Tags Posts tagged with "TAGS"

TAGS

0 137

కాలిఫోర్నియా రాష్ట్రం లో ఉన్న శాక్రమెంటో తెలుగు సంఘం (టాగ్స్) 15 వ వార్షికోత్సవం మరియు సంక్రాంతి సంబరాలసందర్భం గా “మనం” సంస్థ సహకారంతో రూపుదిద్దిన “రంగస్థలం” నాటకం ఆహుతులను విశేషం గా ఆకట్టుకొన్నది. రంగవల్లులు,సంక్రాంతి జట్కా బండి, పాలవెల్లి సెట్టింగ్, మరియు 450 కు పైగా ఉన్నకళాకారులు చేసిన సందడితో సంక్రాంతి వేడుకల ప్రాంగణం లోఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. స్థానిక ఫోల్సోం నగరం లోఉన్న ఫాల్సం హై స్కూల్ ధియేటర్ లో శనివారం జనవరి 19 వతేది 2019 మధ్యాన్నం 12 గం కు మొదలైన సంక్రాంతి సంబరాలు రాత్రి 11 గం వరకు కొనసాగాయి.

శాక్రమెంటో తెలుగు సంఘం సంక్రాంతి సంబరాల లోప్రదర్శించిన ముఖ్యాంశాలు:

1.మనం సంస్థ సహకారంతో టాగ్స్ రూపుదిద్దిన “రంగస్థలం” నాటకం

 1. వేదిక పై రాధా సమేత కృష్ణ, బృందావనం లో గోపాలుడు, అన్నమాచార్య గీతా మాధురి, సాంప్రదాయ తెలుగు జానపదాలు మరెన్నొ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతోఆకట్టుకున్న450 మందికి పైగా స్థానిక కళాకారులు
 2. ప్రతిభావంతులైన స్థానిక తెలుగు బాలలకు పురస్కారాలు
 3. స్థానిక డేవిస్ నగరంలో ఉన్న ప్రీతి ఇండియన్ రెస్టారెంట్ వారిచే తెలుగు పండుగ భోజనం

సంక్రాంతి వేడుకల సందర్భం గా టాగ్స్ అధర్వంలో జరిగినసాంస్కృతిక కార్యక్రమాలు,  స్థానిక డేవిస్ నగరం లో ఉన్న స్థానిక ప్రీతి ఇండియన్ రెస్టారెంట్ వారు వండిన నొరూరుంచే గోంగూర, అరిసె, బొబ్బట్టు, గారెలతో కూడిన పసందైన తెలుగు వంటకాలు, మరి ఇంకెన్నోవిశేషాలతో ఆహుతులను అలరించాయి. కదలి రండి, కలసి రండి, సంక్రాంతి సంబరాన్ని ఉమ్మడిగా జరుపుకొందాము అని టాగ్స్ఇచ్చిన పిలుపుకు స్పందించిన స్థానిక తెలుగు కుటుంబాలు 1500 మందికి పైగా వేదిక కు తరలి వచ్చారు. ఈ సందర్భంగా గృహహింస కు బలైన అతివలను ఆదరించే కాలిఫోర్నియా లో ఉన్న స్థానిక “మై సిస్టర్స్” స్వచ్చంద సంస్థ అధికారి “సిత్రా త్యాగరాజయ్య”, 100 కు పైగా తెలుగు పుస్థకాలు రచించిన స్థానిక తెలుగు రచయిత “శ్రీ వంశీ మోహన్ మాగంటి”, సిలికానాంధ్ర  యువత సేవల ఉప అధ్యక్షురాలు శ్రీమతి స్నేహ వేదుల , సిలికానాంధ్ర వాగ్గేయకారుల సేవల విభాగం డైరక్టర్ శ్రీ వంశీ కృష్ణ నాదెళ్ళ, ప్రియమైన అతిధులు గా విచ్చేసి ఆహుతులకు వారి సంక్రాంతి సందేశం మరియూ  శుభాకాంక్షలు అందజేశారు. వారందరూ స్థానిక తెలుగుకళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలకు అచ్చెరువొందారు. టాగ్స్ కార్యవర్గ సభ్యులు వారందరినీ వేదిక పై ఆహ్వానించి ఘనం గా సన్మానం గావించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా “శ్రీ వంశీ మోహన్ మాగంటి” మాట్లాడుతూ   మనదైన తెలుగు కధ, కవిత్వం, సాహిత్యం, సంప్రదాయాలను తరువాతి తరం బాలబాలికలకు  అందజేయాలని నొక్కి చెప్పారు. సిలికానాంధ్ర గ్లోబల్ టీం సభ్యులు శ్రీ వాసు కూడుపూడి మాట్లాడుతూ  కూచిపూడి గ్రామం లో శరవేగంగా నిర్మాణమౌతున్న మల్టి స్పెషాలిటీ ఆసుపత్రి “సంజీవిని” రెండవ దశ నిర్మాణంలో పాలుపంచుకోవాలని ఆయన స్థానిక తెలుగు వారికి విజ్ఞప్తి చేశారు. కూచిపూడి గ్రామం చుట్టుపక్కల ఉన్న 150 గ్రామాలకు ఆరోగ్య సమస్యలు తీర్చే ఉద్దేశ్యంతో “సంజీవిని” ఆసుపత్రి బృహుత్ యజ్ఞానికి శ్రీకారం చుట్టామని ఆయన చెప్పారు. దాదాపు 500 కుటుంబాలకు పైగా ఉద్యోగ అవకాశాలనుకల్పించడమే కాకుండా చిన్న పిల్లలకు, మహిళలకు ఉపయోగపడే రీతిలో “సంజీవిని” ఆసుపత్రి ని తీర్చి దిద్దుతామని, ఇందుకు సహాయం చేయదలచినవారు నేరుగా సిలికానాంధ్ర ను సంప్రదించాలని శ్రీ వాసు కూడుపూడి విజ్ఞప్తి చేశారు.

 

టాగ్స్ చైర్మన్ అనిల్ మండవ, వైస్ చైర్మన్ మల్లిక్ సజ్జనగాండ్ల,  ప్రెసిడెంట్ నాగ్ దొండపాటి, సెక్రటరీ దుర్గా చింతల, కోశాధికారి మోహన్ కాట్రగడ్డ , సమాచార అధికారి రాఘవ చివుకుల  నేతృత్వంలో టాగ్స్ కార్యవర్గం ఈ సందర్భంగా  ప్రియమైన అతిధులందరికీ జ్ఞాపికలు అందజేసి ఘనసన్మానం గావించింది. శ్రీ శ్రీనివాస కళ్యాణోత్సవం సంధానకర్త శ్రీమతి ఉష మందడి ని టాగ్స్ కార్యవర్గం ఘనంగా సత్కరించింది. అనంతరం రంగస్థలం నాటికలో పల్లెటూరి రచ్చబండ సమావేశం సెట్టింగ్, పాత్రధారుల  వేషధారణ, నటన, నృత్యాలతో 50 మందికి పైగా మనం సంస్థ, స్థానిక కళాకారులు చేసిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకొంది.

ఈ సందర్భం గాప్రతిభావంతులైన పిల్లలను పోత్సహించే గత సంప్రదాయాన్నిపాటిస్తూ, టాగ్స్ కార్యవర్గ సభ్యులు ఎంపిక చేసిన స్థానికప్రతిభావంతులైన హైస్కూల్ పిల్లలు “విశృత్ నాగం, తనూష తొల్లా, ఆష్మిత రెడ్డి, హర్షిత మదుగంటి, శ్రేయ నాగులపల్లి” లకు జ్ఞాపికలు అందజేశారు. టాగ్స్ సౌజన్యం తో జరుగుతున్న శాక్రమెంటో శివారు నగరాలైన స్థానిక ఫాల్సం, రోసివిల్లి, నాటోమాస్, ఎల్ డోరాడొ  సెంటర్లలో చదువుతున్న సిలికానాంధ్ర మనబడి విద్యార్థులు చక్కని తెలుగు పద్యాలు, కధలు, పాటలు వేదికపై ప్రదర్శించారు. స్థానిక వీఎంబ్రేస్స్వచ్చంద సంస్థ వద్ద శిక్షణ పొందుతున్న ఆటిజం ఆరిన పడ్డ దివ్యాంగులైన చిన్నారులచే ప్రదర్శించబడ్డ నృత్యప్రదర్శన కు  ఆహుతులు అందరూ చప్పట్లతో ప్రోత్సహించారు. అలేఖ్య పెన్మత్స, శృతి సేథి ఈ చిన్నారులకు నృత్య శిక్షణ ఇచ్చారు.  టాగ్స్ సమాచార అధికారి రాఘవ చివుకుల సమర్పణ గావించారు. అంతకు మునుపు శనివారంజనవరి 12న శ్రీ శ్రీనివాస కల్యాణోత్సవాన్ని అదే వేదిక ప్రాంగణంలో ఉదయం 9 గం కు టాగ్స్ ఘనంగా నిర్వహించింది. .  ఈ కార్యక్రమం కోసం స్టాక్ టన్ శివ విష్ణు దేవాలయం నుండి విచ్చేసిన పూజారులు  శ్రీ శ్రీనివాస కళ్యాణోత్సవం పూజ ను నిర్వహించారు. పూజానంతరం  ప్రత్యేకంగా తయారుచేసిన తీర్ధ ప్రసాదాలను భక్తులకు టాగ్స్ కార్యకర్తలు అందజేశారు. అనంతరం జరిగిన చిన్నారులకు  భోగిపళ్లు కార్యక్రమం లో పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. రేగిపళ్ళు, పూలు, అక్షంతలతో చిన్నారులను పూజకు విచ్చేసిన  అందరూ ఆశీర్వదించారు.  

కాలిఫోర్నియా శాక్రమెంటోలో సంక్రాంతి సంబరాలు, శ్రీ శ్రీనివాస కల్యాణోత్సవ విజయవంతం కు  అహర్నిశలు కృషి చేసిన వారిలో టీఏజిఎస్ కార్యవర్గ సభ్యులు, మరియు టాగ్స్ కార్యకర్తలు ఉన్నారు

ఈ సందర్భం గా టాగ్స్ కార్యనిర్వాహక సభ్యులు అనాధ భారతీయ బాలబాలికలకు సహాయార్ధం హోప్ ఎబయ్డ్స్, ఆరతి స్వచ్ఛంద సంస్థ, హైదరాబాద్ లో ఉన్న వేగేశ్న ఫౌండేషన్, రెండు తెలుగు రాష్ట్రాల గ్రామాలలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్న సువిధా ఇంటర్నేష్నల్ ఫౌండేషన్, మరియు “వీఎంబ్రేస్” స్వచ్ఛంద సంస్థ కు టాగ్స్ ప్రత్యేకం గా విరాళాలుఅందజేస్తుంది అని, ఈ సంస్థలకు సహాయార్ధం విరాళం ఇవ్వదలచిన వారు మరింత సమాచారం కోసం [email protected] కు ఈమెయిలు లో సంప్రదించాలని టాగ్స్ కార్యనిర్వాహక సభ్యులు కోరారు.

0 778

అమెరికా లో ఉన్న శాక్రమెంటో నగరం  చుట్టుపక్కలనున్న తెలుగు సాహిత్యాభిమానులకి ఇనాక్ గారి రచనలు పరిచయం కోసం ఒక వేదికని అందించడానికి “టాగ్స్”  ముందుకు వచ్చింది. కాలిఫోర్నియా రాష్ట్రం లో ఉన్న శాక్రమెంటో తెలుగు సంఘం (టాగ్స్) నిర్వహించిన “పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ గారితో మాటా మంతి” కార్యక్రమం  ఆహుతులను విశేషం గా ఆకట్టుకొన్నది.  స్థానిక ఫోల్సోం నగరం లో ఉన్న రుచి రెస్టారెంట్ లో ఆదివారం  జూన్ 11 వ తేది 2017  సాయంత్రం 6 గం కు  మొదలైన “పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ గారితో మాటా మంతి” కార్యక్రమం  రాత్రి 10 గం వరకు కొనసాగింది.

ఇనాక్ గారు తమ భాషా రుచులను, సంస్కృతీ మధురిమలను స్థానిక  సాహిత్య ప్రియులు, కళాపిపాసులు తో  ఆత్మీయ విందు లో కలిసి పంచుకున్న సందర్భం కాలిఫోర్నియా రాష్ట్రం లో ఉన్న శాక్రమెంటో లో ఆవిష్కృతమయ్యింది. ముందుగా గత వారం పరమపదించిన ప్రముఖ తెలుగు కవి, సాహితీవేత్త, జ్ఞానపీఠ పురస్కారం గ్రహీత డా సి. నారాయణరెడ్డి కి అంజలి ఘటించడంతో కార్యక్రమం ఆరంభం అయ్యింది. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన ఎనలేని సేవలను, ఆయనతో తనకు ఉన్న సాహిత్య  అన్నదమ్ముల  అనుబంధాన్ని ఇనాక్ గారు సోదాహరణంగా  వివరించారు. పిదప మాధవి బైరా “ఇనాక్ గారి మీద కవిత” తో స్వాగత వచనాలు  పలికి  అందరినీ అలరించారు.  తదుపరి ఇనాక్ గారు  తన తెలుగు నవలలు, కవితలు, నాటకాలని స్థానిక  సాహిత్య ప్రియులకు  పరిచయం చేశారు. కన్నీటి గొంతు, అనంత జీవనం,  ముని వాహనుడు నాటకం తో పాటు ఇనాక్ గారి పలు రచనల మీద చర్చ, సందేహ నివృత్తి జరిగాయి. ఈ సందర్భంగా ఇనాక్ గారు మాట్లాడుతూ మాతృభాషా గొప్పదనాన్ని సభికులకు వివరించారు. తెలుగు కవి వేమన పై తనకున్న ప్రేమను, అభిరుచిని అత్యంత ఆకర్షణీయ మైన శైలిలో ఆయన అభివ్యక్తీకరించారు.  తెలుగు భాషను తరువాతి తరాలకు అందించే కార్యక్రమాన్ని ముందు ఇంటినుండి ఆరంభించడం ద్వారా శాక్రమెంటో   స్థానిక తెలుగు కుటుంబాలు మరింత ఉన్నత స్థాయికి చేరతాయని ఆయన  నొక్కి చెప్పారు. టాగ్స్ కార్యవర్గం సభ్యులు ప్రొఫెసర్ కొలకలూరి ఇనాక్ గారికి వేదిక పై ఘనం గా సన్మానం గావించి “తెలుగు సాహితీ పుత్ర” బిరుదును వారికి ప్రదానం చేశారు.
 
టాగ్స్ చైర్మన్ వెంకట్ నాగం మాట్లాడుతూ, 60 ఏండ్ల కు పైగా తెలుగు సాహిత్యంతో ప్రయాణం చేసిన  పద్మ శ్రీ ప్రొఫెసర్ కొలకలూరి ఇనాక్ గారు రెండవసారి  శాక్రమెంటో పర్యటనకు  రావడం మనమంతా చేసుకున్న అదృష్టమని, ఈ సందర్భంగా  జూన్ 17న “ఇనాక్ గారితో మాటా మంతి” ప్రత్యేక ముఖాముఖి  కార్యక్రమం ఏర్పాటు చెయ్యడం జరిగిందని చెప్పారు.  ఈ రోజు  సాయంత్రం నాలుగు గంటల పాటు   ప్రొఫెసర్ కొలకలూరి ఇనాక్ గారి ప్రసంగంతో పాటు, డా సి నారాయణరెడ్డి గారితో వారికి ఉన్న అనుబంధం, ఇనాక్   గారి సాహితీ ప్రయాణానికి సంబంధించి మరిన్ని వివరాలు ఆసక్తిగా  తెలుసుకోవడం కోసం  విదేశాలలో ఇంత సమయం పాటు జరిగే కార్యక్రమం అరుదైన విషయమని, అందుకు కారణమైన ఇనాక్ గారికి,  విచ్చేసిన  తెలుగు సాహిత్యాభిమానులకి వారు ప్రత్యేక కృతఙ్ఞతలు  చెప్పారు.

సభ కు హాజరు అయిన ప్రతిఒక్కరూ సి నారాయణరెడ్డి, వేమన, ఇనాక్ గారి రచనలపై  అడిగిన పలు ప్రశ్నలకు తన అనుభవాన్ని రంగరించి ఇనాక్ గారు సమాధానం చెప్పిన తీరు అందరినీ ఆకట్టుకుంది. నాలుగు  గంటల పాటు ఆద్యంతం అత్యంత ఆసక్తికరంగా సాగిన ఈ  మాటా మంతి  ఆనంద సందోహంగా, ఆత్మీయ సంగమంగా, ఇనాక్ గారి సాహితీ  గమనంలో మరుపురాని మైలు రాయిగా మిగిలి పోయిందనడం లో సందేహం లేదు.  టాగ్స్ చైర్మన్ వెంకట్ నాగం సభకు సంధానకర్తగా వ్యవహరించారు. స్థానిక రుచి రెస్టారెంట్ వారు పసందైన విందుభోజనాన్ని అందించారు. టాగ్స్ అధ్యక్షులు మనోహర్ మందడి వందన సమర్పణ గావించారు.   కాలిఫోర్నియా శాక్రమెంటో లో ఇనాక్ గారితో మాటా మంతి కార్యక్రమం  విజయవంతం కావడానికి అహర్నిశలు కృషి చేసిన వారిలో టీఏజిఎస్ కార్యవర్గ సభ్యులు : మనోహర్ మందడి, మోహన్ కాట్రగడ్డ, సందీప్ గుడుపెల్లి, శ్రీదేవి మాగంటి, కీర్తి సురం, సురేంద్రనాథ్ కొప్పారపు, శ్రీరామ్ అకిన, మమతా దాసి, నాగేశ్వరరావు దొండపాటి, నాగేంద్రనాథ్ పగడాల, శ్రీనివాస రావు యనపర్తి,  శ్రీధర్ రెడ్డి, అశ్విన్ తిరునాహరి, మల్లిక్ సజ్జనగాండ్ల, స్వర్ణ కంభంపాటి, వాసు కుడుపూడి, సుధాకర్ వట్టి, రాంబాబు బావిరిశెట్టి, అనిల్ మండవ, వెంకట్ నాగం, భాస్కర్ దాచేపల్లి, ప్రసాద్ కేటిరెడ్డి,  డా సంజయ్ యడ్లపల్లి మరియు పలువురు  టాగ్స్ కార్యకర్తలు ఉన్నారు. టాగ్స్ కార్యవర్గ సభ్యుడు నాగ్ దొండపాటి  ఫోటోగ్రఫీ సహకారం అందించారు.   

0 742

కాలిఫోర్నియా రాష్ట్రం లో ఉన్న శాక్రమెంటో తెలుగు సంఘం (టాగ్స్), వేగేశ్న ఫౌండేషన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో నిర్వహించిన “పాటకి పట్టాభిషేకం” కార్యక్రమం  ఆహుతులను విశేషం గా ఆకట్టుకొన్నది. శ్రీ రామకృష్ణ యనమండ్ర, శ్రీమతి లలిత నేమన పాడిన ఘంటసాల, బాలు సినీ మధుర గీతాలతో  ప్రాంగణం లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. స్థానిక ఫోల్సోం నగరం లో ఉన్న ఫాల్సం హై స్కూల్ ధియేటర్ లో ఆదివారం  జూన్ 11 వ తేది 2017  సాయంత్రం 4 గం కు  మొదలైన పాటకి పట్టాభిషేకం కార్యక్రమం  రాత్రి 9 గం వరకు కొనసాగింది. పలువురు స్థానిక కళాకారులు పాడిన మధురగీతాలతో ప్రాంగణం పరవశమైపోయింది.

 

స్థానిక అప్పకడై చెట్టినాడు రెస్టారంట్ వారు వండిన నొరూరుంచే పసందైన తెలుగు వంటకాలు, స్థానిక గాయకులు పాడిన మధుర గీతాలు మరి ఇంకెన్నో విశేషాలతో ఆహుతులను అలరించాయి. కదలి రండి, కలసి రండి, ఘంటసాల, బాలు సినీ మధుర గీతాలతో పాటకి పట్టాభిషేకం జరుపుకొందాము అని టాగ్స్ ఇచ్చిన పిలుపుకు స్పందించిన స్థానిక తెలుగు కుటుంబాలు 250 మందికి పైగా వేదిక కు తరలి వచ్చారు. ఈ సందర్భం గా మూర్తిదేవి అవార్డు గ్రహీత, పద్మ శ్రీ ప్రొఫెసర్ కొలకలూరి ఇనాక్ గారు  ముఖ్య అతిధి గా విచ్చేసి చక్కని ప్రదర్శన చేసిన రామకృష్ణ యనమండ్ర, లలిత నేమన తో పాటు స్థానిక కళాకారులను అభినందించారు. వేగేశ్న ఫౌండేషన్ వంశీ రామరాజుతో తన 40 ఏండ్ల అనుబంధాన్ని  ఆహుతులకు ఆయన వివరించారు. దివ్యాంగులు, అనాధల కు వేగేశ్న ఫౌండేషన్ ద్వారా  వంశీ రామరాజు చేస్తున్న సేవలను తాను హైదరాబాద్ లో ఉండి చూసిన విధం వివరించడమే కాకుండా, ఇటువంటి సేవా కార్యక్రమాలకు సహాయపడడం ద్వారా శాక్రమెంటో   స్థానిక తెలుగు కుటుంబాలు మరింత ఉన్నత స్థాయికి చేరతాయని నొక్కి చెప్పారు. టాగ్స్ కార్యవర్గం సభ్యులు ప్రొఫెసర్ కొలకలూరి ఇనాక్ గారికి వేదిక పై ఘనం గా సన్మానం గావించి జ్ఞాపిక ను అందజేశారు.

ప్రియమైన అతిధి గా విచ్చేసిన వేగేశ్న ఫౌండేషన్ వంశీ రామరాజు గారు హైదరాబాద్ లో ఉన్న తమ ఆశ్రమంలో స్వర్గీయ ఘంటసాల గారికి గుడి కట్టించడం జరిగిందనీ, అక్కడ నిత్య పూజలు జరుగుతున్నాయి అనీ, ఈ “పాటకి పట్టాభిషేకం” కార్యక్రమం  ద్వారా   వేగేశ్న ఫౌండేషన్ కార్యక్రమాలను శాక్రమెంటో  స్థానిక తెలుగు కుటుంబాలవారికి తెలియజేయడం ఆనందకరంగా ఉందని చెప్పారు. “పాటకి పట్టాభిషేకం” బృందం  అమెరికాలో పర్యటించడానికి సహాయ సహకారాలు అందజేసిన తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు గారికి, తెలంగాణా టూరిజం శాఖ కు వంశీ రామరాజు గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రెండు నెలల పాటు అమెరికా లో పర్యటిస్తూ  పలు పట్టణాలతో పాటు   శాక్రమెంటో లో  “పాటకి పట్టాభిషేకం” జరుపుకోవడం ఆనందగా ఉంది అని ఆయన చెప్పారు. శాక్రమెంటో తెలుగు సంఘం కార్యవర్గ సభ్యులు వంశీ రామరాజు గారి కి  వేదిక పై ఘనం గా సన్మానం గావించారు.

 

ముందుగా విశ్రుత్ నాగం, శ్రీదేవి మాగంటి ఆలపించిన ప్రార్ధనా గీతాలతో కార్యక్రమం ఆరంభం అయ్యింది. అనంతరం టాగ్స్ అధ్యక్షులు మనోహర్ మందడి “శ్రీ రామకృష్ణ యనమండ్ర, శ్రీమతి లలిత నేమన” లను సభకు పరిచయం చేశారు.  శ్రీ రామకృష్ణ యనమండ్ర, శ్రీమతి లలిత నేమన పలు  “ఘంటసాల, బాలు” సినీ మధుర గీతాలతో అలరించారు. పిదప పలువు స్థానిక కళాకారులు “అభినవ ఘంటసాల” రాజు  ఈడూరి, దివావాకర్ సోమంచి, శ్రీదేవి సోమంచి, రమా మణి  ఆకెళ్ళ, అబ్దుల్ షేక్, చైత్రిక బుడమగుంట, ప్రతీక బుడమగుంట (బుడమగుంట  సిస్టర్స్) ఆలపించిన గీతాలకు ఆహుతులు తప్పట్లతో అభినందించి వారిని ప్రోత్సాహించారు.

 

టాగ్స్ చైర్మన్ వెంకట్ నాగం మాట్లాడుతూ, పద్మ శ్రీ ప్రొఫెసర్ కొలకలూరి ఇనాక్ గారు రెండవసారి  శాక్రమెంటో పర్యటనకు  రావడం మనమంతా చేసుకున్న అదృష్టమని, ఈ సందర్భంగా  జూన్ 17న “ఇనాక్ గారితో మాటా మంతి” ప్రత్యేక ముఖాముఖి  కార్యక్రమం ఏర్పాటు చెయ్యడం జరిగిందని, ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకు స్థానిక రుచి ఇండియన్ రెస్టారెంట్  కు అందరూ విచ్చేసి  ప్రొఫెసర్ కొలకలూరి ఇనాక్ గారి ప్రసంగంతో పాటు, డా సి నారాయణరెడ్డి గారితో వారికి ఉన్న అనుబంధం,   వారి  సాహితీ ప్రయాణానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుకోవచ్చునని తెలిపారు.

 

టాగ్స్ సెక్రటరీ  మోహన్ కాట్రగడ్డ వందన సమర్పణ గావించారు.   కాలిఫోర్నియా శాక్రమెంటో లో సంక్రాంతి సంబరాలు విజయవంతం కావడానికి అహర్నిశలు కృషి చేసిన వారిలో టీఏజిఎస్ కార్యవర్గ సభ్యులు : మనోహర్ మందడి, మోహన్ కాట్రగడ్డ, సందీప్ గుడుపెల్లి, శ్రీదేవి మాగంటి, కీర్తి సురం, సురేంద్రనాథ్ కొప్పారపు, శ్రీరామ్ అకిన, మమతా దాసి, నాగేశ్వరరావు దొండపాటి,నాగేంద్రనాథ్ పగడాల, శ్రీనివాస రావు యనపర్తి, ప్రసాద్ కేతిరెడ్డి,  శ్రీధర్ రెడ్డి, అశ్విన్ తిరునాహరి, మల్లిక్ సజ్జనగాండ్ల, స్వర్ణ కంభంపాటి, వాసు కుడుపూడి, సుధాకర్ వట్టి, రాంబాబు బావిరిశెట్టి, అనిల్ మండవ, వెంకట్ నాగం, భాస్కర్ దాచేపల్లి, ప్రసాద్ కేటిరెడ్డి,  డా సంజయ్ యడ్లపల్లి మరియు పలువురు  టాగ్స్ కార్యకర్తలు పాల్గోన్నారు. టాగ్స్ కోశాధికారి సందీప్ గుడుపెల్లి  ఫోటోగ్రఫీ సహకారం అందించారు. ఈ సందర్భం గా టాగ్స్ కార్యనిర్వాహక సభ్యులు,  వికలాంగ, అనాధ బాలబాలికల సహాయార్ధం వేగేశ్న ఫౌండేషన్ కు ఆరు వేల డాలర్ల విరాళాన్ని ప్రకటించారు.  ఈ సంస్థకు  సహాయార్ధం విరాళం ఇవ్వదలచిన వారు మరింత సమాచారం కోసం [email protected] కు ఈమెయిల్‌లో సంప్రదించాలని టాగ్స్ కార్యనిర్వాహక సభ్యులు కోరారు.  “పాటకి పట్టాభిషేకం” ఫోటోలను ఫేస్ బుక్ https://www.facebook.com/SacTelugu/photos_stream  లో లేదా www.goo.gl/o9nFna  లో చూడవచ్చునని వారు తెలిపారు.  టాగ్స్ చేపట్టబోయే కార్యక్రమాలకు సంబంధించి మరిన్ని వివరాలను తెలుసుకోవాలనుకునేవారు http://www.sactelugu.org , https://www.facebook.com/SacTelugu ను సందర్శించాలని లేదా [email protected] కు ఈమెయిలు లో సంప్రదించాలని టాగ్స్ కార్యనిర్వాహక సభ్యులు కోరారు.

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జియ్యర్‌ స్వామి వారి మంగళాశాసనాలతో శాక్రమెంటో తెలుగు సంఘం (TAGS) ఆధ్వర్వం లో మంగళవారం జనవరి 10న ప్రారంభం అయిన ఆధ్యాత్మిక ప్రవచన సదస్సుకుకాలిఫోర్నియా రాష్ట్రం లోని శాక్రమెంటో శివారు నగరం ఫోల్సం వేదిక అయ్యింది. ఫోల్సం నగరం లో విస్టా డీలాగో హైస్కూల్ ప్రాంగణం లో అణువణువునా ఉట్టిపడిన ఈ ఆధ్మాత్మికత సదస్సుకు స్థానిక తెలుగు ప్రజలు పెద్ద ఎత్తునహాజరు అయ్యారు. మొదట జియ్యర్‌ స్వామి వారి కి TAGS చైర్మన్ వెంకట్ నాగం పూర్ణకుంభం తో సాంప్రదాయబద్దంగా స్వాగతం చెప్పారు, పిదప జియ్యర్‌ స్వామి వారి ని TAGS అధ్యక్షులు మనోహర్ మందడి పూలమాలతో అలంకృతంగావించారు. అనంతరం రెండు గంటలకు పైగా సాగిన జియ్యర్‌ స్వామి ఆధ్మాత్మిక ప్రసంగంతో ఆహుతులు తడిసి ముద్దయ్యారు. దేహాన్ని దేవాలయంగా భావించి నిత్యం పరిశుభ్రంగా ఉంచుకోవాలని జియ్యర్‌ స్వామి తన ప్రవచనం లోచెప్పారు. ‘ప్రజ్ఞ ‘ ని స్థాపించి వేలాది మంది పిల్లలందరికీ శ్లోకాలు, భారత, రామాయణం కథలు, వేదాలు నేర్పించడం జరుగుతున్నదని, ఉచ్చారణ లో తప్పులు లేకుండా శ్రద్ధగా నేర్చుకొంటే వాటి ఫలితం పూర్తిగా పొందవచ్చునని,అయితే ఈ విషయం లో ప్రవాసాంధ్రులు పిల్లలకు సహకరించాలని చిన్న జియ్యర్ స్వామి వివరించారు.

 

అతి సామాన్యుడికి సైతం ఆలయ ప్రవేశం కలిగేలా చేసి సాక్షాత్తూ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆరాధనా విధానాన్ని క్రమబద్దీకరించి నిత్యం లక్షలాది భక్తులు ఆ కలియుగ ప్రత్యక్షదైవాన్ని దర్శించుకునేలా చేసిన సమతామూర్తి శ్రీరామానుజచార్య ప్రాభవాన్ని ప్రపంచ వ్యాప్తంగా తెలియజేయడంతో పాటుగా ఆయనను భావితరాల వారికి పరిచయం చేయాలనే సత్సంకల్పంతో సుమారు 600 కోట్ల రూపాయలతో శ్రీమద్రామానుజ స్ఫూర్తి కేంద్రం హైదరాబాద్ లోనిశంషాబాద్ లో నిర్మించనున్నట్లు చిన్నజియ్యర్ స్వామి చెప్పారు.

 

సమాజ సంస్కరణాభిలాషతో వందల ఏళ్ళ క్రితమే సమాజంలో కులతత్వ నివా రణకు కృషి చేసి, సమాజానికి ఆధ్యాత్మిక సుగంధం పూసే పలు విశిష్టమైన గ్రంథా లను రచించి, తన బోధలతో.. రచనలతో సమాజాన్ని ఎంతగానోప్రభావితం చేసిన మహనీయుడు శ్రీ భగవద్రామానుజస్వామి వారు. ఆ మహానుభావుడు జన్మించి 2017 నాటికి వెయ్యేళ్ళవుతున్న విశిష్ట సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన ప్రవచనాలను ప్రపంచానికంతా పున:పరిచయం చేయాలనే సదాశయంతో శ్రీ త్రిదండి చిన్న శ్రీమ న్నారాయణ రామానుజ జియ్యర్‌స్వామి వారు తాము చేస్తున్న ప్రయత్నాన్ని సోదాహరణంగా వివరించారు. ఈ బృహత్‌ కృషిలో భాగంగా, హైదరాబాద్‌ సమీపం లోని శంషాబాద్‌ ఆశ్రమంలోసుమారు 45 ఎకరాల విస్తీర్ణంలో 216 అడుగులు ఎత్తున శ్రీ రామానుజస్వామివారి పంచలోహ విగ్రహాన్ని ప్రతిష్టించడానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయని వారు చెప్పారు. ‘స్టాట్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ’ పేరుతో ఇంత భారీఎత్తున నిర్మించే ఆ’సమతామూర్తి’ విగ్రహం ఏర్పాటుకే కనీసం నూరుకోట్ల రూపాయల దాకా వ్యయమవుతుందని, ఈ మొత్తం ప్రాజెక్టుకు సుమారు వెయ్యి కోట్ల రూపాయల దాకా వ్యయమవుతాయని ఆయన చెప్పారు. మూడు దశల్లో జరిగే ఈ ప్రాజెక్టును 2022నాటికి పూర్తిచేయాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నామని చిన్నజియ్యర్‌ స్వామివారు చెప్పారు. అంతేకాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ శ్రీ రామా నుజులస్వామివారి దివ్యక్షేత్రాలు వుండా లనే ఆకాంక్షతో విజయవాడలోని విజయ కీలాద్రిపర్వతంపై కూడా 108 అడుగుల ఎత్తయిన శ్రీ రామానుజుల స్వామివారి సుధామూర్తి (సిమెంట్‌ విగ్రహం) ఏర్పా టుకు కూడా కృషి జరుగుతున్నదని జియ్యర్‌స్వామి చెప్పారు. కార్యక్రమం పిదప వేణు మెప్పర్ల ఆధ్వర్వం లో భక్తులకుప్రసాదాలు TAGS కార్యకర్తలు అందజేశారు.

 

భావితరాలకు స్ఫూర్తినిస్తూ, ఆధ్యాత్మిక రంగానికి అనితర సాధ్యమైన సేవలందించి అజరామర కీర్తినార్జించిన భగవత్‌ రామా నుజాచార్యులవారు నాటి తరానికే కాదు.. నేటి తరానికీ.. భావితరాలకు కూడా స్ఫూర్తి ప్రదాత.. ఆ మానవతాదీప్తిని.. సమతా మూర్తిని స్మరించుకుంటూ.. శాక్రమెంటో తెలుగు వారందరికీ రామానుజస్వాములవారి దివ్యబోధలను తెలుసుకునే సదవకాశాన్ని అందించిన జియ్యర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ కు TAGS కార్యవర్గం ప్రత్యేక కృతజ్ఞతలుతెలియజేసింది. TAGS సెక్రటరీ మోహన్ కాట్రగడ్డ, మరియు ట్రెజరర్ సందీప్ గుడిపెల్లి తదితరులు జియ్యర్‌స్వామి వారికి ఘనంగా వీడ్కోలు చెప్పారు.

sri-chinna-jeyyar-swami-jis-spiritual-pravachana-event-by-tags-1 sri-chinna-jeyyar-swami-jis-spiritual-pravachana-event-by-tags-2 sri-chinna-jeyyar-swami-jis-spiritual-pravachana-event-by-tags-4 sri-chinna-jeyyar-swami-jis-spiritual-pravachana-event-by-tags-6 sri-chinna-jeyyar-swami-jis-spiritual-pravachana-event-by-tags-9 sri-chinna-jeyyar-swami-jis-spiritual-pravachana-event-by-tags-12 sri-chinna-jeyyar-swami-jis-spiritual-pravachana-event-by-tags-13

జియ్యర్‌ స్వామి వారి ఆధ్యాత్మిక ప్రవచన సదస్సు జయప్రదం గా జరగడానికి TAGS కార్యవర్గ సభ్యులు: మనోహర్ మందడి, మోహన్ కాట్రగడ్డ, సందీప్ గుడుపెల్లి, శ్రీదేవి మాగంటి, కీర్తి సురం, సురేంద్రనాథ్ కొప్పారపు, శ్రీరామ్ అకిన,మమతా దాసి, నాగేశ్వరరావు దొండపాటి, నాగేంద్రనాథ్ పగడాల, శ్రీనివాస రావు యనపర్తి, శ్రీధర్ రెడ్డి, వెంకట్ నాగం, అశ్విన్ తిరునాహరి, మల్లిక్ సజ్జనగాండ్ల తదితరులు, మరియు కార్యకర్తలు: వేణు ఆచార్య,శాంత, అనుదీప్ గుడిపెల్లి,రామ కృష్ణ నీలం, సత్యవీర్ సురభి,శ్రీ, రాకేష్ గుర్రాల, ఉష మందడి, వాణి నాగం తదితరులు సహకారం అందించారు.

 

శాక్రమెంటో తెలుగు సంఘం TAGS పిలుపుకు స్పందించి జియ్యర్‌ స్వామి వారి ఆధ్యాత్మిక ప్రవచన సదస్సుకు స్పందించి, తుపాను ను కూడా లెక్కచెయ్యకుండా పెద్ద ఎత్తున వేదిక కు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం ఆసాంతంవిని జయప్రదం చేసిన స్థానిక తెలుగు వారికి, మిత్రులకు, ఫోటోగ్రఫీ సహకారం అందించిన రాకేష్ గుర్రాల “ఆర్ ఆర్ ఫోటోగ్రఫీ” కి TAGS కార్యవర్గం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది.

 

ఈ సందర్భంగా ఫోల్సోం హై స్కూల్ ధియేటర్ లో శనివారం జనవరి 14 వ తేది 2017 11 గంటలకు శాక్రమెంటో తెలుగు సంఘం ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం, తదుపరి 1:30 గంటలకు సంక్రాంతి సంబరాలు మొదలు అవుతాయని,వివిధ సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనకు 300 మందికి పైగా స్థానిక కళాకారులు సంసిద్ధులు అవుతున్నారు కాబట్టి కార్యక్రమానికి విచ్చేసి వారిని పోత్సహించి సంక్రాంతి సంబరాలను జయప్రదం చేయవలసినదిగా శాక్రమెంటోతెలుగు వారికి, మిత్రులకు TAGS కార్యవర్గం విజ్ఞప్తి చేసింది. మరుగునపడిన కళల వికాసానికి శాక్రమెంటో తెలుగు సంఘం చేస్తున్న సాంస్కృతిక కృషి కి అందరు పెద్ద ఎత్తున హాజరై సహకరించాలని కార్యవర్గ సభ్యులు ఈ సందర్భం గావిజ్ఞప్తి చేసారు. TAGS సంక్రాంతి సంబరాల కార్యక్రమాలకు సంబంధించి మరిన్ని వివరాలను తెలుసు కోవాలనుకునే వారు http://www.sactelugu.org లేదా https://www.facebook.com/SacTelugu ను సందర్శించాలని లేదా[email protected] కు ఈమెయిలు లో సంప్రదించాలని ఈ సందర్భంగా TAGS కార్యనిర్వాహక సభ్యులు కోరారు.

0 670

కాలిఫోర్నియా రాష్ట్రం లో ఉన్న శాక్రమెంటో తెలుగు సంఘం 13 వ వార్షికోత్సవం మరియు సంక్రాంతి సంబరాల సందర్భం గా పూర్తి నిడివి భరతనాట్యం నృత్య  రూపకం “శ్రీనివాస కళ్యాణం”ఆహుతులను విశేషం గా ఆకట్టుకొన్నది. రంగవల్లులు, సంక్రాంతి పాలవెల్లి  సెట్టింగ్, మరియు 300 కు పైగా ఉన్న కళాకారులు చేసిన సందడితో సంక్రాంతి వేడుకల ప్రాంగణం లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. స్థానిక ఫోల్సోం నగరం లో ఉన్న ఫాల్సం హై స్కూల్ ధియేటర్ లో శనివారం జనవరి 14 వ తేది 2017 ఉదయం 11 గం కు  మొదలైన సంక్రాంతి సంబరాలు రాత్రి 11 గం వరకు కొనసాగాయి.

 

శాక్రమెంటో తెలుగు సంఘం సంక్రాంతి సంబరాల లో ప్రదర్శించిన ముఖ్యాంశాలు:

 

1.శాక్రమెంటో లో భాస్కర్ ఆర్ట్స్ అకాడమీ వారి సహకారం తో టాగ్స్ రూపొందించిన పూర్తి నిడివి నృత్య  రూపకం “శ్రీనివాస కళ్యాణం”

2.శ్రీనివాస కళ్యాణం రూపకం లో గాత్రం, వయోలిన్, మృదంగం వాద్య సహకారం తో అలరించిన శ్రీ పప్పు సదాశివ శాస్త్రి గారి బృందం

3.జానపద నృత్య రూపకర్త స్నేహ వేదుల రూపొందించిన జానపద నృత్యం

4.వేదిక పై వివిధ ఇతర సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్న300 మందికి పైగా స్థానిక కళాకారులు

5.భోజన విరామ సమయం లో 1000 మందికి పైగా ఆహుతులను లలిత సంగీతం, సినీ గీతాలతో అలరించిన చిన్నారులు, పెద్దలు, డప్పుతో ఆకట్టుకున్న స్థానిక  చిన్నారి

srinivasa-kalyanam-and-tags-13th-anniversary-sankranti-sambaraalu-event-by-tags-1 srinivasa-kalyanam-and-tags-13th-anniversary-sankranti-sambaraalu-event-by-tags-3 srinivasa-kalyanam-and-tags-13th-anniversary-sankranti-sambaraalu-event-by-tags-3 srinivasa-kalyanam-and-tags-13th-anniversary-sankranti-sambaraalu-event-by-tags-4

సంక్రాంతి వేడుకల సందర్భం గా టాగ్స్ అధర్వంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు, పూర్తి నిడివి భరతనాట్యం నృత్య  రూపకం “శ్రీనివాస కళ్యాణం”, వేదిక పై ఉన్న 300 మందికి పైగా స్థానికకళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, డేవిస్ నగరం  లో ఉన్న స్థానిక ప్రీతి ఇండియన్ క్యూసైని వారు వండిన నొరూరుంచే పసందైన తెలుగు వంటకాలు, మరి ఇంకెన్నో విశేషాలతోఆహుతులను అలరించాయి. కదలి రండి, కలసి రండి, సంక్రాంతి సంబరాన్ని ఉమ్మడిగా జరుపుకొందాము అని టాగ్స్ ఇచ్చిన పిలుపుకు స్పందించిన స్థానిక తెలుగు కుటుంబాలు 1000 మందికి పైగావేదిక కు తరలి వచ్చారు. ఈ సందర్భం గా కాలిఫోర్నియా ముఖ్య సమాచార అధికారి (సి ఐ ఓ) శ్రీమతి అమీ టోంగ్ ముఖ్య అతిధి గా విచ్చేసి ఆహుతులకు సంక్రాంతి సందేశాన్ని అందజేశారు. టాగ్స్కార్యవర్గం సభ్యులు శ్రీమతి అమీ టోంగ్ కు  వేదిక పై ఘనం గా సన్మానం గావించి జ్ఞాపిక ను అందజేశారు.

 

ప్రియమైన అతిధి గా విచ్చేసిన స్థానిక కాలిఫోర్నియా యూనివర్సిటీ డేవిస్ క్యాంపస్ ప్రొఫెసర్ శ్రీ హనుమంతరావు ఉన్నవ గారు  స్థానిక తెలుగు కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలకుఅచ్చెరువొందారు. శాక్రమెంటో తెలుగు సంఘం కార్యవర్గ సభ్యులు శ్రీ హనుమంతరావు ఉన్నవ గారిని  వేడుక పై సాదరంగా ఆహ్వానించి కు వేదిక పై ఘనం గా సన్మానం గావించారు. మనదైన తెలుగుసంస్కృతి, కవిత్వం, సాహిత్యం, సంప్రదాయాలను తరువాతి తరం వారికి అందజేయాలని ప్రొఫెసర్ ఉన్నవ నొక్కి చెప్పారు.

 

మరో ప్రియమైన అతిధి గా విచ్చేసిన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు వాసి ప్రముఖ చిత్రకారులు శిల్పి శ్రీ  ఉదయ్ కుమార్ మార్లపూడి  గారిని టాగ్స్ చైర్మన్ వెంకట్ నాగం సభికులకు పరిచయం చేసారు.చిత్రకళలో చేసిన నిరంతర ప్రయత్నమే నన్ను ఈస్థాయి కి నిలబెట్టింది అని, ప్రయత్నిస్తే మీకు ఈ కళలో విజయం తధ్యమని శ్రీ ఉదయ్ కుమార్  సందేశం ఇచ్చారు. శాక్రమెంటో తెలుగు సంఘంసభ్యులకు శ్రీ ఉదయ్ కుమార్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసారు. ఆహుతుల కోరికమేరకు అప్పటికప్పుడు తెలుగుజాతి వైభవం, బాలమురళీకృష్ణ, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పై రెండు స్పాట్పెయింటింగ్స్ వేసి వేదికపై శ్రీ ఉదయ్ కుమార్ ఆహుతుల హర్షద్వానాలు అందుకొన్నారు. శ్రీ  ఉదయ్ కుమార్ మార్లపూడి గారికి టాగ్స్ కార్యవర్గం వేదికపై జ్ఞాపికను బహూకరించి,  శాలువా కప్పి ఘనసన్మానం గావించారు.

srinivasa-kalyanam-and-tags-13th-anniversary-sankranti-sambaraalu-event-by-tags-4 srinivasa-kalyanam-and-tags-13th-anniversary-sankranti-sambaraalu-event-by-tags-5 srinivasa-kalyanam-and-tags-13th-anniversary-sankranti-sambaraalu-event-by-tags-6 srinivasa-kalyanam-and-tags-13th-anniversary-sankranti-sambaraalu-event-by-tags-7

మరో ప్రియమైన అతిధి గా విచ్చేసిన సిలికానాంధ్ర చైర్మన్ శ్రీ ఆనంద్ కూచిభొట్ల గారిని టాగ్స్  ట్రస్టీ వాసు కుడుపూడి సభికులకు పరిచయం చేసారు. ఈ సందర్భం గా  ఆనంద్ కూచిభొట్ల గారుమాట్లాడుతూ 2004 లో మొట్టమొదటి సారిగా టాగ్స్ శాక్రమెంటో లో సంక్రాంతి సంబరాలను జరిపిందని, ఇప్పుడు వరుసగా 13వ సారి సంక్రాంతి సంబరాలను జరుపుకోవడం ఆనందంగా ఉందని, ఈ రెండువేడుకల్లో కుడా సిలికానాంధ్ర బృందం టాగ్స్ వారి సంక్రాంతి సంబరాల సాంస్కృతిక కార్యక్రమాలలో పాలుపంచుకోవడం మరింత ఆనందం గా ఉందని, మనదైన సంస్కృతి, సంప్రదాయాన్ని పిల్లలకుఅందించడానికి ఇటువంటి వేడుకలు అవసరం అని చెప్పారు. తెలుగు వారి కూచిపూడి నాట్యానికి పుట్టినిల్లు అయినటువంటి కూచిపూడి గ్రామం దీనావస్థ లో ఉందని, దీనికి మెరుగుపరచడానికి జయహోకూచిపూడి కార్యక్రమానికి, తెలుగు భాష ను వ్యాపింపజేయడానికి స్థానిక మనబడి కి చేయుతనివ్వాలని శ్రీ ఆనంద్ కూచిభొట్ల నొక్కి చెప్పారు. శ్రీ ఆనంద్ కూచిభొట్ల తో పాటు విచ్చేసిన సిలికానాంధ్ర వైస్చైర్మన్ శ్రీ దిలీప్ కొండిపర్తి, తదితర సిలికానాంధ్ర మరియు యూనివర్సిటీ అఫ్ సిలికానాంధ్ర కార్యవర్గ సభ్యులందరికీ టాగ్స్ ఘనసన్మానం గావించింది.

 

టాగ్స్ సౌజన్యం తో జరుగుతున్న శాక్రమెంటో లో సిలికానాంధ్ర స్థానిక మనబడి విద్యార్థులు చక్కని తెలుగు పద్యాలు, కధలు, పాటలు వేదికపై ప్రదర్శించారు. ఈసందర్భం గా ప్రతిభావంతులైన పిల్లలనుపోత్సహించే గత సంప్రదాయాన్ని పాటిస్తూ, టాగ్స్ కార్యవర్గ సభ్యులు స్థానిక ప్రతిభావంతులైన పిల్లలకు శ్రీమతి అమీ టోంగ్ చేతులమీదగా  జ్ఞాపికలు అందజేశారు. శాక్రమెంటో తెలుగు సంఘంసభ్యులను ఉద్దేశించి ప్రసంగించిన విజయవాడ ఎంపీ శ్రీ కేశినేని నాని గారి వీడియో ను వేదిక పై ప్రదర్శించారు. అంతకు మునుపు శ్రీ శ్రీనివాస కల్యాణోత్సవాన్ని వేదిక ప్రాంగణం లో అదే రోజు  ఉదయం11 గం కు టాగ్స్ ఘనంగా   నిర్వహించింది.  శ్రీకృష్ణ  బలరాం మందిర్ నుండి విచ్చేసిన శ్రీ సచ్ఛినందన దాస శ్రీ శ్రీనివాస కళ్యాణోత్సవం పూజ ను నిర్వహించారు. ప్రత్యేకంగా తయారుచేసిన తీర్ధప్రసాదాలను భక్తులకు టాగ్స్ కార్యకర్తలు అందజేశారు. టాగ్స్ సెక్రటరీ  మోహన్ కాట్రగడ్డ వందన సమర్పణ గావించారు.   కాలిఫోర్నియా శాక్రమెంటో లో సంక్రాంతి సంబరాలు విజయవంతం కావడానికిఅహర్నిశలు కృషి చేసిన వారిలో టీఏజిఎస్ కార్యవర్గ సభ్యులు : మనోహర్ మందడి, మోహన్ కాట్రగడ్డ, సందీప్ గుడుపెల్లి, శ్రీదేవి మాగంటి, కీర్తి సురం, సురేంద్రనాథ్ కొప్పారపు, శ్రీరామ్ అకిన, మమతాదాసి, నాగేశ్వరరావు దొండపాటి,నాగేంద్రనాథ్ పగడాల, శ్రీనివాస రావు యనపర్తి, ప్రసాద్ కేతిరెడ్డి,  శ్రీధర్ రెడ్డి, అశ్విన్ తిరునాహరి, మల్లిక్ సజ్జనగాండ్ల, స్వర్ణ కంభంపాటి, వాసు కుడుపూడి, సుధాకర్ వట్టి,రాంబాబు బావిరిశెట్టి, అనిల్ మండవ, వెంకట్ నాగం, డా సంజయ్ యడ్లపల్లి మరియు టాగ్స్ కార్యకర్తలు పాల్గోన్నారు. ఫోటోగ్రఫీ సహకారం అందించిన రాకేష్ గుర్రాల “ఆర్ ఆర్ ఫోటోగ్రఫీ” కి టాగ్స్ కార్యవర్గం ప్రత్యేకకృతజ్ఞతలు తెలియజేసింది. ఈ సందర్భం గా టాగ్స్ కార్యనిర్వాహక సభ్యులు అనాధ భారతీయ బాలబాలికలకు సహాయార్ధం హోప్ ఎబయ్డ్స్ స్వచ్ఛంద సంస్థ కు టాగ్స్ ప్రత్యేకం గా విరాళాలుఅందజేస్తుంది అని, ఈ సంస్థ కు  సహాయార్ధం విరాళం ఇవ్వదలచిన వారు మరింత సమాచారం కోసం [email protected]gmail.com కు ఈమెయిలు లో సంప్రదించాలని టాగ్స్ కార్యనిర్వాహక సభ్యులు కోరారు.సంక్రాంతి సంబరాల ఫోటోలను ఫేస్ బుక్ https://www.facebook.com/SacTelugu/photos_stream లో చూడవచ్చు నని వారు తెలిపారు.  టాగ్స్ చేపట్టబోయే కార్యక్రమాలకు సంబంధించి మరిన్ని వివరాలనుతెలుసుకోవాలనుకునేవారు http://www.sactelugu.org , https://www.facebook.com/SacTelugu ను సందర్శించాలని లేదా [email protected]gmail.com కు ఈమెయిలు లో సంప్రదించాలని టాగ్స్ కార్యనిర్వాహకసభ్యులు కోరారు.

0 655

తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ శాక్రమెంటో (TAGS) ఆధ్వర్యంలో శాక్రమెంటో శివారు నగరం ఫోల్సోం  లో  డిసెంబర్ 11, 2016 న రాంచో కార్దోవ లో  డిసెంబర్ 17 మరియు  18, 2016 న పలు  ఆటల పోటీలు ఉత్సాహంగా జరిగాయి. అమెరికా లో కాలిఫోర్నియా రాష్ట్రం శాక్రమెంటో శివారు నగరాలకు చెందిన తెలుగు కుటుంబాలకు చెందిన పిల్లలు, పెద్దలు పెద్దఎత్తున పలు ఆటల పోటీలలో పాల్గొన్నారు. ఆటలో గెలిచి తీరాలన్న లక్ష్యమే వారిని విజేతలుగా నిలిపింది. తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ శాక్రమెంటో (TAGS) ఆధ్వర్యంలో జరిగిన ఈ క్రీడా పోటీల్లో 200 మందికి పైగా  పిల్లలు, పెద్దలు పాల్గొని  సత్తా చాటారు. ఈ పోటీలను అసోసియేషన్ అధ్యక్షుడు మనోహర్ మందడి   ప్రారంభించారు. మోహన్ కాట్రగడ్డ, సందీప్ గుడుపెల్లి, శ్రీదేవి మాగంటి, కీర్తి సురం, సురేంద్రనాథ్ కొప్పారపు, శ్రీరామ్ అకిన, మమతా దాసి, నాగేశ్వరరావు దొండపాటి,  నాగేంద్రనాథ్ పగడాల, శ్రీనివాస రావు యనపర్తి, వెంకట్ నాగం, అశ్విన్ తిరునాహరి  ల పర్యవేక్షణలో చదరంగం, తెలుగు ప్రశ్నావళి, తెలుగు కధ చెప్పడం, క్యారమ్స్, గాలిపటాల తయారీ, చిత్ర లేఖనం, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, లెక్కల పోటీలు,  మరియు ముగ్గుల పోటీలు నిర్వహించారు. కాలిఫోర్నియా శాక్రమెంటో లో TAGS ఆటల పోటీలు విజయవంతం కావడానికి అహర్నిశలు కృషి చేసిన వారిలో టీఏజిఎస్ కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలు: సత్యవీర్ సురభి, అనుదీప్  గుడిపెల్లి,ధీరజ్ మద్దిని, పరాగ్ వేదపాథక్,శ్రీ రామ్ గౌర, శివ రామిశెట్టి, సందీప్ గొర్లె, కూశాలి సురేష్ కుమార్, రాకేష్ రెడ్డి  గుర్రాల, దివ్య రెడ్డి కుంభం, దర్శన్ దేవాచ, పవన్  దగ్గుబాటి, అనిత వినయ్, గోపి, కొల్లి, పూజ, శిరీష మారేపల్లి తదితరులు ఉన్నారు. చదరంగం పోటీల నిర్వహణకు విశేష సహకారం అందించిన చదరంగం గురు “బ్రహ్మ మొహంతి” కు  TAGS కార్యవర్గ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక “చికాగో పిజ్జా విత్ ఎ ట్విస్ట్” రెస్టారెంట్ వారు అందించిన నోరూరించే ఇండియన్  పిజ్జాలు అందరినీ అలరించాయి. విజేతల వివరాలను అసోసియేషన్ అధ్యక్షుడు మనోహర్ మందడి  ప్రకటించారు. విజేతలకు జనవరి 14, 2017 న జరుగబొనున్న TAGS 13 వ వార్షికోత్సవం మరియు సంక్రాంతి సంబరాల సందర్భంగా బహుమతులు అందజేయడం జరుగుతుందని నిర్వాహకులు ప్రకటించారు.

 

అమెరికా లో కాలిఫోర్నియా రాష్ట్రం లో ఉన్న శాక్రమెంటో తెలుగు సంఘం (TAGS) 13 వ వార్షికోత్సవం మరియు సంక్రాంతి సంబరాల కు ఏర్పాట్లు శరవేగంగా  జరుగుతున్నాయి. స్థానిక కళాకారులు సంక్రాంతి వేడుకల ప్రాంగణం ను తమ ఆట పాటలతో అలరించబోతున్నారు. స్థానిక ఫోల్సోం నగరం లో ఉన్న ఫోల్సోం హై స్కూల్ ధియేటర్ లో శనివారం జనవరి 14 వ తేది 2017 మధ్యాన్నం 12 గంటలకు శాక్రమెంటో తెలుగు సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబారాలు మొదలయ్యి, రాత్రి 10 గంటలకు ముగుస్తాయి. వివిధ సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనకు 250 మందికి పైగా స్థానిక కళాకారులు సంసిద్ధులు అవుతున్నారు. ఈ సందర్భం గా వివిధ  కళా రూపాల ప్రదర్శన  తో ప్రేక్షకులను అలరింప జేయడానికి శాక్రమెంటో తెలుగు సంఘం కార్యవర్గ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మరుగునపడిన కళల వికాసానికి శాక్రమెంటో తెలుగు సంఘం చేస్తున్న సాంస్కృతిక కృషి కి అందరు పెద్ద ఎత్తున హాజరై సహకరించాలని కార్యవర్గ సభ్యులు ఈ సందర్భం గా విజ్ఞప్తి చేసారు. TAGS సంక్రాంతి సంబరాల  కార్యక్రమాలకు సంబంధించి మరిన్ని వివరాలను తెలుసు కోవాలనుకునే వారు http://www.sactelugu.org లేదా https://www.facebook.com/SacTelugu ను సందర్శించాలని లేదా [email protected] కు ఈమెయిలు లో సంప్రదించాలని ఈ సందర్భంగా  TAGS కార్యనిర్వాహక సభ్యులు కోరారు.

 

tags-telugu-association-sports-event-2016-1 tags-telugu-association-sports-event-2016-2 tags-telugu-association-sports-event-2016-3 tags-telugu-association-sports-event-2016-4 tags-telugu-association-sports-event-2016-5 tags-telugu-association-sports-event-2016-6 tags-telugu-association-sports-event-2016-7 tags-telugu-association-sports-event-2016-8 tags-telugu-association-sports-event-2016-9 tags-telugu-association-sports-event-2016-10 tags-telugu-association-sports-event-2016-11 tags-telugu-association-sports-event-2016-12

0 845

కాలిఫోర్నియా రాష్ట్రం లో శాక్రమెంటో శివారు నగరం మేతర్ లో నెలకొని ఉన్న స్వామి నారాయణ్ మందిర్ లో శాక్రమెంటో తెలుగు సంఘం (టాగ్స్) ఆధ్వర్వం లో డా ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రి గారి చే అన్నమయ్య హరికథ కార్యక్రమం ఘనం గా జరిగింది.

ముందుగా స్థానిక తెలుగు బాల బాలికలచే గణపతి ప్రార్ధనా గీతం తో కార్యక్రమం ప్రారంభం అయ్యింది. తరువాత టాగ్స్ అధ్యక్షులు వెంకట్ నాగం మాట్లాడుతూ, తెలుగుహరికథకు అంతులేని ప్రాచుర్యాన్ని, కథకులకు మార్గానిర్దేశాన్ని చేసిన “హరికథా పితామహుడు” ఆదిభట్ల నారాయణదాసు అయితే వారికి ఉన్న ఉద్దండులైన శిష్య, ఉప శిష్యగణం లో డా ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రి గారు ఒకరు అని చెప్పారు. భారత ఉప రాష్ట్రపతి నుండి సంగీత నాటక అకాడెమీ అవార్డు తో పాటు తెలుగు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉగాది విశిష్ట పురస్కారం, కంచి కామకోటి పీఠం నుండి “ఆస్థానం విద్వాన్” పురస్కారం, ఆదిభట్ల నారాయణ దాసు ఆరాధనా సంఘం నుండి “హరికధ చూడామణి” బిరుదు, మరెన్నో పురస్కారాలు అందుకున్న డా ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రి గారు అన్నమయ్య హరికధ గానం కోసం ఇక్కడకు విచ్చేయ్యడం మనం చేసుకున్న అదృష్టం అని వెంకట్ నాగం నొక్కి చెప్పారు.

టాగ్స్ చైర్మన్ రాంబాబు బారివిసెట్టి, శ్రీ సింహాచల శాస్త్రి గారిని మెడలో పూల దండ తో అలంకృతం గావించారు. అనంతరం సింహాచల శాస్త్రి గారి చే అన్నమయ్య హరికథ ప్రారంభం అయ్యింది. అన్నమయ్య పుట్టుక నుండి, శ్రీ వెంకటేశ్వర స్వామి లో ఐక్యం అయ్యేంతవరకు ప్రతి ఘట్టాన్ని చక్కగా వర్ణించారు. హార్మోనియం తో పండిట్ బినయ్ పాథక్, తబలా తో రాహుల్ డియో సహకారం అందించారు. పిదప సింహాచల శాస్త్రి గారు మాట్లాడుతూ, సినిమా, నాటకం అభివృద్ధి కాక పూర్వం తెలుగు గడ్డ మీద ఇతర జానపద కళారూపాలతో పాటు ఎక్కువ ప్రజాదరణను పొందిన కళారూపాల్లో హరికథ చాల ముఖ్యమైంది, అనాటి నుంచి ఈనాటివరకూ శిధిలం కాకుండా నానాటికీ క్రొత్త రూపును సంత రించుకున్న కళారూపం మన తెలుగు హరికథ, కాబట్టి అమూల్యమైన తెలుగు సాహితీ, సంప్రదాయ, సాంస్కృతిక సంపదన అయినటువంటి మన ఈ హరికధ కళా రూపాన్ని కాపాడుకుని రాబోయే తరాలకు అందించటానికి టాగ్స్ చేస్తున్న ఈ కార్యక్రమానికి మీరు తరలి రావడం చాలా సంతోషం అని చెప్పారు.

Annamayya Harikatha event in California Sacramento City (4) Annamayya Harikatha event in California Sacramento City (3) Annamayya Harikatha event in California Sacramento City (2) Annamayya Harikatha event in California Sacramento City (1)

రెండు గంటల పాటు జనరంజకంగా హరి కథను గానం తో పాటు, పిట్ట కథలతో, మధ్య మధ్య హాస్యరసాన్ని పోషిస్తూ, సమాజంలో వున్న లోపాలను ఎత్తి చూపిస్తూ, మన పిల్లలు అలవరచు కోవలసిన గుణాలను చెబుతూ, వేదాంత బోధ చేస్తూ, శాక్రమెంటో లో మొట్ట మొదటి సారిగా అన్నమయ్య హరి కథను గానం చేసిన సింహాచల శాస్త్రి గారికి టాగ్స్ కార్యవర్గం ఘనం గా సన్మానం గావించింది. ఈ కార్యక్రమం కు సహాయ సహకారాలు అందజేసిన 24 మంత్ర ఆర్గానిక్, కర్రీ బౌల్ రెస్టారంట్ రాక్లిన్, చికాగో ఇండియన్ పిజ్జా, శాక్రమెంటో ఆరాధనా కు టాగ్స్ చైర్మన్ రాంబాబు బారివిసెట్టి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం టాగ్స్ భోజన సమన్వయకర్త దుర్గ చింతల ఆధ్వర్వం లో TAGS కార్యకర్తలు ఆహుతులకు భోజనం వడ్డించారు. కాలిఫోర్నియా శాక్రమెంటో లో హరికథ కార్యక్రమం విజయవంతం కావడానికి అహర్నిశలు కృషి చేసిన వారిలో టీఏజిఎస్ కార్యవర్గ సభ్యులు మనోహర్ మందాడి, గిరిధర్ టాటిపిగారి, శ్రీదేవి మాగంటి, రాజా రామ్ ముమ్మడవరపు, వనిత ఆలపాటి, మోహన్ కాట్రగడ్డ, అబ్దుల్ షైక్, దుర్గా చింతల, స్వర్ణ కంభంపాటి, కీర్తి సురం, అశ్విన్ తిరునాహరి, గిరి టాటిపిగారి, సుధాకర్ వట్టి, రాంబాబు బావిరిశెట్టి, మల్లిక్ సజ్జనగాండ్ల, వాసు కుడుపూడి, భాస్కర్ దాచేపల్లి, వెంకట్ నాగం, TAGS కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

0 1182

కాలిఫోర్నియా రాష్ట్రం లో ఉన్న శాక్రమెంటో తెలుగు సంఘం 12 వ వార్షికోత్సవం మరియు సంక్రాంతి సంబరాల సందర్భం గా సిలికానాంధ్ర వారి సహకారం తో రూపొందించిన పూర్తి నిడివి జానపద రూపకం “మన జానపద జాతర” ఆహుతులను విశేషం గా ఆకట్టుకొన్నది. హరిదాసులు, గంగిరెద్దులు, రంగవల్లులు, ఎద్దులబండి, పల్లె సెట్టింగ్, మరియు జానపద కళాకారులు చేసిన సందడితో సంక్రాంతి వేడుకల ప్రాంగణం లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. స్థానిక ఫోల్సోం నగరం లో ఉన్న ఫాల్సం హై స్కూల్ ధియేటర్ లో శనివారం జనవరి 30 వ తేది 2016 మధ్యాన్నం 12 గంటలకు మొదలైన సంక్రాంతి సంబరాలు రాత్రి 11 గం వరకు కొనసాగాయి.

 

శాక్రమెంటో తెలుగు సంఘం సంక్రాంతి సంబరాల లో ప్రదర్శించిన ముఖ్యాంశాలు:

 1. శాక్రమెంటో లో పూర్తి నిడివి జానపద రూపకం “మన జానపద జాతర”.
 2. జానపద రూపకం లో “ప్రత్యక్ష గానం, మరియు డప్పు తో” అలరించిన జానపద కళా ప్రపూర్ణ “డా. లింగా శ్రీనివాస్“
 3. జానపద గీతాలతో, నృత్యాలతో ఆకట్టుకున్న నిరుపమ చేబియం బృందం
 4. జానపద నృత్య రూపకర్త స్నేహ వేదుల రూపొందించిన బోనాలు ,లంబాడి నృత్యాలు
 5. సిద్ధార్థ్ మార్గదర్శకత్వం లో మానస రావు బృందం చే అల్ట్రా వయోలేంట్ సాంస్కృతిక ప్రదర్శన
 6. గ్రామీణ మరియు గిరిజన నృత్య రూపాలైన లంబాడి, కోయ, కోలాటం, చెక్కభజన, హరిదాసులు, గంగిరెద్దులు, రంగవల్లులు తో కలిపిన జానపద నృత్యాలతో, పాటలతో సందడి చేసిన 50 మందికి పైగా స్థానిక కళాకారులు.
 7. డోలక్ తో ఉర్రూతలూగించిన”బాలాజీ”, కీబోర్డ్ వాద్య సంగీతం తో ఆకట్టుకొన్న “సందీప్ మాండలిక”.
 8. వేదిక పై వివిధ ఇతర సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్న300 మందికి పైగా స్థానిక కళాకారులు.
 9. భోజన విరామ సమయం లో 1000 మందికి పైగా ఆహుతులను లలిత సంగీతం, సినీ గీతాలతో ఆకట్టుకున్న చిన్నారులు, పెద్దలు.

 

సంక్రాంతి వేడుకల సందర్భం గా TAGS అధర్వంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు, పూర్తి నిడివి జానపద రూపకం “మన జానపద జాతర”, వేదిక పై ఉన్న 300 మందికి పైగా స్థానిక కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు,స్థానిక రుచి రెస్టారెంట్ వారు వండిన నొరూరుంచే పసందైన తెలుగు వంటకాలు, మరి ఇంకెన్నో విశేషాలతో ఆహుతులను అలరించాయి. కదలి రండి, కలసి రండి, సంక్రాంతి సంబరాన్ని ఉమ్మడిగా జరుపుకొందాము అని TAGS ఇచ్చిన పిలుపుకు స్పందించిన స్థానిక తెలుగు కుటుంబాలు 1000 మందికి పైగా వేదిక కు తరలి వచ్చారు. ఈ సందర్భం గా అవంతీ కల్యాణం, మేఘ నవలా రచయిత్రి, దేవులపల్లి కృష్ణ శాస్త్రి మనవరాలు శ్రీమతి లలిత రామ్ ముఖ్య అతిధి గా విచ్చేసి ఆహుతులకు సంక్రాంతి సందేశాన్ని అందజేశారు. మనదైన తెలుగు సంస్కృతి, కవిత్వం, సాహిత్యం, సంప్రదాయాలను తరువాతి తరం వారికి అందజేయాలని వారు నొక్కి చెప్పారు. టాగ్స్ తరపున చైర్మన్ రాంబాబు బావిరిశెట్టి, అధ్యక్షులు వెంకట్ నాగం, మరియు కార్యవర్గం సభ్యులు శ్రీమతి లలిత రామ్ గారికి వేదిక పై ఘనం గా సన్మానం గావించి జ్ఞాపిక ను అందజేశారు. ప్రియమైన అతిధి గా విచ్చేసిన స్క్రీన్ ప్లే రైటర్, నిర్మాత, సంభాషణ రచయిత, దర్శకుడు, శ్రీ కోన వెంకట్ స్థానిక తెలుగు కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలకు అచ్చెరువొందారు. శాక్రమెంటో తెలుగు సంఘం కార్యవర్గ సభ్యులు శ్రీ కోన వెంకట్ ను వేడుక పై సాదరంగా ఆహ్వానించి కు వేదిక పై ఘనం గా సన్మానం గావించారు. అపజయాలతో క్రుంగిపోకుండా నేను చేసిన నిరంతర ప్రయత్నమే నన్ను ఈస్థాయి కి నిలబెట్టింది అని, ప్రయత్నిస్తే విజయం తధ్యమని శ్రీ కోన వెంకట్ సందేశం ఇచ్చారు. శాక్రమెంటో తెలుగు సంఘం సభ్యులకు శ్రీ కోన వెంకట్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసారు. మరో ప్రియమైన అతిధి గా విచ్చేసిన సిలికానాంధ్ర వైస్ చైర్మన్ శ్రీ దిలీప్ కొండిపర్తి గారిని TAGS అధక్షులు వెంకట్ నాగం సభికులకు పరిచయం చేసారు. ఈ సందర్భం దిలీప్ కొండిపర్తి గారు మాట్లాడుతూ 2004 లో మొట్టమొదటి సారిగా TAGS శాక్రమెంటో లో సంక్రాంతి సంబరాలను జరిపిందని, ఇప్పుడు వరుసగా 12వ సారి సంక్రాంతి సంబరాలను జరుపుకోవడం ఆనందంగా ఉందని, ఈ రెండు వేడుకల్లో కుడా సిలికానాంధ్ర బృందం TAGS వారి సంక్రాంతి సంబరాల సాంస్కృతిక కార్యక్రమాలలో పాలుపంచుకోవడం మరింత ఆనందం గా ఉందని, మనదైన సంస్కృతి, సంప్రదాయాన్ని పిల్లలకు అందించడానికి ఇటువంటి వేడుకలు అవసరం అని నొక్కి చెప్పారు. తెలుగు వారి కూచిపూడి నాట్యానికి పుట్టినిల్లు అయినటువంటి కూచిపూడి గ్రామం దీనావస్థ లో ఉందని, దీనికి మెరుగుపరచడానికి జయహో కూచిపూడి కార్యక్రమానికి, స్థానిక మనబడి కి చేయుతనివ్వాలని శ్రీ దిలీప్ కొండిపర్తి నొక్కి చెప్పారు.

TAGS Sankranti Sambaraalu 2016 (5) TAGS Sankranti Sambaraalu 2016 (15)

ఈ సందర్భం గా TAGS రూపొందించిన 5వ సమాచార పత్రిక ను శ్రీమతి లలిత రామ్, శ్రీ కోన వెంకట్,   స్థానిక తెలుగు ప్రముఖులు శ్రీ శివాజీ వల్లూరుపల్లి గారు ఆవిష్కరించారు. TAGS సౌజన్యం తో జరుగుతున్న సిలికానాంధ్ర మనబడి కి మూడు ఏండ్లగా ఉపాధ్యాయులుగా ఉండి శాక్రమెంటో లో తెలుగు భాషా వ్యాప్తి కి కృషి చేస్తున్న శ్రీ ప్రసాద్ పన్నాల, శ్రీమతి విజయలక్ష్మి పన్నాల గార్లు శాక్రమెంటో లో జరుగుతున్న స్థానిక మనబడి పిల్లలతో చక్కని తెలుగు పద్యాలు, కధలు, పాటలు పాడించారు. ఈసందర్భం గా ప్రతిభావంతులైన పిల్లలను పోత్సహించే గత సంప్రదాయాన్ని పాటిస్తూ, టాగ్స్ కార్యవర్గ సభ్యులు స్థానిక ప్రతిభావంతులైన పిల్లలు సుకీర్త్ మందడి, తేజ స్నర్ర, విజయ్ రావి లకు జ్ఞాపికలు అందజేశారు. బోర్డు సభ్యులు మోహన్ కాట్రగడ్డ వందన సమర్పణ గావించారు. జగిత్యాల నుండి TAGS సంక్రాంతి సంబరాలకు ప్రత్యేకంగా విచ్చేసిన డా. లింగా శ్రీనివాస్ డప్పు తో, జానపద పాటలతో, స్థానిక కళాకారులతో చేసిన నృత్యాలతో వేదిక దద్దరిల్లింది. ఈ సందర్భం గా TAGS తరపున అధ్యక్షులు వెంకట్ నాగం డా. లింగా శ్రీనివాస్ కు జ్ఞాపిక ను ప్రదానం చేసారు. శాక్రమెంటో తెలుగు సంఘం సభ్యులను ఉద్దేశించి ప్రసంగించిన ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గౌ. కె .ఈ. కృష్ణ మూర్తి గారి వీడియో , మరియు తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ గౌ. శ్రీ మామిడి హరికృష్ణ గారి సంక్రాంతి అభినందనల వీడియో ను వేదిక పై ప్రదర్శించారు. కాలిఫోర్నియా శాక్రమెంటో లో సంక్రాంతి సంబరాలు విజయవంతం కావడానికి అహర్నిశలు కృషి చేసిన వారిలో టీఏజిఎస్ కార్యవర్గ సభ్యులు మనోహర్ మందడి, శ్రీదేవి మాగంటి, రాజా రామ్ ముమ్మడవరపు, వనిత ఆలపాటి, మోహన్ కాట్రగడ్డ, దుర్గా చింతల, స్వర్ణ కంభంపాటి,అశ్విన్ తిరునాహరి, గిరి టాటిపిగారి, సుధాకర్ వట్టి, రాంబాబు బావిరిశెట్టి, మల్లిక్ సజ్జనగాండ్ల, గిరిధర్ టాటిపిగారి, కీర్తి సురం, వాసు కుడుపూడి, భాస్కర్ దాచేపల్లి, వెంకట్ నాగం, TAGS కార్యకర్తలు తదితరులు పాల్గోన్నారు. ఈ సందర్భం గా TAGS కార్యనిర్వాహక సభ్యులు వికలాంగుల సహాయార్ధం తిరుపతి లో ఉన్న అభయ క్షేత్రం అనే సంస్థ కు, అనాధ భారతీయ బాలబాలికలకు సహాయార్ధం హోప్ ఎబయ్డ్స్, వేగేశ్న ఫౌండేషన్ హైదరాబాద్, మరియు నా ఇటుక – నా అమరావతి కి TAGS ప్రత్యేకం గా విరాళాలు అందజేస్తుంది అని, ఈ సంస్థలకు సహాయార్ధం విరాళం ఇవ్వదలచిన వారు మరింత సమాచారం కోసం [email protected] కు ఈమెయిలు లో సంప్రదించాలని TAGS కార్యనిర్వాహక సభ్యులు కోరారు. సంక్రాంతి సంబరాల ఫోటోలను ఫేస్ బుక్ https://www.facebook.com/SacTelugu/photos_stream లో చూడవచ్చు. TAGS చేపట్టబోయే కార్యక్రమాలకు సంబంధించి మరిన్ని వివరాలను తెలుసుకోవాలనుకునేవారు http://www.sactelugu.org , https://www.facebook.com/SacTelugu ను సందర్శించాలని లేదా [email protected] కు ఈమెయిలు లో సంప్రదించాలని TAGS కార్యనిర్వాహక సభ్యులు కోరారు.

TAGS Sankranti Sambaraalu 2016 (1) TAGS Sankranti Sambaraalu 2016 (2) TAGS Sankranti Sambaraalu 2016 (3) TAGS Sankranti Sambaraalu 2016 (4) TAGS Sankranti Sambaraalu 2016 (6) TAGS Sankranti Sambaraalu 2016 (7) TAGS Sankranti Sambaraalu 2016 (8) TAGS Sankranti Sambaraalu 2016 (9) TAGS Sankranti Sambaraalu 2016 (10) TAGS Sankranti Sambaraalu 2016 (12) TAGS Sankranti Sambaraalu 2016 (13) TAGS Sankranti Sambaraalu 2016 (14) TAGS Sankranti Sambaraalu 2016 (16) TAGS Sankranti Sambaraalu 2016 (17) TAGS Sankranti Sambaraalu 2016 (18) TAGS Sankranti Sambaraalu 2016 (20) TAGS Sankranti Sambaraalu 2016 (21) TAGS Sankranti Sambaraalu 2016 (22) TAGS Sankranti Sambaraalu 2016 (23) TAGS Sankranti Sambaraalu 2016 (24) TAGS Sankranti Sambaraalu 2016 (25) TAGS Sankranti Sambaraalu 2016 (26) TAGS Sankranti Sambaraalu 2016 (28) TAGS Sankranti Sambaraalu 2016 (29) TAGS Sankranti Sambaraalu 2016 (31) TAGS Sankranti Sambaraalu 2016 (32)

0 948

తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ శాక్రమెంటో (TAGS) ఆధ్వర్యంలో శాక్రమెంటో శివారు నగరం రాంచో కార్దోవ లో నార్త్ కాలిఫోర్నియా బాడ్మింటన్ క్లబ్ క్రీడా ప్రాంగణంలో శనివారం జనవరి 9, 2016 న ఆటల పోటీలు ఉత్సాహంగా జరిగాయి. అమెరికా లో కాలిఫోర్నియా రాష్ట్రం శాక్రమెంటో శివారు నగరాలకు చెందిన తెలుగు కుటుంబాలకు చెందిన పిల్లలు, పెద్దలు పెద్దఎత్తున పలు ఆటల పోటీలలో పాల్గొన్నారు. ఆటలో గెలిచి తీరాలన్న లక్ష్యమే వారిని విజేతలుగా నిలిపింది. తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ శాక్రమెంటో (TAGS) ఆధ్వర్యంలో జరిగిన క్రీడా పోటీల్లో పిల్లలు, పెద్దలు పాల్గొని సత్తా చాటారు. ఈ పోటీలను అసోసియేషన్‌ అధ్యక్షుడు వెంకట్ నాగం ప్రారంభించారు. శ్రీదేవి మాగంటి, వనిత ఆలపాటి, మనోహర్ మందడి, మోహన్ కాట్రగడ్డ, దుర్గ చింతల, మల్లిక్ సజ్జనగాండ్ల, కీర్తి సురం, గిరి టాటిపిగారి, అశ్విన్ తిరునాహరి ల పర్యవేక్షణలో చదరంగం, తెలుగు ప్రశ్నావళి, తెలుగు కధ చెప్పడం, క్యారమ్స్, గాలిపటాల తయారీ, చిత్ర లేఖనం, బ్యాడ్మింటన్, మరియు ముగ్గుల పోటీలు నిర్వహించారు. కాలిఫోర్నియా శాక్రమెంటో లో TAGS ఆటల పోటీలు విజయవంతం కావడానికి అహర్నిశలు కృషి చేసిన వారిలో టీఏజిఎస్ చైర్మన్ వాసు కుడుపూడి, అధ్యక్షులు వెంకట్ నాగం, కార్యవర్గ సభ్యులు మనోహర్ మందడి, గిరిధర్ టాటిపిగారి, శ్రీదేవి మాగంటి, వనిత ఆలపాటి, రాజా రామ్ ముమ్మడవరపు, వనిత ఆలపాటి, మోహన్ కాట్రగడ్డ, అబ్దుల్ షైక్, దుర్గా సాయి చింతల, స్వర్ణ కంభంపాటి,అశ్విన్ తిరునాహరి, గిరి టాటిపిగారి, సుధాకర్ వట్టి, రాంబాబు బావిరిశెట్టి, మల్లిక్ సజ్జనగాండ్ల, భాస్కర్ దాచేపల్లి, కీర్తి సురం తదితరులు, మరియు TAGS కార్యకర్తలు ఉన్నారు. చదరంగం పోటీల నిర్వహణకు విశేష సహకారం అందించిన చదరంగం గురు “బ్రహ్మ మొహంతి” కు, తెలుగు కధ చెప్పడం పోటీ ని ప్రోత్సహించిన వంశీ మాగంటి కు TAGS కార్యవర్గ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక “చికాగో పిజ్జా విత్ ఎ ట్విస్ట్” రెస్టారెంట్ వారు అందించిన నోరూరించే ఇండియన్ పిజ్జాలు అందరినీ అలరించాయి. విజేతల వివరాలను అసోసియేషన్‌ అధ్యక్షుడు వెంకట్ నాగం ప్రకటించారు.

 

విజేతలకు జనవరి 30, 2016 న జరుగబొనున్న TAGS 12 వ వార్షికోత్సవం మరియు సంక్రాంతి సంబరాల సందర్భంగా బహుమతులు అందజేయడం జరుగుతుందని నిర్వాహకులు ప్రకటించారు. అమెరికా లో కాలిఫోర్నియా రాష్ట్రం లో ఉన్న శాక్రమెంటో తెలుగు సంఘం (TAGS) 12 వ వార్షికోత్సవం మరియు సంక్రాంతి సంబరాల కు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. స్థానిక కళాకారులు, మరియు పలు జానపద కళాకారులు సంక్రాంతి వేడుకల ప్రాంగణం ను తమ ఆట పాటలతో అలరించబోతున్నారు. స్థానిక ఫోల్సోం నగరం లో ఉన్న ఫోల్సోం హై స్కూల్ ధియేటర్ లో శనివారం జనవరి 30 వ తేది 2016 మధ్యాన్నం 12 గంటలకు శాక్రమెంటో తెలుగు సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబారాలు మొదలయ్యి, రాత్రి 10 గంటలకు ముగుస్తాయి. వివిధ సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనకు 250 మందికి పైగా స్థానిక కళాకారులు సంసిద్ధులు అవుతున్నారు. ఈ సందర్భం గా జానపద కళా రూపాల జాతర తో ప్రేక్షకులను అలరింప జేయడానికి శాక్రమెంటో తెలుగు సంఘం కార్యవర్గ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మరుగునపడిన కళల వికాసానికి శాక్రమెంటో తెలుగు సంఘం చేస్తున్న సాంస్కృతిక కృషి కి అందరు పెద్ద ఎత్తున హాజరై సహకరించాలని కార్యవర్గ సభ్యులు ఈ సందర్భం గా విజ్ఞప్తి చేసారు. TAGS సంక్రాంతి సంబరాల కార్యక్రమాలకు సంబంధించి మరిన్ని వివరాలను తెలుసు కోవాలనుకునే వారు http://www.sactelugu.org లేదా https://www.facebook.com/SacTelugu ను సందర్శించాలని లేదా [email protected] కు ఈమెయిలు లో సంప్రదించాలని ఈ సందర్భంగా TAGS కార్యనిర్వాహక సభ్యులు కోరారు.

Telugu Association of Greater Sacramento (TAGS) Sports event 2 Telugu Association of Greater Sacramento (TAGS) Sports event 3 Telugu Association of Greater Sacramento (TAGS) Sports event 4 Telugu Association of Greater Sacramento (TAGS) Sports event 5 Telugu Association of Greater Sacramento (TAGS) Sports event 6 Telugu Association of Greater Sacramento (TAGS) Sports event 7 Telugu Association of Greater Sacramento (TAGS) Sports event 8 Telugu Association of Greater Sacramento (TAGS) Sports event

0 1485

Telugu Association of Greater Sacramento (TAGS) is celebrating its 12th Anniversary and Sankranti Celebrations are on January 30th 2016 in Folsom. TAGS is inviting members & friends of our community to perform their talent at this wonderful event. If you are interested in participating in the cultural programs, please send in your entries no later than November 1st, 2015 to [email protected] with the following information:​

1)Performance Type (Classical/Semi-classical/Folk songs/Instrumental/Skit etc.):
2)Performance Duration (4 – 6 minutes):
3)Number of Participants:
4)Age Group (Children/Adult/Mix):
5)Contact Person Name:
6)Phone:
7)Email:​

Selection of cultural programs will be based on the following criteria: ​

1)Performance Type (Classical/Semi-classical/Folk songs/Instrumental/Skit etc.);
2) Performance Duration (4 – 6 minutes);
3)Minimum number of participants: 6;
4)Minimum Age: 5 Years ​

Entries in each category are limited and will be accepted on a first-come-first-serve basis. Individuals who are interested to perform but do not have a group formed can send their name and contact info to us. TAGS Cultural Committee will coordinate with you and do its best to accommodate you into an appropriate program.​

Cultural Committee will review all entries and will notify you by November 9th, 2015. For cultural program entry registration, volunteering and any other questions, please send us an email to [email protected] We look forward to your participation in this mega event.​

Interested in Event Sponsorship or Stalls Information? ​Pl contact Mohan @480-299-9474 or email [email protected]

TAGS 12th Anniversary & Sankranti Sambaraalu Sat January 30th, 2016​ TAGS 12th Anniversary & Sankranti Sambaraalu Sat January 30th, 2016​

SOCIAL

3,873FansLike
8FollowersFollow

SPECIALS

SHORT FILMS