Europe News
Europe

0 213
ఐర్లాండ్‌లోని తెలంగాణ ఎన్నారైలు(Telanganites Of Ireland) బతుకమ్మ సంబరాలు గణంగా  నిర్వహించారు. డబ్లిన్‌లో  30 మంది వాలంటీర్స్ కలిసి ఈ  బతుకమ్మ పండుగని ఘనంగా నిర్వహించారు.
 
ఈ బతుకమ్మ వేడుకలకు ప్రాంతాలకు అతీతంగా సుమారు  600 మంది హాజరయ్యారు. అమ్మాయిలు బతుకమ్మ మరియు  దాండియా  ఆటలను ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆడారు. పిల్లలకు బతుకమ్మ పండుగ గురించి వివరించారు. దుర్గా మాత పూజతో కార్యక్రమము మొదలైనది. బతుకమ్మ మరియు  దాండియా ఆటలు ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్నాయి . UK  నుండి   సింగర్  స్వాతి  రెడ్డి  విచ్చేసి  బతుకమ్మ పాటలు  పాడారు .  మన సంస్కృతి సాంప్రదాయాలు ఇక్కడి  పిల్లలకి తెలియచేయాలని లక్ష్యంతో  Telanganites Of Ireland వారు ప్రతి సంవత్సరం బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు . బతుకమ్మను  పేర్చి తీసుకువచ్చిన ప్రతి ఆడపడుచులకు బహుమతి ప్రధానం చేసారు. ఈ  వేడుకలో ఇక్కడి ప్రాంతీయ  ఎంపీలు(TDs) Ruth  Coppinger , Jack Chambers మరియు కౌన్సిలర్ Mary McCamley పాల్గొన్నారు .వచ్చిన అతిధులకు ప్రసాదం, రుచికరమైన వంటలు వడ్డించారు.
ఈ బతుకమ్మ సంబరాలు జరుపుటకు సహకరించిన వాలంటీర్లు : శ్రీనివాస  కార్పే , సాగర్ , ప్రబోధ్ మేకల ,జగన్ రెడ్డి  మేకల , కమలాకర్ కోలన్ , సంతోష్  పల్లె , రవీందర్ రెడ్డి చప్పిడి , రాజేష్  అది , దయాకర్ రెడ్డి కొమురెల్లి ,శ్రీనివాస్  పటేల్ , సుమంత్  చావా ,అల్లే  శ్రీను , నగేష్  పొల్లూరు ,నవీన్ గడ్డం , త్రీశిర్  పెంజర్ల , ప్రదీప్  యల్క,,ప్రవీణ్ లాల్ ,వెచ్చ  శ్రీను ,వెంకట్  తీరు ,సునీల్  పాక , అల్లంపల్లి  శ్రీనివాస్ , షరీష్  బెల్లంకొండ ,  శ్రీకాంత్  సంగి  రెడ్డి , రమణ  యానాల , రామ్  రెడ్డి , వెంకట్  గాజుల , వెంకట్ జూలూరి , వెంకట్  అక్కపల్లి , నవీన్  జనగాం , రాజా  రెడ్డి, రామ  బొల్లగొని , కొసనం శ్రీను ,రాజు   తేరా ,సాయినాథ్  & సుచరిత్. 

Siddhendra Kuchipudi Art Academy (SKAA), New Jersey USA proudly presents “Kuchipudi Nrityanjali  – A dedication to tradition & innovation ” , created and performed by Guru Smt. Swathi Atluri and her troupe. It is an humble attempt by the dancers of SKAA to take the audience on a scintillating and soulful journey via the medium of Kuchipudi. One of eight classical dances of India, and the hallmark art form of South Indian tradition, it is one of the gems India has to display. Based in the United States, SKAA has been dedicated to fostering a new generation of dancers in style of Kuchipudi over the last 35 years.

About the Guru

                Over the last three decades, Guru Smt. Swathi Atluri has performed nationally and internationally, captivating audiences with her grace and spellbinding gestures. Her everlasting passion and love for the art form has allowed her to instill culture, knowledge, and a refined skillset into the youth of America. Her  artistic excellence is showcased through all aspects of her work as a dancer, choreographer and teacher. She has received critical acclaim for her leading role performances in numerous stage productions and is renowned for her portrayal of both male and female characters. Lauded for her innovative dancing style, exemplary teaching approach and meticulous attention to the traditions and finer details of her art, She has collected numerous accolades throughout her career, both in the United States and internationally, most recently being awarded the title of ‘Nritya Kala Ratna’ at the 2016 Vamsi-ATA Awards. This prestigious award recognizes Guru Swathi’s extensive and outstanding contribution to the promotion of Kuchipudi in the United States. She has choreographed several ballets like Hari Keertanacharya Annamaya, Siva Ganga, Ayyappa Saranam, Mohini Bhasmasuram, Geeta Govindam.

UK Tour 2017

                On a quest to promote Kuchipudi on an international level, Guru Swathi Atluri has embarked on a tour across the United Kingdom with the desire to contextualize and enlighten others of the beauty of the ancient art form. The tour will be stopping by established institutions in Kala Sangam Bradford, Shri Venkateswara (Balaji) Temple of UK Birmingham, Nehru centre London and Glasgow Mela (Scotland). Filled with intricate movements, provocative imagery, and impassioned vigor, the SKAA tour is a must see for all who ardently embrace the beauty of music, art, and culture. The performing artistes of the SKAA troupe include Swathi Atluri(Gundapuneedi), Manish Polavarapu,  Hanish Polavarapu, Sri Reshmi Ogoti, Meghana Dantuluri, Priya Bhargava , Gayathri Pradha and Vaishnavi Pratha .

                They will be performing select pieces from a “margam” or standard repertoire including Pari Pahi (invocatory song), Kamakshi Stuthi, Manduka Shabdam (one of the oldest pieces), Marakata Manimaya (a tarangam, the distinguishing feature of Kuchipudi from other Indian classical dances), Koluvai Unnade, and fi nally tarana (similar to thillana, often performed as the concluding piece). From beginning to end, tales from Hindu epics, deeds and characteristics of deities, and the nature of man are portrayed through the use of hand gestures, body flexions, dramatization, and abhinaya (facial expressions) to create one, beautiful show.

 

Kala Sangam Bradford

Date: 24th June 2017, Saturday

Time: 7PM to 9PM

Venue: Kalasangam Arts centre

Tickets available at www.kalasangam.org

click here to buy tickets

 

Shri Venkateswara (Balaji) Temple of UK Birmingham

Date: 25th June 2017, Sunday

Time : 2PM to 4PM

Venue: Community Hall, temple

Click here for details

The Nehru centre , London

Date: 27th June 2017, Tuesday

Time: 6:30 PM to 8:30 PM

Click here for details

 

Glasgow Mela 2017, Scotland

Date: 2nd July 2017, Sunday

Time: 12PM to 8PM

Venue: Kelvingrove park, Glasgow

Click here for details

లండన్ లో   Telangana NRI Forum , JET UK    సంయుక్త ఆధ్వర్యం లో ఘనం గా శ్రీ సీతా రామ కళ్యాణం మరియు ఉగాది సంబరాలు నిర్వహించారు.  800 మంది   భక్తులు  కల్యాణ మహోత్సవం లో పాల్గొన్నారు. ముందుగా  జ్యోతి  ప్రజ్వలన ,శాంతి మంత్రం తో ప్రారంభించి , ప్రత్యేకం గ తయారు చేసిన పల్లకి లో శ్రీ రాముల వారిని ,సీతమ్మ  వారిని తీసుకు వచ్చి కళ్యాణం ప్రారంభించారు . లండన్ లో మొదటి సారిగా 80 కుటుంబాలు స్వామి వారి కళ్యాణం లో పాల్గొన్నారు . శ్రీ త్రిదండి చిన్న జీయర్ గారి మఠం  నుండి వచ్చిన శ్రీ రామాచార్య   అయ్యగారి ఆధ్వర్యం లో కళ్యాణం నిర్వహించారు .
Telangana NRI Forum ugadi celebrations in london (1) Telangana NRI Forum ugadi celebrations in london (2)
కల్యాణానంతరం  అన్నమాచర్య కీర్తనలు ,భక్తి పాటలు సాంప్రదాయక నృత్యాలు ,రామాయణం పై క్విజ్ పోటీలు ,చిన్నారుల ఆట ,పాట  లతో ఘనం గా నిర్వహించారు .  భారత సంతతి కి చెందిన  లండన్ MP   సీమా మల్హోత్రా గారు  స్వామి వారి కళ్యాణం లో పాల్గొని  తమను కళ్యాణం లో భాగస్వామ్యం చేసినందుకు    వారికి ధన్యవాదము తెలిపారు . భగవాన్ శ్రీ రామానుజాచార్య 1000 వ జయంతి ఉత్సవాల పై   ప్రజెంటేషన్  ఇచ్చి  భగవాన్ శ్రీ రామానుజాచార్య చరిత్రను తెలిపారు .   శ్రీ సీత రాముల వారిని పల్లకి ఊరేగింపు తో కార్యక్రమం ముగింపు చేశారు.
Telangana NRI Forum ugadi celebrations in london (3) Telangana NRI Forum ugadi celebrations in london (4)
క్విజ్ లో గెలుపొందిన వారిఁగి బహుమతి ప్రధానం చేశారు . కార్యక్రమం లో TELANGANA NRI FORUM    సభ్యులు   JET UK    ట్రస్టీ మరియు JET UK  సభ్యులు  అందరు పాల్గొని  విజయవంతం చేసారు .

ఏప్రిల్ 1, 2017 తారా (Telugu Association of Reading and Around U.K.) ప్రస్థానంలో ఒక మరిచిపోలేని మధురానుభూతిని కలిగిస్తూ చరిత్రలో నిలిచిపోయే రోజు.  శ్రీ హేవిళంబి యుగాది 2017 ఉత్సవాలు తారా ఆధ్వర్యంలో రెడింగ్ తెలుగువాసులు ఘనంగా జరుపుకున్నారు.  సుమారు 600 మంది ఈ ఉత్సవాలకు హాజరై “ఏ దేశమేగినా ఎందు కాలిడినా” అన్న రాయప్రోలు మాటలను నిజం చేసారు.

ఈ ఉగాది ఉత్సవాలలో ‘తారా’ ఆహ్వానాన్ని మన్నించి పద్మశ్రీ అవార్డు గ్రహీత, “లక్ష్మి ఆసు”  యంత్ర నిర్మాత శ్రీ చింతకింది మల్లేశం గారు ముఖ్య అతిథిగా విచ్చేసారు.  శ్రీ మల్లేశంగారిని  భారతదేశానికి వెలుపల జరిగిన పెద్ద కార్యక్రమంలో మొట్ట మొదట సత్కరించిన ఘనత తారా యు.కె. కు దక్కింది.

తారా అధ్యక్షులు శ్రీ సూర్యప్రకాష్ భళ్ళమూడి మల్లేశంగారిని సగౌరవంగా ఆహ్వానిస్తూ వేదికపైకి తీసుకొని వచ్చారు.  తారా కార్యదర్శి శ్రీ సంతోష్ బచ్చు మల్లేశంగారిని రెడింగ్ తెలుగువారికి పరిచయం చేస్తూ, వారు పడ్డ శ్రమను,నిస్వార్ధంగా వారు చేస్తున్న పనిని కొనియాడారు. ‘తారా’ కోశాధికారి శ్రీ రవికాంత్ వాకాడ మాట్లాడుతూ శ్రీ మల్లేశంగారు “రోల్ మోడల్” అని, కృషి వుంటె మనుషులు ఋషులవుతారు అన్న మాటకి ప్రత్యక్ష ఉదాహరణ అని ప్రశంసించారు.
Telugu Association of Reading and Around U.K hevalambi ugadi celebrations (1) Telugu Association of Reading and Around U.K hevalambi ugadi celebrations (2) Telugu Association of Reading and Around U.K hevalambi ugadi celebrations (3) Telugu Association of Reading and Around U.K hevalambi ugadi celebrations (4) Telugu Association of Reading and Around U.K hevalambi ugadi celebrations (5) Telugu Association of Reading and Around U.K hevalambi ugadi celebrations (6) Telugu Association of Reading and Around U.K hevalambi ugadi celebrations (7) Telugu Association of Reading and Around U.K hevalambi ugadi celebrations (8)
శ్రీ మల్లేశంగారికి తర్వాత సన్మాన కార్యక్రమం జరిగింది. ‘తారా’ స్థాపక అధ్యక్షులు శ్రీమతి లక్ష్మి మాటూరు, మహిళా కార్యదర్శి శ్రీమతి మధురిమ రంగా పుష్పగుఛ్చం అందజేసారు.  సూర్యప్రకాష్, సంతోష్ శాలువాతో సత్కరించారు.  రవికాంత్, బాలా కాకర్ల తారా మొమెంటొను అందజేసారు.  ఈ సందర్భంగా తారా తొలిసారిగా ప్రచురించిన తెలుగు కేలండరును తారా ట్రస్టీలు నవీన్ గుర్రం, గోపికిషన్ నేరెళ్లకుంట, రాంబాబు బూరుగు శ్రీ మల్లేశంగారిచే ఆవిష్కరింపజేసారు. తారా తెలుగు పత్రిక “తోరణం” మొదటి సంచికను ‘తారా’ ట్రస్టీలు వెంకట్ పారాగారు  మల్లేశంగారికి అందజేసారు.
తరువాత శ్రీ మల్లేశంగారు మాట్లాడుతూ ‘తారా’ యు.కె. తెలుగు ప్రజలకి చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ, తమ అనుభవాలని సోదాహరణంగా ఫొటోలు, వీడియోల సహాయంతో వివరించారు.  “లక్ష్మి ఆశు” నిర్మాణంలో వారు పడ్డ కష్టాలను, వారి తల్లిగారి కష్టం యే విధంగా పురికొల్పింది, చేనేత కార్మికులకు ఈ యంత్రం యే విధంగా ఉపయోగ పడుతున్నది తెలిపారు.  శ్రీ మల్లేశంగారు తల్లిగారి కష్టాన్ని చెప్తున్నప్పుడు హాజరైన అందరూ చలించిపోయారు. లక్ష్మి ఆసు యంత్ర నిర్మాణం యే విధంగా ఆ కష్టాన్ని దూరం చేసినది తెలియగానే కరతాళ ధ్వనులతో సభ మార్మోగిప్రోయింది.  ఉపన్యాసం ముగిసినప్పుడు అందరూ లేచి నిలబడి శ్రీ మల్లేశంగారికి తమ హర్షోల్లాసాలను వ్యక్తపరిచారు.  కార్యక్రమానికి హాజరైన తెలంగాణా ప్రవాస సంఘం (TenF ) యు.కె. అధ్యక్షులు శ్రీ చంద్రశేఖర్ గారు తారా చేస్తున్న సేవలను కొనియాడుతూ వారి సంఘం చేనేత కార్మికులకు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు.  శ్రీ మల్లేశంగారు భావి తరాలకు మార్గదర్శకం అని అన్నారు.
హాజరైన అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన కార్యక్రమం “స్వరలహరి”.  నేపధ్య గానంతో పాటు, సంగీత దర్శకత్వం, అనేక టివీ పాటల కార్యక్రమాలలో యాంకరుగా, మెంటరుగా అలరిస్తున్న బహుముఖ ప్రతిభావంతుడు హేమచంద్ర వేదుల, బాహుబలి చిత్రంలో పచ్చబొట్టు పాటతో తనదైన ముద్ర వేసిన దామిని భట్ల తమ గానంతో, మాటల పాటలతో ఉఱ్ఱూతలూగించారు.   సభ్యుల ఈలలతో, డేన్సులతో సభ మార్మోగింది.
తారా సభ్యులు ప్రదర్శించిన అనేక కార్యక్రమాలు విచ్చేసిన అందరినీ విశేషంగా అలరించాయి.  చిన్న పిల్లలు చేసిన నాటకాలు, నృత్యాలు, పాటలు, పెద్దలు ప్రదర్శించిన వెరైటీ డేన్సులు, నాటకాలకి చప్పట్లతో సభికులు తమ హర్షాన్ని తెలియజేసారు.
చివరిగా ఈ కార్యక్రమం జయప్రదం కావడానికి తోడ్పడిన వలంటీర్ల సేవలను సంతోష్, రవికాంత్ పేరు పేరున స్మరించి వారికి తారా తరపున ధన్యవాదాలు తెలియజేసారు.  తెలుగువారికి సేవ చెయ్యడంలో తారా ఎప్పుడూ ముందు వుంటుందని, సంస్కృతి, సాహిత్యం, సంప్రదాయం, సమాజం తారా ప్రధాన లక్ష్యాలని అందుకు మునుముందు మరిన్ని కార్యక్రమాలతో వస్తామని చెప్పి వందన సమర్పణ చేసారు.

యూకే లోని షెఫీల్డ్ నగరంలో తెలంగాణ అసోసియేషన్ అఫ్ యూకే (టాక్ ) మరియు హిందూ మందిర్ సంయుక్తంగా కలిసి శ్రీ హేవిళంబి నామ ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు.
టాక్ సభ్యులు సాయిబాబు నర్రా మరియు అరవింద్ రెడ్డి అధ్యక్షతన షెఫీల్డ్ హిందూ దేవాలయంలోని కమ్యూనిటీ హాల్ లో జరిగిన వేడుకలకి ముఖ్య అతిథిగా లార్డ్ లెఫ్టినెంట్ అఫ్ సౌత్ యార్క్ షైర్ ఆండ్రూ కూమ్బ్ మరియు భారీగా ప్రవాస తెలుగు వారు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని సాంప్రదాయ పూజలతో ప్రారంభించి పంచాగ శ్రవణం నిర్వహించారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అతిథులను విశేషంగా ఆకట్టుకున్నాయి, వేదికపై పిల్లలు చేసిన నృత్య కార్యక్రమానికి సభికులనుంచి విశేష స్పందన లభించింది.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన లార్డ్ లెఫ్టినెంట్ అఫ్ సౌత్ యార్క్ షైర్ ఆండ్రూ కూమ్బ్ మాట్లాడుతూ …. అందరికి నూతన శుభాకాంక్షలు తెలిపి తనకు హిందూ ధర్మం మరియు సాంప్రదాయాలు అంటే ఎంతో గౌరవం అనీ ఇంకా ముందు ముందు హిందూ ధర్మం గురించి మరింత తెలుసుకునే ప్రయత్నం చేస్తానని తెలిపారు .
టాక్ అధ్యక్షురాలు పవిత్ర కంది మాట్లాడుతూ….ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపి ,రుచులలో తీపి, చేదు ఉన్నట్లే జీవితంలో కూడా కష్టసుఖాలు ఉంటాయని, వీటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు పోవాలన్నదే ఉగాది పండుగ సందేశమని మరియు భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలను ప్రతిబింభింప చేయడమే టాక్ సంస్థ ముఖ్య ఉద్దేశ్యమని ఈ సందర్భంగా అన్నారు.
టాక్ సభ్యులు అరవింద్ మాట్లాడుతూ…. ఈ ఉగాది సంబరాలలో తెలుగువారే కాకుండా మరాఠీలు , గుజరాతీలు ,బెంగాలీలు మరియు పంజాబీలు పాల్గొనడం విశేషం అని పేర్కొన్నారు, టాక్ ఆధ్వర్యం లో మున్ముందు ఇంకెన్నో కార్యక్రమాలని షెఫిల్డ్ లో నిర్వహిస్తామని సహకరించి అందరికి కృతఙ్ఞతలు తెలిపారు. తెలుగు వారి పండగలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్న షెఫిల్డ్ హిందూ సమాజ్ సంస్థకు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.
TAUK Ugadi celebrations 2017 (1) TAUK Ugadi celebrations 2017 (2) TAUK Ugadi celebrations 2017 (3) TAUK Ugadi celebrations 2017 (4) TAUK Ugadi celebrations 2017 (5) TAUK Ugadi celebrations 2017 (6)
టాక్ సభ్యులు సాయిబాబు నర్రా మాట్లాడుతూ….తెలుగు వారు ఎక్కడున్నా సంస్కృతి సంప్రదాయాలు ఆచరిస్తారనీ , అన్నిటిని మించి మనమందరము పండుగ రోజున ఒక చోటఉల్లాసంగా గడపడం ,దీనికి నిదర్శనం వందలాదిగా ఈ కార్యక్రమానికి హాజరవ్వడమేనన్నారు మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి కృతజ్ఞతలు తెలిపారు.
టాక్ ముఖ్య నాయకుడు రత్నాకర్ మాట్లాడుతూ, ఈ కొత్త సంవత్సరం అందరి జీవితాల్లో నూతన ఉత్సాహాన్ని నింపాలని, తెలంగాణ రాష్ట్రం లోని ప్రజలంతా సుఖశాంతులతో ఉండేలా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గారి నాయకత్వం లో రాష్ట్రం మరింత అభివృద్ధితో ముందుకు సాగాలని, కెసిఆర్ గారికి భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు.
ఈ ఉగాది సంబరాలలో టాక్ అధ్యక్షురాలు పవిత్ర కంది ,సభ్యులు సాయిబాబు నర్రా ,అరవింద్ రెడ్డి ,నవీన్ రెడ్డి ,రత్నాకర్ కడుదుల ,శ్రీకాంత్ జెల్లా , స్నేహలత , ప్రత్యుష ,మాధవ్,విజయ్ ,భూషణ్ ,రాజేష్ వాకా ,వెంకీ ,రాజు తదితరులు పాల్గొన్నారు.

0 1086

ఎన్నారై టి. ఆర్. యస్ యుకె మరియు తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆద్వర్యం లో “తెలంగాణ గవర్నమెంట్ సక్సెస్ స్టోరీస్ ఆన్ స్టార్ట్ప్స్” అనే కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమం లో హైదరాబాద్ కి చెందిన “స్పార్క్ టెన్ ఆక్సిలేటర్”  అనే సంస్థ ప్రోత్సాహం తో  బ్రిస్కీ అనే  కంపెనీని పెట్టి విజయవంతంగా ముందుకు వెళ్తున్న యువ స్టార్ట్ప్ వ్యవస్థాపకులు జతిన్ భాటియా మరియు రాజేష్ భుటాడా లు అతిథులుగా పాల్గొన్నారు.

ఎన్నారై టి. ఆర్.యస్ యుకె  ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల అధ్యక్షతన ప్రారంభమైన కార్యక్రమం లో ముందుగా ఇటీవల యుకె పార్లమెంట్ ముందు జరిగిన ఉగ్రవాది  దాడి లో  ప్రాణాలు కోల్పోయిన వారికి శ్రద్ధాంజలి ఘటించి, తరువాత ఉపాధ్యక్షులు శ్రీకాంత్ పెద్దిరాజు సంతాప సందేశాన్ని సభకు తెలిపారు.

 

అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ స్టార్ట్ప్స్ ప్రోత్సాహం మరియు విజయాల్లో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శనంగా ఉందని, టీ – హబ్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం  చేపడుతున్న కార్యక్రమాలని సభకు వివరించి, పలు సందర్భాల్లో తెలంగాణ ఐ.టీ మంత్రి కే. టీ. ఆర్ గారు చేసిన ప్రసంగాలని సభలో లో ప్రదర్శించారు. అలాగే తెలంగాణ అభివృద్ధి లో తమ వంతు బాధ్యత నిర్వహిస్తు యువతను  స్టార్ట్ప్ వైపు  ప్రోత్సహిస్తున్న “స్పార్క్ 10  సంస్థ” సేవలను ప్రశంసించారు, ముక్యంగా సీఈఓ అటల్ మాల్వియా కృషిని అభినందించారు. ఈ రోజు కార్యక్రమానికి అన్ని రకాల సహాయాన్ని అందించిన స్పార్క్ 10 సంస్థకు కృతఙ్ఞతలు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం టీ హబ్ ద్వారా రూపొందించిన ఆవిష్కరణలు ప్రపంచ స్థాయిలో గుర్తింపును దక్కించుకుంటున్నాయని. ఇటీవలి కాలంలో 4 స్టార్టప్‌లకు అంతర్జాతీయ అవార్డులు దక్కాయని.  “హగ్ ఇన్నొవేషన్స్, లూప్ రియాలిటీ, అథ్‌బేస్, కేతి” ఇందులో ఉన్నాయని తెలిపారు.

తెలంగాణ బిడ్డలు ప్రపంచం లో ఎక్కడున్నా గర్వపడేలా రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి, కే. టీ. ఆర్  గారికి కృతఙ్ఞతలు తెలిపారు.

బ్రిస్కీ కంపెనీ వ్యవస్థాపకులు జతిన్ మరియు రాజేష్ లు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం స్టార్ట్ప్ కు ఇస్తున్న ప్రాధాన్యత మరియు ప్రత్యేక శ్రద్ధ ఎంతో స్ఫూర్తిగా ఉందని, వారి ఆలోచనను ప్రోత్సహించి ముందుకు నడిపించిన “స్పార్క్ 10 ఆక్సిలేటర్” కు ఎప్పటికి కృతజ్ఞులుగా ఉంటామని తెలిపారు. తెలంగాణ ఐ. టీ. మంత్రి కే. టీ. ఆర్ గారు విజనరీ ఉన్న గొప్ప నాయకుడని వారి ప్రతి నిర్ణయం హైదరాబాద్ పేరును ప్రపంచ పటం లో ప్రత్యేకంగా కనిపించేలా ఉన్నాయని, మేము పూణే లో ప్రారంభించినా ఇప్పుడు హైదరాబాద్ లోనే స్థిరపడి వ్యాపారం ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు.  ప్రపంచ వేదికల్లో మాతృ రాష్ట్రం పేరును ఖ్యాతిని ముందుకు తీసుకెళ్తు ఎన్నో కార్యక్రమాలు  చేస్తున్న ఎన్నారై టీ. ఆర్. యస్ శాఖను మరియు టాక్ సంస్థని అభినందించారు. తరువాత ఏర్పాటు చేసిన చర్చలో, పలువురు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పారు.

టాక్ అధ్యక్షురాలు పవిత్ర కంది మాట్లాడుతూ, సంస్థ ఆవిర్భవించి తక్కువకాలమే అయినా, మేమంతా తెలంగాణ బ్రాండ్ ని ప్రపంచ వేదికల్లో మార్కెట్ చేయడానికి అన్ని రకాలుగా కృషి చేస్తున్నామని, బంగారు తెలంగాణ నిర్మాణం లో మా వంతు పాత్ర ఉంటుందని, భవిషత్తులో తెలంగాణ రాష్ట్రం నుండి నాయకులని, ప్రభుత్వ ప్రతినిధులని ఆహ్వానించి బిజినెస్ మీట్ లు నిర్వహించి మా వంతు బాధ్యత నిర్వహిస్తామని తెలిపారు.

Start ups in telangana by nri trs (1) Start ups in telangana by nri trs (2) Start ups in telangana by nri trs (3) Start ups in telangana by nri trs (4)

చివరిగా ఎగ్జిక్యూటివ్ మెంబెర్ రవి రతినేని వందన సమర్పణతో కార్యక్రమాన్ని ముగించారు.

 

ఈ కార్యక్రమంలో ఎన్నారై టీ. ఆర్. యస్   అద్యక్షులు అనిల్ కూర్మాచలం, టాక్ అధ్యక్షురాలు పవిత్ర రెడ్డి కంది, ఎన్నారై టీ. ఆర్. యస్ యుకె  – ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి,అశోక్ దూసరి ,శ్రీకాంత్ పెద్దిరాజు ,ప్రధాన కార్యదర్శి  రత్నాకర్ కడుదుల, అడ్వైసర్ బోర్డు సభ్యులు దొంతుల వెంకట్ రెడ్డి, సత్యం రెడ్డి కంది, వీర ప్రవీణ్ కుమార్  సెక్రటరీ శ్రీధర్ రావు తక్కలపెల్లి, సృజన్ రెడ్డి ,మీడియా ఇంచార్జ్ శ్రీకాంత్ జెల్ల ,యూకే & ఈయూ ఇంచార్జ్ విక్రమ్ రెడ్డి,ఈస్ట్ లండన్ కో ఆర్డినేటర్ నవీన్ మాదిరెడ్డి ,ఈవెంట్స్  కో ఆర్డినేటర్స్ నవీన్ భువనగిరి ,వెస్ట్ లండన్ ఇంచార్జ్ గణేష్ పాస్తం,సురేష్ బుడగం ,  ముఖ్య సభ్యులు రవి కుమార్ రత్తినేని మరియు టాక్ సభ్యులు శ్రీ శ్రావ్య, ప్రవళిక  ,దీప్తి ,రాజేష్ వాక మరియు  స్థానిక ప్రవాసులు ఆర్. సి. రావు, భాస్కర్ నీల    తదితరులు  హాజరైన వారిలో వున్నారు .

లండన్ లో ఎన్నారై టి.ఆర్.యస్- యుకె ఆద్వర్యం లో ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు 

– 63  వ పుట్టినరోజు సందర్బంగా 63 రకాల పూలతో  ప్రత్యేక పూజలు

 

లండన్: ఎన్నారై టి.ఆర్.యస్ యుకె శాఖ ఆధ్వర్యంలో లండన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్నారై టి.ఆర్.యస్ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం మరియు వారి  సతీమణి ప్రభలత కూర్మాచలం సంప్రదాయబద్దంగా కార్యక్రమాన్ని ముందుండి నిర్వహించారు.

 

లండన్ ఇంచార్జి సతీష్ రెడ్డి బండ ఆద్వర్యం లో జరిగిన వేడుకల్లో, కెసిఆర్ గారు 63 వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్బంగా, వివిధ ప్రదేశాల నుండి సేకరించిన 63 రకాల పువ్వులతో వెస్ట్ లండన్ లోని ప్రసిద్ధ దుర్గా దేవి అమ్మ వారి దేవాలయం లో కార్యవర్గ  సభ్యులు కుటుంబ సమేతంగా కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

kcr-63-birthday-in-uk-1 kcr-63-birthday-in-uk-2 kcr-63-birthday-in-uk-3 kcr-63-birthday-in-uk-4 kcr-63-birthday-in-uk-5

కెసిఆర్ గారు ఎల్లప్పుడూ ఆరోగ్యాంగా ఉండాలని, తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణా గా నిర్మించే క్రమంలో భగవంతుడు వారికి అన్ని సందర్భాల్లో మనోధైర్యాన్ని, ఆశీస్సులు అందించి ముందుకు నడిపియ్యాలని వారంతా కోరుకున్నారు.

 

ఆలయ పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి, కెసిఆర్ గారు ఎక్కడున్నా దీర్ఘాయిషులవ్వాలని, తెలంగాణ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని దీవించారు.

వారి నాయకుడి పట్ల, మాతృభూమి పై వారికున్న ప్రేమను చూసి, పండితులు హర్షం వ్యక్తం చేసి, ఇప్పటివరకు అమ్మవారికి  ఒకేసారి 63 రకాల పూలతో పూజ చేయడం ఇదే మొదటి సారని, వీరి ఆలోచనను అభినందించి సభ్యులందరినీ ఆశీర్వదించారు.

 

పూజ అనంతరం అదే రోజు  సాయంత్రం ఏర్పాటు చేసిన వేడుకల్లో, కేక్ కట్ చేసి కెసిఆర్ గారికి శుభాకాంక్షలు తెలిపి, ఎన్నో సంవత్సరాలుగా లండన్ లో కెసిఆర్ గారి పుట్టినరోజు వేడుకలు జరుపుతున్నామని, కానీ ఈ సంవత్సరం ప్రత్యేక పూజలు చేసి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

లండన్ లో  వేడుకలే కాకుండా ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్రం లో పలు సేవా కార్యక్రమాలు చేస్తామని, ఈ సంవత్సరం కూడా వరంగల్ లో “రక్త దాన శిబిరం” ఏర్పాటు చేశామని కార్యదర్శి సృజన రెడ్డి చాడ తెలిపారు.

 

చివరిగా లండన్ ఇంచార్జ్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ, ఒక రోజంతా ఇలా వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని, బంగారు తెలంగాణ నిర్మాణం లో కెసిఆర్ గారి వెంటే ఉంటామని, హాజరైన కార్యవర్గ సభ్యులందరికి, ప్రత్యేకంగా పూల సేకరణకు కృషి చేసిన అశోక్ దూసరి మరియు రత్నాకర్ కడుదుల గార్లకు కృతఙ్ఞతలు తెలిపారు.

ఈ వేడుకల్లో ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ అద్యక్షులు అనిల్ కూర్మాచలం, ఉపాధ్యక్షులు అశోక్ దూసరి, నవీన్ రెడ్డి,శ్రీకాంత్ పెద్దిరాజు ,ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, అడ్వైసర్ బోర్డు సభ్యులు దొంతుల వెంకట్ రెడ్డి, సత్యం రెడ్డి కంది, సెక్రటరీ సృజన్ రెడ్డి ,మీడియా ఇంచార్జ్ శ్రీకాంత్ జెల్ల ,యూకే & ఈయూ ఇంచార్జ్ విక్రమ్ రెడ్డి,IT సెక్రటరీ వినయ్ ఆకుల , లండన్ ఇంచార్జ్ సతీష్ రెడ్డి బండ ,ఈస్ట్ లండన్ కో ఆర్డినేటర్ రమేష్ యెసంపల్లి ,నవీన్ మాదిరెడ్డి , ఈవెంట్స్  కో ఆర్డినేటర్స్ రవి ప్రదీప్,వెస్ట్ లండన్ ఇంచార్జ్ గణేష్ పాస్తం,సురేష్ బుడగం ,  మెంబర్ షిప్ ఇంచార్జ్ రాకేష్ రెడ్డి కీసర  మరియు ముఖ్య సభ్యులు రవి కుమార్ రత్తినేని,అశోక్ కుమార్ అంతగిరి  మరియు టాక్ అధ్యక్షురాలు పవిత్ర కంది, టాక్ సభ్యులు స్వాతి బుడగం, మట్టా రెడ్డి, శ్రీనివాస్ యాదవ్ మేకల తదితరులు హాజరైన వారిలో వున్నారు .

చేనేత పరిశ్రమ అబివృద్ది కి తమ వంతు కృషి చేద్దాం ,బాధ్యత వహిద్దాం అనే నినాదం తో TELANGANA NRI FORUM    మహిళలు  ముందుకొచ్చారు .  సిరిసిల్ల నుండి ప్రత్యేకం గ తెప్పించిన వస్త్రాలను ధరించి  లండన్ బ్రిడ్జి వద్ద ప్రదర్శించి .  WE SUPPORT TELANGANA WEAVERS    అనే నినాదం తో మద్దతు తెలిపారు .    TS NRI శాఖా మంత్రి వర్యులు  K .Rama rao   వారానికి ఒక రోజు చేనేత  దరిస్తా  అన్న స్ఫూర్తి గా మేము సైతం అంటున్నారు లండన్ మహిళా .   త్వరలో  సిరిసిల్ల హ్యాండ్లూమ్ ,ప్రభుత్వ సహకారం తో  వచ్చే నెల లో  చేనేత చీరలు  మరియు  షర్ట్స్ ,  గృహావసరాల నిమిత్త బట్టలు మొదలైనవి  తెలంగాణ నుండి తెప్పించి లండన్ లో ఒక వస్త్ర నిలయం ఏర్పాటు చేసి  మార్కెటింగ్ కి కృషి చేస్తామని  ప్రతినిధులు  కాసర్ల జ్యోతి రెడ్డి , శ్రీ లక్ష్మి ,అంతటి  మీనాక్షి తెలిపారు . 
యూరోప్ లో కాటన్ వస్త్రాల  ఉపయోగం ఎక్కువ గ ఉంటుంది . కొంత సమయం తీసుకొని  మొదట  ఇక్కడి  ప్రవాస భారతీయులకు పరిచయం చేస్తామని  మార్కెటింగ్  సన్నాహాలు చేస్తామని గోలి కవిత తెలిపారు .  ఇతర  తెలంగాణ /తెలుగు   సంఘాల మహిళ ల సహాయం తీసుకొని రాబోయే బోనాలు ,బతుకమ్మ  సంబరాల్లో  చేనేత కు పూర్తి స్థాయి గుర్తింపు తెచ్చే ప్రయత్నం తెస్తామని  సిక్కా ప్రీతీ  తెలిపారు .    

సిరిసిల్ల నుండి ప్రత్యేకం గ తెప్పించిన చేనేత వస్త్రాలను   లండన్ చారిత్రిక ప్రదేశాల్లో  ధరించి  ఫోటో ,వీడియో షూట్ నిర్వహించి సోషల్ మీడియా ద్వారా ప్రవాస భారతీయులను కదిలించే దిశ వా మా ప్రయత్నం మొదలు పెట్టామని అనసూరి  వాణి తెలిపారు . ఈ కార్యక్రమం లో  రంగుల శౌరి ,గంప జయశ్రీ ,హేమలత గంగసాని, పాల్గొన్నారు . 
 
ప్రవాస తెలంగాణ మహిళ లు చేనేత కు మద్దతు ఇవ్వడం పై చేనేత బంధు ,పద్మ శ్రీ , శ్రీ చింతకింది మల్లేశం గారు ప్రశంసించారు .వీడియో ద్వారా తన సందేశాన్ని అందచేస్తూ తమ సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని  తెలిపారు.
 op1a5909

ఇటీవల లండన్ లో ఘనంగా ఆవిర్భావ వేడుకలు నిర్వహించి స్థాపించిన తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (TAUK – టాక్ ) అధ్యక్షురాలిగా పవిత్ర రెడ్డి కంది, అడ్వైసర్ బోర్డు చైర్మన్ గా గోపాల్ మేకల నియమితులయ్యారు.
సంస్థ అధ్యక్షురాలిగా నియమితులైన సంధర్భంగా పవిత్ర రెడ్డి మాట్లాడుతూ, తన పై నమ్మకం వుంచి అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన సభ్యులందరికి కృతజ్ఞతలు తెలిపి, నా గత అనుభవం తో పాటు సంస్థ సభ్యులందరి సహాకారంతో తెలంగాణ సమాజానికి ఆశించిన సేవలందిస్తానని అలాగే త్వరలో పూర్తి కార్యవర్గం ఏర్పాటు చేసుకొని సంస్థ భవిష్యత్తు, చేసే కార్యక్రమాల క్యాలెండర్ విడుదల చేస్తామని తెలిపారు.
ఈ సందర్బంగా పలువురు సభ్యులు పవిత్ర రెడ్డి ని అభినందించి తమ సహాయ సహకారాలు ఎల్లపుడు వుంటాయని తెలిపారు.
pavitra-reddy-kandi

ఎన్నారై ట్.ఆర్.యస్ – యుకె  నూతన కార్యవర్గ సమావేశం లండన్ లో అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం అధ్యక్షతన జరిగింది .

 

ఈ కార్యక్రమంలో ముందుగా అమరవీరులకు ,ఆచార్య జయశంకర్ సర్ కి నివాళులు అర్పించి ,నూతన  కార్యవర్గ సభ్యులని సభ కి పరిచయం చేయడం జరిగింది .

ఈ కార్యక్రమంలో   భవిష్యత్ కార్యాచరణ, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ఎన్నారైల కృషి తదితర విషయాల గురించి చర్చించారు.

 

ఈ సందర్బంగా అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ ముందుగా …. ఖండాతరాల్లో ఉన్నపటికీ నాటి ఉద్యమం నుండి నేటి వరకు పార్టీ జెండా మోసే అవకాశం కల్పించిన కెసిఆర్ గారికి,ఎప్పటికప్పుడు తెరాస ఎన్నారై కార్యకర్తల్ని ప్రోత్సహిస్తున్న ఎంపీ కవిత గారికి కృతఙ్ఞతలు తెలిపారు.

 

ఎన్నో త్యాగాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కూడా పటిష్ట నాయకత్వంతోనే సాధ్యమవుతుందని ,తెలంగాణ పునర్నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర సమితికట్టుబడి వుందని, కెసిఆర్ గారి తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని అన్నారు. అట్టడుగువర్గాల ప్రజలకు ప్రభుత్వ పథకాలను అందించే లక్ష్యంగా మన ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.

 

నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి, మనమంతా చాలా అదృష్టవంతులమని, మైళ్ళ దూరం లో ఉన్నా, కెసిఆర్ గారి నాయకత్వం లో పని చేసే అవకాశం లంబించిందని, అందరంబాధ్యతతో, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.

nri-trs-cell-uk-new-committee-meeting-held-at-london nri-trs-cell-uk-new-committee-meeting-held-at-london

అన్ని సందర్భాల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెరాస శాఖల సమన్వయం ఎంతో స్ఫూర్తినిస్తుందని, సహకరిస్తున్న అన్ని శాఖల కార్యవర్గ సభ్యులకు,  ముఖ్యoగ అమెరికా తెరాస నాయకులు మహేష్తన్నీరు గారికి కృతఙతలు తెలిపారు. గత ఆరు సంవత్సరాలుగా ఎన్నో సందర్భాల్లో పార్టీ కార్యక్రమాలకి సహకరించి మద్దత్తిచిన తెలంగాణ సంఘాలకి, వ్యక్తులకి, అభిమానులకి కృతజ్ఞతలు తెలిపారు.

 

కార్యవర్గ సభ్యులంతా సుదీర్ఘంగా చర్చించి పలు కీలక నిర్ణయాలు – తీర్మానాలు చేయడం జరిగింది, వాటి వివరాలు :

 

  1.  తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి  శ్రీ.కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి పుట్టినరోజు వేడుకలను లండన్ లోఘనంగా నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది.

 

  1. ప్రభుత్వ పథకాలను వినూత్నమైన పద్ధతిలో ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి కృషి చెయ్యాలని నిర్ణయించడం జరిగింది .

 

  1.  నూతనంగా పదవులు చేపట్టిన సభ్యుల బాధ్యతలను వారికి వివరించడం జరిగింది, ప్రతి మూడు నెలలకు ఒక్కసారి కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకొని సంస్థ చేసిన కార్యక్రమాల  పై ఒకబులెటిన్ కూడా విడుదల చేయాలని నిర్ణయించారు.

 

  1. తెరాస   ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న ప్రతిపక్షాలకు, వారికి మద్దత్తు తెలుపుతున్న వ్యక్తులకు – సంస్థలకు సరైన రీతిలో ప్రతివిమర్శన చేసి, నిజా నిజాలు ప్రజలకు తెలిసేలా, ఇటు ప్రత్యక్ష మీడియాద్వారా మరియు సోషల్ మీడియా ద్వారా తెలుపాలని నిర్ణయించారు.

 

చివరిగా ప్రధాన కార్యదర్శి రత్నాకర్ మాట్లాడుతూ, కార్యవర్గ సమావేశం ప్రతి సభ్యునిలో నూతన ఉత్సాహాన్ని ఇచ్చిందని, హాజరైన విలువైన సూచనలను సలహాలను అందించినందుకు,  ప్రతి ఒక్కరికికృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశం విజయవంతానికి ప్రత్యేకంగా కృషి చేసిన ఈవెంట్ కమిటీ సభ్యులు  సత్యపాల్ పింగిళి, నవీన్ భువనగిరి ,రవి ప్రదీప్,సత్య చిలుముల కు ప్రత్యేక కృతజ్ఞతలుతెలిపారు.

 

ఉపాధ్యక్షులు శ్రీకాంత్ పెద్దిరాజు వందన సమర్పణతో సమావేశం ముగిసింది.

 

 

ఈ కార్యక్రమంలో అద్యక్షులు అనిల్ కూర్మాచలం, ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి,అశోక్ దూసరి ,శ్రీకాంత్ పెద్దిరాజు ,సంయుక్త కార్యదర్శి రత్నాకర్ కడుదుల, అడ్వైసర్ బోర్డు సభ్యులు దొంతుల వెంకట్ రెడ్డి,సత్యం రెడ్డి కంది, సెక్రటరీ సృజన్ రెడ్డి ,సంయుక్త కార్యదర్శి సేరు సంజయ్ ,మీడియా ఇంచార్జ్ శ్రీకాంత్ జెల్ల ,యూకే & ఈయూ ఇంచార్జ్ విక్రమ్ రెడ్డి,IT సెక్రటరీ వినయ్ ఆకుల , లండన్ ఇంచార్జ్సతీష్ రెడ్డి బండ ,ఈస్ట్ లండన్ కో ఆర్డినేటర్ రమేష్ యెసంపల్లి ,నవీన్ మాదిరెడ్డి , ఈవెంట్స్ ఇంచార్జ్ సత్యపాల్ పింగిళి ,ఈవెంట్స్  కో ఆర్డినేటర్స్ నవీన్ భువనగిరి ,రవి ప్రదీప్,సత్య చిలుముల  ,వెస్ట్లండన్ ఇంచార్జ్ గణేష్ పాస్తం,సురేష్ బుడగం , మరియు ముఖ్య సభ్యులు రవి కుమార్ రత్తినేని,అశోక్ కుమార్ అంతగిరి ,చిత్తరంజన్ రెడ్డి  హాజరైన వారిలో వున్నారు .

SOCIAL

3,873FansLike
8FollowersFollow

SPECIALS

SHORT FILMS