Telugu Community News
Telugu Community News

తెలంగాణ కెనడా సంఘం ఆధ్వర్యంలో 12 జనవరి 2019  శనివారం రోజున కెనడా దేశం గ్రేటర్ టోరొంటో లోని  పోర్టుక్రెడిట్ సెకండరి పాఠశాల ఆడిటోరియంలో 800 మందికి పైగా ప్రవాస తెలంగాణా వాసులు  సంక్రాంతి పండుగ మరియు తీన్మార్ సాంస్కృతిక ఉత్సవాలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు.

ఈ పండుగ సంబురాలు తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ రమేశ్ మునుకుంట్ల  ఆధ్వర్యంలో జరుగగా తెలంగాణ కెనడా అసోసియేషన్ ఫౌండేషన్ కమీటీ అధ్యక్షులు శ్రీ శ్రీనివాసు తిరునగరి, ట్రుస్టీ బోర్డు అధ్యక్షులు శ్రీ హరి రావుల్, ఉపాధ్యక్షులు శ్రీ విజయకుమార్ తిరుమలాపురం , కార్యదర్షి శ్రీ శ్రీనివాస్ మన్నెం, కోషాధికారి శ్రీ దామోదర్ రెడ్డి మాది, సాంస్కృతిక కార్యదర్షి శ్రీమతి దీప గజవాడ,  డైరెక్టర్లు శ్రీ మనోహర్ భొగా, శ్రీ  శ్రీనివాస్ చంద్ర, శ్రీమతి మంగ వాసం, శ్రీ మూర్తి కలగోని, శ్రీ గణేశ్ తెరాల, ట్రస్టీలు శ్రీ సురేశ్ కైరోజు, శ్రీ వేనుగోపాల్ రెడ్డి ఏళ్ళ, శ్రీ కిరణ్ కుమార్ కామిశెట్టి మరియు శ్రీ నవీన్ ఆకుల ,   ఫౌండర్లు  శ్రీ కోటేశ్వరరావు చిత్తలూరి,  శ్రీ చంద్ర స్వర్గం, శ్రీ దేవేందర్ రెడ్డి గుజ్జుల, శ్రీ రాజేశ్వర్ ఈద, అథీక్ పాష , శ్రీ ప్రభాకర్ కంబాలపల్లి, కలీముద్దిన్, శ్రీ వేణుగోపాల్ రోకండ్ల, శ్రీ సంతోష్ గజవాడ, శ్రీ నవీన్ సూదిరెడ్డి, శ్రీ ప్రకాశ్ రెడ్డి చిట్యాల పాల్గొన్నారు.

ఈ సంక్రాంతి సంబరాలలో పిల్లలకు భోగిపండ్ల కార్యక్రమముతో ఆశీర్వదించారు మరియు సంస్థ నిర్వహించిన ముగ్గుల పోటీలలో మొదటి బహుమతి శ్రీమతి అనుపమ పబ్బ గారు గెలుచుకున్నారు. ఈ సందర్బంగా సాంస్కృతిక కార్యదర్షి శ్రీమతి దీప గజవాడ మరియు ఉపాధ్యక్షులు శ్రీ విజయకుమార్ తిరుమలాపురం ఆద్వర్యంలో మూడు గంటలపాటు చక్కటి సాంస్కృతిక కార్యక్రమములను నిర్వహించగా సభా సమయం మొత్తానికి ఆంకర్లుగా కుమారి మేఘ స్వర్గం మరియు శ్రీమతి హారిక నిర్వహించారు.

ఈ సందర్బంగా తెలుగు తిధి లతో కూడిన టోరొంటో సమయముతో అసోషియేషన్ 2019 క్యాలెండరును ఆవిష్కరించారు.

ఈ ఉత్సవాలలో తెలంగాణ కెనడా సంఘం అత్యంత రుచికరమైన భోజనాలను ఏర్పాటు చేసింది. చివరగా అధ్యక్షులు శ్రీ రమేశ్ మునుకుంట్ల వందన సమర్పణతో బతుకమ్మ ఉత్సవాలు ముగిసాయి.

SOUTH ASIAN REPUBLICAN COALITION STARTS UP WITH A VERY SUCCESSFUL FUNCTION

 

The South Asian Republican Coalition, popularly known as SARC, kicked off its formation with a rally/dinner at the Royal Albert’s Palace in Edison on December 29th.  Several hundreds of people from Republican Party and from South Asian Communities were in attendance.  The purpose of this SARC is to bring South Asian Americans, (from India, Pakistan, Sri Lanka, Bangladesh, Maldives, Afghanistan, Bhutan, Nepal and other countries together on one platform for strong voice, to create awareness among South Asian Americans to actively participate in main stream American’s political life and to believe in core values and principles of Republican Party and to support and promote it. SARC was founded by Mr. Hemant Bhatt in March, 2018 who is Businessman, Political operative, Activist and also Founder and President of TrumpMyPresident.com, Director, Immigration Relations, America Winning Coalition, Founder, President and CEO of fearmanagement.org and the Managing Director of Quick Insurance Agency. Mr. Pinakin Pathak who is a proven and renowned businessman, community leader and philanthropist and Mr. Sridhar Chillara who is profound businessman, a well known media personality, community leader, Founder and CEO of Mana TV, Mana TV International, TV5 International have joined hands with Hemant Bhatt in December, 2018 as Co-Founders of SARC to achieve SARC’S Mission and Goals and Objectives.

Mr. Bhatt, in his welcome address, said to the excited audience that America is at cross roads and said South Asian Americans have the interests of America First and are committed to make America proud, safe, strong, wealthy and great. America is is land of opportunity for all and South Asians will not leave any stone unturned to repay mother America what they have gotten from here. In U.S., there are about 20 Million South Asian Americans and are growing very fast. He further stated We, at SARC believe that a vital democracy requires an informed electorate, civil discourse and bold thinking. Mr. Bhatt called the supporters of SARC are an extraordinary team of enlightened individuals, entrepreneurs, educators and middle class working persons who will create awareness of the issues our great nation is facing to make our nation proud. What U.S. President Donald J. Trump and his Administration are doing will be done by any head of any nation will do in the best interests of nation and its people. He also emphasized to create awareness among South Asians and legal immigrants who become citizens to register them as Republicans.

 

Mr. Steven Rogers, Chairman of America Winning Coalition, Member of President Donald J. Trump Advisory Board 2020 and a retired law enforcement official given the keynote address and narrated the achievements and accomplishments of President Mr. Trump and his Administration and enlightened the audience about the contribution made by South Asians in the main stream America for its economic growth. He emphasized that this great nation America has proven Capitalism and Socialism which is failed world over should not be promoted in America. He blessed the launch of SARC and encouraged the audience to reelect President Mr. Trump in 2020.

 

Padmashri Dr. Sudhir Parikh, a well known community leader, philanthropist and CEO of ITV Gold, Desi Talk and other media publications has congratulated SARC team on its launch and inspired them to work hard to take SARC at next level. He recalled how he has supported the Republican Party in past and emphasized to do more for the Republican Party. He also said he is with SARC and will do everything for its success.

 

Mr. Pathak very excitedly cheered the gathering and laid down the mission and objectives of SARC. He further appealed audience to promote Republican Party’s agenda, and to revitalize the interests in politics by actively engaging individuals, organizations and the media in pursuit of bringing the solutions to economic, racial and social justice issues.He also encouraged the members of the audience to visit SARC’s web site and make free registration as members of the SARC to strengthen its movement.

 

Mr. Chillara, while thanking the invited distinguished guests and members of the audience to come out on a day falling in peak Holidays to attend the SARC launch, invited all sections of the South Asian Communities nationwide to join SARC for better future. He also laid down the goals & talked about the importance of SARC for South Asian communities. He thanked everyone who supported to make this event happen which was a great grand success. 

 

Sanjiv Pandya, a well known media personality and a community leader very marvelously conducted the entire event to its end and filled the event gaps with nice commentary about his political insight

in current environment prevailing in our country.

 

If you, or someone you know may be interested in getting involved, they should contact [email protected]. Membership for SARC is free. For free membership and for further information, please visit SARC website: www.sarcusa.org or send email at [email protected]

0 137

కాలిఫోర్నియా రాష్ట్రం లో ఉన్న శాక్రమెంటో తెలుగు సంఘం (టాగ్స్) 15 వ వార్షికోత్సవం మరియు సంక్రాంతి సంబరాలసందర్భం గా “మనం” సంస్థ సహకారంతో రూపుదిద్దిన “రంగస్థలం” నాటకం ఆహుతులను విశేషం గా ఆకట్టుకొన్నది. రంగవల్లులు,సంక్రాంతి జట్కా బండి, పాలవెల్లి సెట్టింగ్, మరియు 450 కు పైగా ఉన్నకళాకారులు చేసిన సందడితో సంక్రాంతి వేడుకల ప్రాంగణం లోఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. స్థానిక ఫోల్సోం నగరం లోఉన్న ఫాల్సం హై స్కూల్ ధియేటర్ లో శనివారం జనవరి 19 వతేది 2019 మధ్యాన్నం 12 గం కు మొదలైన సంక్రాంతి సంబరాలు రాత్రి 11 గం వరకు కొనసాగాయి.

శాక్రమెంటో తెలుగు సంఘం సంక్రాంతి సంబరాల లోప్రదర్శించిన ముఖ్యాంశాలు:

1.మనం సంస్థ సహకారంతో టాగ్స్ రూపుదిద్దిన “రంగస్థలం” నాటకం

  1. వేదిక పై రాధా సమేత కృష్ణ, బృందావనం లో గోపాలుడు, అన్నమాచార్య గీతా మాధురి, సాంప్రదాయ తెలుగు జానపదాలు మరెన్నొ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతోఆకట్టుకున్న450 మందికి పైగా స్థానిక కళాకారులు
  2. ప్రతిభావంతులైన స్థానిక తెలుగు బాలలకు పురస్కారాలు
  3. స్థానిక డేవిస్ నగరంలో ఉన్న ప్రీతి ఇండియన్ రెస్టారెంట్ వారిచే తెలుగు పండుగ భోజనం

సంక్రాంతి వేడుకల సందర్భం గా టాగ్స్ అధర్వంలో జరిగినసాంస్కృతిక కార్యక్రమాలు,  స్థానిక డేవిస్ నగరం లో ఉన్న స్థానిక ప్రీతి ఇండియన్ రెస్టారెంట్ వారు వండిన నొరూరుంచే గోంగూర, అరిసె, బొబ్బట్టు, గారెలతో కూడిన పసందైన తెలుగు వంటకాలు, మరి ఇంకెన్నోవిశేషాలతో ఆహుతులను అలరించాయి. కదలి రండి, కలసి రండి, సంక్రాంతి సంబరాన్ని ఉమ్మడిగా జరుపుకొందాము అని టాగ్స్ఇచ్చిన పిలుపుకు స్పందించిన స్థానిక తెలుగు కుటుంబాలు 1500 మందికి పైగా వేదిక కు తరలి వచ్చారు. ఈ సందర్భంగా గృహహింస కు బలైన అతివలను ఆదరించే కాలిఫోర్నియా లో ఉన్న స్థానిక “మై సిస్టర్స్” స్వచ్చంద సంస్థ అధికారి “సిత్రా త్యాగరాజయ్య”, 100 కు పైగా తెలుగు పుస్థకాలు రచించిన స్థానిక తెలుగు రచయిత “శ్రీ వంశీ మోహన్ మాగంటి”, సిలికానాంధ్ర  యువత సేవల ఉప అధ్యక్షురాలు శ్రీమతి స్నేహ వేదుల , సిలికానాంధ్ర వాగ్గేయకారుల సేవల విభాగం డైరక్టర్ శ్రీ వంశీ కృష్ణ నాదెళ్ళ, ప్రియమైన అతిధులు గా విచ్చేసి ఆహుతులకు వారి సంక్రాంతి సందేశం మరియూ  శుభాకాంక్షలు అందజేశారు. వారందరూ స్థానిక తెలుగుకళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలకు అచ్చెరువొందారు. టాగ్స్ కార్యవర్గ సభ్యులు వారందరినీ వేదిక పై ఆహ్వానించి ఘనం గా సన్మానం గావించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా “శ్రీ వంశీ మోహన్ మాగంటి” మాట్లాడుతూ   మనదైన తెలుగు కధ, కవిత్వం, సాహిత్యం, సంప్రదాయాలను తరువాతి తరం బాలబాలికలకు  అందజేయాలని నొక్కి చెప్పారు. సిలికానాంధ్ర గ్లోబల్ టీం సభ్యులు శ్రీ వాసు కూడుపూడి మాట్లాడుతూ  కూచిపూడి గ్రామం లో శరవేగంగా నిర్మాణమౌతున్న మల్టి స్పెషాలిటీ ఆసుపత్రి “సంజీవిని” రెండవ దశ నిర్మాణంలో పాలుపంచుకోవాలని ఆయన స్థానిక తెలుగు వారికి విజ్ఞప్తి చేశారు. కూచిపూడి గ్రామం చుట్టుపక్కల ఉన్న 150 గ్రామాలకు ఆరోగ్య సమస్యలు తీర్చే ఉద్దేశ్యంతో “సంజీవిని” ఆసుపత్రి బృహుత్ యజ్ఞానికి శ్రీకారం చుట్టామని ఆయన చెప్పారు. దాదాపు 500 కుటుంబాలకు పైగా ఉద్యోగ అవకాశాలనుకల్పించడమే కాకుండా చిన్న పిల్లలకు, మహిళలకు ఉపయోగపడే రీతిలో “సంజీవిని” ఆసుపత్రి ని తీర్చి దిద్దుతామని, ఇందుకు సహాయం చేయదలచినవారు నేరుగా సిలికానాంధ్ర ను సంప్రదించాలని శ్రీ వాసు కూడుపూడి విజ్ఞప్తి చేశారు.

 

టాగ్స్ చైర్మన్ అనిల్ మండవ, వైస్ చైర్మన్ మల్లిక్ సజ్జనగాండ్ల,  ప్రెసిడెంట్ నాగ్ దొండపాటి, సెక్రటరీ దుర్గా చింతల, కోశాధికారి మోహన్ కాట్రగడ్డ , సమాచార అధికారి రాఘవ చివుకుల  నేతృత్వంలో టాగ్స్ కార్యవర్గం ఈ సందర్భంగా  ప్రియమైన అతిధులందరికీ జ్ఞాపికలు అందజేసి ఘనసన్మానం గావించింది. శ్రీ శ్రీనివాస కళ్యాణోత్సవం సంధానకర్త శ్రీమతి ఉష మందడి ని టాగ్స్ కార్యవర్గం ఘనంగా సత్కరించింది. అనంతరం రంగస్థలం నాటికలో పల్లెటూరి రచ్చబండ సమావేశం సెట్టింగ్, పాత్రధారుల  వేషధారణ, నటన, నృత్యాలతో 50 మందికి పైగా మనం సంస్థ, స్థానిక కళాకారులు చేసిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకొంది.

ఈ సందర్భం గాప్రతిభావంతులైన పిల్లలను పోత్సహించే గత సంప్రదాయాన్నిపాటిస్తూ, టాగ్స్ కార్యవర్గ సభ్యులు ఎంపిక చేసిన స్థానికప్రతిభావంతులైన హైస్కూల్ పిల్లలు “విశృత్ నాగం, తనూష తొల్లా, ఆష్మిత రెడ్డి, హర్షిత మదుగంటి, శ్రేయ నాగులపల్లి” లకు జ్ఞాపికలు అందజేశారు. టాగ్స్ సౌజన్యం తో జరుగుతున్న శాక్రమెంటో శివారు నగరాలైన స్థానిక ఫాల్సం, రోసివిల్లి, నాటోమాస్, ఎల్ డోరాడొ  సెంటర్లలో చదువుతున్న సిలికానాంధ్ర మనబడి విద్యార్థులు చక్కని తెలుగు పద్యాలు, కధలు, పాటలు వేదికపై ప్రదర్శించారు. స్థానిక వీఎంబ్రేస్స్వచ్చంద సంస్థ వద్ద శిక్షణ పొందుతున్న ఆటిజం ఆరిన పడ్డ దివ్యాంగులైన చిన్నారులచే ప్రదర్శించబడ్డ నృత్యప్రదర్శన కు  ఆహుతులు అందరూ చప్పట్లతో ప్రోత్సహించారు. అలేఖ్య పెన్మత్స, శృతి సేథి ఈ చిన్నారులకు నృత్య శిక్షణ ఇచ్చారు.  టాగ్స్ సమాచార అధికారి రాఘవ చివుకుల సమర్పణ గావించారు. అంతకు మునుపు శనివారంజనవరి 12న శ్రీ శ్రీనివాస కల్యాణోత్సవాన్ని అదే వేదిక ప్రాంగణంలో ఉదయం 9 గం కు టాగ్స్ ఘనంగా నిర్వహించింది. .  ఈ కార్యక్రమం కోసం స్టాక్ టన్ శివ విష్ణు దేవాలయం నుండి విచ్చేసిన పూజారులు  శ్రీ శ్రీనివాస కళ్యాణోత్సవం పూజ ను నిర్వహించారు. పూజానంతరం  ప్రత్యేకంగా తయారుచేసిన తీర్ధ ప్రసాదాలను భక్తులకు టాగ్స్ కార్యకర్తలు అందజేశారు. అనంతరం జరిగిన చిన్నారులకు  భోగిపళ్లు కార్యక్రమం లో పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. రేగిపళ్ళు, పూలు, అక్షంతలతో చిన్నారులను పూజకు విచ్చేసిన  అందరూ ఆశీర్వదించారు.  

కాలిఫోర్నియా శాక్రమెంటోలో సంక్రాంతి సంబరాలు, శ్రీ శ్రీనివాస కల్యాణోత్సవ విజయవంతం కు  అహర్నిశలు కృషి చేసిన వారిలో టీఏజిఎస్ కార్యవర్గ సభ్యులు, మరియు టాగ్స్ కార్యకర్తలు ఉన్నారు

ఈ సందర్భం గా టాగ్స్ కార్యనిర్వాహక సభ్యులు అనాధ భారతీయ బాలబాలికలకు సహాయార్ధం హోప్ ఎబయ్డ్స్, ఆరతి స్వచ్ఛంద సంస్థ, హైదరాబాద్ లో ఉన్న వేగేశ్న ఫౌండేషన్, రెండు తెలుగు రాష్ట్రాల గ్రామాలలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్న సువిధా ఇంటర్నేష్నల్ ఫౌండేషన్, మరియు “వీఎంబ్రేస్” స్వచ్ఛంద సంస్థ కు టాగ్స్ ప్రత్యేకం గా విరాళాలుఅందజేస్తుంది అని, ఈ సంస్థలకు సహాయార్ధం విరాళం ఇవ్వదలచిన వారు మరింత సమాచారం కోసం [email protected] కు ఈమెయిలు లో సంప్రదించాలని టాగ్స్ కార్యనిర్వాహక సభ్యులు కోరారు.

తెలుగు అలయన్స్అఫ్ కెనడా (తాకా) రంగ రంగ వైభోగంగా సంక్రాంతి సంబరాలు, చింగస్కీ సెకండరీ స్కూల్, భ్రాంప్టెన్, కెనడా లో జనవరి 19, 2019 న జరుపు కొన్నారు. ఈ సంబరాలను -30 డిగ్రీల చలిలో కూడా తెలుగు వారందరు వచ్చి  వేడుకలను విజయవంతం చేసారు. తాకా కార్యదర్శి నాగేంద్ర హంసాల ఆహ్వానించగా, కల్పనా మోటూరి, రజని లయం, ముంతాజ్ బేగం,సుష్మ, మరియు అర్చన గార్లు దీప ప్రజ్వలన చేయగా సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. తాకా వారు కార్యక్రమానికి వచ్చిన చిన్నపిల్లలకు డైరెక్టర్స్ దీపా సాయిరామ్ మరియు వాణి జయంత్ భోగి పళ్ళ కార్యక్రమమును  మంగళ వాయిద్యాల మద్య ముత్తయిదుల చే ఆశీర్వదింప చేసారు. తాకా కార్యవర్గం సంక్రాంతి పండుగ మీద వ్యాస రచన పోటీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

 

తాకా అద్యక్షులు శ్రీ అరుణ్ లయం గారు సంక్రాంతి  మరియు  తెలుగు సంస్కృతి  గురించి  సభికులను ఉద్దేశించి ప్రసంగించారు మరియు ఈ సంవత్సరపు దాతలను సభకు పరిచయం చేసారు. ఈ సంబరాలలో తాకా పూర్వ అద్యక్షులు శ్రీ చారి సామంతపూడి మరియు శ్రీ గంగాధర్ సుఖవాసి ప్రత్యేకంగా టొరోంటొ ఘడియలుతో చేపించబడిన  తెలుగు క్యాలెండర్నిఆవిష్కరించారు. ఈ సంబరాలలో  తాకా  సాంస్కృతిక కార్యదర్శి దీప సాయిరాం మరియు వాణి జయంత్ ఆధ్వర్యం లో దాదాపు 20  సాంస్కృతిక  కార్యక్రమాలు  తోటి  తెలుగు వారితో  నాటికలు, సినిమా డాన్సులు, పాటలు ఆరు గంటల పాటు ఎంతో ఉత్సాహమంతమైన వాతావరణం లో ప్రదర్శించ బడ్డాయి. అచ్చ తెలుగు వంటకాలు మరియు అరిసెలతో తాకా వారు భోజనాలని ఏర్పరిచారు.                                                              

ఎంతో అద్భుతంగా చేపట్టి మరియు విజయవంతం చేసిన ఫుడ్ కమిటీ శ్రీ సురేష్ కూన, సాంస్కృతిక కమిటి దీప సాయిరాం మరియు వాణి జయంత్, క్యాలెండర్ కమిటీ శ్రీ  గంగాధర్ సుఖవాసి మరియు ఉపాధ్యక్షులు దుగ్గిన రామచంద్రరావు , తాకా కోశాధికారి కల్పనా మోటూరిలను,రిజిస్ట్రేషన్ కమిటీ సభ్యుడు రాఘవ్ అల్లం లను   తాకా అద్యక్షులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇతర ట్రస్టీ సభ్యులు శ్రీబాషా షేక్, శ్రీ రాంబాబు కల్లూరిని, శ్రీ కిరణ్ కాకర్లపూడి, ఇతర వ్యవస్థాపక సభ్యులు శ్రీ శ్రీనాథ్ కుందూరు, శ్రీ రమేష్ మునుకుంట్ల గార్లు పాల్గొని కార్యవర్గానికి ఎంతో సహకరించారు. తాకా కమిటీలు ఈ సంక్రాంతి సంబరాలను  ఎంతో శ్రమకోర్చి కెనడా లోని  తెలుగు వారి కోసం  ఏర్పాటు చేసారు. చివరిగా అందరికి  ధన్యవాదాలు చెపుతూ జనగణమన  జాతీయ గీతంతో  కార్యక్రమాలు  ముగించారు.

0 100
డాలస్ లో సంబరాల కోసం మేము సైతమన్న తెలుగుప్రజలు
 
డాలస్, జనవరి 20: అమెరికా తెలుగు సంబరాలకు నాట్స్ విసృత్తంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అమెరికాలో పెద్ద ఎత్తున నిర్వహించిన అమెరికా తెలుగు సంబరాల కోసం నాట్స్ డాలస్ నగరంలో ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇర్వింగ్ వేదికగా వచ్చేమే 24,25,26 తేదీల్లో నాట్స్ అమెరికా తెలుగు సంబరాలను నిర్వహించనుంది. దీంతో స్థానికంగా ఉండే తెలుగు ప్రజలంతా ఈ సంబరాల్లో పాల్గొనేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. డాలస్ లో నిర్వహించిన ఫండ్ రైజింగ్ కు  విశేష స్పందన లభించింది. దాదాపు 6,00,000 డాలర్ల  విరాళాలను ఇచ్చేందుకు నాట్స్  సభ్యులు, తెలుగు ప్రజలు తమ సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇప్పటికే 5 తెలుగు సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించిన నాట్స్ 6వ తెలుగు సంబరాలను కూడా అంతే వైభవంగా నిర్వహించేందుకు భారీ కసరత్తు చేస్తోంది. సంబరాలు ఎలా ఉంటాయనేది తెలుపుతూ అమెరికా తెలుగు సంబరాల కర్టన్ రైజర్ ఈవెంట్ జరిపారు.ఈ ఈవెంట్ లోనే ఫండ్ రైజింగ్ కూడా చేశారు.దీనికి విచ్చేసిన స్థానిక తెలుగు ప్రజలంతా ముక్తకంఠంతో సంబరాలకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
 
 నాట్స్ బోర్డు డైరక్టర్, ఫండ్ రైజింగ్ డైరక్టర్ అయిన ఆది గెల్లి ఈ కార్యక్రమానికి వచ్చిన అతిధులను పరిచయం చేశారు. ఆలాపన టీం… ఈ ఈవెంట్లో సంగీత మధురిమలు పంచింది. ఇదే వేదికపై నాట్స్ డాలస్ చాప్టర్2019-20 నాయకత్వాన్ని కూడా నాట్స్ ప్రకటించింది.
డాలస్ చాప్టర్ కో ఆర్డినేటర్ గా అశోక్ గుత్తా, సెక్రటరీగా డీవీ ప్రసాద్, హెల్ఫ్ లైన్ కమిటీ చైర్మన్ గా సత్య శ్రీరామనేని, కో ఛైర్మన్ గా రవి తాండ్ర, రాజీవ్ కంభంను నియమించింది. స్పోర్ట్స్  ఛైర్మన్ గా శ్రీనివాస్ కాసర్ల, సత్య శ్రీరామనేని, మహిళా సాధికారిత ఛైర్మన్ గా కవితాదొడ్డా, వెబ్ కమిటీ ఛైర్మన్ గా శ్రీథర్ నేలమడుగుల, సోషల్ మీడియా అండ్ మార్కెటింగ్ ఛైర్మన్ గా విజయ్ కొండ, కల్చరల్ కమిటీ ఛైర్మన్ ఆర్య బొమ్మినేని, కమ్యూనిటీ సర్వీసెస్ ఛైర్మన్ గా రాజేంద్ర యనమదల కు బాధ్యతలు అప్పగించింది. ఇంకా ఈ  ఈ కార్యక్రమంలో నాట్స్ తెలుగు సంబరాల కన్వీనర్ కిషోర్ కంచర్ల, నాట్స్ బోర్డు డైరక్టర్స్ .. ఆది గెల్లి, రాజేంద్ర మాదాల, అమర్ అన్నే,రాజ్ అల్లాడ, నాట్స్ ఈ.సి. నుండి బాపు నూతి, శేఖర్ అన్నే, అజయ్ గోవాడ, జ్యోతి వనం తదితరులు హాజరయ్యారు.

0 365

As the state of Telangana flourishes with development and growth, the focus now shifts to promoting, preserving, perpetuating the heritage of the people of Telangana and Telugu origin. Taking a cue an organization makes its way towards the same principles.

 

Since its inception Telangana American Telugu Association has been in the forefront of community service, bringing cohesiveness and promoting the Telangana culture. With over 200 events in the last 4 years the association is being accredited of satisfying community needs.

A glittering ceremony marked the board meeting of Telangana American Telugu Association in Aria Convention Center, Las Vegas, NV where over 150 members converged the board meeting.

The leadership of Telangana American Telugu Association oversaw the logistics, Dr. Pailla Malla Reddy the Pharma giant from New York chaired the board meeting of Telangana American Telugu Association. 

Dr. Pailla Malla Reddy Chair of Advisory Council announced the new board and Executive Committee. He welcomed the members and thanked them for being part of the board meeting. He emphasized that Telangana American Telugu Association to focus towards community service, and increasing the membership for this year. He welcomed the young leadership into TATA and encouraged them to reach out to all corners of the North America and invite them to become members of TATA. He requested the members to selflessly work as a team and attain the set goals and objectives of Telangana American Telugu Association.

 

The outgoing President Dr. Haranath Policherla felt highly contented and explained all the achievements during his tenure. The members congratulated Dr. Haranath Policherla for his selfless service towards the organization. 

Dr. Pailla Malla Reddy appointed the following as Board of Directors (BODs) and the oath ceremony was administered by Dr. Mohan Patalolla, Advisory Council member.

Vikram Jangam, Bharath Madadi, Vamshi Reddy, Srinivas Ganagoni Mahesh Adibhatla, Ranjeeth Kyatam, Neelohita Kotha, Suresh Venkannagari, Harinder Tallapalli, Srinivas Manapragada, Usha Mannem, Chandra Police, Ravinder Nagulagari, Sharath Vemuganti, Narender Metuku, Naveen Malipeddi, Chandrashekhar Palla, Venkat Gaddam, Naveen Goli, Pradeep Mettu, Prasad Kunarapu, Ramana Ummadi, Satish Mekala, Sahodhar Reddy, Sreekanth Akkipalli, Venkat Aekka.

 

Dr. Vijayapal Reddy, AC member outlined the core expectations from each Telangana American Telugu Association Board of Director (TATA BOD).

Dr. Pailla Malla Reddy later announced the Executive Committee list and announced Vikram Jangam as the President for 2019-2021 along with the other Executive Committee:

– Bharath Madadi, President-Elect

– Vamshi Reddy, Executive Vice-President

– Srinivas Ganagoni, General Secretary

– Mahesh Adibhatla, Executive Director

– Ranjeeth Kyatam, Treasurer

– Neelohita Kotha, Joint-Secretary

– Suresh Venkannagari, Joint-Treasurer

– Harinder Tallapalli – International Vice President

– Srinivas Manapragada – Executive Coordinator

 

Vikram Jangam took charge of the affairs as president of Telugu American Telugu Association and addressed the board members, Vikram Jangam in his maiden speech as President declared that he will work selflessly and uphold values of ethics and the constitution. He laid out the planned activities for the upcoming 2 years and requested all members to support his presidency. 

He thanked Chair Dr. Malla Reddy Pailla, Advisory Council members, and others for resting trust on him and letting him spearhead the organization. He outlined the below objectives

• Telangana American Telugu Association community outreach for Telangana and Telugu families in North America, 

• Promoting youth by involving them in Telangana American Telugu Association activities, 

• Inducting members of over 5000 in North America, 

• Provide support to mainstream people in North America

• Telangana American Telugu Association Seva Days to be held biennially in the state of Telangana.

 

Srinivas Ganagoni, General Secretary, in his opening remarks, said the board should work as a team and plan Community Service events across North America and also focus on increasing the membership.

 

The board later appointed Standing Committee Chairs, Regional Vice-Presidents and Regional Coordinators. Many directors and Telangana American Telugu Association members occasioned their views unequivocally to strengthen Telangana American Telugu Association and to ensure that Telangana American Telugu Association works for the cause of Telangana and Telugu community in North America and the Telugu states of Telangana and Andhra Pradesh. The meeting was later adjourned by President Vikram Jangam.

 

0 95

నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (NATS) అమెరికా వ్యాప్తముగా చేస్తున్న మిలియన్ కాన్ ఫుడ్ డ్రైవ్ లో భాగంగా, నాట్స్ లాస్ ఏంజెల్స్ చాప్టర్ NTR వర్ధంతి సందర్భముగా ఫుడ్ డ్రైవ్ జరిపి 2000 డాలర్స్ పైగా ఫుడ్ సప్లైస్ ని మూరుపార్క్ ఫుడ్ పాంట్రీ కి డొనేట్ చేయటం జరిగింది. ఫుడ్ పాంట్రీ నిర్వాహకులు మాట్లాడుతూ వారు చేస్తున్న ప్రోగ్రామ్స్ కొన్ని వందల కుటుంబములకు ఫుడ్ మరియు ఆర్ధిక సహాయం అందిస్తున్నాయని చెప్పారు. నాట్స్ చేసిన ఈ సహాయం కొన్ని వందల కుటుంబాలకు ఫుడ్ అందచేస్తుందని ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న నాట్స్ సేవలు అభినందనీయం అని అన్నారు.

 

నాట్స్ వైస్ ప్రెసిడెంట్ చందు నంగినేని మాట్లాడుతూ ఈ విన్నూత ప్రోగ్రాం ని నాట్స్ అమెరికా వ్యాప్తముగా 11 సిటీస్లో చేపట్టినట్లు చెప్పారు. NRIs  స్వతహాగా స్వదేశమయిన ఇండియా లో  అనేక సేవ కార్యక్రమాలు చేస్తున్నారని, అలాగే తమకి ఎన్నో అవకాశాలు కలిపించిన అమెరికా లో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయవలసిన ఆవశ్యకతని వివరిస్తూ,  NRIs ని ఆ విధముగా  ప్రోత్సహించటానికి నాట్స్ ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. అన్ని సిటీస్ లో NRIs ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చి నాట్స్ చేపట్టిన ఈ  కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్లు చెప్పారు. రీజినల్ వైస్ ప్రెసిడెంట్ రామ్ కోడితాలా మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు NRIs ని అమెరికా లో సాఫ్ట్వేర్ రంగంలోనే కాక సేవ రంగం లో కూడా ముందు వుంచుతాయని మరియు ఇక్కడే పుట్టి పెరుగుతున్న పిల్లలకు సేవా భావాన్ని అలవాటు చేస్తున్నదని అన్నారు. నాట్స్ లాస్ ఏంజెలెస్ చాఫ్టర్ సెక్రటరీ శ్రీనివాస్ చిలుకూరి మాట్లాడుతూ ఇటువంటి మంచి ప్రోగ్రాం చెయ్యటానికి సహాయ సహకారాలు అందించిన దాతలకు మరియు NATS LA చాప్టర్ మెంబెర్స్ కు మరియు వాలంటీర్స్ కి కృతజ్ఞతలు తెలుపుతూ, ఇటువంటి మరిన్ని విన్నూత కార్యక్రమాలు చేపట్టనున్నట్లు, వాటికి కూడా ఇలానే సహాయ సహకారములు అందించవలనని కోరారు.

ఈ కార్యక్రమములో ఇంకా నాట్స్ బోర్డు అఫ్ డైరెక్టర్ మధు బోడపాటి, మనోహర్ మద్దినేని, సునీల్ పాతకమూరు, కిషొర్ గరికపాటి ,ఉదయ్ బొంతు, శ్రీనివాస్ సూరె, గౌరీ శంకర్, శరత్ పోపూరి , సాయిరాం బండారు, రామకృష్ణ జిల్లెళ్లమూడి ,కిషొర్ రామదేను, గిరిధర్ నక్కల, సాయి మగదల, శ్రీనివాస్ సంపంగి , కృష్ణ మద్దిలేటి తదితరులు పాల్గున్నారు.

0 107

ATA, American Telugu Association [ATA], a 28 year old Telugu Organization serving the  interests of  burgeoning Telugu Community in USA elected Parmesh Bheemreddy as its new President at the board meeting attended by large number of ATA Trustees, Executive Board members and other supporters. Upon being elected, Mr.Parmesh Bheemreddy was promptly sworn in as the President on January 19th at the board meeting held in Las Vegas.

 

Born in Pothireddypadu village of Nagarkurnool district of Telangana Mr.Bheemreddy came to US on a student visa to pursue higher education in Computer Science. Being a software professional himself, established a firm and helped many students and professional from India to settle down in US. Married to a cardiologist Sarita, Bheemreddy is a well-known Community Volunteer, co-founder of Palamuru NRI forum and conducted various charity activities across the district.. An avid community activist, Mr.Bheemreddy has been an integral part of ATA since Inception and served in various positions like Secretary for the 12th Convention and as a Convener for the Philadelphia Conference in 2014.

ATA board was sworn in on the occasion as well, raising the Board of Trustees count from 27 to 31. Mr.Bhuvanesh Boojala from DC Metropolitan area was elected unanimously as the President Elect. ATA elected Venu Sankineni as Secretary, Sharath Vemula as Joint Secretary, Ravi Patlola as Treasurer and Arvind Muppidi as Joint Treasurer. ATA Advisory Chair Hanmanth Reddy garu congratulated the new board and wished them luck in its future endeavors.

 

Presiding over the board meeting, the new president not only vowed to preserve and strengthen the Telugu community across North America but also promised to further promote the literary, cultural, social, educational and rich cultural values of the community strictly abiding by the constitution of ATA. Unveiling his vision, Mr.Bheemreddy quoted that ATA under his leadership will include focus areas like immigration, SAT Training, exchange student onboarding procedures, Medical and Dental camps for Senior Citizens and Visitors, Matrimonial and Emergency Services.

 

Mr.Bheemreddy was ecstatic to announce that the new ATA Foundation Scholarship program will award 10 scholarships to meritorious students of economically backward classes of $1000 each. Mr.Bheemreddy thanked the outgoing President Karunakar Asireddy, EC and board for its outstanding contribution to ATA and expanding the organization to new areas like Nashville and Boston areas.

0 71
TATVA (Telugu Association of Trivalley) conducted its annual JALSA 2018 event with non stop entertainment with dances, skits and singing. Trivalley area is hard hit last month during disastrous wild fires and Woosley fire threatened homes of few hundreds of telugu families in Thousand Oaks, Augoura Hills, Oak Park and Malibu area.Fortunately due to heroic efforts of fire fighters and god’s grace none of Telugu families lost their homes even though there are more than 1000 homes lost in this fire.
 
To thank fire fighters TATVA did a fund raising at the event and raised $5000 and donated to Ventura county fire fighters. Fire fighters attended this event and thanked Telugu community for their support and said no other community shoed this much generosity.
 

SOCIAL

3,873FansLike
8FollowersFollow

SPECIALS

SHORT FILMS