Tags Posts tagged with "New Jersey"

New Jersey

0 630
జూన్ ,13 , 2017 ,న్యూ జెర్సీ : ఈ రోజు ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ  అద్వర్యంలోమీట్ అండ్ గ్రీట్ సమావేశం న్యూ జెర్సీలోని రాజ్ భోగ్  రెస్టారెంట్లో  జరిగింది . ఈ కార్యక్రమంలో శ్రీ సుశ్రీ శ్వేతా షాలిని  గారు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. శ్రీ శ్వేతా షాలిని గారు  ప్రస్తుతం మహారాష్ట్ర బిజెపీ  అధికార ప్రతినిధి గా సేవలందిస్తున్నారు. 
 
శ్రీ షాలిని  గారు ఈ సందర్భముగా కేంద్రంలో ఉన్న శ్రీ మోడీ  గారి ప్రభుత్వం చేపట్టుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి , మరియు , దేశంలో నెలకొన్న సామాజిక, రాజకీయ పరిస్థితులను గురించి వివరించారు. అలాగే మహారాష్ట్రలోని  శ్రీ దేవేంద్ర ఫడ్నవిస్ గారి ప్రభుత్వం చేపట్టుతున్న వివిధ  అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు . గత ప్రభుత్వాల పని సంస్కృతిని ఎప్పుడు ఉన్నటువంటి బిజెపీ ప్రభుత్వాల పని తీరుకి ఉన్న వ్యత్యాసాన్ని వారు ప్రవాస భారతీయులకు వివరించారు. అలాగే మహారాష్ట్ర ప్రభుత్వ రైతు రుణ మాఫీ గురించి కూడా వివరించారు. 
ఈ సందర్భంగా  ప్రవాస భారతీయులు అడిగిన పలు ప్రశ్నలకు శ్రీ శ్వేతా షాలిని గారు జవాబులు ఇవ్వడం జరిగింది. ముఖ్యముగా రైతుల సమస్యలపై అడిగిన ప్రశ్నలకు షాలిని గారు సువివరముగా సమాదానాలు చెప్పడం జరింగింది. 
 
తెలంగాణ మరియు మహారాష్ట్ర లో రైతు ఆత్మహత్యల గురించి అడగగా , షాలిని గారు దానికి గల కారణాలు ను చాల విపులముగా జవాబు చెప్పారు.
 
ఈ కార్యక్రమానికి , ఓఎఫ్ బిజెపీ జాతీయ అధ్యక్షులు శ్రీ కృష్ణ రెడ్డి ఏనుగుల గారు, ఓఎఫ్ బిజెపీ మాజీ జాతీయ అధ్యక్షులు శ్రీ జయేష్ పటేల్,  ఓఎఫ్ బిజెపీ జాతీయ మండలి సభ్యులు శ్రీ కల్పన శుక్ల, ఓఎఫ్ బిజెపీ  న్యూ జెర్సీ కోఆర్డినేటర్ శ్రీ అరవింద్ పటేల్ గారు, ఓఎఫ్ బిజెపీ  న్యూ జెర్సీ కో- కోఆర్డినేటర్లు  శ్రీ ఆనంద్ జైన్ మరియు  రవి బుద్ధానూరు, ఓఎఫ్ బిజెపీ న్యూ జెర్సీ మెంబర్షిప్ కన్వీనర్ శ్రీ ప్రమోద్ భగత్ గారు,  ఓఎఫ్ బిజెపీ మీడియా కో-కన్వీనర్  శ్రీ దిగంబర్ ఇస్లాంపురే గారు,ఓఎఫ్ బిజెపీ జాతీయ యువ కన్వీనర్ శ్రీ హరి సేథీ గారు, ఓఎఫ్ బిజెపీ జాతీయ యువ సహా -కన్వీనర్, శ్రీ విలాస్ రెడ్డి జంబుల , శ్రీ దీప్ భట్  గార్లు, , ఓఎఫ్ బిజెపీ న్యూ జెర్సీ యువ కన్వీనర్  శ్రీ పార్తీబన్ వర్ధన్,సహా -కన్వీనర్ శ్రీ శ్రీకాంత్ రెడ్డి మరియు ఇతర  ఓఎఫ్ బిజెపీ నేతలు ప్రదీప్ రెడ్డి, సందీప్ రెడ్డి గార్ల తో పటు  చాల మంది ప్రవాస భారతీయలు ఉత్సహంగా పాల్గొన్నారు.
 

0 656

కళాభారతి  అసోసియేషన్ అద్వర్యంలో న్యూ జెర్సీ లో జరిగిన హోలీ సంబరాలకు విశేష స్పందన లబించింది. ఈ సంబరాలలొ  దాదాపు 200 మంది తెలుగు ప్రజలు తో పాటు అమెరికా పిల్లలు కూడా  పాల్గొన్నారు. పెద్దలు, చిన్న పిల్లలు అనె తేడా లెకుండా రంగులూ చల్లుకుంటూ నౄత్యాలు చేస్తూ అనందంగా జరుపుకున్నారు.  ఈ ఉత్సవాల్లొ కాముడి మంటలు  ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది.ఇందులో కళాభారతి అసోషియెషన్ మెంబెర్స్ , ఇతరులు పాల్గొన్నారు.

kalabharathi holi celebrations

Photo gallery: https://www.dropbox.com/sh/0oxmspfnqum9lum/AACS58FDUCa7cWrXLx3wWB_6a?dl=0

0 652
ఎడిసన్: న్యూ జెర్సీ: ఏప్రిల్ 7:  ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అమెరికాలో అంగరంగ వైభవంగా జరిపే తెలుగు సంబరాల కోసం సన్నాహాలు ముమ్మరమయ్యాయి. ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఈ సారి చికాగో వేదికగా అమెరికా తెలుగు సంబరాలను నిర్వహించనుంది. దీనిలో భాగంగానే సంబరాలకు సన్నాహకంగా న్యూజెర్సీలోని రాయల్ అల్బెర్ట్స్ కన్వెన్షన్ హాల్ లో అమెరికా తెలుగు సంబరాలు చికాగో కన్వెన్షన్ 2017- కర్టన్ రైజర్ పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. చికాగోలోని శ్యాం బర్గ్ వేదికగా జూన్ 30, జులై 1,2 తేదీల్లో జరిగే తెలుగు సంబరాలకు అమెరికాలోని తెలుగు ప్రజలంతా తరలిరావాలని నాట్స్ పిలుపునిచ్చింది. భాషే రమ్యం.. సేవే గమ్యం అని నినదించే నాట్స్ అమెరికాతో పాటు తెలుగు రాష్ట్రాల్లో చేపడుతున్న సేవాకార్యక్రమాలను నాట్స్ ఛైర్మన్ శ్యాం మద్దాళి వివరించారు. నాట్స్ హెల్ఫ్ లైన్ లతో తెలుగు ప్రజలకు ఎలా చేరువయ్యింది..భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటనేది నాట్స్ అధ్యక్షుడు మోహనకృష్ణ మన్నవ తెలిపారు. ఉచిత వైద్య శిబిరాలతో పాటు ఇక ముందు నాట్స్ వైద్య బృందాలు చేపట్టే సేవా కార్యక్రమాలను నాట్స్ బోర్డ్  కార్యదర్శి శ్రీధర్ అప్పసాని వివరించారు.
బోర్డు అఫ్ డైరెక్టర్స్, గంగాధర్ దేసు, రాజేంద్ర అప్పలనేని, అరుణ గంటి నాట్స్ చేస్తున్న, మున్ముందు చేయబోయే  సేవా కార్యక్రమాలను వివరిస్తూ సంబరాలలో తెలుగు వారందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
యువిక జెవెల్లర్స్, శాండియాగో, కాలిఫోర్నియా వారు కూడా ఈ సంబరాలలో మరో ప్రముఖ సపోర్టర్ గా వ్యవహరించనున్నారు.
NATS Curtain Raiser New Jersey for 2017 Chicago Sambaralu a grand success (1) NATS Curtain Raiser New Jersey for 2017 Chicago Sambaralu a grand success (2) NATS Curtain Raiser New Jersey for 2017 Chicago Sambaralu a grand success (3) NATS Curtain Raiser New Jersey for 2017 Chicago Sambaralu a grand success (4)
తొలుత, బోన్ మారో డ్రైవ్ ను డా.మధు కొర్రపాటి ప్రారంభించి అసలు ఈ బోన్ మారో డ్రైవ్ ఉద్దేశ్యం ఏమిటి, యువత బాధ్యత ఇందులో ఎంత ఉంది తదితర వివరాలు తెలియచేస్తూ యువత ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని పదే పదే విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది.  ముఖ్యంగా యువతలో నాట్స్ కు ఆదరణ పెరుగుతుందని..యువ నాయకత్వానికి ఎప్పుడూ నాట్స్ పెద్ద పీట వేస్తుందన్నారు. ఈసారి చికాగో వేదికగా జరిగే అమెరికా తెలుగు సంబరాల్లో ఏం ప్రత్యేకతలున్నాయనేది సంబరాల కమిటీ కన్వీనర్  రవి అచంట వివరించారు. సేవే గమ్యం అనేది మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తూ.. నాట్స్ తెలుగువారి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించిందని న్యూజెర్సీలో తెలుగు ప్రముఖుడు.. న్యూ జెర్సీ పబ్లిక్ యుటిలిటీ కమిషనర్ ఉపేంద్ర చివుకుల అన్నారు. ముఖ్య అతిధి ఉపేంద్ర చివుకులను నాట్స్ న్యూయార్క్ కోఆర్డినేటర్ శ్యాం నాళం, నాట్స్ మీడియా కోఆర్డినేటర్ మురళీకృష్ణ మేడిచెర్ల, పుష్ప గుచ్చం, శాలువాతో సత్కరించారు. తెలుగువారిని ఏకం చేయడంలో నాట్స్ కీలక పాత్ర పోషిస్తుందని ఉపేంద్ర కొనియాడారు. ఉపేంద్ర చివుకుల మాట్లాడుతూ తాను అమెరికా వచ్చిన తొలి రోజుల్లోనే ఈ బోన్ మారో కార్యక్రమాల్లో పాల్గొన్న విషయాన్ని గుర్తుచేసుకొంటూ యువత ఇటువంటి వాటి కి తమవంతు సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపు నిచ్చారు.
నాట్స్ శ్రేయోభిలాషి, సప్పోర్టర్ ఏ.వి.ఆర్.చౌదరి , రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న అనేక అంశాల గురించి వివరిస్తూ , పెట్టుబడులు ఎలా పెట్టాలి, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ప్రెజంటేషన్ ద్వారా వివరించారు. దేశ వ్యాప్తంగా ఉన్న అవకాశాలను వివరిస్తూ , ఇంతకుముందు తమ జి & సి సంస్థ ద్వారా పెట్టుబడులు పెట్టినవారి లాభాలు ఎలా ఉన్నాయో తదితర విషయాలు తెలియచేశారు.
నాట్స్ చేపట్టిన సంబరాల సన్నాహాక కార్యక్రమానికి నాట్స్ తో పాటు స్థానిక తెలుగు సంఘం టీఏజీడీవీ ప్రతినిథులు, సభ్యులు కూడా విచ్చేశారు. శ్రీకాంత్, ప్రసాద్, అదితి భావరాజు, రాజీవ్ తదితర గాయనీ గాయకులు ఈ కార్యక్రమంలో హుషారైన తెలుగు పాటలు పాడి జోష్ నింపారు. ఇమిటేషన్ రాజు చేసిన మిమిక్రీ అందరినీ అలరించింది. సంబరాలకు నాట్స్ ఇచ్చిన పిలుపుకు మంచి స్పందన లభించింది. దాదాపు 800 మందికి పైగా నాట్స్ అభిమానులు, సపోర్టర్స్ పాల్గొన్న ఈ కార్యక్రమం లో 500,000 డాలర్లు డొనేషన్ ప్లడ్జ్ లు వచ్చాయి.. అమెరికా తెలుగు సంబరాల్లో మేముసైతమంటూ తెలుగువారి నుంచి వస్తున్న స్పందనపై నాట్స్ హర్షం వ్యక్తం చేసింది. నాట్స్ సంబరాల సన్నాహాక కార్యక్రమంలో నాట్స్ జాతీయ నాయకత్వంతో పాటు.. న్యూజెర్సీ,న్యూ యార్క్, పెన్సిల్వేనియా  నాట్స్ సభ్యులు..వాలంటీర్లు.. ఇతర తెలుగు సంఘాల  సభ్యులు కూడా భారీ ఎత్తున తరలివచ్చారు.
ఈ కార్యక్రమం విజయవంతమవటానికి  నాట్స్ సెక్రటరీ రమేష్ నూతలపాటి, నార్త్ ఈస్ట్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి, న్యూ జెర్సీ చాప్టర్ కోఆర్డినేటర్ వంశీకృష్ణ వెనిగళ్ల, రాజ్ అల్లాడ  తమ మిత్ర బృందాలతో కలసి ఎంతగానో సహాయ పడ్డారు.

0 544
ఎడిసన్ , న్యూ జెర్సీ :  ఇటీవల జరిగిన వివిధ రాష్ట్రల ఎన్నికల్లో బీజేపీ గణ విజయం సాధించడంతో , ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ, అమెరికా వ్యాప్తంగా విజయ్ దివస్ సంబరాలు జరుపుకోవడం జరిగింది.
ఈ సందర్బంగా  అఫ్ బీజేపీ అధ్యక్షులు, శ్రీ కృష్ణ రెడ్డి ఏనుగుల గారు మాట్లాడుతూ , ప్రస్తుతం బీజేపీ , యావత్ భారత దేశం లోని 29 రాష్ట్రాల్లో 17 రాష్ట్రాల్లను బీజేపీ లేదా బీజేపీ నాయత్కవం వహిస్తున్న ఎన్డీఏ కూటమి పాలిస్తుంది  అని తెలిపారు. అదేవిధంగా , జనాభా పరంగా చుస్తే , దాదాపుగా 62 శాతానికి అధికంగా  బీజేపీ లేదా బీజేపీ నాయత్కవం వహిస్తున్న ఎన్డీఏ కూటమి పాలిస్తుంది అని చెప్పారు.
అలాగే, ఇటీవల జరిగిన వివిధ రాష్ట్రల ఎన్నికల్లో, బీజేపీ గణ విజయంలో, ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ నిర్వహించిన కీలక  పాత్రను గురించి వివరించారు . తరువాత , ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల సంగం సభ్యులైన , గుంజన్ మిశ్ర గారు , కల్పనా శుక్ల గారు, దిగంబర్ ఇస్లాంపురే గారు మాట్లాడారు. వారు బీజేపీ గణ విజయంలో, ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ నిర్వహించిన పాత్రను క్లుప్తంగా వివరించారు.
అదేవిధంగా, ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ నేతలు , టీవీ ఆసియా హెచ్ .అర్. షా గారిని సన్మానించడం జరిగింది.  ఆప్-బీజేపీ  సీనియర్ నేత  జయేష్ పటేల్ గారు హెచ్ .అర్. షా గారు చేసిన సేవలను కొనియాడారు.
OFBJP Victory Celebrations
ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ యూత్ జాతీయ కన్వీనర్, హరీ సేథీ గారు , ఇండియా డెవలప్మెంట్ ఫౌండేషన్  గురించి వివరించారు.  పండిట్  దీన్దయాల్ ఉపాధ్యాయ్ గారి శత జయంతి  సందర్బంగా , రక్షపాల్ గారు మాట్లాడుతూ, దీన్దయాల్ గారి జీవితం, మరియు బీజేపీ కి ఆయన చూపించిన మార్గదర్శనం గురించి వివరించారు.
న్యూ జెర్సీ కమిషనర్ ఉపేంద్ర చివుకుల గారు  మాట్లాడుతూ , అమెరికా లో చేస్తున్న  ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ సేవలను కొనియాడుతూ , మోడీ గారి ఆధ్వర్యంలో భారత్ లో మంచి అభివృద్ధి కనబడుతుంది అన్నారు.
ఈ సంబరాల్లో , ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ నేతలు విలాస్ రెడ్డి జంబుల (నేషనల్ యూత్ కో-కన్వీనర్ ), రవి భూధనూరు,  వంశీ యంజాల , ప్రదీప్ కట్ట , బాల గురు , ఆత్మ సింగ్ , కాజోల్ బి , నాగరాజు , శ్రీకాంత్ , శ్రీనివాస్ గనగోని  అలాగే అనేక సంగాల నేతలు  మరియు అనేక మంది ప్రవాస భారతీయులు  ఉత్సహంగా పాల్గొన్నారు.

0 725
4-ఫిబ్రవరి: ఎడిసన్, న్యూ జెర్సీ: ఆకలితో ఉన్న వారికి ఆ ఆకలి తీర్చడమే అత్యుత్తమ సేవగా భావించే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఒన్ మిలియన్ ఫుడ్ డ్రైవ్ అంటూ రంగంలోకి దిగింది. నాట్స్ మహిళా విభాగం ఇచ్చిన పిలుపుకు అమెరికాలో నాట్స్ విభాగాలన్నీ స్పందించాయి. పేదలకు అందించే ఫుడ్ క్యాన్స్ సేకరించడంలో మేముసైతం  అని పోటీపడ్డాయి.. ఒక్కో ఛాప్టర్ లో వేల కొద్ది ఫుడ్ క్యాన్స్ సేకరించి పేదలకు పంచి పెట్టాయి. తాజాగా న్యూజెర్సీలో కూడా నాట్స్ ఫుడ్ డ్రైవ్ విశేష స్పందన లభించింది. ఇక్కడ సేకరించిన ఫుడ్ క్యాన్స్ ను నాట్స్ న్యూజెర్సీ టీం పేదలకు అందించింది. ఈ సమాజం కోసం నా వంతు బాధ్యత ఏమిటని ఆలోచించే చాలా మంది ఈ ఫుడ్ క్యాన్స్ ను ఉచితంగా అందించారు. నాట్స్ ఇచ్చిన  పిలుపును అందుకున్న తెలుగు ప్రజలు చాలా మంది ఈ ఫుడ్ క్యాన్స్ విరాళంగా ఇచ్చారు.  అన్నార్తులకు  అండగా నిలబడేందుకు నాట్స్ ఎప్పుడూ ముందుంటుందనేది ఈ ఫుడ్ డ్రైవ్ నిర్వహించింది. నాట్స్ వాలంటీర్లు, సభ్యులందరూ ఫుడ్ డ్రైవ్ విజయవంతం అయ్యేందుకు.. తమకు తోచిన ప్రతి ఒక్కరిని తోచినంత సాయం చేసేలా చేశారు. నాట్స్ ప్రెసిడెంట్ మోహనకృష్ణ మన్నవతో పాటు, బోర్డు అఫ్ డైరెక్టర్స్ డా. మధు కొర్రపాటి, అరుణ గంటి, రంజిత్ చాగంటి నాట్స్ నాయకులు.. వంశీకృష్ణ వెనిగళ్ల, రమేష్ నూతలపాటి, శ్రీహరి మందాడి, విష్ణు ఆలూరు, మురళీకృష్ణ మేడిచెర్ల, చంద్రశేఖర్ కొణిదెల, ప్రసాద్ గుర్రం, సూర్యం గంటి,  సూర్య గుత్తికొండ, శ్యాం నాళం, లక్ష్మి మోపర్తి, మోహన్ కుమార్ వెనిగళ్ల, చైతన్య, కవిత తోటకూర,  సుశీల పానుగంటి, సుధీర్ తుమ్మల, చైతన్య పెద్దు , అరుణ్ మాదిరాజు, వెంకట్ సత్యేన్ద్ర కడియాల, సుధీర్ పోతు, పద్మజ నన్నపనేని,స్థానిక సాయి దత్త పీఠం నుండి శుభ పాటిబండ్ల, లక్ష్మి పాత్రుని, వంశీ గరుడ, శ్రీధర్ దోనేపూడి, తదితరులు ఈ పుడ్ డ్రైవ్ కోసం భారీగా ఫుడ్ క్యాన్స్ సేకరించారు.
ఈ రోజు న్యూ జెర్సీ  లో జరిగిన  1 మిలియన్ క్యాన్ ఫుడ్ డ్రైవ్ తో పాటుగా నాట్స్ కొలంబస్, డిట్రాయిట్, డల్లాస్, చికాగో,  సెయింట్ లూయిస్, చాఫ్టర్ల లో విశేషంగా సేకరించటంతో నాట్స్ మహిళా విభాగం, నాట్స్ విజయవంతముగా ముగిసినట్టు ప్రకటించింది.
new-jersey-nats-food-drive-1 new-jersey-nats-food-drive-2 new-jersey-nats-food-drive-3 new-jersey-nats-food-drive-4
మోహనకృష్ణ మన్నవ, మధు కొర్రపాటి తదితరులు మీడియా తో మాట్లాడుతూ భాషే రమ్యం సేవే గమ్యం అని నమ్మే నాట్స్, ఈరోజు జరిగిన సేవా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరినీ అభినందించారు. ఈ రకమైన సేవా కార్యక్రమాలు.. స్థానిక సంస్థల సహాయ సహకారాలతో, దాతల ధాతృత్వంతో మున్ముందుమరెన్నో కార్యక్రమాలు చేస్తామని ప్రకటించారు.

0 646
భారతీయ జనతా పార్టీ లెజిస్లేటివ్ కౌన్సిల్ అఫ్ ఆంధ్ర ప్రదేశ్ – శ్రీ సోము వీర్రాజు అమెరికా పర్యటన లో బాగంగా న్యూ జెర్సీ లో  ‘ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ’ కార్యకర్తల కార్యక్రమం లో సోము వీర్రాజు గారు  ప్రవాస భారతీయులు నిర్వహించిన సోషల్ మీడియా  పాత్ర ను , అమెరికా లో కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను , మోడీ గారి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడాన్ని కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రత్యేక హోదా కంటే , ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఎలా  అభివృద్ధి చెందుతుందో కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసారు.
ofbjp-karyakartas-met-with-shr-somu-veeraju-in-new-jersey
కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం  ఏ  రకంగా సహకరిస్తుంధో తెలియచేస్తూ , స్మార్ట్ సిటీస్ ని  ఏరకంగా అభివృద్ధి  పరచవచ్ఛో తెలియజేసారు , దీని కోసం BJP /కేంద్ర ప్రభుత్వం /మోడి గారు  అందిస్తున్న సహాయాన్ని కొనియాడారు. గ్రామీణాభివృద్ధి కోసం కేంద్ర , రాష్త్రా ల ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలని వెల్లడిస్థ్హూ , తమ తమ గ్రామాల అభివృద్ధి కోసం  ప్రవాస భారతీయులు ని సహకరించాల్సింది గా  విజ్ఞప్తి చేసారు.
అమెరికా పర్యటన లో బాగంగా, సాన్ హౌసియా (కాలిఫోర్నియా ), హౌస్టన్ (టెక్సాస్ ), డిట్రాయిట్ (మిచిగాన్ ) లో పట్టణాలలో కూడా   సో ము వీర్రాజు ఆత్మీయ సభ (మీట్ అండ్ గ్రీట్) లు జరిగాయి .
ఈ కార్యక్రమంలో కృష్ణ రెడ్డి ఏనుగుల (నేషనల్ ప్రెసిడెంట్ -ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ ), జయేష్ పటేల్ (మాజీ ప్రెసిడెంట్ ), హరీ సేతు  (నేషనల్ యూత్ కన్వీనర్ ),విలాస్ రెడ్డి జంబుల (నేషనల్ యూత్ కో-కన్వీనర్ ), హరీ సేతు , దీపు భట్ , రామ్ వేముల , శ్రీకాంత్ తుమ్మల ,పార్తీబన్ , ప్రదీప్ కట్ట , హన్మంత్ , కిషోర్, వంశీ యంజాల తదితరులు పాల్గొన్నారు.
Photos Link:

భారతీయ సంస్కృతిని అమెరికాలో కూడా పరిఢవిల్లేలా చేస్తున్న నృత్యమాధవి గ్రూప్ ఆరవ వార్షికోత్సవం ఘనంగా జరిగింది.. న్యూజెర్సీలోని నార్త్ బ్రూన్స్ విక్ హైస్కూల్ లో ఆడిటోరియంలో జరిగిన ఈ వార్షికోత్సవ వేడుకల్లో భారతీయ సంప్రదాయం ఉట్టిపడింది. ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అంటూ పాడుకోవటమే కాకుండా.. తల్లి భారతి నేర్పిన సంస్కృతికి అద్దం పడుతూ ఈ వార్షికోత్సవంలో అనేక కార్యక్రమాలు నిర్వహించింది. నృత్యమాధవి స్కూల్ ఆఫ్ డ్యాన్స్ పేరుతో  కూచిపూడి నృత్యాన్ని అమెరికాలో చిన్నారులకు నృత్యమాధవి గ్రూపు నేర్పిస్తోంది. వీటితో పాటు విజువల్ ఆర్ట్స్, యోగా, వైదిక బోధనలు, భారతీయనృత్యం ఇవన్నీ లలిత కళా తోరణం అనే గొడుగుకిందకు తెచ్చి చిన్నారులకు నేర్పిస్తూ.. వారికి చిన్ననాటి నుంచే భారతీయ సంస్కృతిపై మక్కువ పెంచుకునేలా చేస్తోంది. కళ అనేది మనోవికాసానికి తోడ్పడుతుందని.. మనిషిలోని సృజనాత్మకతను వెలికితీస్తుందని ఎన్.ఎం.జీ మేనేజింగ్ డైరక్టర్ వేణు ఏలూరి ఈ కార్యక్రమ ప్రారంభోపన్యాసంలో అన్నారు.. నృత్యమాధవి గ్రూపు ద్వారా చిన్నారులు తమకిష్టమైన కళను నేర్చుకుంటున్నారని ఇది వారి మనోవికాసానికి, భారతీయ సంస్కృతి పరిరక్షణకు దోహద పడుతుందని ఆయన తెలిపారు. నృత్యమాధవి వార్షికోత్సవ సంబరాల్లో ఇతర పాఠశాలల విద్యార్ధులు కూడా పాలుపంచుకున్నారు. భరత నాట్యం స్కూల్ ఆఫ్ డ్యాన్స్ నుంచి కద్మ ఇందులో తన నాట్యాన్ని ప్రదర్శించారు. గెర్రీ ఫియానో,  ఉజ్వల్ వ్యాస్ గజల్స్ తో పాటు కొత్తగా నృత్యమాధవి స్కూల్ లో చిన్నారులు తమ ప్రతిభపాటవాలను ఈ వేదికపై చూపారు.
kuchipudi-dance-drama-lalitha-parameshwari-1 kuchipudi-dance-drama-lalitha-parameshwari-2 kuchipudi-dance-drama-lalitha-parameshwari-3 kuchipudi-dance-drama-lalitha-parameshwari-4
గురు దేవో భవ అంటూ ఈ వార్షికోత్సవం 50 మంది చిన్నారులతో  ఆది శంకర్యచార్యుని గురు అష్టాకంతో ప్రారంభమైంది.. నృత్య మాధవి స్కూల్  డైరక్టర్ నృత్య సేవా మణి శ్రీమతి దివ్యా ఏలూరి నేతృత్వంలో చిన్నారులు గురు అష్టాకానికి చేసిన నృత్య ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. దీంతో పాటు వీడలేరా వయ్యారాలు గీతానికి చేసిన నృత్యం అందరి మనసులను కట్టిపడేసింది.

అమెరికాల తొలిసారిగా లలితా పరమేశ్వరీ నృత్యరూపకాన్ని ఈ వార్షికోత్సవ వేదికగా ప్రదర్శించారు. కళా రత్న శ్రీమతి  ఎ.బి. బాల కొండలరావు నృత్య దర్శకత్వంలో  దాదాపు 60 మంది విద్యార్ధులు ఈ నృత్య రూపకంలో నృత్యం చేశారు. వీరితో  పాటు లలితా దేవిగా శ్రీమతి దివ్య ఏలూరి చేసిన ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. మొత్తం ఈ వార్షికోత్సవంలోనే  లలితాపరమేశ్వరీ నృత్య రూపకం ప్రత్యేక ఆకర్షణగా నిలచింది. కన్నులపండువగా జరిగింది.

లలితా సహస్ర నామ భాష్యంలోని వివిధరూపాలను  ఈ నృత్యరూపకం ద్వారా చూపారు. రాక్షసులకురాజైనా బండాసురుడినా శక్తిరూపంలో పార్వతీ ప్రతిరూపం లలితా పరమేశ్వరీ వధించడాన్ని ఇందులో చక్కగా ప్రదర్శించారు. ముఖ్యంగా శివ శక్తి ఐక్య రూపిణి లలితా దేవీ వచ్చే ఘట్టం.. అద్భుతంగా ఉంది. అజ్నానాన్ని జయించి విజ్నానం వైపు మనల్ని మళ్లీంచే అంతరార్ధం ఈ నృత్యరూపకం ద్వారా పరోక్షంగా చెప్పారు.

శ్రీమతి బాల కుమారుడైన ఆదిత్య అనుకుల రాక్షసరాజు బండాసురుడిగా అద్భుతంగా నటించారు. మన్మధుడిగా అక్షయ్ ఏలూరి, మాయ మోహినిగా అంజనా గోటేటి, చిన్న పార్వతీగా ఆషా ఏలూరి, కామేశ్వరీ దేవిగా శైలజా మేడిచెర్ల చేసిన ప్రదర్శనలకు అద్భుతమైన స్పందన లభించింది. ఈ నృత్యరూపంలో ప్రతి ఒక్కరు తమ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారు. లలిత పరమేశ్వరీగా  దివ్య ఏలూరి చేసిన ప్రదర్శన వార్షికోత్సవానికి వచ్చిన ప్రతి ఒక్కరు లేచి చపట్లతో అభినందించారు.

సిలికానాంధ్ర వ్యవస్థాపకులు ఆనంద్ కూచిబొట్ల,న్యూజెర్సీ బోర్డ్ కమిషనర్ ఉపేంద్ర చివుకుల, మన టీవీ సీఈఓ శ్రీధర్ చిల్లర, హరి ఇప్పనపల్లి, రఘు శంకరమంచి, డాక్టర్  సిరికొండ తదితర ప్రముఖులు ఈ వార్షికోత్సవాలకు అతిధులుగా హజరయ్యారు.

ఆంధ్రప్రదేశ్ లోని కూచిపూడి గ్రామంలో సంజీవని ఆసుపత్రికోసం లలిత కళా తోరణం ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఎన్.ఎం.జి డైరక్టర్ దివ్య ఏలూరి ప్రకటించారు. ఈ కార్యక్రమం ద్వారా ఐదు వేల డాలర్లు సేకరించనున్నట్టు తెలిపారు. జయహో కూచిపూడి కార్యక్రమానికి విలువైన సేవలను అందిస్తున్న దివ్య ఏలూరికి సిలికానాంధ్ర వ్యవస్థాపకులు ఆనంద్ కూచిబొట్ల అభినందించారు.

0 797

NATA SAHA joined hands with American Diabetes Association (ADA) and participated in Tour de Cure and Step Out: Walk to Stop Diabetes on June 26, 2016 at Novo Nordisk, Princeton NJ.

 

Over 1500 people participated in the event along with NATA SAHA members who came in big numbers. This was more than just another fundraising event, it’s a day packed with excitement and energy where walkers and riders of all levels joined forces in the fight to Stop Diabetes® and raised over $300,000 during this event for diabetes research education and advocacy in support of the American Diabetes Association.

 

NATA-SAHA event is coordinated by the Rajeshwar Gangasani (President-Elect), Srinivas Ganagoni (Joint,Secretary), Anjan Karnati (Chair:Community Services) and Dr. Meena Murthy (SAHA-Advisor).

NATA_SAHA_ADA_06282016_1

SAHA (South Asian Health Ambassadors) is formed by NATA at Dallas Convention 2016 by our top leaders to promote “Health and Wellness” Programs to educate and bring awareness to all our NATA Members and South Asian population.

 

It is important to highlight the serious problem of Diabetes, nearly 30 million children and adults in the U.S. have diabetes and the 86 million have pre-diabetes and in South Asians specifically Asian Indians knowing Hyderabad is the Diabetes capital of the world.

 

We as NATA SAHA team are committed to educate and help reversing the trend by engaging our community in such events and with many other awareness programs in the coming months.

 

NATA formed the following SAHA committee to take these initiatives forward and spread the message:

 

Advisors: Dr. Meena Murthy, Dr. Venkamma Reddy, Rajeshwar Gangasani, Dr. Raghavareddy Ghosala, Dr. Stanley Reddy and Srinivas Ganagoni

 

Core Committee Members: Anjan Karnati, Sarath Veta, Ramesh Anthony, Hari Velkur, Anna Reddy, Dwarak Varanasi, Sarath Mandapati, Rami Reddy Alla, Satya Pathapait, Sudhakar Reddy, Surya Reddy, Srinath Palavala, Nageshwar Mukkamalla, Sreekanth Penumada, Siva Meka, Arun Sriramineni, Vamsi Koppuravuri, Krishna Siddhada, Naresh Chintalacheruvu and Venkat Sunkireddy.

 

About Diabetes:

Diabetes is a disease in which the body does not produce or properly use insulin. Insulin is a hormone that is needed to convert sugar, starches and other food into energy needed for daily life. The cause of diabetes continues to be a mystery. Both genetics and environmental factors such as obesity and lack of exercise appear to play roles in the cause of type 2 diabetes.

 

Type 1 Diabetes:

Results from the body’s failure to produce insulin, the hormone that “unlocks” the cells of the body, allowing glucose to enter and fuel them. It is estimated that 5-10% of Americans who are diagnosed with diabetes have type 1 diabetes.

 

Type 2 Diabetes:

Usually results from insulin resistance (a condition in which the body fails to properly use insulin), combined with relative insulin deficiency. Type 2 diabetes accounts for about 90-95% of all diagnosed cases of diabetes.

 

Symptoms of Diabetes:

Diabetes often goes undiagnosed because many of its symptoms may seem harmless. Recent studies indicate that the early detection of diabetes symptoms and treatment can decrease the chance of developing the complications of diabetes.

 

Some diabetes symptoms include: frequent urination, excessive thirst, extreme hunger, unusual weight loss, increased fatigue, irritability and blurry vision. If you have one or more of these diabetes symptoms, see your doctor right away.

 

Diabetes Complications:

  1. Increased risk of heart disease and stroke
  2. Leading cause of kidney failure
  3. Nervous system disease and non-traumatic lower-limb amputations

 

Photo Gallery:

https://goo.gl/photos/7RiJEXLg2djokd9m9

0 785
సొమెర్సెట్, నూ జెర్సీ, మే 15th 2016: తెలుగుపీపుల్ ఫౌండేషన్, ఆర్థికముగా వెనకబడియున్న ఉన్నత విద్యాభ్యాసము చేస్తున్న విద్యార్థుల విజయానికి చేయూతనిస్తున్న ఒక లాభాపేక్ష లేని సంస్థగా 8th వార్షిక సమావేశాన్ని మే 14, 2016 శనివారం నాడు సోమర్సెట్, నూ జెర్సీలో జురుపుకొన్నది.

తెలుగుపీపుల్ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో ఆర్థికముగా వెనకబడియున్న విద్యార్థులు ఇంజనీరింగ్, మెడిసన్, మానేజ్మెంట్ మరియు ఇతర వృత్తి విద్యలను విజయవంతముగా పూర్తి చేయుటకు సహాయ వేతనములను అందజేస్తున్నది.

“ఒక ఉత్తమ విద్యార్థికి సహాయము చేయడం ద్వారా అది అతని యొక్క జీవితమే కాక అతని  కుటుంబాన్ని మరియు అతని చుట్టు పక్కల ఉన్నవారి జీవితాలను కూడ ప్రవాభితము చేస్తుంది” అన్నారు వ్యవస్థాపక సభ్యులు శ్రీ కొత్త కృష్ణ గారు. ప్రపంచంలో ఉన్నత శిఖరాలను సాధించిన చాలామంది వ్యక్తులు  అతి తక్కువ స్థాయి లో ఉన్నప్పుడు ఎవరిదో ఒకరి సహాయముతో ఉన్నత విద్యలను పూర్తి చేసారని కృష్ణ గారు గుర్తుచేసారు. అందుకు ప్రతీకగా ఆయన పలు తెలుగు ప్రముఖుల పేర్లు – శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య, శ్రీ దాసరి నారాయణ రావు, శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు, యెల్లాప్రగడ సుబ్బారావు తదితరులుఉదహరించారు.

ఏ విద్యర్థులకైతే ఈ రోజు ఈ సంస్ఠ సహాయము చేస్తున్నదో, ఆ విద్యార్థులే ఒకనాడు గొప్ప నాయకులవుతారని అన్నారు పరోపకారి మరియు లీడ్ ఇండియా 2020 ఇంటర్నేషనల్ చైర్మన్ శ్రీ ఇప్పనపల్లి హరికృష్ణ గారు. తెలుగుపీపుల్ ఫౌండేషన్ యొక్క అంకితభావపూర్వితమైన శ్రమను ఆయన కొనియాడారు.

అవసరములో ఉన్న తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు గుర్తింపు కోసం పాకులాట మరియు దూబరా లేకుండా సహాయం చేసే ఇలాంటి సంస్థలను అందరూ ప్రోత్సాహించాలి అని తానా సంస్థ రీజనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి దేవినేని లక్ష్మి గారు మట్లాడుతూ అన్నారు. అంతే కాకుండా , ఆమె గొప్ప ధనసహాయముతో ముందుకి వచ్చి సంస్థకు తమ సహాయ సమర్ధనలను అన్నివేళలా అందజేస్తామని వాగ్ధానము చేసారు.

TeluguPeple Foundation 8th Annual Success Meet (2) TeluguPeple Foundation 8th Annual Success Meet (3) TeluguPeple Foundation 8th Annual Success Meet (7) TeluguPeple Foundation 8th Annual Success Meet (31) TeluguPeple Foundation 8th Annual Success Meet (33) TeluguPeple Foundation 8th Annual Success Meet (39)
జీవితాలలో శాశ్వత మార్పు తీసుకొని వచ్చే ఈ తెలుగుపీపుల్ ఫౌండేషన్ యొక్క శ్రమ లబ్ధి పొందిన వారి యొక్క స్పందనా మరియు వారు సమాజానికి చేసే తదుపరి సహాయము ఒక “చైన్ రియాక్షన్” గా మారుతుందని జర్నలిస్ట్ మరియు విద్యా సెంటర్ ప్రోజెక్ట్ ఫౌండర్ శ్రీమతి స్వాతి శ్రీరాం అన్నారు. విద్యా సెంటర్ ప్రోజక్ట్ సంస్థ పలు తెలంగాణా జిల్లాలో 10, 000 కి మించి విద్యార్థులకు పుస్తకములు పంచిపెట్టబడినవి. ఈ సంధర్భముగా తెలుగుపీపుల్ ఫౌండేషన్ యొక్క లక్ష్యం సాధించుట కొరకు శ్రీమతి స్వాతి గారు విచ్చేసిన అతిధులకు యధాశక్తి విరాళములు ఇవ్వవలసినదిగా విజ్ఞప్తి చేసారు.
కార్యక్రమములో, ఎబెంజెర్. సీ. మల్లేపల్లి మరియు నరేష్ తాళ్ళూరు స్ఫూర్తిపూరకమైన ప్రసంగములు చేసారు.
ఈ కార్యక్రమము శనివారము(2016-06-14) సాయంత్రము తెలుగుపీపుల్ డాట్ కాం కార్యాలయములో నిర్వహించబడినది. మొత్తము 10 లక్షల రూపాయలకు మించి ఈ కార్యక్రమము ద్వారా సేకరించడమైనది. ఈ మొత్తము సొమ్ము అర్హులైన విద్యార్థులకు స్కాలర్షిప్స్ సమకూర్చే నిమిత్తము ఉపయోగించబడును.
మొదటగా చిన్నపిల్లలు పాల్గొన్న సాంస్కృతిక కార్యక్రమములతో సభ ప్రారంభించబడినది.

0 849

మన్విల్లె, న్యూ జెర్సీ: అమెరికాలో తెలుగు సంఘాల చరిత్రలో నాట్స్ మరో కీలకమైన ముందడుగు వేసింది. అమెరికా లో ప్రతి తెలుగువారికి ఆత్మీయనేస్తంలా  మారిన నాట్స్ ఇప్పుడు వారికి ఆర్థికంగా కూడా ఎంతో కొంత దోహదపడేలా నాట్స్ రివార్డ్ కార్డ్ ను ప్రవేశపెట్టింది. న్యూజెర్సీలోని మన్విల్లె – రిథమ్స్ లో  ‘నాట్స్ –  రివార్డ్ కార్డ్’ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. నాట్స్ కార్యదర్శి రమేష్ నూతలపాటి స్వాగతోపన్యాసంతో ప్రారంభమైన  ఈ కార్యక్రమంలో నాట్స్ రివార్డ్ కార్డ్ ప్రత్యేకతలు.. విశేషాలను నాట్స్ నాయకులు వివరించారు. తెలుగు సంఘాలంటే ఆట పాటలే కాదు.. ఆదుకోవడం. అండగా నిలబడటం అని ఇప్పటికే నిరూపించిన నాట్స్.. ఇప్పుడు ఆర్థికంగా కూడా నాట్స్ సభ్యులకు సహకరించాలని నిశ్చయించుకుంది. ఈ క్రమంలోనే నాట్స్ రివార్డ్ కార్డును రూపొందించిందని దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నాట్స్ మాజీ ఛైర్మన్ డాక్టర్. మధు కొర్రపాటి అన్నారు. అమెరికా లోని అన్ని రాష్ట్రాలలోనే కాకుండా, భారత దేశం లో కూడా ఈ రివార్డ్ కార్డు విస్తృత వినియోగం లోకి రానుంది. ఇప్పటికే అనేక వ్యాపార సంస్థలు.. నాట్స్ రివార్డ్ కార్డుపై డిస్కౌంట్ ఇచ్చేందుకు ముందుకొచ్చాయని..భవిష్యత్తులో మరిన్ని సంస్థలు కూడా ఈ జాబితాలో చేరనున్నాయని  నాట్స్ ప్రెసిడెంట్ మోహన కృష్ణ మన్నవ అన్నారు. గత కొన్నేళ్లుగా రివార్డ్ కార్డ్ ప్రతిపాదన ఉందని.. అయితే అది ఇప్పటికి  సాకారమైందని.. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి తాను ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నానని నాట్స్ ఛైర్మన్ శ్యాం మద్దాళి అన్నారు. అమెరికాలో తెలుగు సంఘాల చరిత్రలో వైద్య శిబిరాలతో  సేవాపథంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన నాట్స్ ఇప్పుడు కూడా రివార్డ్ కార్డుతో మరోసారి తన ప్రత్యేకతను చాటుకుందని నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్ గంగాధర్ దేసు తెలిపారు. గివింగ్ బ్యాక్ టూ సొసైటీ అనేది ప్రతిసారీ చెప్పటమే కాదు… చేతల్లో కూడా చూపుతున్న నాట్స్ ఇప్పుడు తన సభ్యులకు కూడా తాము ఖర్చు పెట్టే దానిలో ఎంతో కొంత తిరిగి వచ్చేలా ఈ రివార్డ్ కార్డ్ రూపొందించిందని బసవేంద్ర సూరపనేని  వివరించారు.

NATS Reward Card Launch in NJ (1) NATS Reward Card Launch in NJ (2) NATS Reward Card Launch in NJ (3) NATS Reward Card Launch in NJ (4) NATS Reward Card Launch in NJ (5)

NATS Vendors Registered so far..

Food &Restaurants: Travel Agents:
Bawarchi  Jersey City, NJ DyNex Travel (Domestic and International flight bookings)
Nalabheema Dawath, Edison, NJ http://www.dynextravel.com/
Crepes  Celestas, Menlo park Mall, Edison, NJ
Bawarchi Edison, NJ  Pharmacies:
Abhiruchi, North Brunswick, NJ Heights Pharmacy
https://avakaya.com/ (Homefoods), Edison, NJ Greene Pharmacy
Desi Chef – Desi Bazar – NJ Neighbor Care Pharmacy
 Dakshin Restaurant, Edison, NJ
Attorneys: INSURANCE
Sunitha Krosuri NY Life
Srinivas Jonnalagadda Farmers Insurance
CPAs: Cars and Auto Services:
SVEK Financial Services Euro& Asia Auto services –  Sunoco Auto services
H1 Tax Services, Edison, NJ
Training Institutes: Dresses and Apparels
Dynex Tech (Training and support in all technologies) Amogha Apparels
http://www.dynextech.com/

కేవలం 50 డాలర్లతో అటు నాట్స్ రివార్డ్ కార్డుతో పాటు .. నాట్స్ జీవిత కాల సభ్యత్వం లభిస్తుందని నాట్స్ తెలిపింది. కేవలం వ్యాపార సంస్థల్లో డిస్కౌంట్లకే ఈ రివార్డ్ కార్డు పరిమితం కాదని… అమెరికాలో తెలుగువాడికి ఏ కష్టమోచ్చినా నాట్స్ మాకు అండగా ఉందనే భరోసా ఈ కార్డు ద్వారా లభించనుందని నాట్స్ ప్రకటించింది. కోటి ఆశలతో తెలుగునేల నుంచి అమెరికాకు వచ్చే విద్యార్థులకు సైతం ఈ కార్డు ఎంతగానో దోహదపడుతుందని తెలిపింది.  అమెరికాలోని ప్రతి తెలుగువాడి దగ్గర ఈ నాట్స్ రివార్డ్ కార్డు ఉండాలనే అకాంక్షతో  నాట్స్ అడుగులు వేయనుందని  నాట్స్ నాయకుల తో పాటు రివార్డ్ కార్డ్ ను ఆవిష్కరించిన గజల్ శ్రీనివాస్  ప్రకటించారు. నాట్స్ రివార్డ్ కార్డ్ ఆవిష్కరణ కార్యక్రమంలో గజల్ శ్రీనివాస్  ‘నాన్న’ పై రెంటాల వ్రాసిన గజల్ పాడి సభికులను తమ తండ్రితో తమకున్న అనుభూతిని నెమరు వేసుకునేట్టు చేసారు. స్థానిక కళాకారులు ప్రసాద్, సుందరి తదితరులు పాటలు పాడి అలరించారు. 600 మందికి పైగా

తెలుగు వారు హాజరైన , ఈ సమావేశం లో 300 మంది క్రొత్తగా నాట్స్ సభ్యులుగా నమోదై తమ నాట్స్ రివార్డ్ కార్డులను సొంతం చేసుకున్నారు.

 ఈ ఈవెంట్ స్పాన్సర్ షిప్ కు ముందుకొచ్చిన  వారందరిని న్యూజెర్సీ నాట్స్ కో  ఆర్డినేటర్ వంశీ కృష్ణ వెనిగళ్ళ అభినందించారు. అటు రివార్డు కార్డుపై డిస్కౌంట్ ఇచ్చేందుకు ముందుకొచ్చిన వ్యాపారస్థులను నాట్స్ నార్త్ ఈస్ట్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి సత్కరించారు. ఇంత పెద్ద ఈవెంట్ కు భోజన సదుపాయాలను అందించినందుకు జెర్సీసిటీ బావర్చి రెస్టారెంట్ యాజమాన్యాన్ని నాట్స్ అభినందించింది.  రంజిత్ చాగంటి వందన సమర్పణతో ఈ సభ ముగిసింది.

SOCIAL

3,873FansLike
8FollowersFollow

SPECIALS

SHORT FILMS