సర్ సి.వి. రామన్. ప్రపంచ వ్యాప్తంగా భారతావనికి వన్నె తెచ్చిన సి.వి.రామన్ తిరుచురాపల్లి సమీపంలో 1888 వ సంవత్సరం నవంబర్ 7న జన్మించారు.
దేశానికి తొలి ‘భారతరత్న’ అయిన సర్ సి.వి.రామన్ అంతకన్నా కూడా ఎక్కువగా మానవరత్న! నోబెల్ సహా ఇంకా ఎన్నో వైజ్ఞానికరంగ హోదాలకు గౌరవం తెచ్చిపెట్టిన ఈ భౌతిక శాస్త్రవేత్త సవినయ సంపన్నుడు. పదహారేళ్లకు డిగ్రీ, తర్వాత రెండేళ్లకు మాస్టర్స్ డిగ్రీ సాధించిన నిరుపేద విద్యార్థి. సముద్రపు నీటిపై సూర్యకాంతి పడిన ప్పుడు ఆ కాంతిలోని నీలం రంగు ఎక్కువగా చెల్లాచెదురై, మన కంటికి చేరడం వల్లనే సముద్రం నీలం కనిపిస్తుందని రామన్ సిద్ధాంతీకరించారు. ఇలా ద్రవాలపై పడిన కాంతి కిరణాలు ఎలా చెల్లా చెదరవుతాయో తెలిపే పరిశోధన ఫలితమే రామన్ ఎఫెక్ట్ (రామన్ ప్రభావం). telugu community news - Sir CV Raman                 References: http://en.wikipedia.org/wiki/C._V._Raman http://www.nobelprize.org/nobel_prizes/physics/laureates/1930/raman-bio.html