల, శ్రీ చంద్ర స్వర్గం, శ్రీ  కుందూరి శ్రీనాధ్, శ్రీ హరి రావుల మరియు శ్రీ వేణు రోకండ్ల పాల్గొన్నారు

ఈ సభలో TCA 2017 టొరొంటో టైములో చక్కటి తెలుగు క్యాలెండరును ఆవిష్కరించారు

 

ఆఖరున ఉపాధ్యక్షులు శ్రీ రాజేశ్వర్ ఈద  వందన సమర్పణతో కార్యక్రమాలు ముగిసాయి.

టి. ఆర్. యస్ పార్టీ ఎన్నారై ఆస్ట్రేలియా శాఖ – ఓవర్‌సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ టి. ఆర్. యస్ అధ్యక్షునిగా నాగేందర్ రెడ్డి కాసర్ల
ఆస్ట్రేలియా పర్యటన లో ఉన్న టి. ఆర్. యస్ ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు, ఇటీవల జాగృతి ఆస్ట్రేలియా  ఆద్వర్యంలో జరిగిన తెలంగాణా ఆవిర్భావ వేడుకల్లో టి. ఆర్. యస్ పార్టీ ఆస్ట్రేలియా ఎన్నారై శాఖ – “ఓవర్‌సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ టి. ఆర్. యస్” గా ప్రకటించి  అధ్యక్షునిగా నాగేందర్ రెడ్డి కాసర్లను నియమించడం జరిగింది.  అక్టోబర్ లో పూర్తి కమిటీ ప్రకటించి ప్రత్యేక సభను ఏర్పాటు చేస్తామని కవిత తెలిపారు.
 గతి కొద్ది రోజులుగా ఆస్ట్రేలియా లో రెండు గ్రూపులుగా ఉన్న టి. ఆర్. యస్ పార్టీ సంస్థలు ఇక కవిత గారి ఆదేశాల మేరకు అధికారిక “ఓవర్‌సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ టి. ఆర్. యస్”  సంస్థ లో బాగస్వాములై క్రమశిక్షణ కలిగిన   కార్యకర్తలుగా, పార్టీకి మన వంతు బాద్యత నిర్వాహిద్దామని, అలాగే ఈ అవకాశం కలిపించి కే. సీ. ఆర్ గారికి, నా పై నమ్మకం ఉంచి అధ్యక్ష బాద్యతలు  అప్పగించిన కవిత గారికి
అద్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల కృతజ్ఞతలు తెలిపారు.
Nagendar Kasarla

బ్రిటిష్ సౌత్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కామర్స్(BSICC) మరియు తెలంగాణా ఎన్నారై ఫోరమ్ (TeNF) -యూకే శాఖ సంయుక్తంగా లండన్ లోని బ్రిటిష్ పార్లమెంట్ లో “బ్రిటిష్ సౌత్ ఇండియన్ బిజినెస్ మీట్” (British South Indian Business Meet)నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో తెలంగాణా, ఆంధ్ర, తమిళనాడు, కర్నాటక మరియు కేరళ రాష్ట్రాల ప్రతినితులు, స్థానిక బ్రిటన్ ఎంపీ వీరేంద్ర శర్మ తో పాటు ఇతర ఎంపీ లు పాల్గొన్నారు.

తెలంగాణా రాష్ట్రం నుండి భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారు, తెలంగాణా టూరిసం సెక్రెటరీ బుర్ర వెంకటేశం గారు, ఏం.డీ డాక్టర్ క్రిస్టీన మరియు తెలంగాణా ఎన్నారై ఫోరమ్ అద్యక్షుడు సిక్క చంద్రశేఖర్ గౌడ్ వ్యవస్థాపక సబ్యుడు – ఎన్నారై టి.ఆర్.యస్ అద్యక్షుడు అనిల్ కూర్మాచలం, అడ్వై సరి బోర్డ్ ఛైర్మన్ ఉదయ్ నగరాజు పాల్గొన్న వారిలో ఉన్నారు.

British South Indian Business Meet 2015  @ UK Parliament - London (1) British South Indian Business Meet 2015  @ UK Parliament - London (3) British South Indian Business Meet 2015  @ UK Parliament - London (4) British South Indian Business Meet 2015  @ UK Parliament - London (5) British South Indian Business Meet 2015  @ UK Parliament - London (6) British South Indian Business Meet 2015  @ UK Parliament - London (7)

బ్రిటన్ ఎంపీ మరియు BSICC పాట్రన్ వీరేంద్ర శర్మ ముందుగా స్వాగతో పన్యాసం ఇస్తూ భారత – యూకే దేశాల మద్య ఉన్న మంచి వ్యాపార అనుకూల విధానాల గురించి వివరించి, వాటిని సద్వినియోగం చేసుకోవాలని హాజరైయన అన్ని రాష్ట్రాల ప్రతినితులని కోరారు. ముక్యంగా తెలంగాణా ప్రతినుతులని ప్రశంశిస్తు ముఖ్య మంత్రి కే. సీ. ఆర్ గారు రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతున్న తీరును అభినందించారు.

భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారు మాట్లాడుతూ … తెలంగాణా రాష్ట్ర విశిష్టత, ప్రస్తుత ఆర్థిక పరిస్థితీ , గణాంకాల తో సహా …. ఐ.టి ,ఫార్మా ,ఫుడ్ ప్రోసెసింగ్ ,ఇన్‌ఫ్రా స్ట్రక్చర్, పవర్,నీళ్ళు .. ప్రతి రంగం లో గత సంవత్సర కాలం లో రాష్ట్ర ప్రభుత్వం సాదించిన విజయాలు, తీసుకున్న నిర్ణయాల గురించి వివరించారు. ప్రపంచం లో ఎక్కడా లేనటువంటి సరికొత్త నూతన పారిశ్రామిక విదానం టీ. యస్ ఐ పాస్ (TSiPass)విధి విధానాల గురించి వివరించారు. ముక్యంగా తెలంగాణా ప్రభుత్వం – ముఖ్య మంత్రి కే. సీ. ఆర్ గారు అవినీతి లేని పెట్టుబడులకి అనుకూల నిర్ణయాలన్ని సభకు వివరించారు. రోజు రోజుకు అబివృద్డిలో హైదరాబాద్ దూసుకెళ్తున్న తీరు గురించి ప్రత్యేకంగా వివరించారు, నేడు రాష్ట్రం లో ప్రారంభమైన భారత దేశం లోనే అతి పెద్ద ఇంకూబేటార్ టి. హబ్ (T-HUB) గురించి ప్రత్యేకంగా వివరించారు .

నేడు భారత దేశం లో అన్ని రంగాల్లో పెట్టుబడులకి కేవలం తెలంగాణా ఒక్కటే అనువైన రాష్ట్రమని, కావున తెలంగాణా కి పెట్టుబడులతో వచ్చి కలిసి ఇద్దరం ఏదుగుదామని పిలుపున్నిచ్చారు. ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆహ్వానించినందుకు తెలంగాణా ఎన్నారై ఫోరమ్ సంస్థను అభినందించారు.

తెలంగాణా టూరిసం సెక్రెటరీ బుర్ర వెంకటేశం గారు చక్కని ప్రెసెంటేషన్ తో పర్యాటాకంగా తెలంగాణా రాష్ట్ర విశిష్టత ను వివరించారు, రాష్ట్రం లో చూడవలసిన ప్రదేశాలని,చారిత్రాత్మక కట్టడాల గురించి, హైదరాబాద్ బిర్యానీ తో సహా రాష్ట్రం లో ప్రత్యేకంగా లబించే ఆహార పదార్థాల గురించి వివరించారు. హైదరాబాద్ లో ప్రాముక్యమైన ముత్యాల, బట్టలు, తెలంగాణా రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక సంస్కృతి, వివిద రకాల పండగలు వాటి విశిష్టత ను వివరించారు. “Destination for All seasons and all reasons”అని చెప్పి, పర్యాటక రంగం లో పెట్టుబడులకు తెలంగాణా అనుకూలమైన రాష్ట్రమని ఆహ్వానించారు.

అలాగే ఈ కార్యక్రమం నిర్వహించిన తెలంగాణా ఎన్నారై ఫోరమ్ (TeNF) తెలంగాణా సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్తున్న తీరు గొప్పదని, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని అభినందిస్తూ. యూకే – యురోప్ లో “తెలంగాణా రాష్ట్ర ప్రబుత్వా పర్యాటక శాఖ ” అంబాసిడార్ గా తెలంగాణా ఎన్నారై ఫోరమ్ ఉంటుందని తెలిపారు. అలాగే నేడు చారిత్రాత్మక పార్లిమెంట్ ఆవరణ లో జరిగిన కార్యక్రమానికి తెలంగాణా రాష్ట్ర ప్రబుత్వా పర్యాటక శాఖను ఆహ్వానించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

చివరిగా తెలంగాణా ఎన్నారై ఫోరమ్ అద్యక్షుడు సిక్క చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ… BSICC యాజమాన్యానికి , ఎంపీ నర్సయ్య గౌడ్ గారికి, బుర్ర వెంకటేశం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు .

ఈ కార్యక్రమంలో BSICC కో – ఆర్డినేటర్ సుజిత్ నాయర్, తెలంగాణా ఎన్నారై ఫోరమ్ అద్యక్షుడు సిక్క చంద్రశేఖర్ గౌడ్ వ్యవస్థాపక సబ్యుడు – ఎన్నారై టి.ఆర్.యస్ అద్యక్షుడు అనిల్ కూర్మాచలం, అడ్వై సరి బోర్డ్ ఛైర్మన్ ఉదయ్ నగరాజు ,
తెలంగాణా ఇండస్ట్రీస్ ఫెడ్‌రేషన్ ప్రతినిధి విజయ్ చౌదరి, స్టెరింగ్ కమిటీ సబ్యుడు గణేశ్, ఉపాద్యక్షురాలు పవిత్ర రెడ్డి కంది, సబ్యులు రత్నాకర్, నవీన్ రెడ్డి పాల్గొన్న వారిలో ఉన్నారు.

0 1434

మనం దేవుడిని పూలతో పూజిస్తాం. మరి ఆ పూలనే దెవుడిగా పూజిస్తే? అందమైన రంగు రంగుల పూలని ఏరీ కోరి తెచ్చి పళ్ళెంలో ఒక రాశిగా పేర్చి ఆ పై భాగంలో అమ్మవారిని ప్రతిష్టించి పసుపు కుంకాలతో ఆర్చించి అలరించే అపూర్వమైన ఉత్సవ విశేషం తెలంగాణా బతుకుమ్మ పండగ.
ముగ్ధ మనోహరం గా అలంకరించుకున్న స్త్రీలంతా తమ ఇళ్ళూ వాకిళ్ళూ అలికి ముగ్గులు తీర్చి దిద్డి అందులో బతుకమ్మని ప్రతిష్టించి లయబద్ధంగా “బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో “అని పాటలు పాడుతూ చుట్టూ తిరుగుతూ ఉంటే చూడ ముచ్చటగా ఉంటుంది. ఆట పాటల తరువాత బతుకమ్మలని తీసుకుని నది వొడ్డున అంతా తాము తెచ్చిన ప్రసాదాలు పంచుకుని అక్కడి జలాశయాల్లో నిమజ్జనం చేస్తారు.


ప్రకృతిని ప్రజలతో మమేకం చేసిన అమ్మ తల్లి మన బతుకమ్మ. బతుకమ్మ అంటే మన బతుకుకే ఒక అమ్మ, బ్రతుకుని కాపాడే అమ్మ. సమస్త ప్రాణి కోటికి జీవనాధారం. తెలంగాణా ప్రజలకి ఇలవేల్పుగా, ప్రకృతి స్వరూపిణీ గా విలసిల్లుతోంది. అసలు ఈ బతుకమ్మ తల్లి కోసం సాక్షాత్తూ సూర్య భగవానుడు ఎర్ర మందారం గా, దేవతలు అంతా తలొక పువ్వు అయ్యీ ఆమెని పూజించారు అంటే అతిశయోక్తి కాదేమో.  బతుకమ్మ రైతు నుండి రాజు వరకు, పండితుడి నుండి పామరుడి కి తెలిసిన దేవత. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు తొమ్మిది రోజులు దసరా నవరాత్రులలో చేసే అద్భుత పండగ.


వ్యవసాయ ప్రధానమైన మన దేశం లో బతుకమ్మని పూజించటం కోసం సుగంధ పుష్పాలతో పాటు రైతులు తమ ఇళ్లల్లో సొర, బీర, కాకర, దోస, గుమ్మడి పాదులు పెంచుతారు, దానితో వారికి ఆహారం సమకూరుతుంది. కలువలు, తామరలు చెరువుల్లో పెంచటం వల్ల వాటి పరిరక్షణ కలుగుతుంది. వ్యవసాయానికి కూడా ఉపయోగం. అలాగే పిల్లలు పెద్దలు పూలు ఏరీ కోరీ తేవటం వల్ల చెట్ల గురించిన విజ్ఞానం కలుగుతుంది.

ప్రముఖ తెలుగు వేద కవి శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు ఏకం గా ” బతుకమ్మ శతకం” రచించి తెలంగాణా పల్లెల్లో జీరాడు పట్టు కుచ్చిళ్లతొ తిరుగాడే ఆడపడుచుని ఒక సాంస్కృతిక కధానాయికగా ఆవిష్కరించారు. ఆయన రచించిన శతకం లో ఒక పద్య కుసుమం.
Praising you honestly- thousands of good flowers, their worship is reasonless blossomness, how generous? please give them all batukamma

వేల రకాల పూలు ఉన్నత భక్తి తో నిన్ను కీర్తిస్తున్నాయి, వాటి భక్తి కి కారణం , కోరికా లేదు వాటికి సౌందర్యం ఇచ్చావు అని కృతజ్ఞతగా నీకు సర్వ సమర్పణ చేసుకుంటున్నాయి ఆ పూలని దగ్గర చేర్చుకుని అనుగ్రహించు తల్లి అంటూ అద్భుతం గా రాశారు.

ప్రకృతి ని పరిరక్షించండి, ప్రేమించండి అన్న అద్భుత సందేశం ఉన్న బతుకమ్మ పండగ తెలంగాణా రాష్ట్రానికే కాదు ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఆదర్శ ప్రాయమే.

మన అందరి తెలుగు మిత్రులందరికీ శరన్నవరాత్రి, బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

– సువర్ష , లాస్ ఏంజెల్స్

లండన్: తెలంగాణ ఎన్నారై ఫోరం (TeNF) ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాలకు యుకే నలుమూలల నుండి సుమారు 700లకు పైగా తెలంగాణ కుటుంబ సభ్యులు హాజరైయ్యారు.  ఈ వేడుకలకు తెలంగాణా రాష్ట్రం నుండి తెలంగాణా మండలి ఛైర్మన్ శ్రీ స్వామి గౌడ్ గారు మూక్య అతిధి గా హాజరవడం విశేషం. స్వదేశం లో జరుపుకున్నట్టు సంప్రదాయ బద్దంగా  పూజలు నిర్వహించి, లండన్ వీదుల్లో తోట్టెల ఊరేగింపు ప్రవాస తెలంగాణ బిడ్డలనే కాకుండా స్తానికులని కూడా ముగ్దులని చేసింది.

Council Chairman Swamy Goud Garu @ TeNF London Bonalu Celebrations (1) Council Chairman Swamy Goud Garu @ TeNF London Bonalu Celebrations (2) Council Chairman Swamy Goud Garu @ TeNF London Bonalu Celebrations (3) Council Chairman Swamy Goud Garu @ TeNF London Bonalu Celebrations (4)

ఈ సంవత్సరం జరుపుకొనే పండగకు ప్రత్యేకత ఉందని  తెలంగాణ రాష్ట్ర పండగగా కొత్త ఉత్సాహాన్ని, స్పూర్తి ని ఇచ్చాయని, తెలంగాణా మండలి ఛైర్మన్ శ్రీ స్వామి గౌడ్ గారు  మా ఆహ్వన్నని మన్నించి లండన్ విచ్చేసి మా ఆడబిడ్దల తో పాటు బోణం ఎత్తుకోవడం మాకెంతో స్పూర్తినిచ్చిందని కమిటీ సబ్యులు, హాజరైన ప్రవాస తెలంగాణ బిడ్డలు తెలిపారు.  తెలంగాణ ఎన్నారై ఫోరం మూడు   సంవత్సరాలలో చేసిన ముఖ్య కార్యక్రమాల వీడియో ని ప్రదర్శించి, అతిథులకు వివరించారు. ఇది చూసి హాజరైన ప్రతి ఒక్కరు ఉద్వేగానికి లోనయ్యారు.

బోానాల ఊరేగింపు తరువాత ఏర్పాటు చేసిన వేడుకల సభ లో తెలంగాణా మండలి ఛైర్మన్ శ్రీ స్వామి గౌడ్ గారు  మాట్లాడుతూ… ఉద్యమం లో ఎన్నారై ల పాత్ర గొప్పదని తెలిపారు,  ముక్యంగా ఉద్యమ సమయం లో తెలంగాణా ఎన్నారై ఫోరమ్ లండన్ వీదుల్లో “జై తెలంగాణా ” అంటూ చేసిన పోరాటం మాకు ఎంతో స్పూర్తినిచ్చిందని తెలిపారు.  ఈ బోనాలు వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, తెలంగాణా రాష్ట్రం లో ఉనట్టుగా అనిపించిందని, తెలంగాణా సంస్కృతి ని ప్రపంచానికి చాటి చెప్తున్న  తీరుని  ప్రశంసించారు. ఒక పక్క వ్యక్తిగతంగా ఇక్కడున్న బిడ్డలు బిజీ గా ఉన్నపట్టికి,  బాద్యత గల తెలంగాణా బిడ్డలు గా ఆనాడు ఉద్యమం లో నేడు పునర్నిర్మాణం లో పోశ్శిస్తున్న పాత్ర నాకు ఎంతో స్పూర్తినిస్తుందని తెలిపారు.

ఖండాంతరాళ్లలో ఉంటూ తెలంగాణా పేద బిడ్దలను, అనాధలను, వికలాంగుల బిడ్డలకు చేస్తున్న ఆర్థిక సహాయం వెల కట్టలెనిదని తెలిపారు.   టి.అర్.యస్ ప్రభుత్వం –  తెలంగాణా తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ గారు, తెలంగాణా ప్రజల ఆకాంక్షాల మేరకు,  మనం కలలు కన్న బంగారు తెలంగాణ కోసం కెసిఆర్ గారు ఆహార్ నిశలు కష్టపడ్తున్నారని ఎటువంటి సందేహాలు అవసరం లేదని హామీ ఇచ్చారు.

 

తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన  మిషన్ కాకతీయ పథకాల గురించి వివరించారు, టి.అర్.యస్ ప్రబుత్వం, ప్రతి ఒక్కరిని కలుపుకొని అందరి సూచనలని తీసుకొని ముందుకు వెతుందని కాబట్టి మీరు కూడా  ఎటువంటి సలహాలు అయిన లేదా సందేహాలు ఉన్న వ్యక్తిగతంగా నన్ను కాని,సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కాని సంప్రదించవచ్చు అని తెలిపారు. ప్రతి తెలంగాణా బిడ్డ మిషన్ కాకతీయ లో బాగాస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తరువాత తెలంగాణా రాష్ట్ర సాధన లో మరియు నేడు పునర్నిర్మాణం లో వారి మాతృ భూమికి చేస్తున్న సేవలకు, తెలంగాణా ఎన్నారై ఫోరమ్ ప్రతినిధులు స్వామి గౌడ్ గారిని ఘనంగా సన్మానించి, జ్ఞాపిక ను అందచేశారు.

 

తెలంగాణ ఎన్నారై ఫోరం అద్యక్షులు సిక్కా చందు గౌడ్  మాట్లాడుతూ… తెలంగాణా ఉద్యమం లో స్వామి గౌడ్ గారి పాత్రను, మలి దశ ఉద్యమంలోనే కాకుండా 1969 లో నూనూగు మీసాల వయస్సు నుండి నేడు తెలంగాణా రాష్ట్ర సాధన వరకు చేసిన పోరాటాల గురించి సభకు వివరించారు, పిలవగానే వచ్చిి ఈ బోనాల వేడుకల్లో మాతో పాటు బాగస్వాములైనందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తెలంగాణా ఎన్నారై ఫోరమ్ తెలంగాణా ప్రజల కోసం, ప్రపంచం లో ఉన్న తెలంగాణా బిడ్డలా కోసం చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించి, అందరు ఇందులో బాగస్వాములు కావాలని పిలుపున్నిచ్చారు.

 

తెలంగాణ చిన్నారులు, కమిటీ మహిళా విభాఘం సబ్యులు చేసిన సాంస్కృతిక కార్యక్రమం అందరిని అలరించింది. తెలంగాణ పునర్నిర్మాణం లో బాగంగా పేద విద్యార్థులకు పుస్తకాల పంపిన కై నిర్వహించిన రాఫెల్ లో అందరు పాల్గొని విజేతలు బంగారం బహుమతులు గెల్చుకున్నారు, అలాగే సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని సంస్థ జ్ఞాపిక లతో ప్రశంశించారు.   సంప్రదాయ తెలంగాణా వంటకాలతో పండగ భోజనం సొంత ఇంటిని తల్పించందని పలువురు అభిప్రాయపడ్డారు.

 

తెలంగాణ ఎన్నారై ఫోరం ప్రధాన కార్యదర్శి   ప్రవీణ్ రెడ్డి  గంగాసాని మరియు  మంద సునీల్ రెడ్డి ఆద్వర్యం లో జరిగిన బోనాల జాతర ఇంతటి విజయం సాదించడం సంతోషం గా ఉందని కమిటీ సబ్యులు తెలిపారు.

 

తెలంగాణ ఎన్నారై ఫోరం అద్యక్షులు సిక్కా చంద్ర శేకర్  గౌడ్ , తెలంగాణ ఎన్నారై ఫోరం వ్యవస్థాపక సబ్యులు అనిల్ కూర్మాచలం తో పాటు ఉపాధ్యక్షులు పవిత్ర రెడ్డి కంది, ప్రదాన కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి, అడ్వైసరి బోర్డు ఛైర్మన్ ఉదయ నాగరాజు,  సంయుక్త కార్యదర్శి సుధాకర్ గౌడ్, ఈవెంట్స్ ఇంచార్జ్ నగేష్ రెడ్డి, ఈవెంట్స్ సెక్రటరీ శ్వేతా రెడ్డి, అడ్వైసరి బోర్డు సబ్యులు  ప్రమోద్ అంతటి ,మహిళా విభాగం సబ్యులు అర్చన జువ్వాడి , మీనాక్షి , సుమ, స్వాతి, వాణి,నిర్మల,,శుశుమ్న, దీప్తి ఇతర కమిటీ సబ్యులు శ్రీధర్, రోహిత్ రేపక,అశోక్ గౌడ్,నవీన్ రెడ్డి, రత్నాకర్ , హరి గౌడ్ నవపేట్ ,  మల్ల రెడ్డి,విక్రం రెడ్డి,నరేష్,రంగు వెంకట్,  శివాజీ షిండే, శ్రీకాంత్ జెల్ల, ఆక్రం, శ్రీనివాస్ రుద్ర చిట్టి వంశీ, సందీప్ గౌడ్, శ్రీధర్ రావు, స్వదేశం నుండి వచ్చిన కరీంనగర్ టి.ఆర్.యస్ నాయకులు తిరుపతి రెడ్డి కాసార్ల్ గారు  తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు.

0 1257

DATA Celebrated Telangana Formation Day & Cultural Night on June 14th 2015 @ Southfork Ranch Allen TX

Dallas Area Telangana Association (DATA www.dataus.org) celebrated 1st Anniversary of Telangana Formation Day and Cultural Night on June 14th at Southfork Ranch Allen TX. Over 1500 Telugu and Telangana enthusiasts all around the Texas participated. The event was started by playing American, Indian & Telangana anthems.

DATA founding member and Event Coordinator Mr. Mahendar Ganapuram started the program by requesting the attendees to say “Jai Telangana”, Mr. Mahendar explained the importance of remembering “Telangana Ideologist / Siddantha Kartha” Prof Sri Jayshankar Garu” and all the fallen martyrs and requested to observe a moment of silence. He also explained DATA past activities and charity programs for the past 5 years, and requested continued support from everyone.

DATA Cultural Chair Mr. Srinivas Thippana introduced singers Sri Vandemataram Srinivas, Sri Anuj Gurwara, Miss Madhoo and Miss Nithya to the audience. All the singers sung some popular numbers in Telangana and Telugu, Hindi Movies, later NRI kids performed various dances to the popular numbers. Everyone enjoyed the evening with delicious food from Pista House and Swagruha Kitchen. DATA thanks their support.

DATA Chairman Sri Pramod Prodduturi thanked all the sponsors, donors, volunteers, choreographers and performers. He also thanked the Bathukamma Dasara committees for their unwavering attention to the festival DATA Co-Chair Sri Ram Kasarla thanked community Organizations such as Telanga American Telugu Association (TATA), American Telugu Association (ATA) and Telangana Jagruthi for their monitory support. TATA representatives – Sri Vikram, Sri Mahendar Kamireddy, Sri Mahesh Adibhatla, ATA representatives, Sri Ajay Reddy, Sri Raghveer Bandaru, Sri Mahendar G, Sri Satish Reddy and Telangana Jagruthi representatives Sri Sridhar Bandaru, Sri Sumanth Garakarajula and Sri Kiran Guntuka.

For the past 5 years DATA has done many events, DATA requested continued support. Mahendar thanked media partners TV5, TV9, Telangana Vihar, Masti TV, DP TV, Sound O Rama, 6News, CVR News, Yuva Media, Namasthe Hyderabad, MyDealsHub.com and TelanganaDaliy. DATA thanks Pista House and Swagruha Kitchen for the delicious food. Sri Mahesh Adibhatla and Smt. Padmasri Thota moderated the Event.

Stay tuned for next DATA eventBathukamma & Dasara Paduga a Telangana State Festival on Oct 17th 2015.

0 2938

TELANGANA AMERICAN TELUGU ASSOCIATION (TATA) GRAND LAUNCH on April 5th, 2015

Telugu people in America are creating another history !! The aspiration of thousands of NRI youth from Telangana has led to the formation of TATA in the USA. The grand launching of Telangana American Telugu Association (TATA) is set to take place on Sunday, April 5, 2015 at 11.00 AM at the famous Royal Albert’s Palace in NJ, USA (see, www.tataus.org).

TATA is a Telugu charitable and cultural organization of the Telangana people. TATA extends a warm welcome to all Telugu speaking people to an open and inclusive platform where the focus will be on Telugu language, arts with primary vision of providing Charitable, Community, Cultural and Social services to Telangana region.

TATA is a national-level association established in synchronization with the new Telangana state formation and for emerging community needs of thousands of Telangana NRIs living in the USA. TATA is being designed uniquely to represent all people of Telangana origin and Telugu families. The main motto of TATA is reflected by its slogan Telugu kalala thota – Telangana sevala kota”.

TATA will strive to promote the Telangana culture and community services throughout the United States, and wish to contribute towards the development of “Bangaru Telangana” as has been envisioned by the Telangana state founders. The venue of the TATA inauguration is Royal Albert’s Palace in Edison, New Jersey. The program starts at 11 AM with cultural programs with celebrity artists and folk singers along with local talent. It’s going to be a fun filled entertainment program along with the Launch of TATA by Telangana people and esteemed guests.

TATA cordially invites all Telugu people and families to grace this event, which is set to create a new wave in America. An exciting cultural program is being planned and various Telangana dignitaries and celebrities are expected to attend the TATA inauguration. Registration to attend is requested to make proper arrangements for seating, lunch etc at the venue.

Smt. Kavitha (TRS Leader), Hon’ble MP from Telangana State, has kindly consented to be the Chief Guest. Several leaders from Telangana region form different parties are slated to attend the event.

The ace comedian and star performer Shiva Reddy is going to engage the audience with his performance. Vandemataram Srinivas, Gorati Venkanna, are going to enthrall the audience with their mesmerizing, soulful and emotional songs. Revanth, Lipsika, Anudeep and Hanishka are going to rock the stage with their performances. Several other programs are planned to make this a GRAND LAUNCH.  Click here to register for the event.

SOCIAL

3,873FansLike
8FollowersFollow

SPECIALS

SHORT FILMS