డిసెంబర్ 18, 2016, డాలస్, టెక్సస్ ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో "నెలనెలా తెలుగు వెన్నెల" సాహిత్య సదస్సు ఆదివారం డిసెంబర్18వ తేదీన దేశీప్లాజా టీవీ స్టూడియోలో సాహిత్యవేదిక సమన్వయకర్త బిళ్ళా ప్రవీణ్ అధ్యక్షతన నిర్వహించబడింది. ప్రవాసంలో నిరాటంకంగా 113 నెలలపాటు ఉత్తమ సాహితీవేత్తల నడుమ సాహిత్యసదస్సులు నిర్వహించటం ఈ సంస్థ విశేషం. సమన్వయకర్త బిళ్ళా ప్రవీణ్ సభను ప్రారంభిస్తూ 113వ నెలనెలా తెలుగు వెన్నెల సదస్సుకి విచ్చేసిన సాహితీప్రియులకు స్వాగతం పలికారు. నెల నెలా తెలుగు వెన్నెల సింహావలోకనం సందర్భంగా2016 సంవత్సరంలో జరుపుకున్న సాహిత్యవేదిక కార్యక్రమాలను నెమరు వేసుకున్నారు.  ప్రతి నెలలో జరిగిన కార్యక్రమాన్ని, ముఖ్య అతిథి ప్రసంగాన్ని సభికులతో పంచుకున్నారు. తనకు సహకారం అందించిన సాహితీవేదిక సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్)  అధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, తక్షణ పూర్వాధ్యక్షులు డా.ఊరిమిండి నరసింహారెడ్డి , ఉపాధ్యక్షులు శీలం కృష్ణవేణి , కార్యదర్శి వీర్నపు చినసత్యం , కోశాధికారి దండ వెంకట్ , డా.సీ.ఆర్.రావు , డా.సుధ కలవగుంట, కాజా సురేష్, డా.కృష్ణ పుట్టపర్తి, నిమ్మగడ్డ మనోహర్  నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమమాని సంబందించిన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. tantex_113th-nntv_group-photo_12182016 tantex_113th-nntv_samanvayakartha_billa-praveen_12182016 tantex_113th-nntv_team ప్రతి ఆదివారం సాయంత్రం ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం సమర్పించే టాంటెక్స్ తరంగిణి కార్యక్రమం తెలుగు వన్ రేడియో ద్వారా 3 గంటల నుండి 5 గంటల వరకు సాగుతుంది. ఈ కార్యక్రమానికి RJ శ్రీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ 113వ నెలనెలా తెలుగు వెన్నెల సదస్సుని దేశీ ప్లాజా స్టూడియో నుండి టాంటెక్స్ తరంగిణిలో తెలుగు వన్ రేడియో ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేసారు. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్)  అధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం గారు, పూర్వాధ్యక్షులు డా.ఊరిమిండి నరసింహారెడ్డి గారు మరియు సమన్వయకర్త బిళ్ళా ప్రవీణ్ గారు శ్రోతలతో 2016 లో జరిగిన నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమాల వివరాలను పంచుకున్నారు. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం  అధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం మరియు కార్యక్రమ సమన్వయకర్త బిళ్ళా ప్రవీణ్ సాహిత్య వేదిక బృంద సభ్యులను మరియు  సాహితీ ప్రియులను,  టాంటెక్స్ సంస్థ ముప్పై వసంతాల జ్ఞాపిక తో సత్కరించారు. సమన్వయకర్త బిళ్ళా ప్రవీణ్ సాహిత్యం మీద ప్రేమ, మాతృ భాష మీద మమకారంతో విచ్చేసిన భాషాభి మానులకు, సాహితీ ప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు.  ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన దేశీ ప్లాజా, రేడియో ఖుషి మరియు ప్రసార మాధ్యమాలైన టీవీ 5, టోరి , టి.ఎన్.ఐ లకు కృతఙ్ఞతాపూర్వక అభివందనములు తెలియజేసారు. టాంటెక్స్ 113 వ నెల నెలా తెలుగు వెన్నెల సదస్సు గురించి బసాబత్తిన శ్రీనివాసులు  సమర్పించిన నివేదిక.