TASC దీపావళి సంబరాలలో (October 25th evening) ఘంటసాల వారి మధుర గీతాలకు అంతర్జాతీయ నృత్య కళాకారులచే “సమర్పణం” అనే బృంద నాట్య కార్యక్రమం ఉంటుంది. శ్రీమతి పార్వతీ రవి ఘంటసాల (గాయకుడు ఘంటసాల గారి కోడలు), ఆ బృందానికి నాయకత్వం, దిశానిర్దేశం చేస్తారు. ఆ అత్యంత ప్రతిష్టాకరమైన నృత్యరూపకంలో పాల్గొనేందుకు మన దక్షిణ కాలిఫోర్నియా లోని ఔత్సాహిక నాట్య కళాకారులకు ఒక అరుదైన, అపురూపమైన అవకాశం ఉంది. శ్రీమతి పార్వతి గారు, తోటి కళాకారులు కొందరు Los Angeles కి విచ్చేసియున్నారు. October-15 నుండి, Dance Practice Sessions ఉంటాయి. సుమారుగా ప్రతిరోజు సాయంత్రం రెండు గంటలపాటు, వచ్చే పది రొజులు ఉంటాయి.

 మీకు కూచిపూడి, భరతనాట్యం, కధకళి, కధక్ ఇటువంటి ఎటువంటి నృత్య రూపకంలో ప్రవేశం ఉన్నా మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఆడిషన్ ద్వారా గుర్తించి, ఆ పైన టీం లోకి తీసుకోవడం జరుగుతుంది.

ఆసక్తి గలవారు డా. సింధూరి జయ సింఘే గారిని, # 562-841-0504 లో సంప్రదించండి.

Samarpanam in association with TASC in Los Angeles