తేది 16 నవంబరు శనివరం రోజున కెనడా లోని మిస్సిస్సౌగ నగరంలో తెలంగాణ ఎన్ ఆర్ ఐ లు మరియు కెనడా సభ్యులు ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ సదస్సు లో  మంత్రి శ్రీ పొన్నాల లక్ష్మయ్య గారు మరియు కెనడాలోని భారతీయ సాంస్కౄతిక కేంద్రము డైరెక్టరు పద్మశ్రీ డా|| యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు పాల్గొని ప్రసంగించారు.  మంత్రి పొన్నాల లక్ష్మయ్య గారు మాట్లడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరే రోజు ఆసన్నమైందని, తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రవాస తెలంగాణా వాసులంతా తెలంగాణా పునర్నిర్మానంలో వారి వారి నైపున్యం గల ఏరియా లో పాలుపంచుకొని నవతెలంగాణా నిర్మాణంలో సహకరించి ముందుకురావలని పిలుపినిచ్చారు. శ్రీ లక్ష్మీ ప్రసాద్ గారు మట్లాడుతూ తెలుగువారికి రెండు రాష్త్రాలుండడం సంతొషమని కెనడాలోని తెలుగు వారందరూ ఒకే కుటుంబం లా కలిసి ఉన్నందుకు సంతోషదాయకమని కెనడాలోని భారతీయ సాంస్కౄతిక కేంద్రము ఆద్వైర్యంలో జరుగబొయే అన్ని కార్యక్రమాలలో పాల్గొనాలని, కెనడా లొ భారతీయుల కు భారత ప్ర్వుత్వం తరఫున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
ఈ కర్యక్రమం లో దాదపు 40 మంది పాల్గొనగా  శ్రీనాధ్ కుందూరు మరియు రమెష్ మునుకుంట్ల గార్లు సమన్వయ పరిచారు.

Sri Ponnala Lakshmaiah's message from Toronto to NRIs-1
Sri Ponnala Lakshmaiah’s message from Toronto to NRIs
Sri Ponnala Lakshmaiah's message from Toronto to NRIs-2
Sri Ponnala Lakshmaiah’s message from Toronto to NRIs