అనంతమైన ఆలంబనకు, అతీతమైన ప్రేమకు, ఊహించలేని మంచితనానికి, సోధించలేని సహనానికి, సరైన సాత్వికతకు, అలుపెరుగని అనురాగాలకి, అక్షరబింబమైన రెండు అక్షరాల మాట ‘అమ్మ’. అది అవనిలో పరిపూర్ణ సుస్వరాల మూట. తల్లిగా, చెల్లిగా, భార్యగా, గృహిణిగా, సమాజ సేవకురాలిగా …ఇలా ఏ పాత్రలోనైనా అలవోకగా ఇమిడిపోయి మనలను అలరించే ఆ స్త్రీ మూర్తిని మనసారా అభినందించడం మన కనీస విధ్యుక్త ధర్మం.

ఈ సందేశాత్మక విషయాలను మరొక్కసారి మననం చేసుకోవాలనే సంకల్పంతో, మే 7వ తేదీ, శాక్రమెంటో లోని సెంటర్ ఎట్ 2300 ఆడిటోరియం లో మొట్టమొదటిసారిగా ఎవ్వరూ ఊహించని రీతిలో నటోమాస్ గ్రూప్ వారిచే మాతృదినోత్సవ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. దాదాపు 400 మంది ఆహుతులతో థియేటర్ కళకళలాడింది.

‘Natomas Group - Mother's Day Event 2016, Sacramento, California (1) ‘Natomas Group - Mother's Day Event 2016, Sacramento, California (2) ‘Natomas Group - Mother's Day Event 2016, Sacramento, California (3) ‘Natomas Group - Mother's Day Event 2016, Sacramento, California (4)

ఈ మాతృదినోత్సవ సందర్భంగా అమ్మ ఇతివృత్తంతో రూపొందించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా వుండి అందరినీ అలరించి, కార్యక్రమం చివరివరకూ అదే స్ఫూర్తిని కొనసాగించాయి.

ఈ కార్యక్రమానికి మణిహారం ప్రముఖ తెలుగు ప్లే బ్యాక్ సింగర్,  శ్రీమతి ఉష గారి పాటల కచ్చేరి.  ఉష గారి అనుభవపూర్వక సమయస్ఫూర్తితో, చలోక్తులతో, సుమధుర పాటలతో ఈ చల్లని సాయంకాలం అతిధులందరూ ఎంతో మనోల్లాసంతో మధురానుభూతిని పొందారు. మరో గాయకుడు వంశీ కూడా తన గాన మాధుర్యంతో అందరినీ అలరించారు. ఇక జానపద పాటల గాయని శ్రీమతి స్నేహలత మురళి తన జానపదాలతో అందరిలో ఎంతో ఉత్సాహాన్ని నింపారు.

ఈ కార్యక్రమానికి స్థానిక ప్రముఖులు శ్రీమతి పల్లవి పెండ్యాల, శ్రీమతి రజని ఘోరకవి మరియు శ్రీమతి కవిత కొండ్లె ముఖ్య అతిధులుగా విచ్చేశారు.

ఈ కార్యక్రమ కర్త అయిన శ్రీ వెంకట మేచినేని గారి వోట్ అఫ్ థాంక్స్ తో ఈ కార్యక్రమం ముగిసి, ఈ ఉత్సవానికి విచ్చేసిన మాతృమూర్తులందరికీ ఎన్నో వెలకట్టలేని అనుభూతులను మిగిల్చింది.