జనవరి 16 శనివారం నాడు జరిగే లాటా వారి సంక్రాంతి మేళాకి ఇదే లాటా వారి సాదర ఆహ్వానం

రంగు రంగుల రంగ వల్లులు,
జంట సన్నాయిల జోడు మేళం,
డూడూ బసవన్న ల ఆట పాటలు,
హరి దాసుల కీర్తనలు ,
గాలి పటాల రెప రెపలు,
నూరూరించే తిను బండరాలు

వీటిని మీ జ్ఞాపకాల కలల నుండి మీ కళ్ళ ముందుకు తీసుకు వస్తోంది లాటా!

తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక గ నిలిచే సంక్రాంతి వేడుకలు, మీ చిన్న నాటి జ్ఞాపకాలు మరియు తెలుగు వారి పల్లెటూర్లు… ఇవన్నీ లాటా సంక్రాంతి మేళా లో మిమ్ముల్ని అలరించనున్నాయి! కావాల్సిందల్లా తెలుగు దనాన్ని తట్టి లేపే మీరు, మీ బంగారు పాపలు మరియు బాబులే!!!!

ఇక ఎందుకు ఆలస్యం?? జనవరి 16 న జోర్డాన్ హై స్కూల్, లాంగ్ బీచ్ కి విచ్చేయండి.

ఆయురారోగ్యాలతో, భోగ భాగ్యలతో, సిరి సంపదలతో తెలుగు వారంతా వర్దిల్లాలని మీ లాటా మనస్పూర్తిగా చేస్తున్న ఈ సంక్రాంతి కార్యక్రమానికి మీరంతా వచ్చి దిగ్విజయం చేయాలనీ మనవి!

సంక్రాతి మేళా ముఖ్య విశేషాలు

  • పల్లెటూరు సంక్రాంతి ని మైమరిపించేల రంగు రంగుల రంగ వల్లులు, గొబ్బెమ్మలు, అరటి తోరణాలు.
  • బొబ్బట్లు, పూత రేకులు, గారెలు మరియు పాయసం తో పసందైన, రుచికరమైన తెలుగు వారి విందు భోజనము.
  • పిల్లలు మరియు పెద్దల కొరకు పలు రకాల ఆటలు మరియు తిను భండారాల దుకాణములు
  • దద్దరిల్లే దరువులు…గణ గణ మనే చక్క భజనలు…
  • కళ్ళు చెదిరే వస్త్ర దుకాణాలు…
  • అందరిని అలరించే సాంస్కృతిక కార్యక్రమాలు

మరెందుకు ఆలస్యం, తెలుగు వారి పెద్ద పండుగ మరియు పెద్దల పండుగకు చిరునవ్వులు చిందించే చిన్నారులతో కలిసి తెలుగు వారి సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే సాంప్రదాయ వస్త్రాధరణ తో( పట్టు పావడాలు, చీరెలు, ధోవతులు ), నవ్య కాంతి ని నింపే సంక్రాంతి వేడుకలలో పాల్గొనాలని లాటా మీ అందరినీ ఆహ్వానిస్తుంది .

LATA Sankaranthi Mela Event in Los Angeles on Jan 16 2016