కాలిఫోర్నియా రాష్ట్రం లో ఉన్న శాక్రమెంటో తెలుగు సంఘం 13 వ వార్షికోత్సవం మరియు సంక్రాంతి సంబరాల సందర్భం గా పూర్తి నిడివి భరతనాట్యం నృత్య  రూపకం “శ్రీనివాస కళ్యాణం”ఆహుతులను విశేషం గా ఆకట్టుకొన్నది. రంగవల్లులు, సంక్రాంతి పాలవెల్లి  సెట్టింగ్, మరియు 300 కు పైగా ఉన్న కళాకారులు చేసిన సందడితో సంక్రాంతి వేడుకల ప్రాంగణం లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. స్థానిక ఫోల్సోం నగరం లో ఉన్న ఫాల్సం హై స్కూల్ ధియేటర్ లో శనివారం జనవరి 14 వ తేది 2017 ఉదయం 11 గం కు  మొదలైన సంక్రాంతి సంబరాలు రాత్రి 11 గం వరకు కొనసాగాయి.   శాక్రమెంటో తెలుగు సంఘం సంక్రాంతి సంబరాల లో ప్రదర్శించిన ముఖ్యాంశాలు:   1.శాక్రమెంటో లో భాస్కర్ ఆర్ట్స్ అకాడమీ వారి సహకారం తో టాగ్స్ రూపొందించిన పూర్తి నిడివి నృత్య  రూపకం “శ్రీనివాస కళ్యాణం” 2.శ్రీనివాస కళ్యాణం రూపకం లో గాత్రం, వయోలిన్, మృదంగం వాద్య సహకారం తో అలరించిన శ్రీ పప్పు సదాశివ శాస్త్రి గారి బృందం 3.జానపద నృత్య రూపకర్త స్నేహ వేదుల రూపొందించిన జానపద నృత్యం 4.వేదిక పై వివిధ ఇతర సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్న300 మందికి పైగా స్థానిక కళాకారులు 5.భోజన విరామ సమయం లో 1000 మందికి పైగా ఆహుతులను లలిత సంగీతం, సినీ గీతాలతో అలరించిన చిన్నారులు, పెద్దలు, డప్పుతో ఆకట్టుకున్న స్థానిక  చిన్నారి srinivasa-kalyanam-and-tags-13th-anniversary-sankranti-sambaraalu-event-by-tags-1 srinivasa-kalyanam-and-tags-13th-anniversary-sankranti-sambaraalu-event-by-tags-3 srinivasa-kalyanam-and-tags-13th-anniversary-sankranti-sambaraalu-event-by-tags-3 srinivasa-kalyanam-and-tags-13th-anniversary-sankranti-sambaraalu-event-by-tags-4 సంక్రాంతి వేడుకల సందర్భం గా టాగ్స్ అధర్వంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు, పూర్తి నిడివి భరతనాట్యం నృత్య  రూపకం “శ్రీనివాస కళ్యాణం”, వేదిక పై ఉన్న 300 మందికి పైగా స్థానికకళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, డేవిస్ నగరం  లో ఉన్న స్థానిక ప్రీతి ఇండియన్ క్యూసైని వారు వండిన నొరూరుంచే పసందైన తెలుగు వంటకాలు, మరి ఇంకెన్నో విశేషాలతోఆహుతులను అలరించాయి. కదలి రండి, కలసి రండి, సంక్రాంతి సంబరాన్ని ఉమ్మడిగా జరుపుకొందాము అని టాగ్స్ ఇచ్చిన పిలుపుకు స్పందించిన స్థానిక తెలుగు కుటుంబాలు 1000 మందికి పైగావేదిక కు తరలి వచ్చారు. ఈ సందర్భం గా కాలిఫోర్నియా ముఖ్య సమాచార అధికారి (సి ఐ ఓ) శ్రీమతి అమీ టోంగ్ ముఖ్య అతిధి గా విచ్చేసి ఆహుతులకు సంక్రాంతి సందేశాన్ని అందజేశారు. టాగ్స్కార్యవర్గం సభ్యులు శ్రీమతి అమీ టోంగ్ కు  వేదిక పై ఘనం గా సన్మానం గావించి జ్ఞాపిక ను అందజేశారు.   ప్రియమైన అతిధి గా విచ్చేసిన స్థానిక కాలిఫోర్నియా యూనివర్సిటీ డేవిస్ క్యాంపస్ ప్రొఫెసర్ శ్రీ హనుమంతరావు ఉన్నవ గారు  స్థానిక తెలుగు కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలకుఅచ్చెరువొందారు. శాక్రమెంటో తెలుగు సంఘం కార్యవర్గ సభ్యులు శ్రీ హనుమంతరావు ఉన్నవ గారిని  వేడుక పై సాదరంగా ఆహ్వానించి కు వేదిక పై ఘనం గా సన్మానం గావించారు. మనదైన తెలుగుసంస్కృతి, కవిత్వం, సాహిత్యం, సంప్రదాయాలను తరువాతి తరం వారికి అందజేయాలని ప్రొఫెసర్ ఉన్నవ నొక్కి చెప్పారు.   మరో ప్రియమైన అతిధి గా విచ్చేసిన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు వాసి ప్రముఖ చిత్రకారులు శిల్పి శ్రీ  ఉదయ్ కుమార్ మార్లపూడి  గారిని టాగ్స్ చైర్మన్ వెంకట్ నాగం సభికులకు పరిచయం చేసారు.చిత్రకళలో చేసిన నిరంతర ప్రయత్నమే నన్ను ఈస్థాయి కి నిలబెట్టింది అని, ప్రయత్నిస్తే మీకు ఈ కళలో విజయం తధ్యమని శ్రీ ఉదయ్ కుమార్  సందేశం ఇచ్చారు. శాక్రమెంటో తెలుగు సంఘంసభ్యులకు శ్రీ ఉదయ్ కుమార్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసారు. ఆహుతుల కోరికమేరకు అప్పటికప్పుడు తెలుగుజాతి వైభవం, బాలమురళీకృష్ణ, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పై రెండు స్పాట్పెయింటింగ్స్ వేసి వేదికపై శ్రీ ఉదయ్ కుమార్ ఆహుతుల హర్షద్వానాలు అందుకొన్నారు. శ్రీ  ఉదయ్ కుమార్ మార్లపూడి గారికి టాగ్స్ కార్యవర్గం వేదికపై జ్ఞాపికను బహూకరించి,  శాలువా కప్పి ఘనసన్మానం గావించారు. srinivasa-kalyanam-and-tags-13th-anniversary-sankranti-sambaraalu-event-by-tags-4 srinivasa-kalyanam-and-tags-13th-anniversary-sankranti-sambaraalu-event-by-tags-5 srinivasa-kalyanam-and-tags-13th-anniversary-sankranti-sambaraalu-event-by-tags-6 srinivasa-kalyanam-and-tags-13th-anniversary-sankranti-sambaraalu-event-by-tags-7 మరో ప్రియమైన అతిధి గా విచ్చేసిన సిలికానాంధ్ర చైర్మన్ శ్రీ ఆనంద్ కూచిభొట్ల గారిని టాగ్స్  ట్రస్టీ వాసు కుడుపూడి సభికులకు పరిచయం చేసారు. ఈ సందర్భం గా  ఆనంద్ కూచిభొట్ల గారుమాట్లాడుతూ 2004 లో మొట్టమొదటి సారిగా టాగ్స్ శాక్రమెంటో లో సంక్రాంతి సంబరాలను జరిపిందని, ఇప్పుడు వరుసగా 13వ సారి సంక్రాంతి సంబరాలను జరుపుకోవడం ఆనందంగా ఉందని, ఈ రెండువేడుకల్లో కుడా సిలికానాంధ్ర బృందం టాగ్స్ వారి సంక్రాంతి సంబరాల సాంస్కృతిక కార్యక్రమాలలో పాలుపంచుకోవడం మరింత ఆనందం గా ఉందని, మనదైన సంస్కృతి, సంప్రదాయాన్ని పిల్లలకుఅందించడానికి ఇటువంటి వేడుకలు అవసరం అని చెప్పారు. తెలుగు వారి కూచిపూడి నాట్యానికి పుట్టినిల్లు అయినటువంటి కూచిపూడి గ్రామం దీనావస్థ లో ఉందని, దీనికి మెరుగుపరచడానికి జయహోకూచిపూడి కార్యక్రమానికి, తెలుగు భాష ను వ్యాపింపజేయడానికి స్థానిక మనబడి కి చేయుతనివ్వాలని శ్రీ ఆనంద్ కూచిభొట్ల నొక్కి చెప్పారు. శ్రీ ఆనంద్ కూచిభొట్ల తో పాటు విచ్చేసిన సిలికానాంధ్ర వైస్చైర్మన్ శ్రీ దిలీప్ కొండిపర్తి, తదితర సిలికానాంధ్ర మరియు యూనివర్సిటీ అఫ్ సిలికానాంధ్ర కార్యవర్గ సభ్యులందరికీ టాగ్స్ ఘనసన్మానం గావించింది.   టాగ్స్ సౌజన్యం తో జరుగుతున్న శాక్రమెంటో లో సిలికానాంధ్ర స్థానిక మనబడి విద్యార్థులు చక్కని తెలుగు పద్యాలు, కధలు, పాటలు వేదికపై ప్రదర్శించారు. ఈసందర్భం గా ప్రతిభావంతులైన పిల్లలనుపోత్సహించే గత సంప్రదాయాన్ని పాటిస్తూ, టాగ్స్ కార్యవర్గ సభ్యులు స్థానిక ప్రతిభావంతులైన పిల్లలకు శ్రీమతి అమీ టోంగ్ చేతులమీదగా  జ్ఞాపికలు అందజేశారు. శాక్రమెంటో తెలుగు సంఘంసభ్యులను ఉద్దేశించి ప్రసంగించిన విజయవాడ ఎంపీ శ్రీ కేశినేని నాని గారి వీడియో ను వేదిక పై ప్రదర్శించారు. అంతకు మునుపు శ్రీ శ్రీనివాస కల్యాణోత్సవాన్ని వేదిక ప్రాంగణం లో అదే రోజు  ఉదయం11 గం కు టాగ్స్ ఘనంగా   నిర్వహించింది.  శ్రీకృష్ణ  బలరాం మందిర్ నుండి విచ్చేసిన శ్రీ సచ్ఛినందన దాస శ్రీ శ్రీనివాస కళ్యాణోత్సవం పూజ ను నిర్వహించారు. ప్రత్యేకంగా తయారుచేసిన తీర్ధప్రసాదాలను భక్తులకు టాగ్స్ కార్యకర్తలు అందజేశారు. టాగ్స్ సెక్రటరీ  మోహన్ కాట్రగడ్డ వందన సమర్పణ గావించారు.   కాలిఫోర్నియా శాక్రమెంటో లో సంక్రాంతి సంబరాలు విజయవంతం కావడానికిఅహర్నిశలు కృషి చేసిన వారిలో టీఏజిఎస్ కార్యవర్గ సభ్యులు : మనోహర్ మందడి, మోహన్ కాట్రగడ్డ, సందీప్ గుడుపెల్లి, శ్రీదేవి మాగంటి, కీర్తి సురం, సురేంద్రనాథ్ కొప్పారపు, శ్రీరామ్ అకిన, మమతాదాసి, నాగేశ్వరరావు దొండపాటి,నాగేంద్రనాథ్ పగడాల, శ్రీనివాస రావు యనపర్తి, ప్రసాద్ కేతిరెడ్డి,  శ్రీధర్ రెడ్డి, అశ్విన్ తిరునాహరి, మల్లిక్ సజ్జనగాండ్ల, స్వర్ణ కంభంపాటి, వాసు కుడుపూడి, సుధాకర్ వట్టి,రాంబాబు బావిరిశెట్టి, అనిల్ మండవ, వెంకట్ నాగం, డా సంజయ్ యడ్లపల్లి మరియు టాగ్స్ కార్యకర్తలు పాల్గోన్నారు. ఫోటోగ్రఫీ సహకారం అందించిన రాకేష్ గుర్రాల “ఆర్ ఆర్ ఫోటోగ్రఫీ” కి టాగ్స్ కార్యవర్గం ప్రత్యేకకృతజ్ఞతలు తెలియజేసింది. ఈ సందర్భం గా టాగ్స్ కార్యనిర్వాహక సభ్యులు అనాధ భారతీయ బాలబాలికలకు సహాయార్ధం హోప్ ఎబయ్డ్స్ స్వచ్ఛంద సంస్థ కు టాగ్స్ ప్రత్యేకం గా విరాళాలుఅందజేస్తుంది అని, ఈ సంస్థ కు  సహాయార్ధం విరాళం ఇవ్వదలచిన వారు మరింత సమాచారం కోసం sactags@gmail.com కు ఈమెయిలు లో సంప్రదించాలని టాగ్స్ కార్యనిర్వాహక సభ్యులు కోరారు.సంక్రాంతి సంబరాల ఫోటోలను ఫేస్ బుక్ https://www.facebook.com/SacTelugu/photos_stream లో చూడవచ్చు నని వారు తెలిపారు.  టాగ్స్ చేపట్టబోయే కార్యక్రమాలకు సంబంధించి మరిన్ని వివరాలనుతెలుసుకోవాలనుకునేవారు http://www.sactelugu.org , https://www.facebook.com/SacTelugu ను సందర్శించాలని లేదా sactags@gmail.com కు ఈమెయిలు లో సంప్రదించాలని టాగ్స్ కార్యనిర్వాహకసభ్యులు కోరారు.