ఫిబ్రవరి 5, 2017 న్యూయార్క్ : ఓవర్ సీస్ ఫ్రెండ్స్అఫ్ భారతీయ జనతా పార్టీ , యూత్ అవుట్ రీచ్కార్యక్రమాన్ని న్యూయార్క్ లో నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమంలో అనేక మంది యువ కార్యకర్తలను ఓవర్ సీస్ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ లోకి స్వాగతించారు . అదే విదంగా, అనేక మంది ప్రవాస భారతీయ యువతలోఉన్న పలు ఇమ్మిగ్రేషన్ కి సంబందించిన సందేహాలను ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ సభ్యులు నివృత్తి చేసారు .  అలాగే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్నిచేపట్టడం జరిగింది. ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయజనతా పార్టీ యూత్ టీం ఇలాంటి కార్యక్రమాలనుఅమెరికా దేశ వ్యాప్తముగా చేపట్టనుంది.    ఈ కార్యక్రమం ఓఎఫ్ బిజెపీ జాతీయ అధ్యక్షులు శ్రీ కృష్ణరెడ్డి ఏనుగుల గారి అద్వర్యంలో , ఓఎఫ్ బిజెపీ జాతీయయువ టీం నిర్వహించింది. ఓఎఫ్ బిజెపీ జాతీయ యువకన్వీనర్ శ్రీ హరి సేథీ గారు, ఓఎఫ్ బిజెపీ జాతీయ యువసహా -కన్వీనర్లు శ్రీ దీప్ భట్, శ్రీ విలాస్ రెడ్డి జంబులగార్లు,ఓఎఫ్ బిజెపీ న్యూ జెర్సీ యువ సహా -కన్వీనర్ శ్రీ శ్రీకాంత్ రెడ్డి గారు, ఓఎఫ్ బిజెపీ సోషల్ మీడియా టీంనుండి శ్రీ దిగంబర్ ఇస్లాంపురే గారు , న్యూయార్క్ నుండిశ్రీ భాస్కర్ మరియు వారి మిత్రబృందం పాల్గొన్నారు.

ofbjp-outreach-program-in-new-york-1 ofbjp-outreach-program-in-new-york-2