గాన గంధర్వుడు “పద్మ భూషణ్” డా. ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం గారి “సంగీత విశ్వ రూపం” ప్రత్యక్షంగా వీక్షించి, వీనుల విందుగా మైమరచిపోయే రెండు అపురూప అవకాశాలు వచ్చే నెల ఆగస్టులో హ్యూస్టన్ వాసులకి దక్కనున్నాయి.

నెల మొదట్లో , అంటే ఆగస్ట్ 1 & 2 , 2015 (శని, ఆదివారాలలో) ఒక్కొక్కటీ సుమారు మూడేసి గంటల సేపు నిర్విరామంగా రోజుకి మూడేసి చొప్పున, రెండు ప్రాంగణాలలో జరుగుతున్న “పాడుతా తీయగా” కార్యక్రమంలో 13-16 ఏళ్ల వయస్సులో ఉన్న అమెరికా యువ గాయనీ గాయకుల పోటీలలో బాలూ గారు తన అద్వితీయ సినీ సంగీత పరిజ్ఞానాన్నీ, వాయిద్యాలు, సాంకేతిక పరికరాలకి అనుగుణంగా శ్రోతలని రంజింపజేసే ఉన్నత స్థాయిలో పాట పాడే పద్ధతిలో ఔత్సాహిక, భావి తరాల గాయనీ గాయకులకి సూచనలు, శిక్షణా ఇచ్చి ఉత్తేజం కలిగిస్తారు. పూర్తి వివరాలు ఇందుతో జత పరిచాం. ఇటువంటి అవకాశం ఎంత అపురూపమైనదో మీకు ప్రత్యేకంగా చెప్పక్కర లేదు కదా!

ఇక రెండో అపురూపమైన కార్యక్రమం నెలాఖరున, అంటే ఆగస్ట్ 30, 2015 నాడు ఎస్.పి, బాలూ గారు, సునీత, శ్రావణ భార్గవి & హేమచంద్ర, గీతా మాధురి, తనయుడు ఎస్.పి. చరణ్, మనో, & మాళవిక మొదలైన, సుప్రసిద్ధ గాయనీ గాయకుల బృందం తో సమర్పిస్తున్న “స్వరాభిషేకం” కార్యక్రమం. గాన గంధర్వుడు స్వయంగా తన అద్భుతమైన గాత్రంతో మిమ్మల్ని మైమరపింప చేసే ఈ కార్య్యక్రమం పూర్తి వివరాలు కూడా ఇందుతో జతపరిచాం.

హ్యూస్టన్ వాసులందరినీ ఈ సంగీత విభావరి కార్యక్రమాలకి పెద్ద సంఖ్యలో తరలి వచ్చి, ఆనందించి ఆర్థికంగా సమర్థించమని కోరుతున్నాం.

etv padutha teyaga in hustonswaribhishekam in huston