తెలుగు వారందరికీ చిరపరిచితుడూ, ఈకాలపు చలనచిత్ర గేయరచయితల్లో ప్రముఖుడూ అయిన చంద్రబోస్ గార్ని కలిసే ఒక మంచి అవకాశాన్ని రిథం అండ్ మెలడీస్ మీకు అందిస్తోంది.
మౌనంగానే ఎదగమని మొక్కలనుంచి జీవిత పాఠాలు నేర్చుకోవాలన్నా, కళ్ళు కళ్ళు ప్లస్సు అని ప్రేమ పాఠాలు నేర్చుకోవాలన్నా, కలలోనైనా కలగనలేదే నువు వస్తావని అని ప్రేమికుడు అబ్బురపడ్డా, లక్ష్మీ బావా, లక్ష్మీ బావా నిన్నేపెళ్ళాడ్తా అని మరదలు ఆశపడ్డా
అది చంద్రబోస్ గారి కలంలోనుంచి జారిపడినప్పుడే పాటకు అందం, సన్నివేశానికి పరమార్ధం కలుగుతుంది అన్నంతగా అందరినీ మెప్పించిన రచయిత మనల్ని కలవడానికీ,  తన రచనానుభవాలు మనతో పంచుకోవడానికీ వస్తున్నారు. Meet & Greet with Chandrabose in Los Angeles March 12th 2016 సంగీతమే సేవగా, సేవే సంగీతంగా అనేక కార్యక్రమాలు చేస్తున్న రిథం అండ్ మెలడీస్  మీకు అందిస్తోన్న గొప్ప కార్యక్రమం Rancho Senior Center,3 Ethel Coplen Way, Irvine, CA 92612 Saturday, March 12, 2016 7 PM - 10 PM వివరాలకు: సుధీర్ కోట, రిథం అండ్ మెలడీస్ అధ్యక్షుడు (949) 892-9313