Tags Posts tagged with "Sankranthi"

Sankranthi

0 137

కాలిఫోర్నియా రాష్ట్రం లో ఉన్న శాక్రమెంటో తెలుగు సంఘం (టాగ్స్) 15 వ వార్షికోత్సవం మరియు సంక్రాంతి సంబరాలసందర్భం గా “మనం” సంస్థ సహకారంతో రూపుదిద్దిన “రంగస్థలం” నాటకం ఆహుతులను విశేషం గా ఆకట్టుకొన్నది. రంగవల్లులు,సంక్రాంతి జట్కా బండి, పాలవెల్లి సెట్టింగ్, మరియు 450 కు పైగా ఉన్నకళాకారులు చేసిన సందడితో సంక్రాంతి వేడుకల ప్రాంగణం లోఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. స్థానిక ఫోల్సోం నగరం లోఉన్న ఫాల్సం హై స్కూల్ ధియేటర్ లో శనివారం జనవరి 19 వతేది 2019 మధ్యాన్నం 12 గం కు మొదలైన సంక్రాంతి సంబరాలు రాత్రి 11 గం వరకు కొనసాగాయి.

శాక్రమెంటో తెలుగు సంఘం సంక్రాంతి సంబరాల లోప్రదర్శించిన ముఖ్యాంశాలు:

1.మనం సంస్థ సహకారంతో టాగ్స్ రూపుదిద్దిన “రంగస్థలం” నాటకం

  1. వేదిక పై రాధా సమేత కృష్ణ, బృందావనం లో గోపాలుడు, అన్నమాచార్య గీతా మాధురి, సాంప్రదాయ తెలుగు జానపదాలు మరెన్నొ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతోఆకట్టుకున్న450 మందికి పైగా స్థానిక కళాకారులు
  2. ప్రతిభావంతులైన స్థానిక తెలుగు బాలలకు పురస్కారాలు
  3. స్థానిక డేవిస్ నగరంలో ఉన్న ప్రీతి ఇండియన్ రెస్టారెంట్ వారిచే తెలుగు పండుగ భోజనం

సంక్రాంతి వేడుకల సందర్భం గా టాగ్స్ అధర్వంలో జరిగినసాంస్కృతిక కార్యక్రమాలు,  స్థానిక డేవిస్ నగరం లో ఉన్న స్థానిక ప్రీతి ఇండియన్ రెస్టారెంట్ వారు వండిన నొరూరుంచే గోంగూర, అరిసె, బొబ్బట్టు, గారెలతో కూడిన పసందైన తెలుగు వంటకాలు, మరి ఇంకెన్నోవిశేషాలతో ఆహుతులను అలరించాయి. కదలి రండి, కలసి రండి, సంక్రాంతి సంబరాన్ని ఉమ్మడిగా జరుపుకొందాము అని టాగ్స్ఇచ్చిన పిలుపుకు స్పందించిన స్థానిక తెలుగు కుటుంబాలు 1500 మందికి పైగా వేదిక కు తరలి వచ్చారు. ఈ సందర్భంగా గృహహింస కు బలైన అతివలను ఆదరించే కాలిఫోర్నియా లో ఉన్న స్థానిక “మై సిస్టర్స్” స్వచ్చంద సంస్థ అధికారి “సిత్రా త్యాగరాజయ్య”, 100 కు పైగా తెలుగు పుస్థకాలు రచించిన స్థానిక తెలుగు రచయిత “శ్రీ వంశీ మోహన్ మాగంటి”, సిలికానాంధ్ర  యువత సేవల ఉప అధ్యక్షురాలు శ్రీమతి స్నేహ వేదుల , సిలికానాంధ్ర వాగ్గేయకారుల సేవల విభాగం డైరక్టర్ శ్రీ వంశీ కృష్ణ నాదెళ్ళ, ప్రియమైన అతిధులు గా విచ్చేసి ఆహుతులకు వారి సంక్రాంతి సందేశం మరియూ  శుభాకాంక్షలు అందజేశారు. వారందరూ స్థానిక తెలుగుకళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలకు అచ్చెరువొందారు. టాగ్స్ కార్యవర్గ సభ్యులు వారందరినీ వేదిక పై ఆహ్వానించి ఘనం గా సన్మానం గావించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా “శ్రీ వంశీ మోహన్ మాగంటి” మాట్లాడుతూ   మనదైన తెలుగు కధ, కవిత్వం, సాహిత్యం, సంప్రదాయాలను తరువాతి తరం బాలబాలికలకు  అందజేయాలని నొక్కి చెప్పారు. సిలికానాంధ్ర గ్లోబల్ టీం సభ్యులు శ్రీ వాసు కూడుపూడి మాట్లాడుతూ  కూచిపూడి గ్రామం లో శరవేగంగా నిర్మాణమౌతున్న మల్టి స్పెషాలిటీ ఆసుపత్రి “సంజీవిని” రెండవ దశ నిర్మాణంలో పాలుపంచుకోవాలని ఆయన స్థానిక తెలుగు వారికి విజ్ఞప్తి చేశారు. కూచిపూడి గ్రామం చుట్టుపక్కల ఉన్న 150 గ్రామాలకు ఆరోగ్య సమస్యలు తీర్చే ఉద్దేశ్యంతో “సంజీవిని” ఆసుపత్రి బృహుత్ యజ్ఞానికి శ్రీకారం చుట్టామని ఆయన చెప్పారు. దాదాపు 500 కుటుంబాలకు పైగా ఉద్యోగ అవకాశాలనుకల్పించడమే కాకుండా చిన్న పిల్లలకు, మహిళలకు ఉపయోగపడే రీతిలో “సంజీవిని” ఆసుపత్రి ని తీర్చి దిద్దుతామని, ఇందుకు సహాయం చేయదలచినవారు నేరుగా సిలికానాంధ్ర ను సంప్రదించాలని శ్రీ వాసు కూడుపూడి విజ్ఞప్తి చేశారు.

 

టాగ్స్ చైర్మన్ అనిల్ మండవ, వైస్ చైర్మన్ మల్లిక్ సజ్జనగాండ్ల,  ప్రెసిడెంట్ నాగ్ దొండపాటి, సెక్రటరీ దుర్గా చింతల, కోశాధికారి మోహన్ కాట్రగడ్డ , సమాచార అధికారి రాఘవ చివుకుల  నేతృత్వంలో టాగ్స్ కార్యవర్గం ఈ సందర్భంగా  ప్రియమైన అతిధులందరికీ జ్ఞాపికలు అందజేసి ఘనసన్మానం గావించింది. శ్రీ శ్రీనివాస కళ్యాణోత్సవం సంధానకర్త శ్రీమతి ఉష మందడి ని టాగ్స్ కార్యవర్గం ఘనంగా సత్కరించింది. అనంతరం రంగస్థలం నాటికలో పల్లెటూరి రచ్చబండ సమావేశం సెట్టింగ్, పాత్రధారుల  వేషధారణ, నటన, నృత్యాలతో 50 మందికి పైగా మనం సంస్థ, స్థానిక కళాకారులు చేసిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకొంది.

ఈ సందర్భం గాప్రతిభావంతులైన పిల్లలను పోత్సహించే గత సంప్రదాయాన్నిపాటిస్తూ, టాగ్స్ కార్యవర్గ సభ్యులు ఎంపిక చేసిన స్థానికప్రతిభావంతులైన హైస్కూల్ పిల్లలు “విశృత్ నాగం, తనూష తొల్లా, ఆష్మిత రెడ్డి, హర్షిత మదుగంటి, శ్రేయ నాగులపల్లి” లకు జ్ఞాపికలు అందజేశారు. టాగ్స్ సౌజన్యం తో జరుగుతున్న శాక్రమెంటో శివారు నగరాలైన స్థానిక ఫాల్సం, రోసివిల్లి, నాటోమాస్, ఎల్ డోరాడొ  సెంటర్లలో చదువుతున్న సిలికానాంధ్ర మనబడి విద్యార్థులు చక్కని తెలుగు పద్యాలు, కధలు, పాటలు వేదికపై ప్రదర్శించారు. స్థానిక వీఎంబ్రేస్స్వచ్చంద సంస్థ వద్ద శిక్షణ పొందుతున్న ఆటిజం ఆరిన పడ్డ దివ్యాంగులైన చిన్నారులచే ప్రదర్శించబడ్డ నృత్యప్రదర్శన కు  ఆహుతులు అందరూ చప్పట్లతో ప్రోత్సహించారు. అలేఖ్య పెన్మత్స, శృతి సేథి ఈ చిన్నారులకు నృత్య శిక్షణ ఇచ్చారు.  టాగ్స్ సమాచార అధికారి రాఘవ చివుకుల సమర్పణ గావించారు. అంతకు మునుపు శనివారంజనవరి 12న శ్రీ శ్రీనివాస కల్యాణోత్సవాన్ని అదే వేదిక ప్రాంగణంలో ఉదయం 9 గం కు టాగ్స్ ఘనంగా నిర్వహించింది. .  ఈ కార్యక్రమం కోసం స్టాక్ టన్ శివ విష్ణు దేవాలయం నుండి విచ్చేసిన పూజారులు  శ్రీ శ్రీనివాస కళ్యాణోత్సవం పూజ ను నిర్వహించారు. పూజానంతరం  ప్రత్యేకంగా తయారుచేసిన తీర్ధ ప్రసాదాలను భక్తులకు టాగ్స్ కార్యకర్తలు అందజేశారు. అనంతరం జరిగిన చిన్నారులకు  భోగిపళ్లు కార్యక్రమం లో పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. రేగిపళ్ళు, పూలు, అక్షంతలతో చిన్నారులను పూజకు విచ్చేసిన  అందరూ ఆశీర్వదించారు.  

కాలిఫోర్నియా శాక్రమెంటోలో సంక్రాంతి సంబరాలు, శ్రీ శ్రీనివాస కల్యాణోత్సవ విజయవంతం కు  అహర్నిశలు కృషి చేసిన వారిలో టీఏజిఎస్ కార్యవర్గ సభ్యులు, మరియు టాగ్స్ కార్యకర్తలు ఉన్నారు

ఈ సందర్భం గా టాగ్స్ కార్యనిర్వాహక సభ్యులు అనాధ భారతీయ బాలబాలికలకు సహాయార్ధం హోప్ ఎబయ్డ్స్, ఆరతి స్వచ్ఛంద సంస్థ, హైదరాబాద్ లో ఉన్న వేగేశ్న ఫౌండేషన్, రెండు తెలుగు రాష్ట్రాల గ్రామాలలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్న సువిధా ఇంటర్నేష్నల్ ఫౌండేషన్, మరియు “వీఎంబ్రేస్” స్వచ్ఛంద సంస్థ కు టాగ్స్ ప్రత్యేకం గా విరాళాలుఅందజేస్తుంది అని, ఈ సంస్థలకు సహాయార్ధం విరాళం ఇవ్వదలచిన వారు మరింత సమాచారం కోసం [email protected] కు ఈమెయిలు లో సంప్రదించాలని టాగ్స్ కార్యనిర్వాహక సభ్యులు కోరారు.

0 1334

శనివారం, జనవరి 17, 2015

డాల్లస్/ఫోర్ట్ వర్త్

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పట్టుకొమ్మలైన మన పండుగలలో విశేషమైనది సంక్రాంతి. ఈ సందర్భంగా ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఇర్వింగ్ నిమిట్జ్ హైస్కూల్ లో ఏర్పాటు చేసిన “సంక్రాంతి సంబరాలు” అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో, చూడ ముచ్చటైన సాంస్కృతిక కార్యక్రమాలతో ఎంతో ఘనంగా నిర్వహించ బడ్డాయి. సంస్థ 2015 అధ్యక్షులు డా.ఊరిమిండి నరసింహారెడ్డి, మరియు కార్యక్రమ సమన్వయకర్త వెంకట్ దండ ఆధ్వర్యంలో, సాంస్కృతిక సమన్వయకర్త శారద సింగిరెడ్డి ఈ కార్యక్రమాలను నిర్వహించారు. సంక్రాంతి పండుగ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్టు టాంటెక్స్ మహిళా కార్యవర్గ సభ్యులు సభా ప్రాంగణంలో బొమ్మల కొలువును అలంకరించారు. సుమారు 800 మంది పైగా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. పోషక దాతలు మరియు వివిధ వ్యాపార సంస్థల ప్రదర్శనలు ఆహ్వానితులకి స్వాగతం పలికాయి. స్థానిక విందు ఇండియన్ రెస్టారెంట్ వారు అరిసెలతో నోరూరించే పండుగ బంతి భోజనం వడ్డించారు.

 

సుమారు 185 మంది బాలబాలికలు ఉత్సాహంగా పాల్గొన్న ఈ కార్యక్రమం, అచ్చమైన తెలుగు వాతావరణాన్ని అణువణువునా ప్రతిబింబించే పాటలకు, తెలుగింటి ఆచారాలను, వాటిలోని విశిష్టతను ఎంతో ఆదరంగా చూపించే సంగీత, నృత్య అంశాలకు పెద్ద పీట వేసిందనటంలో ఏ మాత్రం సందేహం లేదు. వనితావేదిక సమన్వయకర్త శ్రీలక్ష్మి మండిగ నేతృత్వంలో చిన్నారుల కోసం నిర్వహించిన ముగ్గుల పోటీకి విశేష ఆదరణ లభించింది. ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతి గ్రహీతలను గుర్తించారు.

Sankraanti Sambaralu 2015_TANTEX New Governing Board Team Sankraanti Sambaralu 2015_TANTEX Team with Sponsors TANTEX Sankraanti Sambaralu 2015_Nruthyakshari_Tribute to ANR

పల్లవి తోటకూర ఆధ్వర్యంలో చిన్నారులు ఆలపించిన అమెరికా జాతీయ గీతంతో కార్యక్రమం మొదలైనది.

ఆ తరువాత వెంకట్ ములుకుట్ల అధ్వర్యంలో వినాయకుడిని ప్రార్థిస్తూ వివిధ సంగీత వాయిద్యాలతో ఫ్యూజన్ పాట, జ్యోతి కందిమళ్ళ నిర్వహణలో ‘మహా గణపతిం మరియు స్వాగతం” శాస్త్రీయ నృత్యం, సంజనా పడిగెల నిర్వహణలో చిన్నారుల టాలీవుడ్ మెడ్లీ నృత్యాలు, ఝాన్సి చామకూర నిర్వహణలో LMA పిల్లల సినిమా పాటల మెడ్లీ, ప్రవీణ వజ్జ నిర్వహణలో “కొలనిదోపరికి గొబ్బిళ్ళో” సంక్రాంతి పండుగను వర్ణిస్తూ చిన్నారుల శాస్త్రీయ నృత్యం, యోగిత మండువ దర్శకత్వంలో ప్రదర్శించిన “సంక్రాంతి వచ్చిందే తుమ్మెద” చిత్ర సంగీత మిశ్రమ నాట్య విన్యాసాలు, గురు శ్రీలతా సూరి నిర్వహణలో నాట్యాంజలి బృందం వారి “చరిష్ను’ శాస్త్రీయ ఫ్యూజన్ నృత్యం ప్రేక్షకులని ఎంతో ఆకొట్టుకున్నాయి. ఆ తరువాత లక్ష్మినాగ్ సూరిభొట్ల దర్శకత్వంలో ప్రదర్శించిన “అత్తారింటికి దారి “ హాస్య నాటిక అందరిని ఆహ్లాదంలో ముంచెత్తి, నవ్వులు పూయించింది. హెతల్ జోష్ నాగరాజ్ నిర్వహణలో ‘గ్రేస్ క్రియేషన్స్ – గర్ల్స్ లైఫ్’ నృత్యం అందరిని ఆనంద పరిచినది.

 

డాల్లస్ లో వున్న తెలుగు వారందరినీ సంక్రాంతి సంబరాల్లో ముంచడానికి టాంటెక్స్ ఆహ్వానం మేరకు విచ్చేసిన    ప్రముఖ హాస్య నటుడు శివారెడ్డి ప్రేక్షకులను తన మిమిక్రీ , కృత భాషణం (Ventriloquism for Kids) , సరదా మాటలతో, హాస్యోక్తులతో నవ్వులు పువ్వులు పూయించారు. ఈ సందర్భంగా శివారెడ్డి గారికి ఙ్ఞాపిక, దుశ్శాలువ, సన్మాన పత్ర పుష్పగుచ్ఛాలతో సన్మానం చేయడం జరిగింది.

 

2014 అధ్యక్షులు విజయ మోహన్ కాకర్ల ప్రసంగిస్తూ తమకు సహాయ సహకారాలు అందించిన కార్య వర్గ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తూ , తమ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల వివరాలు సభ్యులతో పంచుకున్నారు. ఆ తరువాత సంస్థ నూతన అధ్యక్షులు డా.ఊరిమిండి నరసింహారెడ్డి ను సభకు పరిచయం చేసారు. అధ్యక్షులు డా.ఊరిమిండి నరసింహారెడ్డి 2015 నూతన కార్యవర్గ సభ్యులను అందరిని సభకు పరిచయం చేస్తూ, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం ఉత్తరాధ్యక్షుడుగా, ఉప్పలపాటి కృష్ణారెడ్డి ఉపాధ్యక్షుడుగా, ఆదిభట్ల మహేష్ ఆదిత్య కార్యదర్శిగా, వీర్నపు చినసత్యం సంయుక్త కార్యదర్శిగా, శీలం కృష్ణవేణి కోశాధికారిగా, వేణుమాధవ్ పావులూరి సంయుక్త కోశాధికారిగా పదవీ బాధ్యతలు స్వీకరించారని తెలిపారు. ఆ తరువాత పాలక మండలి నూతన అధిపతిగా అజయ్ రెడ్డి, ఉపాధిపతిగా సుగన్ చాగర్లమూడి మరియు సభ్యులుగా శ్రీనివాస్ రెడ్డి గుర్రం, రమణారెడ్డి పుట్లూరు, రామకృష్ణా రెడ్డి రొడ్డ, శ్యామ రుమాళ్ళ, శ్రీనివాస్ బావిరెడ్డి లను సభకు పరిచయం చేసారు.

 

Sankraanti Sambaralu 2015_Audience TANTEX Sankraanti Sambaralu 2015_Attarintiki Daari_Haasya Naatika TANTEX Sankraanti Sambaralu 2015_Charishnu Saastreeya Nruthyam 1 TANTEX Sankraanti Sambaralu 2015_Chief Guest_Comedian Siva Reddy TANTEX Sankraanti Sambaralu 2015_Chinnarula Nruthyam 1 TANTEX Sankraanti Sambaralu 2015_Decorations 1 TANTEX Sankraanti Sambaralu 2015_Decorations 2 TANTEX Sankraanti Sambaralu 2015_LMA Chinnarula Gaanam

సభని ఉద్దేశిస్తూ నూతన అధ్యక్షులు డా.ఊరిమిండి నరసింహారెడ్డి 2015 సంవత్సరంలో కార్యక్రమాల నాణ్యత పెంచడం, స్థానిక కళాకారులకు అవసరమైన వేదికలు కల్పించడం, యువత వ్యక్తిత్వ వికాస పురోభివృద్ధికి దోహదపడే కార్యక్రమాలను ప్రవేశపెట్టడం, సంస్థ పరిధిలో ఉన్న తెలుగు వారి మధ్య సఖ్యత పెంచడం లాంటి వినూత్నకార్యక్రమాలతో డల్లాస్ తెలుగు ప్రజలకి చేరువ అవతామని మరియు సాంస్కృతిక అవసరాలతో పాటు మారుతున్న మన సభ్యుల అవసరాలకు అనుగుణంగా సంస్థ కార్యకలాపాలను రూపుదిద్దుకోవడం ఎంతైనా అవసరమని తెలిపారు.

 

డా.ఊరిమిండి నరసింహారెడ్డి, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం మరియు పాలకమండలి ఉపాదిపతి సుగన్ చాగార్ల మూడి సంయుక్తంగా కాకర్ల దంపతులను ఙ్ఞాపిక, దుశ్శాలువ, సన్మాన పత్ర పుష్పగుచ్ఛాలతో సత్కరించారు. ఆ తరువాత డా.ఊరిమిండి నరసింహారెడ్డి మరియు విజయమోహన్ కాకర్ల సంయుక్తంగా 2014 పాలకమండలిఅధిపతి మూర్తి ములుకుట్ల దంపతులను ఙ్ఞాపిక, దుశ్శాలువ, సన్మాన పత్ర పుష్పగుచ్ఛాలతో సత్కరించారు.

 

టాంటెక్స్ సంస్థకు గత కొన్ని సంవత్సరాలుగా సేవలందించిన కార్యవర్గ సభ్యులైన రఘు చిట్టిమల్ల, బాల్కి చామకూర, సుభాషిణి పెంటకోటలను, మరియు పాలక మండలి సభ్యులుగా పదవీవిరమణ చేసిన డా. సి. ఆర్. రావు, 2014 పోషక దాతలను డా.ఊరిమిండి నరసింహారెడ్డి, విజయ మోహన్ కాకర్ల మరియూ మిగతా కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక జ్ఞాపికలతో సన్మానించారు.

 

ఆ తరువాత సాంస్కృతిక కార్యక్రమాలు పునఃఫ్రారంభిస్తూ, రేఖా రెడ్డి నిర్వహణలో చలనచిత్ర నృత్యాలు , పఠనేని సురేష్ సమన్వయంలొ స్థానిక గాయకులు చక్కటి చలన చిత్రంలోని పాటల మెడ్లీ, శ్రీలత ముషం నిర్వహణలో ‘బావ మరదళ్ల సంక్రాంతి సరదా సందడి “ చిన్నారుల నృత్యo , రూప బంద నేతృత్వంలో ‘బ్రోవ భారమా’ పాశ్చాత్య మరియు శాస్త్రీయ ఫ్యూజన్ నృత్యం, సరిత కొండ నిర్వహించిన చలన చిత్ర నృత్యాల మెడ్లీ అందరిని అలరించినది. తెలుగు చలనచిత్ర జగత్తు 2014 సంవత్సరంలో కోల్పోయిన ఒక మహా నటుడు ANR గారికి స్మృత్యాంజలి ఘటిస్తూ, శాంతి నూతి మరియు మల్లిక్ దివాకర్ల నేతృత్వంలో సమర్పించిన ‘నృత్యాక్షరి’ ప్రదర్శన ఆహ్వానితులను ఎంతో ఆనందంలో ముంచివేసి నేటి కార్యక్రమాలలో   ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

 

2014 సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయకర్త సింగిరెడ్డి శారద తనకు సంవత్సరం పొడుగునా సహకరించిన కార్యకర్తల జట్టుకు కృతజ్ఞతాపూర్వక అభివందనం తెలియజేస్తూ 2015వ సంవత్సరంలో సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టనున్న వనం జ్యోతి గారిని సభకు పరిచయం చేసారు.

 

“సంక్రాంతి సంబరాలు” కార్యక్రమ సమన్వయకర్త దండ వెంకట్, ఎంతో ఓపికగా నాలుగు గంటల వినోదాన్ని ఆస్వాదించిన ప్రేక్షకులకు, అతిథులకు, రుచికరమైన విందు భోజనం వడ్డించిన విందు రెస్టారెంట్ యాజమాన్యంకు, మరియు నేటి కార్యక్రమ పోషక దాతలకు  కృతఙ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా అద్భుతంగా పనిచేసిన పఠనేని సురేష్, ఇల్లెందుల సమీర మరియు జలసూత్రం చంద్రశేఖర్ లకు అభినందనలు తెలిపారు.

 

 

కార్యక్రమ సమన్వయకర్త   దండ వెంకట్, ఈ కార్యక్రమ ప్రత్యేక పోషక దాతలైన ప్రీమియర్ స్పాన్సర్ బిజినెస్ ఇంటేల్లి సొల్యూషన్స్, ప్రెసెంటిoగ్ స్పాన్సర్ మెడికల్ అండ్ వెల్ నెస్ సెంటర్-మర్ఫి, ఈవెంట్ స్పాన్సర్ తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం (టి.డి.ఎఫ్.), టాంటెక్స్ సంస్థ ప్లాటినం పోషక దాతలైన బావర్చి బిర్యానీ పాయింట్, మై టాక్స్ ఫైలెర్, బిజినెస్ ఇంటేల్లి సోలుషన్స్, ఆకుల అసోసియేట్స్, బేలర్ స్కాట్ అండ్ వైట్ హార్ట్ హాస్పిటల్ మరియు రుచి పాలస్ ఇండియన్ రెస్టారంట్, గోల్డ్ పోషక దాతలైన పారడైస్ బిర్యానీ పాయింట్, పసంద్ రెస్టారెంట్, పాన్ పెప్సికో, హొరైజన్ ట్రావెల్స్, విష్ పాలెపు సి.పి.ఏ, ఆంబియన్సు రియాల్టీ (కిశోర్ చుక్కాల), జి అండ్ సి గ్లోబల్ కన్సార్టియం, టెక్సాస్ హెల్త్ ఫిజిషయన్స్ గ్రూప్, అనిల్ గారి రియాల్టర్స్ , విక్రం రెడ్డి జంగం అండ్ ఫ్యామిలీ , సిల్వర్ పోషక దాతలైన శ్రీని చిదురాల రియాల్టర్ , వెండాన్గో లేఔట్స్, సిం-పర్వతనేని-బ్రౌన్ లా ఆఫీసెస్, ఒమేగా ట్రావెల్ అండ్ టూర్స్, పెన్ సాఫ్ట్ టెక్నాలజీస్, రెలై ట్రస్ట్ మార్ట్ గేజ్ లకు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియ జేసారు. “గాన సుధ – మన టాంటెక్స్ రేడియో” 1220 AM లో ప్రసారం చేయడానికి సంయుక్త సహకారం అందిస్తున్న ప్రత్యేక ప్రసారమాధ్యమాలైన దేసిప్లాజా, రేడియో ఖుషిలకు మరియు ప్రసారమాధ్యమాలైన టివి9, 6టివి, తెలుగు వన్ రేడియో (టోరి), ఏక్ నజర్, టివి5, డిపిటివి లకు కృతఙ్ఞతలు తెలియచేసారు.

 

ఎలాంటి లాభాపేక్షా లేకుండా తెరవెనుక నుండి సేవలందించిన కార్యకర్తలందరికీ తమ హృదయపూర్వక కృతఙ్ఞతాభివందనాలు తెలియజేసిన పిదప భారతీయ జాతీయ గీతం ఆలాపనతో, అత్యంత శోభాయమానంగా నిర్వహించిన సంక్రాంతి సంబరాలకు తెరపడింది.

0 1626

కాలిఫోర్నియా రాష్ట్రం లో ఉన్న శాక్రమెంటో తెలుగు సంఘం 11 వ వార్షికోత్సవం మరియు సంక్రాంతి సంబరాల సందర్భం గా సిలికానాంధ్ర  వారి సహకారం తో రూపొందించిన పూర్తి నిడివి  జానపద రూపకం “మన పల్లె, మన సంక్రాంతి” ఆహుతులను విశేషం గా  ఆకట్టుకొన్నది. హరిదాసులు, గంగిరెద్దులు, రంగవల్లులు, జానపద కళాకారులు చేసిన సందడితో సంక్రాంతి వేడుకల ప్రాంగణం లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. స్థానిక ఫోల్సోం నగరం లో ఉన్న  హారిస్ ధియేటర్ లో శనివారం జనవరి 17 వ తేది 2015 మధ్యాన్నం 1:30 గంటలకు మొదలైన సంక్రాంతి సంబరాలు రాత్రి 11 గం వరకు కొనసాగాయి.

 

శాక్రమెంటో తెలుగు సంఘం సంక్రాంతి సంబరాల లో ప్రదర్శించిన ముఖ్యాంశాలు:

  1. శాక్రమెంటో లో మొట్ట మొదటిసారిగా పూర్తి నిడివి జానపద రూపకం “మన పల్లె ….. మన సంక్రాంతి…..“.
  2. జానపద రూపకం లో “ప్రత్యక్ష గానం, మరియు డప్పు తో” అలరించిన డా.లింగా శ్రీనివాస్.
  3. జానపద గీతాలతో ఆకట్టుకొన్న  నిరుపమ చేబియం, వంశీ నాదెళ్ళ, నారాయణన్ రాజు.
  4. జానపద నృత్య రూపకర్త స్నేహ వేదుల రూపొందించిన ఆట పాటలతో సందడి చేసిన 50 మందికి పైగా స్థానిక నృత్యకారులు.
  5. డోలక్ తో ఉర్రూతలూగించిన “బాలాజీ మహదేవన్”.
  6. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్న 250 మందికి పైగా స్థానిక కళాకారులు

 

 TAGS Sankranti 2015 _7 TAGS Sankranti 2015 _8 TAGS Sankranti 2015 _9
TAGS Sankranti 2015 _1 TAGS Sankranti 2015 _2 TAGS Sankranti 2015 _3 TAGS Sankranti 2015 _4 TAGS Sankranti 2015 _5 TAGS Sankranti 2015 _6

సంక్రాంతి వేడుకల సందర్భం గా TAGS  అధర్వంలో జరిగిన సాంస్కృతిక  కార్యక్రమాలు, పూర్తి  నిడివి జానపద రూపకం, వేదిక పై ఉన్న 250 మందికి పైగా స్థానిక కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు,స్థానిక పీకాక్ రెస్టారెంట్ వారు రూపొందించిన నొరూరుంచే పసందైన తెలుగు వంటకాలు, మరి ఇంకెన్నో విశేషాలతో  ఆహుతులను అలరించాయి. కదలి రండి, కలసి రండి, సంక్రాంతి సంబరాన్ని ఉమ్మడిగా జరుపుకొందాము అని TAGS  ఇచ్చిన పిలుపుకు స్పందించిన స్థానిక తెలుగు కుటుంబాలు 800 మందికి పైగా వేదిక కు తరలి వచ్చారు. ఈ సందర్భం గా ముఖ్య అతిధి, స్థానిక తెలుగు కుటుంబానికి చెందిన నరేంద్ర ప్రత్తిపాటి ని TAGS  అధ్యక్షుడు వెంకట్ నాగం సభకు పరిచయం చేసారు. నరేంద్ర ప్రత్తిపాటి గారు సట్టర్ హెల్త్, మరియు డ్రిక్సెల్ యూనివర్సిటీ వంటి ప్రతిష్టాన సంస్థలకు బోర్డు మెంబెర్ గా ఉండడం తెలుగు వారికి గర్వకారణం అని పేర్కొన్నారు. ఈ సందర్భం గా నరేంద్ర ప్రత్తిపాటి  గారు ఆహుతులకు సంక్రాంతి సందేశాన్ని అందించి, చెస్ కప్ గెలుచుకున్న స్థానిక తెలుగు పిల్లలకు ట్రోఫీ లను అందజేశారు. ప్రియమైన అతిధి గా విచ్చేసిన స్థానిక ఫోల్సోం నగర మేయర్ “ఆండీ మొరిన్” స్థానిక తెలుగు కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలకు అచ్చెరువొందారు. ఫోల్సోం సిటీ హాల్ సమావేశం లో ఈ  సంక్రాంతి వేడుకను ప్రత్యేకంగా ప్రస్తావిస్తానని ఈ సందర్భం గా చెప్పారు. మరో ప్రియమైన అతిధి గా విచ్చేసిన సిలికానాంధ్ర  చైర్మన్ ఆనంద్ కూచిభొట్ల ను TAGS  చైర్మన్ వాసు కుడుపూడి సభికులకు పరిచయం చేసారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ సిలికానాంధ్ర  చైర్మన్ ఆనంద్ కూచిభొట్ల గారు  2004 లో మొట్టమొదటి సారిగా TAGS శాక్రమెంటో లో సంక్రాంతి సంబరాలను జరిపిందని, ఇప్పుడు వరుసగా 11వ సారి సంక్రాంతి సంబరాలను జరుపుకోవడం ఆనందంగా ఉందని, మన సంస్కృతి, సంప్రదాయాన్ని పిల్లలకు అందించడానికి ఇటువంటి వేడుకలు అవసరం అని నొక్కి చెప్పారు.

 

ఈ సందర్భం గా TAGS రూపొందించిన సమాచార పత్రిక ను స్థానిక తెలుగు ప్రముఖులు శ్రీ శివాజీ వల్లూరుపల్లి గారు ఆవిష్కరించారు. TAGS సౌజన్యం తో జరుగుతున్న సిలికానాంధ్ర మనబడి కి రెండు ఏండ్లగా  ఉపాధ్యాయులుగా ఉండి శాక్రమెంటో లో  తెలుగు భాషా వ్యాప్తి కి కృషి చేస్తున్న శ్రీ ప్రసాద్ పన్నాల, శ్రీమతి విజయలక్ష్మి పన్నాల గార్లను TAGS కార్యవర్గ సభ్యులు ఘనం గా  సన్మానించారు. ఈసందర్భం గా ప్రతిభావంతులైన పిల్లలను పోత్సహించే గత సంప్రదాయాన్ని పాటిస్తూ, టాగ్స్ కార్యవర్గ సభ్యులు స్థానిక ప్రతిభావంతులైన పిల్లలు:  వినీత్ సోమంచి, ఆరతి బొబ్బాల, శివాని బొబ్బాల, అర్నావ్ మామిడి, మరియు  వంశీ గంగారం లకు వేదికపై జ్ఞాపికలు అందజేశారు.

 

మనోహర్ మందాడి వందన సమర్పణ గావించారు. జగిత్యాల నుండి TAGS సంక్రాంతి సంబరాలకు ప్రత్యేకంగా విచ్చేసిన డా. లింగా శ్రీనివాస్ డప్పు తో, జానపద పాటలతో, స్థానిక కళాకారులతో చేసిన నృత్యాలతో వేదిక దద్దరిల్లింది. ఈ సందర్భం గా TAGS తరపున అధ్యక్షులు వెంకట్ నాగం డా. లింగా శ్రీనివాస్ కు “జానపద కళా ప్రపూర్ణ” బిరుదును ప్రదానం చేసారు. డా. లింగా శ్రీనివాస్ ప్రదర్శించిన కోడి బాయె లచ్చమ పాటతో కార్యక్రమం విజయవంతం గా ముగిసింది. ఇంకా కాసేపు ఉంటే బాగుండెను అనే భావనతో ఆహుతులు వెనుదిరిగారు. కాలిఫోర్నియా శాక్రమెంటో లో “మాతృ దేవో భవ, పితృ దేవో భవ” విజయవంతం కావడానికి అహర్నిశలు కృషి చేసిన వారిలో టీఏజిఎస్ కార్యవర్గ సభ్యులు మనోహర్  మందాడి, గిరిధర్ టాటిపిగారి, శ్రీదేవి మాగంటి, రాజా రామ్ ముమ్మడవరపు, వనిత ఆలపాటి, మోహన్ కాట్రగడ్డ, అబ్దుల్ షైక్, దుర్గా చింతల, స్వర్ణ కంభంపాటి,అశ్విన్ తిరునాహరి, గిరి టాటిపిగారి, సుధాకర్ వట్టి, రాంబాబు బావిరిశెట్టి, మల్లిక్ సజ్జనగాండ్ల, వాసు కుడుపూడి, భాస్కర్ దాచేపల్లి, వెంకట్ నాగం, TAGS కార్యకర్తలు తదితరులు పాల్గోన్నారు. ఈ సందర్భం గా TAGS కార్యనిర్వాహక సభ్యులు విశాఖ లో హుదుద్ తుపాను బారిన పడిన CBM పాఠశాల విద్యార్ధుల సహాయార్ధం, అలాగే వికలాంగుల సహాయార్ధం  తిరుపతి లో ఉన్న అభయ క్షేత్రం అనే సంస్థ కు (http://www.abhayakshethram.org/), అలాగే అనాధ భారతీయ బాలబాలికలకు సహాయార్ధం హోప్ ఎబయ్డ్స్ http://www.hopeabides.org/ కు  TAGS ప్రత్యేకం గా విరాళాలు అందజేస్తుంది  అని, ఈ సంస్థలకు  సహాయార్ధం విరాళం ఇవ్వదలచిన వారు మరింత సమాచారం కు [email protected] కు ఈమెయిలు లో సంప్రదించాలని TAGS కార్యనిర్వాహక సభ్యులు కోరారు. TAGS చేపట్టబోయే కార్యక్రమాలకు సంబంధించి మరిన్ని వివరాలను తెలుసుకోవాలనుకునేవారు http://www.sactelugu.org లేదా https://www.facebook.com/SacTelugu ను సందర్శించాలని లేదా [email protected] కు ఈమెయిలు లో సంప్రదించాలని TAGS కార్యనిర్వాహక సభ్యులు కోరారు.

 

0 1903

LATA proudly presents and invites each and everyone of you to take part in Mega Event “Sankranthi Mela” on Jan 17th, 2015 at Jordan High School in Long Beach,CA!

Did you attend last year ? YES, Perfect! We are pretty sure that we will be there this year too. You can expect more as we are preparing our best to improve with last year recommendations.

Not attended last year event? Then here it’s
It is a one-of-a-kind an event that will blow your mind and bring back all your childhood memories about celebrating Sankranthi back home!
If you speak or understand Telugu, this is an absolutely must-attend event in LA. Do not miss this amazing chance to experience a homely atmosphere.

Bring your entire family and enjoy a day immersed within our traditional Sankranthi celebrations!!!

Highlights
● Carnival Games (Noon to 5:00 pm) – About 8 games during Mela for kids such as Cola Ring Toss, Ducks in a Row, Dart Balloon Pop and many others.
● Kids and Youth Traditional dressing fashion parade
● Henna design on your hands and face painting – FREE
● Many of your favorite local vendor stalls and authentic homemade food during Mela.
● Amazing auditorium with new sound system – State of the art theater with 1800 seating capacity.
● Non-stop 2hrs Entertainment – About 150 talented local Telugu community members will mesmerize you with Folk dances, Jada Kolatam and Movie songs and lot more surprises you will never expect!
● Location – Auditorium is centrally located to LA & OC cities.
● ***FREE*** Delicious Authentic Telugu – Dinner Buffet served by DOSA PLACE.
● MEMBERS GET IN ABSOLUTELY ***FREE***!

For tickets visit www.latausa.org

LATA Mega Sankranthi Mela 2015 in Los Angeles

To celebrate the start of new year, let’s celebrate again together with our own festival Sankranthi. TANE extends invites to all the members and their friends to join us in celebrating Sankranthi in Eindhoven. Below the invitation with all the details. Please be noted that the event is going be served with home made Authentic Andhra dinner. Couple of volunteers are going to cook with just the raw material cost and the reminder of the collected entry fee goes to charity.
Please feel free to let you friends know about this event. Last date for registrations is 13th Jan 2015.
Invitation for Sankranthi 2015 - Eindhoven, The Netherlands

0 1339

Telugu Association of Greater Chicago (TAGC) invites you all for 2015 Sankranthi/Republic Day Celebrations on 17th January at HTGC Rama Temple, 10915 Lemont Rd, Lemont, IL 60439.

For program details please contact the cultural team at [email protected] for membership drive please contact [email protected]

Come and celebrate your evening with many great performances and delicious food!

TAGC 2015 Sankranthi Republic Day Celebrations - Membership Drive

SOCIAL

3,873FansLike
8FollowersFollow

SPECIALS

SHORT FILMS