Tags Posts tagged with "TANTEX"

TANTEX

0 758

జనవరి 7, 2018, డాలస్/ఫోర్ట్ వర్త్  

         తెలుగు సంస్కృతికి, తెలుగు భాషకి ఎల్లప్పుడూ పట్టం కట్టే  ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాoటెక్స్ ) వారు 2018 సంవత్సరానికి  ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని జనవరి 7 వ తేదీన డాలస్ లో జరిగిన గవర్నింగ్ బోర్డు సమావేశం లో  ప్రకటించారు. ఈ సందర్బంగా శీలం కృష్ణవేణి సంస్థ అధ్యక్షురాలిగా  పదవీబాధ్యతలు స్వీకరించారు. టాoటెక్స్ లాంటి గొప్ప సంస్థ కి అధ్యక్షురాలిగా పదవీబాధ్యతలు తీసుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఉత్తర అమెరికా లోనే ప్రతిష్టాత్మక సంస్థ అయిన టాoటెక్స్ ను ముందుండి నడపవలసిన బాధ్యతను తన మీద పెట్టినoదుకు టాoటెక్స్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియచేశారు.

 

అధికారిక కార్యనిర్వాహక బృందం

అధ్యక్షులు : శీలం కృష్ణవేణి సంయుక్త కార్యదర్శి :  కసగాని మనోహర్
ఉత్తరాధ్యక్షుడు: వీర్నపు చిన్నసత్యం కోశాధికారి:  పాలేటి లక్ష్మి
ఉపాధ్యక్షుడు : కోడూరు కృష్ణారెడ్డి సంయుక్త కోశాధికారి:  కొణిదల లోకెష్ నాయుడు
కార్యదర్శి :  మండిగ శ్రీలక్ష్మి తక్షణ పూర్వాధ్యక్షులు: ఉప్పలపాటి కృష్ణా రెడ్డి

 

కాజ చంద్రశేఖర్ , సింగిరెడ్డి శారద,

పార్నపల్లి ఉమా మహేష్, బ్రహ్మదేవర శేఖర్ రాజ్, పద్మశ్రీ తోట,

తోపుదుర్తి  ప్రభంద్ రెడ్డి, లంక భాను, ఎర్రం శరత్,  ఇల్లెందుల సమీర,

బండారు సతీష్, చంద్రా రెడ్డి పోలీస్, బొమ్మ వెంకటేష్ , యెనికపాటి జనార్ధన్

 

 

పాలక మండల బృందం

అధిపతి :  డా. సిరిపిరెడ్డి రాఘవ రెడ్డి,  ఉపాధిపతి: కొనార రామ్

కన్నెగంటి చంద్రశేఖర్, ఎన్. ఎం.యస్. రెడ్డి, మందాడి ఇందు రెడ్డి,

నెల్లుట్ల పవన్ రాజ్, ఎర్రబోలు దేవేందర్,

 

కొత్త పాలక మండలి మరియు  కార్యవర్గ బృందాల సూచనలు, సహాయ సహకారాలతో ,సరికొత్త ఆలోచనలతో 2018 లో అందరిని అలరించే మంచి కార్యక్రమాలు చేయనున్నామని, స్థానిక తెలుగు వారి ఆశీస్సులు, ఆదరణ తప్పక ఉంటాయని ఆశిస్తున్నానని  సంస్థ అధ్యక్షులు తెలిపారు.

2017 సవత్సరంలో టాంటెక్స్ అధ్యక్షుడుగా పదవీ విరమణ చేసిన తక్షణ పూర్వాధ్యక్షుడు ఉప్పలపాటి కృష్ణా రెడ్డి  మాట్లాడుతూ “శీలం కృష్ణవేణి  గారి నేతృత్వంలో ఏర్పడిన 2018 కార్యవర్గ బృందం నిర్వహించబోయే కార్యక్రమాలకు నా సంపూర్ణ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాను”, అని తెలిపారు.

మరిన్ని వివరాలకు www.tantex.org సందర్శించండి.

0 880

మనకు ఎన్నో పండుగలు ఉన్నా దీపావళి పండుగ మాత్రం ఎంతో ప్రత్యేకమైనది, తెలుగు రాష్ట్రాలలోనే కాదు , ప్రపంచం నలుమూలలా కాంతి నింపే దీపాల రంగవల్లి దీపావళి.  ఈ  ఉత్సాహం  అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది.. అమెరికా తెలుగు సాంస్కృతిక రాజధానిగా పేరొందిన డల్లాస్ నగరంలో, తెలుగు ప్రజల గుండె చప్పుడు , తెలుగుదనానికి మాతృక అయిన టాంటెక్స్ వారి దీపావళి వేడుకలు స్థానిక మార్తోమా చర్చి ఆడిటోరియంలో  శనివారం రోజున కన్నుల పండుగగా జరిగాయి. ఈ దీపావళి సంబరాలను టెక్సాస్  రాష్ట్రం నుండే  కాక  ఎన్నో  వేల  మైళ్ళు  ప్రయాణించి , ప్రక్క రాష్టాలనుండి వచ్చిన తెలుగు వారు , ఆద్యంతం ఎంతో ఉల్లాసంగా, బంధుమిత్రులతో,  ఆత్మీయులతో  ఘనంగా జరుపుకున్నారు.

ప్రాంగణమంతా ఎపిక్ ఈవెంట్స్ వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అందమైన అలంకరణతో ముస్తాబై,  అతిధులకు, ప్రేక్షకులకు ఆహ్వానం పలికింది. టాంటెక్స్ సాంస్కృతిక బృంద సమన్వయకర్త పద్మశ్రీ తోట ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా  తన సహజ సిద్దమైన సుమధుర వ్యాఖ్యానం తో, సున్నిత హాస్యంతోప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.  స్థానిక కళాకారులు ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యాలు, సినిమా డాన్సులు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పసందైన విందు, కళకళలాడుతున్న అంగళ్ళతో ఆవరణ అంతా పండుగ వాతావరణం నెలకొంది.

ప్రార్ధనా గీతంతో మొదలైన కార్యక్రమాలుసంప్రదాయ  కీర్తనలతో , నృత్యాలతో , మెడలీ పాటలతో, ఎంతో హుషారుగా సాగాయి.  ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన తరుణం రానే వచ్చింది, బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ద్వారా ఎంతో ప్రాచుర్యం పొందిన హరితేజ, ధనరాజ్ లను ,  తెలుగు రాప్ పాటలతో పేరు తెచ్చుకొన్న రేపర్  రోల్ రైడ లను ఒక్కసారిగా చూసిన ప్రేక్షకులు  చాలా సేపటివరకు తమ కరతాళ ధ్వనులతో, కేరింతలతో చిన్న పాటి సునామీ సృష్టించారు. వారు కూడా అంచనాలకు ఏమీ తగ్గకుండా చక్కని హాస్య నాటికలతో, పంచ్ డైలాగులతో, విపరీతంగా నవ్వించారు. హరితేజ గారిని  అమెరికా చిన్నారులు ఎంతో మంది కలిసి, ఆత్మీయంగా హత్తుకొని, ఎంతో ప్రేమ కనపరిచారు. ఆవిడ ఈ  అభిమానానికి చలించిడల్లాస్ కు టాంటెక్స్ కు మనసారా కృతజ్ఞతలు చెప్పారు. రోల్ రైడ అయితే స్టేజీనుండి క్రిందకు దిగి, ప్రతి ఒక్క చిన్నారిని కలిసి వారితో రాప్ డాన్స్ చేశారు, ముఖ్యముగా ‘పతంగ్’ అనే పాటను ప్రేక్షకులు  కోరిక మేరకు రెండు సార్లు పాడారు. ధనరాజ్ గారు అ నుండి అః వరకు ఒక్కో  అక్షరమే వాడి  ప్రేమికుల మధ్య సంభాషణను హాస్యవంతంగా చేసిన స్కిట్ ప్రశంసలు అందుకొంది.  

 

అటు తరువాత , స్టేజీమీద ఒక్కసారిగా చీకట్లు కమ్ముకొన్నాయి , ఏంజరిగిందో అనుకొనే లోగా ఒక్కో దీపం వెలగడం, రంగురంగుల దీపాల కాంతులలో 50 కి పైగా కళాకారులు చేసిన ప్రదర్శన డల్లాస్ కళాకారుల ప్రతిభకు తార్కాణం. రేడియం కాంతులతో నిజంగానే పటాసులు కాలుస్తున్నారా అనేంత ఆహ్లాదంగా సాగిన ఈ ప్రదర్శన అశేష నీరాజనాలు అందుకొంది .  అందమైన భామలు  “వచ్చిండే – మెల్ల మెల్లగా వచ్చిండే అని చేసిన నృత్యాలు, సంప్రదాయాన్ని మరువకుండా చేసిన కూచిపూడి నృత్యాలు సమపాళ్ళలో మేళవించి చక్కని అనుభూతి అందించాయి.  

 

కార్యక్రమంలో  సంస్థ అధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలుగు సంస్కృతీ సాంప్రదాయలకు పట్టం కట్టి,  తరాలు మారినా  తెరమరుగు కాకుండా రక్షణ ఛత్రంలా నిలబడటo, తెలుగు భాషను రక్షించుకోవడం,వ్యాప్తి  చేయడం, భావితరాలకు అందించడమే టాంటెక్స్ లక్ష్యమని వెల్లడించారు. కొత్తగా భారత దేశాన్నుంచి వచ్చే వారే కాక, అమెరికా లోని ఇతర రాష్ట్రాలనుండి వచ్చే తెలుగు వారి సంఖ్య బాగా పెరుగుతున్న నేపథ్యంలో మన టాంటెక్స్ సంస్థ ఎంతో అభివృద్ధి సాధించే అవకాశం ఉంది అని తెలిపారు. మరియు ఈ దీపావళి అందరి జీవితాలలో కొత్త వెలుగులు నింపాలని,  కష్టాలు తొలంగించాలని ఆకాక్షించారు.

వచ్చిన వారికి షడ్రషోపేత  తెలుగు భోజనంతో పాటు  అందుబాటు ధరలలో  నాణ్యమైన ధరలకు వస్త్రాభరణాలు, ఇంకా ఎన్నో ఉపయోగ కరమైన స్టాళ్లు టాంటెక్స్ వాళ్ళు ఏర్పరిచారు. కమ్మని  విందుతో పాటు చక్కని సాంస్కృతిక కార్యక్రమాలు,విచ్చేసిన అందరిని అలరించాయి.   దీపావళి వేడుకల ప్రాంగణమంతా చక్కటి సాంప్రదాయ దుస్తులతో విచ్చేసిన పిల్లలు, పెద్దలతో  పండుగ వాతావరణం నెలకొన్నది.

ఈ దీపావళి కార్యక్రమ ప్రెజెంటింగ్ పోషకులు TPAD సంస్థకు మరియు కార్యక్రమ పోషకులైన రమణారెడ్డి క్రిష్టపాటి గారికి, డా.రాఘవేంద్ర ప్రసాద్ గారికి, ఆత్మచరణ్ రెడ్డి గారికి, అప్పారావు  యార్లగడ్డ గారికి, సతీష్ మండువ గారికి , రామారావు ముళ్ళపూడి గారికి జ్ఞాపికలు ప్రధానం చేసి టాంటెక్స్ సంస్థ అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు, తమ కృతఙ్ఞతలు తెలియచేసారు.     

అతిథుల సన్మాన కార్యక్రమంలో ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) అధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణారెడ్డి మరియు కార్యవర్గ బృందం, పాలకమండలి అధిపతి రోడ్ద రామకృష్ణ రెడ్డి మరియు బృందం పాల్గొని పుష్ప గుచ్చం మరియు జ్ఞాపికలతో ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య సన్మానించారు.

చివరగా కార్యక్రమ సమన్వయకర్త పార్నపల్లి ఉమామహేష్ వందన సమర్పణ చేస్తూ సహాయం అందించిన సంస్థలకు, స్వచ్ఛంద సేవకులకు, పోషకదాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అర్ధరాత్రి కావస్తున్నా , చివరివరకు ఉండి  టాంటెక్స్ దీపావళి సంబరాలకు ఇంత ఘన విజయం చేకూర్చిన ప్రేక్షకులకు  అధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణారెడ్డి గారు పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు . 

ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన ఫన్ ఏసియా మరియు ప్రసార మాధ్యమాలైన టీవీ9, టీవీ5, టి.ఎన్.ఐ,  , తెలుగు టైమ్స్  లకు  కృతఙ్ఞతా పూర్వక అభివందనములు తెలియజేశారు. ఎంతో కృషి, సమయం వెచ్చించిన టాంటెక్స్ కార్యవర్గ సభ్యులకు మరియు వివిధ కమిటీ సభ్యులకు, స్వచ్ఛంద కార్యకర్తలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. భారతీయ జాతీయ గీతం ఆలపించడంతో, ఆహ్లాదంగా గడిచిన ఈ కార్యక్రమానికి తెర పడినది.

 

పైన వివరించిన కార్యక్రమాల ఛాయాచిత్రాలను ఈ క్రింద పొందుపరచిన లంకెలో చూడవచ్చును.

https://tantex.smugmug.com/2017-Events/Deepavali-Vedukalu-2017/

టాంటెక్స్ దీపావళి వేడుకల గురించి జలసూత్రం చంద్రశేఖర్ సమర్పించిన పత్రికా నివేదిక.

0 1081

జులై 8th 2017 డాలస్, టెక్సస్

31 సంవత్సరాల ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) తెలుగు వైభవం  మరియు  ఆ సంస్థ ప్రత్యేక కార్యక్రమం  “నెల నెలా తెలుగు వెన్నెల” తెలుగు సాహిత్య వేదిక 10వ వార్షికోత్సవం ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.  ఈ   ప్రత్యేక సదస్సు “తెలుగు వైభవం”  విశిష్ట అతిధుల సమక్షంలో అశేష అభిమానుల మధ్య  స్థానిక ఇర్వింగ్ హై స్కూల్ ఆడిటోరియం లో,  అధిక సంఖ్యలో పాల్గొన్న డాలస్ ప్రాంతీయ తెలుగు భాషాభిమానుల ఆదరాభిమానాలు చూరగొంటూ, అత్యంత వైభవంగా జరిగాయి.  ప్రవాసంలో నిరాటంకంగా 120 నెలల పాటు సాహితీ వేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించటం ఈ సంస్థ విశేషం. మధ్యాహ్నం ప్రారంభమైన సాహిత్య వేదిక వార్షికోత్సవం ఉప్పలపాటి కృష్ణా రెడ్డి అధ్యక్షతన మరియు సమన్వయకర్త సింగిరెడ్డి శారద ఆధ్వర్యంలో నిర్వహించబడినది. భారతదేశం నుండి వచ్చిన ముఖ్య అతిథులు, డాలస్ లోని తెలుగు భాషాభిమానులు, సాహితీ ప్రియులు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది

కార్యక్రమంలో ముందుగా సాహిత్య వేదిక సమన్వయకర్త సింగిరెడ్డి శారద 2017 సంవత్సరంలో జరిగిన సాహిత్య కార్యక్రమాల గురించి మాట్లాడారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ  ఉపకులపతి ప్రొఫెసర్ వి.దుర్గాభవాని గారు తెలుగు సాహిత్యం గురించి మాట్లాడారు. విమర్శకుడు, కథ, యాత్రా రచయిత దాసరి అమరేంద్ర గారు “తెలుగు యాత్రా సాహిత్యం” అంశం మీద చక్కగా ప్రసంగించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ గ్రహీత డా. కాత్యాయని విద్మహే గారు “తెలుగు సాహిత్య విమర్శ” అంశం మీద ప్రధాన ప్రసంగం గావించారు. సంపాదకులు,విమర్శకులు వాసిరెడ్డి నవీన్ గారు “తెలుగు కథ – మారుతున్న స్వరం” అంశం మీద ప్రసంగించారు. నాటక రచయిత డా. కందిమళ్ళ సాంబశివరావు గారు “తెలుగు నాటకం – సామాజిక చైతన్యం” అంశం మీద ప్రసంగించారు. ప్రముఖ కధా రచయిత గొర్తి బ్రహ్మానందం గారు తెలుగు సాహిత్యం మీద తెలుగు భాష సాహితీవేత్తల నడుమ చర్చ నిర్వహించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను చర్చించి,  విచ్చేసిన వారందరినీ ఆనందపరిచారు. విచ్చేసిన సాహితీ ప్రముఖులందరిని సంస్థ కార్యవర్గ మరియు సాహిత్య వేదిక బృందం పుష్ప గుచ్చం , దుశ్శాలువ మరియు జ్ఞాపికలతో ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య సన్మానించారు.

10వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ఫోటో కవితల పోటీకి ఆశేష ఆదరణ లభించింది. ప్రముఖ కవయిత్రి మెర్సీ మార్గరెట్ గారు ఫోటో కవితల పోటీకి న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. డాలస్ కి చెందిన నశీం షేక్ రాసిన “పునాదులు-సమాధులు” కవితకి మొదటి బహుమతి లభించగా. రావెల పురుషోత్తమరావు గారి “ఆదరాబాదరాగా” కవితకి రెండవ బహుమతి లభించింది. చిలుకూరి  వెంకటశాస్త్రి గారి “జయహో” కవితకి మూడవ బహుమతి లభించింది.

దాదాపు మూడు దశాబ్దాలకు పైగా తన జీవితాన్ని కూచిపూడి కళకే అంకితం చేసి, దేశ విదేశాల్లో వందలాది నృత్య ప్రదర్శనలతో కూచిపూడి నృత్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేస్తూ వాటికి విశేష పేరు ప్రఖ్యాతలు సంపాదించిన  నాట్యాచార్యులు, చలన చిత్ర నృత్య దర్శకులు శ్రీ కేవీ సత్యనారాయణ గారు డాలస్ కి చెందిన నాట్య కళాకారులతో కలిసి “జయహో శ్రీ కృష్ణదేవరాయ” కూచిపూడి నృత్య రూపకాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఎంతో ఆసక్తితో అష్ట దిగ్గజాలుగా పాల్గొన్న స్థానిక భాషాబిమానుల వేష ధారణ మరియు వారి ఆసక్తి ఈ నృత్య రూపకానికి నూతన శోభ, ఉత్సాహం తెచ్చిపెట్టాయి.

భోజనానంతర విరామం తరువాత, ఈ ప్రత్యేక సదస్సు సమన్వయ కర్త మహేష్ ఆదిత్య ఆదిభట్ల ఆహ్వాన పలుకులతో, సాయంకాల వినోద కార్యక్రమాల వివరాలు అందిస్తూ,  ప్రేక్షకులకు పునస్వాగతం తెలిపారు.  ఈ సందర్భంగా , ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) అధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణారెడ్డి తమ సందేశంలో “31 సంవత్సరాల టాంటెక్స్ తెలుగు వైభవం మనమందరం కలిసి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఒక చిన్న సంస్థ గామొదలైన టాంటెక్స్  ఈ నాడు అమెరికా లో ఉన్న జాతీయ తెలుగు సంస్థలతో ధీటుగా ఇటు అమెరికాలో అటు ఇండియా లో కూడా గుర్తింపుతెచ్చుకుంది అన్నారు డల్లాస్ నగరంలో లభించే ఆదరాభిమానాల గురించి అమెరికాలోనే కాకుండా , మన భారతదేశంలోను మనకు అభినందనలు తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి”  అని తన సంతోషాన్ని వ్యక్తం చేసారు.  

భారతదేశం నుంచి అమెరికాలో పర్యటన చేస్తూ కార్యక్రమానికి విచ్చేసిన  కోడంగల్ ఎం.ఎల్.ఎ. శ్రీ రేవంత్ రెడ్డి గారికి అభినందనలు తెలుపుతూ,  సంస్థ కార్యవర్గ, పాలక మండలి బృందం సన్మానం చేశారు. అటు తరువాత , కార్యక్రమానికి తనవంతు ఆర్ధిక సహాయం చేస్తూ విచ్చేసిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రవాస భారతీయుల ఐ.టి. ప్రత్యేక ప్రతినిధి మనోహర్ రెడ్డి గారిని టాంటెక్స్ కార్యవర్గ బృందం సన్మానం చేయడం జరిగినది.  అటు పిమ్మట, ప్రెసిడెన్సియల్   స్పాన్సర్ : NATS సంస్థను,  లోన్ స్టార్ స్పాన్సర్స్: డా. పైల మళ్ళా రెడ్డి, డా. ప్రేమ్ రెడ్డి లను , NATA, TPAD సంస్థలను , ప్రీమియర్ స్పాన్సర్స్ : TANA సంస్థను , క్వాంట్ సిస్టమ్స్ ను, గోల్డ్ స్పాన్సర్: రాం కోనార, సౌత్ ఫోర్క్ డెంటల్ లను సభా వేదిక మీద సన్మానించారు.

సంస్థ సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయకర్త తోట పద్మశ్రీ , విచ్చేసిన గాయక బృందాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయగా , ప్రత్యేక కార్యక్రమం మొదలు పెడుతూ తమ మృదుమైన పలుకులతో వ్యాఖ్యాతగ వ్యవహరిస్తూ , మధురమైన , అందరికి ఇష్టమైన పాటలతో ప్రముఖ గాయని సునీత గారి ఆధ్వర్యంలో జరిగిన సంగీత విభావరిలో  , సంగీత దర్శకుడు , గాయకుడు వందేమాతరం శ్రీనివాస్, గాయకులు భార్గవి పిళ్ళై, దినకర్, యాసిన్ నజీర్ , సమీర భరద్వాజ్ లు, ఈ ప్రత్యేక సదస్సుకు విచ్చేసి కదలకుండా వింటున్న  వారందరినీ ఆద్యంతం ఆకట్టుకుని సంగీత ప్రవాహంలో  ముంచెత్తారు. ప్రేక్షకుల కోరికపై ఎన్నో ఉత్సాహ పరిచే పాటలు వినిపించారు.

1986, సంస్థ ప్రారంభింప బడిన సంవత్సరం నుంచి 2017 వరకు , ఆయా సంవత్సరాలలో అత్యుతమ పాటలుగా గుర్తింపబడిన  పాటల సమాహారాన్ని , తమ నృత్య నైపుణ్యాన్ని జోడించి “టాంటెక్స్-చిత్రలహరి” అనే ఒక వినూత్న కార్యక్రమాన్ని, శాంతి నూతి మరియు  రవి తేజ ఆధ్వర్యంలో మొదటి భాగాన్ని, కార్యక్రమానికి ప్రత్యేకంగా విచ్చేసిన టాలీవుడ్ నటి స్నేహ నామనంది మరియు గోమతి సుందరబాబు ఆధ్వర్యంలో రెండవ భాగాన్ని, స్థానిక కళాకారులు  ప్రదర్శించారు.  ప్రత్యేకంగా రూపొందించిన ఈ కార్యక్రమంలో స్థానిక కళాకారుల నృత్య నైపుణ్యo, విచ్చేసిన వారందరినీ ఎంతో ఆకట్టుకుంది.

అతిథుల సన్మాన కార్యక్రమంలో ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) అధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణారెడ్డి, ఉత్తరాధ్యక్షులు శీలం కృష్ణవేణి, ఉపాధ్యక్షుడు వీర్నపు చినసత్యం మరియు కార్యవర్గ బృందం, పాలకమండలి అధిపతి రోడ్ద రామకృష్ణ రెడ్డి మరియు బృందం పాల్గొని పుష్ప గుచ్చం , దుశ్శాలువ మరియు జ్ఞాపికలతో ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య సన్మానించారు.

ఏ కార్యక్రమానికైనా మనల్ని ప్రోత్సహించిచేయూతనిచ్చే పోషక దాతలు లేకుంటే కార్యక్రమం చేయడం సాధ్యపడదు. ప్రత్యేక అతిథులు,  పోషకదాతల గౌరవార్ధం ముందు రోజు  టాంటెక్స్ వారు ఏర్పాటు చేసిన విందులో పోషకదాతలు ప్రతి ఒక్కరిని పేరు పేరునా గుర్తించి, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయo ఉప కులపతి డా. వి. దుర్గా భవాని , సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత డా. కాత్యాయని విద్మహే గార్ల, ఇతర తెలుగు సాహిత్య ప్రముఖులు మరియు  ప్రముఖ గాయని సునీత మరియు వారి గాయక బృందం ఙ్ఞాపికలు అందచేస్తూ ఈ ప్రత్యేక కార్యక్రమ పోషకుల వదాన్యతను అభినందించారు.  

ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన ఫన్ ఏసియా మరియు ప్రసార మాధ్యమాలైన యువ రేడియో, టీవీ5, టి.ఎన్.ఐ,  టీవీ9 లకు  కృతఙ్ఞతా పూర్వక అభివందనములు తెలియజేశారు. ఎంతో కృషి, సమయం వెచ్చించిన టాంటెక్స్ కార్యవర్గ సభ్యులకు మరియు వివిధ కమిటీ సభ్యులకు, స్వచ్ఛంద కార్యకర్తలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. భారతీయ జాతీయ గీతం ఆలపించడంతో, విచ్చేసిన వారందరినీ ఎంతో ఆహ్లాదపరచిన ఈ కార్యక్రమానికి తెర పడినది.

 

పైన వివరించిన కార్యక్రమాల ఛాయాచిత్రాలను ఈ క్రింద పొందుపరచిన లంకెలలో చూడవచ్చును.

https://tantex.smugmug.com/2017-Events/Sahitya-Vedika/Sahitya-Vedika10h-Anniversary-120th-NNTV-July-8th2017/

https://tantex.smugmug.com/2017-Events/Telugu-Vaibhavam-Musical-Extravaganza-July-8th-2017/

0 679

షడ్రుచుల సమ్మేళనంతో కొత్త సంవత్సరం అంతా ఆనందంగా ఉండాలని ప్రతి  తెలుగు వారు కోరుకుంటారు. మరి డాలస్ ఫోర్ట్ వర్త్ చుట్టుపక్కల నివసించే తెలుగు బంధువుల ఆనందం కోసం 31 సంవత్సరాల నుంచి పలు కార్యక్రమాలు అందించే ఉత్తర  టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) వారు,   ఈ సంవత్సరo శ్రీ హేవళంబి నామ ఉగాది ఉత్సవాలు మరింత శోభాయమానంగా తీర్చిదిద్ది,  స్థానిక మెక్ఆర్థర్  హై స్కూల్ లో  అత్యద్భుతంగా నిర్వహించారు.సంస్థ అధ్యక్షులు శ్రీ ఉప్పలపాటి కృష్ణారెడ్డి, కార్యక్రమ సమన్వయకర్త శ్రీమతి పాలేటి లక్ష్మి ఆధ్వర్యంలో మరియు సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయకర్త శ్రీమతి తోట పద్మశ్రీ పర్యవేక్షణలో ఈ ఉగాది ఉత్సవాలలో ఏర్పాటు చేసిన విభిన్న కార్యక్రమాలు ప్రేక్షకులను ఆనంద పారవశ్యంతో ఓలలాడించాయి.

ఉగాది పచ్చడి, ఘుమఘుమలాడే పసందైన భోజనాన్ని స్థానిక బావర్చి రెస్టారెంట్ వారు అందించి అందరిని సంతృప్తి పరిచారు. ఈ ఉగాది ఉత్సవాలకు సుమారు 1100 మందికి పైగా  తెలుగువారు హాజరు కాగా సుమారు 250 మంది పిల్లలు మరియు పెద్దలు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని సందడి చేసారు.

అమెరికా జాతీయ గీతంతో కార్యక్రమం ప్రారంభమై, ‘ఏకదంతాయ వక్రతుండాయ” అంటూ ఫ్యూజన్ నృత్యంతో  సాగి, వివిధ సంప్రదాయక నృత్యాలతో కార్యక్రమాలు  సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ కొనసాగాయి. భారత దేశం నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన కోమలి సోదరీమణులు  కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తూ, చక్కటి మాటలతో , మిమిక్రీ ప్రదర్శనలతో ప్రేక్షకులందరిని ఎంతో ఆనందపరిచారు.  సంప్రదాయమైన నృత్యాలతో పాటు, సినిమా పాటల సమాహారం వంటి చక్కని డాన్సు మెడ్లీ లు, జానపద గీతాలు,  స్థానిక కళాకారుల అద్వితీయ ప్రతిభతో ఎంతో ఆకట్టు కొన్నాయి. “రామాయణం” నృత్య రూపకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ప్రేక్షకుల మనసును దోచుకున్నది.  ఉగాది సందర్భంగా శ్రీ కంటంరాజు సాయికృష్ణ గారు పంచాంగ శ్రవణం గావించారు .

_SAM8741-L _SAM8875-L _SAM8935-L _SAM8961-L _SAM9048-L

ఇదంతా ఒక ఎత్తయితే, భారత దేశం నుండి ప్రత్యేకంగా విచ్చేసిన మెజీషియన్ వసంత్ తన ప్రతిభావంతమైన ప్రదర్శనలతో విచ్చేసిన వారందరిని ఆకట్టుకున్నారు.  ‘పాడుతా తీయగా’ ద్వారా సుపరిచతమైన యువ గాయకుడు శ్రీ కూరపాటి సందీప్ ఉత్సాహం నింపుతూ పాడిన పాటలు ప్రేక్షకులను పరవశింపచేసాయి.

కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు శ్రీ ఉప్పలపాటి కృష్ణారెడ్డి ఉగాది శుభాకాంక్షలతో విచ్చేసిన వారందిని ఉద్దేశిస్తూ తన సందేశంలో ఈ సంవత్సరం చేయబోతున్న కార్యక్రమాల వివరణతో పాటు, సుమారు దశాబ్దం పైన డాలస్ లో వున్న తెలుగు వారందరికీ సుపరిచితమైన గాన సుధ – మన టాంటెక్స్ రేడియో” ఫన్ ఏషియా 1110 AM లో పునః ప్రారంభమైన రేడియో ప్రసారo, సభ్యులకు ఉచిత చలనచిత్ర ప్రదర్శన విషయాలు తెలిపారు. మన తెలుగు వారి సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ, సంగీత, లలిత కళల ప్రాధాన్యంతో “తెలుగు వైభవం” అనే ప్రత్యేక కార్యక్రమం కోసం సన్నాహాలు జరుగుతున్నవని తెలిపారు.

ఉగాదిని పురస్కరించుకొని టాంటెక్స్ 2017ఉగాది పురస్కారాల’ను ఈ సంవత్సరం వైద్య , తెలుగు భాషాభివృద్ది, విద్యా రంగాలలో విశేష సేవలందించిన వ్యక్తులకు ప్రకటించారు. వైద్యరంగంలో డా.గునుకుల శ్రీనివాస్ గారికి, తెలుగు భాషాభివృద్ది రంగంలో శ్రీ  కే.సి. చేకూరి గారికి , విద్యా రంగంలో  డా. పుప్పాల ఆనంద్ గారికి  ఈ పురస్కారాలను అందచేశారు. అదే విధంగా సంస్థ వివిధ కార్యక్రమాలలో ఎనలేని సేవలను అందిస్తున్న  శ్రీ దివాకర్ల మల్లిక్, డా. కలవగుంట సుధ, కుమారి మార్పాక పరిమళ, కుమారి తుమ్మల జస్మిత, శ్రీ నిడిగంటి ఉదయ్ లను  ‘ఉత్తమ స్వచ్ఛంద సేవకుడు (బెస్ట్ వాలంటీర్) పురస్కారంతో సత్కరించారు. అలాగే కార్యక్రమానికి విచ్చేసిన అతిధి కళాకారులైన మెజీషియన్ వసంత్, గాయకుడు కూరపాటి సందీప్, కోమలి సోదరీమణులను టాంటెక్స్ కార్యవర్గ బృందం జ్ఞాపికలతో సత్కరించారు. సంస్థ రేడియో కార్యక్రమాలకు 2016 సంవత్సరంలో వ్యాఖ్యాతలగా స్వచ్ఛందoగా సేవలందించిన కార్యకర్తలను జ్ఞాపికలతో గుర్తించడం జరిగినది.

ఈ ఉగాది కార్యక్రమ ప్రెజెంటింగ్ పోషకులు NSI సంస్థకు,  శ్రీ రాం కొనార గారికి, శ్రీ  పోలవరపు శ్రీకాంత్ గారికి మరియు కార్యక్రమ పోషకులైన రిచ్మండ్ హిల్ మోంటెస్సోరి సంస్థకు, ప్రాడిజీ టెక్నాలజీస్ సంస్థకు, శ్రీ వీర్నపు చినసత్యం గారికి జ్ఞాపికలు ప్రధానం చేసి టాంటెక్స్ సంస్థ తమ కృతఙ్ఞతలు తెలియచేసారు.

_SAM9123-L _SAM9245-L _SAM9293-L _SAM9302-L _SAM9382-L

వందన సమర్పణ గావిస్తూ, కార్యక్రమ సమన్వయకర్త  శ్రీమతి పాలేటి లక్ష్మి, డైమండ్, ప్లాటినం, గోల్డ్, సిల్వర్, ప్రెజెంటింగ్ మరియు ఈవెంట్  పోషక దాతలకి, ప్రత్యేక ప్రసారమాధ్యమాలైన  ఫన్ ఏషియా వారికి మరియు ప్రసారమాధ్యమాలైన టోరి, TNI, TV5, TV9,  ఏక్ నజర్ లకు  కృతఙ్ఞతలు తెలియచేసారు.

ఎంతో కృషి, సమయం వెచ్చించిన టాంటెక్స్ కార్యవర్గ సభ్యులకు మరియు వివిధ కమిటీ సభ్యులకు, స్వచ్ఛంద కార్యకర్తలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. భారతీయ జాతీయ గీతం ఆలపించడంతో, విచ్చేసిన వారందరినీ ఎంతో ఆహ్లాదపరచిన ఈ కార్యక్రమానికి తెర పడినది.

 

ఉగాది ఉత్సవాల కార్యక్రమంలోని ఛాయాచిత్రాలను ఈ క్రింద పొందుపరచిన లంకెలో చూడవచ్చును.

https://tantex.smugmug.com/2017-Events/Ugaadi-Utsavaalu-2017/

0 591

మార్చి 19, 2017, డాలస్, టెక్సస్
ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (TANTEX) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో “116వ  నెలనెలా తెలుగు వెన్నెల” మరియు 38వ టెక్సస్ తెలుగు సాహిత్య సదస్సు శనివారం మార్చి 19వ తేదీన దేశీప్లాజా టీవీ స్టూడియోలో సాహిత్యవేదిక సమన్వయకర్త శ్రీమతి సింగిరెడ్డి శారద అధ్యక్షతన ఘనంగా నిర్వహించబడింది. ప్రవాసంలో నిరాటంకంగా 116 నెలలపాటు ఉత్తమ సాహితీవేత్తల నడుమ సాహిత్యసదస్సులు నిర్వహించటం ఈ సంస్థ విశేషం. డాలస్ నుండే కాకుండా హ్యూస్టన్, ఆస్టిన్, సాన్ ఆంటోనియో నుండి భాషాభిమానులు,సాహిత్యప్రియులు అధిక సంఖ్యలో ఈ సమావేశానికి విచ్చేసి జయప్రదం చేసారు.

 
సమన్వయకర్త శ్రీమతి సింగిరెడ్డి శారద సభను ప్రారంభిస్తూ సదస్సుకి విచ్చేసిన సాహితీప్రియులకు స్వాగతం పలికారు. పరిచయ కార్యక్రమాలు, పసందైన విందు భోజనం తరువాత శ్రీమతి ఆడూరి సృజన “సంగీత సాహిత్య సమలంకృతే”, “స్వరములు ఏడైనా రాగాలెన్నో” పాటలను పాడి సభను ప్రారంభించారు. సాన్ ఆంటోనియో నుండి వచ్చిన శ్రీ సూరంపూడి శరత్, శ్రీ కరణం రామ్మోహన్ స్వీయకవితలని చదివి వినిపించారు. ఆస్టిన్ నుండి వచ్చిన శ్రీ మందపాటి సత్యం తన నవల “నిజమే కల అయితే” కి ప్రేరణ ఎలా కలిగిందో తెలియజేసారు. శ్రీ డొక్కా రాం ఆత్మానందం-ఆత్మారామం శీర్షికన తన స్వీయ కవితలని వినిపించారు. హ్యూస్టన్ నుండి వచ్చిన శ్రీ వంగూరి చిట్టెన్ రాజు పోతన భాగవతాన్ని భావితరానికి ఉపయోగపడేలా చేస్తున్న శ్రీ పుచ్చా మల్లిక్ గురించి చెప్పారు.

38th TX Sahitya Vedika 1 38th TX Sahitya Vedika 2 38th TX Sahitya Vedika 3
డాలస్ కి చెందిన శ్రీ వేముల లెనిన్ బాబు కవితా కుమారి ప్రస్థాన గీతిక శీర్షికన ఊహా సుందరి అయిన కవితా కుమారి జన్మస్థలం, ఆమె ప్రయాణం గురించి వివరిస్తూ మంచి పాటలని పాడారు. డా. ఊరిమిండి నరసింహారెడ్డి “మన తెలుగు సంపద” శీర్షికన కొన్ని పొడుపు కథలను సభతో పంచుకున్నారు. శ్రీ మాడ దయాకర్ నరసింహావతార ఘట్టం – పోతన నాటకీయత గురించి మాట్లాడారు. మెమొరియల్ డే వారాంతం జరగనున్న తానా సభల సూవనీర్ “తెలుగు పలుకు” ప్రధాన సంపాదకులు శ్రీ చేకూరి కేసీ ఔత్సాహిక ప్రవాస తెలుగు రచయితలు కవితలు, కథలు, పద్యలు, వ్యాసాలు మొదలైనవి ఏప్రిల్ మొదటివారానికి చేరేలా పంపాలని కోరారు.

 
శ్రీ దొడ్ల రమణ గారు సాన్ ఆంటోనియోకి చెందిన శ్రీమతి దేవగుప్తాపు పద్మ గారి “పద్మ పద్య వాహిని” పుస్తక పరిచయం చేసారు. పుస్తక పరిచయం తరువాత పుస్తకావిష్కరణ కూడా జరిగింది. శ్రీ విన్నకోట రవిశంకర్ గారి “వేసవి వాన” కవితా సంపుటిని శ్రీ బసాబత్తిన శ్రీనివాసులు పరిచయం చేస్తూ అందులోని రెండు కవితలు చదివారు. శ్రీ పాపినేని శివశంకర్ గారికి కేంద్ర సాహిత్య పురస్కారాన్ని తెచ్చిన “రజనీగంధ” కవితా సంపుటిని శ్రీ మద్దుకూరి చంద్రహాస్ పరిచయం చేసారు. ఇందులోని ప్రతి కవిత మనకి ఒక కొత్త విషయాన్ని పరిచయం చేస్తుందన్నారు. శ్రీమతి కూచిభొట్ల లలితామూర్తి తమ తాతగారు రచించిన శ్రీగణేశ్వరీయం పుస్తక పరిచయం చేసి కొన్నిటిని పంచి పెట్టారు.

 
తేనీటి విందు తర్వాత సాన్ ఆంటోనియోకి చెందిన శ్రీ పోతన సాయికుమార్ రచించి దర్శకత్వం వహించిన “వైద్యో నారాయణ” నాటకాన్ని ప్రదర్శించారు. ఇందులో శ్రీ పోతన సాయికుమార్, శ్రీ కరణం రామ్మోహన్, శ్రీ మేక సీ.ఎస్.రెడ్డి, శ్రీ సూరంపూడి శరత్, శ్రీ దొడ్డ సత్య, శ్రీ దేవగుప్తాపు బాబు, శ్రీ కోట వేణుగోపాల్, శ్రీమతి ఆదిత్య లక్ష్మి నటించారు. శ్రీ కన్నెగంటి చంద్ర సాహిత్యంలో విషాదం ప్రాముఖ్యత గురించి మాట్లాడారు. డా. కలవగుంట సుధ ఆధ్యాత్మ రామాయణం గురించి మాట్లాడారు. శ్రీ పూదూర్ జగదీశ్వరన్ సరస్వతి దేవి మీద ఒక పద్యం వినిపించారు. దాని తర్వాత ఇడ్లీ దండకం చదివి అందరినీ నవ్వించారు. డా. ఆళ్ళ శ్రీనివాసరెడ్డి కొన్ని విప్లవగీతాలను, ఒక జానపద గీతం ఆలపించారు. శ్రీ జలసూత్రం చందు స్వీయరచన పాటని పాడారు.

 
116వ నెలనెలా తెలుగు వెన్నెల సదస్సుని దేశీ ప్లాజా స్టూడియో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేసారు. సింగిరెడ్డి శారద మాట్లాడుతూ సాహిత్యం మీద ప్రేమ, మాతృభాష మీద మమకారంతో విచ్చేసిన భాషాభిమానులకు, సాహితీ ప్రియులకు, పసందైన విందు భోజనం సమకూర్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసారు. ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన దేశీ ప్లాజా, రేడియో ఖుషి మరియు ప్రసార మాధ్యమాలైన టీవీ 5, టోరి , టి.ఎన్.ఐ లకు కృతఙ్ఞతాపూర్వక అభివందనములు తెలియజేసారు.

 
కార్యక్రమంలోని ఛాయాచిత్రాలను ఈ లంకెలో చూడవచ్చును.

https://tantex.smugmug.com/2017-Events/Sahitya-Vedika/116th-NNTV-38th-TX-Sahitya-Sadassu-Mar18th-2017
టాంటెక్స్ 116 వ నెల నెలా తెలుగు వెన్నెల సదస్సు గురించి బసాబత్తిన శ్రీనివాసులు  సమర్పించిన నివేదిక.

0 785

డాలస్/ఫోర్ట్ వర్త్ , 28 జనవరి 2017

 

సంక్రాంతి లేదా సంక్రమణం అంటే చేరడం అని అర్ధం. సూర్యుడు మకర రాశిలో చేరగానే వచ్చే సంక్రాంతి పండుగ అంటే తెలుగు వాళ్ళకు ఎంతో ఇష్టం.  భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగ ఎంత గొప్పగా  జరుగుతుందో వర్ణించడానికి మాటలు చాలవు. పచ్చని పొలాలు, వెచ్చని చలిమంటలు, భోగిపళ్లు, హరిదాసులు , కనుమ విందు వంటకాలను జ్ఞప్తికి తెచ్చేలా ఉత్తర అమెరికాలో అతిపెద్ద తెలుగు సంస్థలలో ఒకటైన టాంటెక్స్ వారు  ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రసవత్తరమైన కార్యక్రామాలు రూపొందించారు.  సంప్రదాయానికి పెద్ద పీట వేసి , ఆధునికతను మేళవించి తెలుగు మనసులను రంజింపచేసి   సాంస్కృతిక బృంద సమన్వయకర్త లక్ష్మి పాలేటి , కార్యక్రమ సమన్వయకర్త జ్యోతి వనం గార్ల ఆధ్వర్యంలో, ఉప్పలపాటి కృష్ణారెడ్డి గారి  అధ్యక్షతన డాలస్ లో జనవరి 28వ తేదీన డాలస్ లో ఇర్వింగ్ హైస్కూల్లో లో  టాంటెక్స్  సంక్రాంతి సంబరాలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ సారి అతిపెద్ద విశేషం ఏమిటంటే నూతన సంవత్సర కానుకగా టాంటెక్స్ వారు ఈ సంక్రాంతి సంబరాలకు, సభ్యులకు ఉచిత విందుభోజనం, ఉచిత ప్రవేశం కల్పించి, రసవత్తరమైన విందు వినోద కార్యక్రమాలు అందించుట.

కార్యక్రమానికి  ప్రధాన వ్యాఖ్యాతలు గా సమీరా ఇల్లందుల, మధుమహిత మద్దుకూరి, అభినుత మద్దుకూరి లు ఆద్యంతం హాస్యరసభరితంగా వ్యాఖ్యానం నిర్వహించారు. అమెరికన్ జాతీయగీతంతో ప్రారంభమైన కార్యక్రమాలు, సంస్కృతి సంప్రదాయాల మేళవింపుగా ఆసక్తి కరంగా సాగాయి. శాస్త్రీయ నృత్యం చూస్తే టాంటెక్స్ వేడుకలలోనే చూడాలి అనే మాటను ఎప్పటిలా నిజం చేస్తూ శ్రీ లక్ష్మి తోరం గారి రూపకల్పనలో చక్కని నాట్య ప్రదర్శన, గిరిజా ఆనంద్ గారి రూపకల్పనలో ‘శివ పూజకు వేళాయరా’, శ్రీ దేవి యడ్లపాటి గారి ఆధ్వర్యంలో ‘శంభో శివ శంభో’ అనే సినీ నృత్యగీతం, జయలక్ష్మి గొర్తి గారి రూపకల్పనలో ‘ శ్రీమాన్నారాయణ’  శాస్త్రీయ నృత్యం, రూప బంద గారి రూపకల్పనలో  ‘ఓం మహాప్రాణ దీపం’ నృత్యం, హేమమాలిని చావలి  గారి ‘కొలువైతివా రంగ సాయి’ అంటూ చక్కని సాంప్రదాయక నృత్యాలు కనుల విందు చేశాయి.  మరి జోష్ ఉన్న పాటలు, డాన్సులు లేకుండా ఎలా ? దీని సమాధానంగా  టైం టు పార్టీ అంటూ సునీత ఆలపాటి గారి టీం , ‘గోపికమ్మ చాలును లేమ్మా’ అంటూ రాజేష్ వెలనాటి గారి జట్టు,  ‘లాలాగూడ లంబాడి పిల్ల’ అంటూ విజయ నెట్టెం గారి టీం , ఇలా కార్యక్రమాలు అత్యంత హుషారుగా సాగాయి.

_mg_8825-l _mg_8939-copy-l _mg_8965-l _mg_8968-l _mg_8995-l _mg_9064-l _mg_9151-l img_4605-l

2017 వ సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని, టాంటెక్స్ నూతన అధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణారెడ్డి గారిని తక్షణ పూర్వాధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం గారు సభకు పరిచయం చేశారు. అధ్యక్షులు శ్రీ ఉప్పలపాటి కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ, ఈ సంక్రాంతి పర్వదినాన నూతన ఉత్సాహంతో  తెలుగు భాషకు, ప్రజలకు సేవ చేయడమే పరమార్ధంగా, నిస్వార్ధ కళా సేవకులు , నిర్విరామ శ్రామికులు తన కార్యవర్గ సభ్యుల అండదండలతో ఉత్తర అమెరికా తెలుగు ప్రజలకు తన శాయశక్తులా సహాయ పడతానని, 31 సంవత్సరాల చరిత్ర కలిగిన టాంటెక్స్  వంటి విశిష్ట సంస్థకు అధ్యక్షుడిని చేసినందుకు సర్వదా కృతజ్ఞుడిని అని, అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి టాంటెక్స్  సంస్థ ప్రజలకు మరింత చేరువయ్యేలా చేసి, తెలుగు జాతి మొత్తం గర్వపడేలా సంస్థ అభివృద్ధికి కృషి చేస్తామని, మహా తెలుగు సభలు టాంటెక్స్  ఆధ్వరంలో నిర్వహిస్తామని సభ్యుల కరతాళ ధ్వనుల మధ్య ప్రసంగించారు.

తక్షణ పూర్వాధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ, నూతన కార్యవర్గం అత్యుత్సాహంతో బాధ్యతలు పంచుకొనేందుకు సంయక్తం అవడం , గడచిన సంవత్సరం అంతా మీరు అందించిన సహాయ సహకారాలు  ఈ సంవత్సరం కూడా కొనసాగించమని, తెలుగు జాతి అభ్యున్నతికి అందరూ కృషి చేయాలని పిలుపు నిచ్చారు. జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం గారికి శాలువా కప్పి పుష్ప గుచ్చాలతో టాంటెక్స్ అధ్యక్షులు కృష్ణా రెడ్డి ఉప్పలపాటి గారు, పాలకమండలి సభ్యులు ఘనంగా సత్కరించారు. అలాగే కార్యనిర్వాహక/పాలక మండలి  సభ్యులుగా విశేష సేవలందించి, బయటకు వచ్చిన జ్యోతి వనం, వెంకట్ దండ , రఘు గజ్జల, సుగన్ చాగర్లమూడి, శ్రీనివాస రెడ్డి గుర్రం లను శాలువా, జ్ఞాపిక తో సత్కరించారు.

 

2016 సంవత్సరపు పోషక దాతల నందరిని కృష్ణారెడ్డి ఉప్పలపాటి, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ,  మరియు మిగతా కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక జ్ఞాపికలతో సన్మానించారు. ఈ సంక్రాంతి కార్యక్రమానికి ప్రత్యేకంగా విచ్చేసిన T.A.T.A. సంస్థ ప్రస్తుత అధ్యక్షులు మరియు  డైమండ్ పోషక దాత డా. ఝాన్సి రెడ్డి గారిని అభినందిస్తూ, వారిని ఘనంగా శాలువతో, జ్ఞాపికతో సత్కరించడం జరిగినది.

 

క్రొత్తగా ఎన్నికైన కార్యనిర్వాహక సభ్యులు   భాను లంక , మనోహర్ కాసగాని, ప్రబంధ రెడ్డి  తోపుదుర్తి, శరత్ రెడ్డి ఎర్రం, సమీరా ఇల్లందులను మరియు  పాలక మండలి సభ్యులు చంద్ర కన్నెగంటి, రాం కొనార , వేణు పావులూరి లను  సాదరంగా కమిటీలోకి ఆహ్వానించారు.  సంక్రాంతి కార్యక్రమ పోషక దాతలు చంద్రశేఖర్ కాజ లను,అజయ్ గోవాడ, శ్రీలు మండిగ  గార్లను సత్కరించారు.  కార్యక్రమ ప్రసార మాధ్యమాలు అయిన దేశి ప్లాజా, టీవీ 9, టీవీ 5, TNI లకు ఈ సందర్భంగా జ్ఞాపికలు అందచేసారు.

 

తిరిగి ప్రారంభం అయిన కార్యక్రమాలలో విశిష్ట అతిధి, బుల్లి తెర వ్యాఖ్యాత, చలన చిత్ర నటుడు జెమిని సురేష్ గారు తన సినీ అనుభవాలను , కళాకారులు కావాలంటే ఎటువంటి తపన, కార్యదీక్ష  ఉండాలో , తన సినీ అనుభవాలు అన్ని పూస గుచ్చినట్లు వర్ణించారు. జెమిని సురేశ్  గారిని ఉప్పలపాటి కృష్ణరెడ్డి గారు జ్ఞాపికతో సత్కరించారు. స్వరమంజరి అనే కార్యక్రమం ద్వారా టాంటెక్స్ వారు  నూతన కళాకారులను వెలుగులోకి తెచ్చి వారికి చక్కని అవకాశాలు కల్పిస్తారు. ఆ కార్యక్రమంలో 2016 విజేతలయిన స్నిగ్ధ ఏలేశ్వరపు, కీర్తి చామకూర , దీపికా కాకర్ల అద్భుతమైన గాత్రంతో ప్రేక్షకులను మైమరపింప చేశారు.

 

ఇలా కార్యక్రమాలు జోరుగా హుషారుగా సాగిపోయాయి. ఆహూతులకు టచ్ నైన్ వారు చిన్నారులకు పిజ్జా, బర్గర్లతో పాటు సాంప్రదాయక తెలుగు వంటలతో , ఘుమఘుమ రుచులతో పసందైన విందు భోజనం ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణంలో చీరలు, చుడిదార్లు, గాజులతో నిండిన ఎన్నో స్టాల్ లు అతివలకోసం సిద్ధంగా ఉంచారు. అక్కడే టాక్స్ ఫైలింగ్ ఏర్పాట్లు, యోగ, ఆర్యోగ సంభందిత స్టాల్ లు ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకొనే వీలు కల్పించారు.

 

“సంక్రాంతి సంబరాలు” కార్యక్రమ సమన్వయకర్త జ్యోతి వనం , ఎంతో ఓపికగా నాలుగు గంటల వినోదాన్ని ఆస్వాదించిన ప్రేక్షకులకు, అతిథులకు, రుచికరమైన విందు భోజనం వడ్డించిన టచ్ నైన్  రెస్టారెంట్ యాజమాన్యంకు, మరియు నేటి కార్యక్రమ పోషకులకు కృతఙ్ఞతలు తెలియజేశారు.
ఎక్కడ చూసినా సంతోషంతో వెల్లివిరియగా  టాంటెక్స్  సంక్రాంతి సంబరాలు  ఘనంగా ముగిసాయి.

 

కార్యక్రమంలోని ఛాయాచిత్రాలను ఈ లంకెలో చూడవచ్చును.

టాంటెక్స్ సంక్రాంతి సంబరాల గురించి జలసూత్రం చంద్రశేఖర్  సమర్పించిన నివేదిక.

0 671

జనవరి 15, 2017, డాలస్, టెక్సస్

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో “నెలనెలా తెలుగు వెన్నెల” సాహిత్య సదస్సు ఆదివారం జనవరి 15వ తేదీన దేశీప్లాజా టీవీ స్టూడియోలో సాహిత్యవేదిక సమన్వయకర్త బిళ్ళా ప్రవీణ్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించబడింది. ప్రవాసంలో నిరాటంకంగా 114 నెలలపాటు ఉత్తమ సాహితీవేత్తల నడుమ సాహిత్యసదస్సులు నిర్వహించటం ఈ సంస్థ విశేషం. డాలస్ లోని భాషాభిమానులు,సాహిత్యప్రియులు అధిక సంఖ్యలో ఈ సమావేశానికి విచ్చేసి సభను జయప్రదం చేసారు.

బిళ్ళా ప్రవీణ్ సభను ప్రారంభిస్తూ 114వ నెలనెలా తెలుగు వెన్నెల సదస్సుకి విచ్చేసిన సాహితీప్రియులకు స్వాగతం పలికారు. సభకు 2017 సంవత్సరానికి సమన్వయకర్తగా శ్రీమతి శారద సింగిరెడ్డి గారిని పరిచయం చేస్తూ వేదిక మీదికి ఆహ్వానించారు. తెలుగు సాహిత్యవేదిక సమన్వయకర్తగా రెండవసారి పదవీబాధ్యతలను స్వీకరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని శ్రీమతి సింగిరెడ్డి శారద తెలియజేసారు.  కార్యక్రమంలో ముందుగా చిరంజీవి కమ్మంకర్ శ్రీతన్ ప్రార్థనా గీతాన్ని ఆలపించాడు.  తాను భగద్గీత నేర్చుకుంటున్నానని, మొదటి ఎనిమిది అధ్యాయాలలో అధ్యాయం పేరు చెప్పి ఎన్నోపద్యం అడిగినా, పద్యాన్ని అప్పజెప్పగలను అని అడిగిన అన్నీ తడుముకోకుండ చక్కగా చెప్పగలిగాడు.  పూర్తిగా పారాయణం చేయడం వచ్చిన తరువాత అర్ధం కూడా తెలుసుకుని ఆచరించే దిశగా శిక్షణ, స్థానిక హిందూదేవాలయంలో పొందుతున్నట్లుగా చిరంజీవి తండ్రి తెలియజేసారు.  చిన్నారి చెబుతుంటే తనకు ఐదవతరగతిలో పోటీ కోసం నేర్చుకున్న భగవద్గీతలోని శ్లోకం గుర్తుకు వచ్చిందని, సాహిత్యాభిమాని డా. ఇస్మాయిల్ పెనుకొండ లేచి వినిపించి తన ఆనందాన్ని వ్యక్తం చేసారు.

గతంలో నెలనెలా తెలుగువెన్నెల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన శ్రీ పిస్కా సత్యనారాయణ గారు, ఈ కార్యక్రమంలో ద్వాపరయుగంలోని శ్రీక్రిష్ణుడిని, కలియుగంలోని శ్రీక్రిష్ణదేవరాయలని అనుసంధానిస్తూ కొన్ని పద్యాలను ఉదహరిస్తూ మాట్లాడారు.  సాహిత్యవేదిక సభ్యులు డా. కలవగుంట సుధ గారు క్షేత్రయ్య పదసాహిత్యం పై మాట్లాడుతూ అష్టావిధ నాయికల వర్ణన అభినయించారు.  శ్రీ మద్దుకూరి చంద్రహాస్ గారు ‘నేనొక ప్రేమ పిపాసిని ‘ అనే సినిమా పాటలో మొదటి రెండు చరణాలు ఎక్కువ ప్రజాదరణ చెంది ప్రాచుర్యంలో ఉన్నప్పటికి, మూడవ చరణంలో ఎంత అందమైన సాహిత్యం దాగిఉందో వివరించారు.  శ్రీ జువ్వాడి రమణ గారు శాతవాహనులకి ఆ పేరు ఎలా వచ్చింది అనే విషయానికి సంబంధించిన వివరాలను వివరించారు.  శ్రీ వేముల లెనిన్ గారు కొన్ని నన్నయ పద్యాలను పంచుకున్నారు.

ప్రతి ఆదివారం సాయంత్రం ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం సమర్పించే టాంటెక్స్ తరంగిణి కార్యక్రమం తెలుగు వన్ రేడియో ద్వారా 3 గంటల నుండి 5 గంటల వరకు సాగుతుంది. ఈ కార్యక్రమానికి     శ్రీనివాసులు  మరియు పరిమళ రేడియో వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తూ 114వ నెలనెలా తెలుగు వెన్నెల సదస్సుని దేశీ ప్లాజా స్టూడియో నుండి టాంటెక్స్ తరంగిణిలో తెలుగు వన్ రేడియో ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేసారు.

tantex_114th-nntv_01152017_2016-and-2017-samanvayakarthalu tantex_114th-nntv_01152017_audience-1 tantex_114th-nntv_01152017_audience-2 tantex_114th-nntv_01152017_gnaapika-pradhanam-to-mukhya-athithi tantex_114th-nntv_01152017_group-photo tantex_114th-nntv_01152017_mukhya-athithi_dr-alla-srinivasa-reddy tantex_114th-nntv_01152017_pushpa-guchham-to-mukhya-athithi tantex_114th-nntv_01152017_shaluva-sanmaanam-to-mukhya-athithi tantex_114th-nntv_01152017_vividha-vakthalu

114వ నెలనెలా తెలుగు వెన్నెల సదస్సుకి ముఖ్య అతిథిగా విచ్చేసిన డా. ఆళ్ళ శ్రీనివాస రెడ్డి గారిని పరిచయం చేస్తూ శ్రీ ఎం. వి. ఎల్. ప్రసాద్ వేదిక మీదకు ఆహ్వానించగా, డా.సి.ఆర్.రావు , కలవల రావు  గార్లు అతిథికి పుష్పగుచ్చం అందచేసారు.
డా. ఆళ్ళ శ్రీనివాస రెడ్డి గారు  “జానపదం మరియు భావకవిత్వం” పై ప్రసంగించారు.  దాదాపు తొంభై నిముషాల పాటు సాగిన ప్రసంగంలో “కోడిబాయె లచ్చమ్మ” దగ్గర మొదలై, సందర్భానుసారంగా జానపదంలో వేర్వేరు ప్రాంతాల యాసలను, ఆయా పాటల లక్షణాలను వివరిస్తూ, ఎన్ని బాణీలు వేర్వేరు కవులు, రచయితల కలాలనుండి వెలువడ్డాయో పాడి వినిపించారు.  ఒకే పాట వయసుతో పాటు మనం పాడే విధానం ఎలా మారుతుందో ఒకటిరెండు ఉదాహరణలు పాడి వినిపించారు.  దేవులపల్లి, దాశరధి, దేవరకొండ బాలగంగాధర తిలక్, నండూరి వారి ఎంకి, దేశభక్తి గేయాలు, పాటలు, కవితలు, పద్యం ఇలా అన్ని రకాల జానపద సాహిత్యాన్నీ స్పృశిస్తూ ముగిసింది.

2016 సంవత్సారానికి  సంస్థ అధ్యక్షులుగా వ్యవహరించిన జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నెల నెలా తెలుగు వెన్నెల సదస్సుల కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన 2016 సాహిత్య వేదిక బృంద సభ్యులను , సమన్వయకర్తను అభినందిస్తూ, క్రొత్త బృందాన్ని ఈ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకువెళ్లాలని కోరారు.  అధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ముప్పై సంవత్సరాల చరిత్రగల సంస్థకు అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం తన అదృష్టంగా భావిస్తున్నాను అని  తెలుపుతూ, రాబోయే కార్యక్రమాల గురించి తెలిపారు.

ముఖ్య అతిథిని ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్)  అధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణారెడ్డి  మరియు పాలకమండలి అధిపతి రొడ్డ రామకృష్ణ రెడ్డి గార్లు శాలువాతో మరియు కార్యక్రమ సమన్వయకర్త బిళ్ళా ప్రవీణ్ మరియు సాహిత్య వేదిక బృంద సభ్యులు  జ్ఞాపిక తో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఉత్తరాధ్యక్షులు శీలం క్రిష్ణవేణి , ఉపాధ్యక్షులు  వీర్నపు చినసత్యం, కోశాధికారి గోవాడ అజయ్, సంయుక్త  కోశాధికారి మండిగ శ్రీలక్ష్మి, పాలకమండలి సభ్యులు  కన్నెగంటి చంద్ర, కార్యవర్గ సభ్యులు డా.ఊరిమిండి నరసింహారెడ్డి, దండ వెంకట్, సింగిరెడ్డి శారద, పార్నపల్లి ఉమామహేష్, తోపుదుర్తి ప్రభంధ్, లంకా భాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సమన్వయకర్త బిళ్ళా ప్రవీణ్ సాహిత్యం మీద ప్రేమ, మాతృ భాష మీద మమకారంతో విచ్చేసిన భాషాభి మానులకు, సాహితీ ప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు.  ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన దేశీ ప్లాజా, రేడియో ఖుషి మరియు ప్రసార మాధ్యమాలైన టోరి , టి.ఎన్.ఐ లకు కృతఙ్ఞతాపూర్వక అభివందనములు తెలియజేసారు.

కార్యక్రమంలోని ఛాయాచిత్రాలను ఈ లంకెలో చూడవచ్చును.

https://tantex.smugmug.com/2017-Events/Sahitya-Vedika/114th-Nela-Nela-Telugu-Vennela/

 

టాంటెక్స్ 114 వ నెల నెలా తెలుగు వెన్నెల సదస్సు గురించి అట్లూరి స్వర్ణ  సమర్పించిన నివేదిక.

0 660

జనవరి 8, 2017, డాలస్/ఫోర్ట్ వర్త్

తెలుగు సంస్కృతికి, తెలుగు భాషకి ఎల్లప్పుడూ పట్టం కట్టే  ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాoటెక్స్ ) వారు2017 సంవత్సరానికి  ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని జనవరి 8 వ తేదీన ఇర్వింగ్ లో జరిగిన గవర్నింగ్ బోర్డు సమావేశం లో  ప్రకటించారు. సంస్థ అధ్యక్షుడిగా ఉప్పలపాటి కృష్ణారెడ్డి పదవీబాధ్యతలు స్వీకరించారు. టాoటెక్స్ లాంటి గొప్ప సంస్థ కి అధ్యక్షుడిగా పదవీబాధ్యతలు తీసుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఉత్తర అమెరికా లోనే ప్రతిష్టాత్మక సంస్థ అయిన టాoటెక్స్ ను ముందుండి నడపవలసిన బాధ్యతను తన మీద పెట్టినoదుకు టాoటెక్స్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియచేశారు.

 

అధికారిక కార్యనిర్వాహక బృందం

అధ్యక్షుడు : ఉప్పలపాటి కృష్ణా రెడ్డి సంయుక్త కార్యదర్శి : కోడూరు కృష్ణారెడ్డి
ఉత్తరాధ్యక్షులు: శీలం కృష్ణవేణి కోశాధికారి:  గోవాడ అజయ్
ఉపాధ్యక్షుడు : వీర్నపు చిన్నసత్యం సంయుక్త కోశాధికారి:  మండిగ శ్రీలక్ష్మి
కార్యదర్శి :  కాజ చంద్రశేఖర్ తక్షణ పూర్వాధ్యక్షులు: జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం

 

 

ఆదిభట్ల మహేష్ ఆదిత్య, పాలేటి లక్ష్మి, బిళ్ళ ప్రవీణ్, సింగిరెడ్డి శారద,

కొణిదల లోకెష్ నాయుడు,  బ్రహ్మదేవర శేఖర్ రాజ్, పార్నపల్లి ఉమా మహేష్, పద్మశ్రీ తోట,

తోపుదుర్తి  ప్రభంద్ రెడ్డి,  కసగాని మనోహర్, లంక భాను, ఎర్రం శరత్,  ఇల్లెందుల సమీర.

tantex2017_bot_lr tantex2017_ec_lr tantex2017_janmeeting_lr tantex2017_ob_lr tantex2017_president_lr

పాలక మండల బృందం

అధిపతి :  రొడ్డ రామకృష్ణరెడ్డి,  ఉపాధిపతి: పావులూరి వేణుమాధవ్

డా. సిరిపిరెడ్డి రాఘవ రెడ్డి, పుట్లూరు రమణ, రుమాళ్ళ శ్యామ,  కొనార రామ్, కన్నెగంటి చంద్రశేఖర్,

 

కొత్త కార్యవర్గ బృందంతో, సరికొత్త ఆలోచనలతో 2017 లో అందరిని అలరించే మంచి కార్యక్రమాలు చేయనున్నామని, స్థానిక తెలుగు వారి ఆశీస్సులు, ఆదరణ తప్పక ఉంటాయని ఆశిస్తున్నానని  సంస్థ అధ్యక్షులు తెలిపారు.

2016 సవత్సరంలో టాంటెక్స్ అధ్యక్షుడుగా ఇటీవలే పదవీ విరమణ చేసిన తక్షణ పూర్వాధ్యక్షుడు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ “ఉప్పలపాటి కృష్ణా రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పడిన 2017 కార్యవర్గ బృందం నిర్వహించబోయే కార్యక్రమాలకు నా సంపూర్ణ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాను”, అని తెలిపారు.

మరిన్ని వివరాలకు www.tantex.org సందర్శించండి.

0 760

డిసెంబర్ 18, 2016, డాలస్, టెక్సస్

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో “నెలనెలా తెలుగు వెన్నెల” సాహిత్య సదస్సు ఆదివారం డిసెంబర్18వ తేదీన దేశీప్లాజా టీవీ స్టూడియోలో సాహిత్యవేదిక సమన్వయకర్త బిళ్ళా ప్రవీణ్ అధ్యక్షతన నిర్వహించబడింది. ప్రవాసంలో నిరాటంకంగా 113 నెలలపాటు ఉత్తమ సాహితీవేత్తల నడుమ సాహిత్యసదస్సులు నిర్వహించటం ఈ సంస్థ విశేషం.
సమన్వయకర్త బిళ్ళా ప్రవీణ్ సభను ప్రారంభిస్తూ 113వ నెలనెలా తెలుగు వెన్నెల సదస్సుకి విచ్చేసిన సాహితీప్రియులకు స్వాగతం పలికారు. నెల నెలా తెలుగు వెన్నెల సింహావలోకనం సందర్భంగా2016 సంవత్సరంలో జరుపుకున్న సాహిత్యవేదిక కార్యక్రమాలను నెమరు వేసుకున్నారు.  ప్రతి నెలలో జరిగిన కార్యక్రమాన్ని, ముఖ్య అతిథి ప్రసంగాన్ని సభికులతో పంచుకున్నారు. తనకు సహకారం అందించిన సాహితీవేదిక సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్)  అధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, తక్షణ పూర్వాధ్యక్షులు డా.ఊరిమిండి నరసింహారెడ్డి , ఉపాధ్యక్షులు శీలం కృష్ణవేణి , కార్యదర్శి వీర్నపు చినసత్యం , కోశాధికారి దండ వెంకట్ , డా.సీ.ఆర్.రావు , డా.సుధ కలవగుంట, కాజా సురేష్, డా.కృష్ణ పుట్టపర్తి, నిమ్మగడ్డ మనోహర్  నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమమాని సంబందించిన అనుభవాలను గుర్తు చేసుకున్నారు.

tantex_113th-nntv_group-photo_12182016 tantex_113th-nntv_samanvayakartha_billa-praveen_12182016 tantex_113th-nntv_team

ప్రతి ఆదివారం సాయంత్రం ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం సమర్పించే టాంటెక్స్ తరంగిణి కార్యక్రమం తెలుగు వన్ రేడియో ద్వారా 3 గంటల నుండి 5 గంటల వరకు సాగుతుంది. ఈ కార్యక్రమానికి RJ శ్రీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ 113వ నెలనెలా తెలుగు వెన్నెల సదస్సుని దేశీ ప్లాజా స్టూడియో నుండి టాంటెక్స్ తరంగిణిలో తెలుగు వన్ రేడియో ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేసారు. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్)  అధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం గారు, పూర్వాధ్యక్షులు డా.ఊరిమిండి నరసింహారెడ్డి గారు మరియు సమన్వయకర్త బిళ్ళా ప్రవీణ్ గారు శ్రోతలతో 2016 లో జరిగిన నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమాల వివరాలను పంచుకున్నారు.

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం  అధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం మరియు కార్యక్రమ సమన్వయకర్త బిళ్ళా ప్రవీణ్ సాహిత్య వేదిక బృంద సభ్యులను మరియు  సాహితీ ప్రియులను,  టాంటెక్స్ సంస్థ ముప్పై వసంతాల జ్ఞాపిక తో సత్కరించారు.

సమన్వయకర్త బిళ్ళా ప్రవీణ్ సాహిత్యం మీద ప్రేమ, మాతృ భాష మీద మమకారంతో విచ్చేసిన భాషాభి మానులకు, సాహితీ ప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు.  ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన దేశీ ప్లాజా, రేడియో ఖుషి మరియు ప్రసార మాధ్యమాలైన టీవీ 5, టోరి , టి.ఎన్.ఐ లకు కృతఙ్ఞతాపూర్వక అభివందనములు తెలియజేసారు.

టాంటెక్స్ 113 వ నెల నెలా తెలుగు వెన్నెల సదస్సు గురించి బసాబత్తిన శ్రీనివాసులు  సమర్పించిన నివేదిక.

0 897

డాలస్/ఫోర్టువర్త్, టెక్సస్: ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెన్నెల” 105వ సాహిత్య సదస్సు మరియు ఉగాది కవిసమ్మేళనం ఆదివారం, ఏప్రిల్ 24వ తేదీన దేశీప్లాజా టీవీ స్టూడియోలో, ఎంతో ఆసక్తితో విచ్చేసిన భాషాభిమానులు, సాహితీ ప్రియుల సమక్షంలో సాహిత్య వేదిక సమన్వయకర్త బిళ్ళా ప్రవీణ్ అధ్యక్షతన నిర్వహించబడింది.   కవిసమ్మేళనంతో బాటు “నవల – కథన శిల్పం” అనే అంశంపై డా. సి. మృణాలిని గారు ప్రధానవక్తగా అనుపమానమైన వాగ్ధాటితో సాగించిన ప్రసంగం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.

సమన్వయకర్త స్వాగతోపన్యాసం, తదుపరి శ్రీమతి స్వాతి ఆలపించిన “శ్రీ గణనాథం” ప్రార్థనా గీతంతో అవిఙ్ఞంగా మొదలైన దుర్ముఖినామ సంవత్సర కవిసమ్మేళనం లో  చిరంజీవి పాలూరి ఇతిహాస్ జొన్నవిత్తుల వ్రాసిన “తెలుగు పద్యముల ప్రసాదం” వినిపించగా, డా. దొడ్ల రమణ “బంధాలు చిరకాలం వుండవు” అనే అంశం మీద తమ స్వీయ రచన పోతన భాగవతం లోని పద్యాలతో పోల్చుతూ వివరించగా, శ్రీ వేముల లెనిన్ శ్రీ శ్రీ “వర్షధార” ని ధారాళంగా పాడగా, శ్రీ మద్దుకూరి చంద్రహాస్ తనకు ఉగాది పై ఉన్న ఇష్టాన్ని “ఉగాది కవిత మమత” స్వీయ రచన ద్వారా పంచుకున్నారు. శ్రీ కాజ సురేష్  తెలుగు అంగ్లము కలిపి వ్రాసిన సీసపద్యమును, తెలుగు నాటక పద్యాల గొప్పతనము తెలియజేయగ, శ్రీ జువ్వాడి రమణ ప్రతి ఉగాది తను వస్తూ ఏదో తెస్తుంది, ఈ ఏడాది ఏమి తెస్తుందో ఎదురు చూడాలి అంటూ ఆశ – హస్యం రెండూ కలిపి చక్కని స్వీయ రచనను వినిపిస్తే, శ్రీ మాడ దయాకర్  స్వీయరచన లో “ఆరు రుతువులు ఉన్నా  కాని అకాల వాతావరణాలే” అంటూ ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం చేస్తున్న సాహితీ సేవని కొనియాడారు.

నందివాడ ఉదయ భాస్కర్ “దుర్ముఖి రుద్రాక్ష కిళ్ళీ” కవితలో ఇప్పటి రాజకీయాలని తనదైన శైలిలో వినిపించగా, శ్రీ పుదూర్ జగదీశ్వరన్ శ్రీనాథుని పద్యాలను వినిపిస్తూ కవిసమ్మేళనం అనగా నీరుకాకులగుంపు అంటూ నవ్విస్తే, పెనుగొండ ఇస్మాయిల్ తాను మధుబాల పై వ్రాసుకున్న స్వీయకవితను తనకు నచ్చిన మరో రెండు కవితలతో పంచగా, శ్రీమతి పాలూరి సుజన ఎన్నికలపై వ్రాసివినిపించిన స్వీయ రచన ముఖ్య అతిథి మన్ననలను పొందగా, డా. కలవగుంట సుధ సిద్దేంద్రయోగి “భామా కలాపము” లోని అష్టవిధ నాయిక అవస్థలను కళ్ళముందుంచారు. శ్రీమతి మార్తినేని మమత  స్వీయరచనలో “సాధించటానికి అత్మవిశ్వాసం ఉంటే చాలు” అన్నారు.  భారతదేశం నుంచి వచ్చిన మరొక ప్రొఫెసర్ కస్తూరి హనుమంతరావు గారు మాట్లాడుతూ తెలుగు బాషకి ప్రవాసులు చేస్తున్న సేవని ప్రశంసించారు. శ్రీ మల్లవరపు అనంత్ “సింగుతా స్వీటుగా కోల్డుగా” అని పేరడీ తోపాటు, స్వీయరచన “యువచేతనమూ, వసంతరాగ రాజితమూ, దుర్ముఖినామ సంవత్సరమూ” అంటూ చక్కగా ఆలపించారు. శ్రీ వెంకటేశ్వర చిన్ని, శ్రీ నిమ్మగడ్డ రామక్రిష్ణ, శ్రీ సాజి గోపాల్ తదితరులు పాల్గొని, వివిధ అంశాల మిశ్రమంగా సాగిన కవి సమ్మేళనం ఉగాది పచ్చడిలో షడ్రుచుల కలయికలా శోభాయమానంగా జరిగింది.

TANTEX_105 va Telugu Sahitya Sadassu_04242016_Audience TANTEX_105 va Telugu Sahitya Sadassu_04242016_Gnaapika Pradhaanam to Mrunalini garu TANTEX_105 va Telugu Sahitya Sadassu_04242016_Group Photo TANTEX_105 va Telugu Sahitya Sadassu_04242016_Mukhya Athithi Mrunalini garu TANTEX_105 va Telugu Sahitya Sadassu_04242016_Pushpa Guchham to Mrunalini garu TANTEX_105 va Telugu Sahitya Sadassu_04242016_Shaluva Sanmaanam  to Mrunalini garu TANTEX_105 va Telugu Sahitya Sadassu_04242016_Ugaadi Kavi Sammelanam 2 TANTEX_105 va Telugu Sahitya Sadassu_04242016_Ugaadi Kavi Sammelanam 3 TANTEX_105 va Telugu Sahitya Sadassu_04242016_Ugaadi Kavi Sammelanam 4 TANTEX_105 va Telugu Sahitya Sadassu_04242016_Ugaadi Kavi Sammelanam1

డా.సి.మృణాలిని గారు వృత్తిరీత్యా పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని తులనాత్మక అధ్యయన శాఖకు అధ్యాపకురాలు మరియు దర్శకురాలు.  టి.వి., వార్తాపత్రికలు, పుస్తకాలద్వారా చాలామంది తెలుగువారు అభిమానించే వ్యక్తి. విస్తృత అధ్యయనం, తెలుగు, ఆంగ్ల సాహిత్యాల తులనాత్మక పరిశీలన ఆమెకు  చాల ఇష్టమైన వ్యాపకం. పురాణ, ఇతిహాసాలలోని స్త్రీ పాత్రలకి యధాతధమైన అక్షరరూపాన్ని ఇవ్వగలిగిన ప్రజ్గ్ఞాని.  వనితా టీవి ద్వారా వినూత్న కార్యక్రమాలను రూపొందించి, తొలినాళ్ళలో జాబులు జవాబులుతో దూరదర్శన్ ప్రేక్షకులను ఆకట్టుకుని, వరల్డ్ స్పేస్ రేడియో ద్వారా తెలుగు సాహిత్య వైభవాన్ని, సినీ పాటల సంగీత సౌరభాన్ని ప్రపంచంలోని తెలుగు వారందరికీ వినిపించిన ఘనతని,  ప్రపంచ సభలలో తెలుగు సాహిత్య సాంస్కృతిక గౌరవాన్ని చాటిచెప్పే వకృత్వ పటిమ సొంతం చేసుకున్న డా. మృణాలిని అక్షరాలు తేలికగా జీర్ణమయ్యే ఉగ్గుపాలు.

నవలలో ఏం చెబుతున్నారన్నది వస్తువైతే, ఎలా చెబుతున్నారన్నది శిల్పమవుతుంది.  అంటే వస్తువు తప్ప తక్కిన నవలాంగాలన్నీ శిల్పంలో భాగమే.  సాధారణంగా తెలుగు విమర్శకులు శైలి, శిల్పం అని ద్వంద్వసమాసంలా వాడుతుంటారు గానీ, నిజానికి శైలి కూడా ఒక రకంగా శిల్పంలో భాగమే కనుక, నవలాశిల్పం అన్న ప్రయోగం చాలా విస్తృతి కలిగింది.  వైవిధ్యంతో కూడుకున్నది.  విశ్వసాహిత్యంలోని కొన్ని నవలలను రచయితలు కథా వస్తువుని, శైలిని, శిల్పాన్ని మలచిన తీరును ఈ కోణం నుంచి విశ్లేషిస్తూ చక్కని వివరణ ఇచ్చారు. గొపిచంద్, యండమూరి, సులొచన రాణి, రంగనాయకమ్మ, ఓల్గా, అంపశయ్య నవీన్ ఇలా పాత కొత్త అంటూ లేకుండా అన్ని తరాల రచయితలను, నవలా రచనలనూ గుక్కతిప్పుకోకుండా పోల్చుతూ సాగిన ప్రసంగం అందరిని మంత్రముగ్ధులను చేసింది.

సభకు విచ్చేసిన ఆహూతులకు టాంటెక్స్ తెలుగు సాహిత్య వేదిక వారు “ఉప్పు- కారం” తో పచ్చి మామిడి ముక్కలు, దోర జామ కాయలు, చక్కెర పొంగలి, వేడి వేడి గా పునుగులు, పకోడీలు, పులిహోర, పుదీనా రైస్, తేనీరు తో పసందుగా చక్కని అల్పాహారం అందచేసారు.

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) అధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, ఉత్తరాధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణారెడ్డి, సమన్వయ కర్త బిళ్ళా ప్రవీణ్, సాహిత్య వేదిక బృందం, టాంటెక్స్ కార్యవర్గం ముఖ్య అతిధి డా.సి.మృణాలిని గారిని శాలువ మరియు జ్ఞాపిక తో సత్కరించారు. సమన్వయకర్త బిళ్ళా ప్రవీణ్ మాట్లాడుతూ డల్లాస్ లో దుర్ముఖినామ సంవత్సరం సందర్భంగా ఇలా కవి సమ్మేళనం జరపడం ఎంతో సంతోషంగా ఉంది అని, అలాగే డా.సి.మృణాలిని గారు చేసిన ప్రసంగానికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు భాషాభిమానులకు, సాహితీ ప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన దేశీ ప్లాజా, రేడియో ఖుషి మరియు ప్రసార మాధ్యమాలైన టి.ఎన్.ఐ., టీవీ5, టీవీ9 లకు కృతఙ్ఞతా పూర్వక అభివందనములు తెలియజేసారు. టాంటెక్స్ పాలకమండలి అధిపతి గుర్రం శ్రీనివాస రెడ్డి, సభ్యులు రొడ్డ రామకృష్ణారెడ్డి,  ఉపాధ్యక్షులు శీలం కృష్ణవేణి, కార్యదర్శి వీర్నపు చినసత్యం, కోశాధికారి దండ వెంకట్, తక్షణ పూర్వాధ్యక్షుడు  డా. ఊరిమిండి నరసింహారెడ్డి, సభ్యులు పావులూరి వేణుమాధవ్, వనం జ్యోతి, మండిగ శ్రీలక్ష్మి, పాలేటి లక్ష్మి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే సాహిత్యవేదిక సభ్యులు అట్లూరి స్వర్ణ, బసాబత్తిన శ్రీనివాసులు, జలసూత్రం చంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కార్యక్రమంలోని ఛాయాచిత్రాలను ఈ క్రింది లంకెలో చూడవచ్చును.

https://tantex.smugmug.com/2016-Events/Sahitya-Vedika/105th-Nela-Nela-Telugu-Vennela/

 

టాంటెక్స్ 105 వ నెల నెలా తెలుగు వెన్నెల సదస్సు గురించి మార్తినేని మమత  సమర్పించిన నివేదిక.

SOCIAL

3,873FansLike
8FollowersFollow

SPECIALS

SHORT FILMS