Canada News
Canada News, Canada Telugu News, Canada NRI news, telugu community news

తెలంగాణ కెనడా సంఘం ఆధ్వర్యంలో 12 జనవరి 2019  శనివారం రోజున కెనడా దేశం గ్రేటర్ టోరొంటో లోని  పోర్టుక్రెడిట్ సెకండరి పాఠశాల ఆడిటోరియంలో 800 మందికి పైగా ప్రవాస తెలంగాణా వాసులు  సంక్రాంతి పండుగ మరియు తీన్మార్ సాంస్కృతిక ఉత్సవాలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు.

ఈ పండుగ సంబురాలు తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ రమేశ్ మునుకుంట్ల  ఆధ్వర్యంలో జరుగగా తెలంగాణ కెనడా అసోసియేషన్ ఫౌండేషన్ కమీటీ అధ్యక్షులు శ్రీ శ్రీనివాసు తిరునగరి, ట్రుస్టీ బోర్డు అధ్యక్షులు శ్రీ హరి రావుల్, ఉపాధ్యక్షులు శ్రీ విజయకుమార్ తిరుమలాపురం , కార్యదర్షి శ్రీ శ్రీనివాస్ మన్నెం, కోషాధికారి శ్రీ దామోదర్ రెడ్డి మాది, సాంస్కృతిక కార్యదర్షి శ్రీమతి దీప గజవాడ,  డైరెక్టర్లు శ్రీ మనోహర్ భొగా, శ్రీ  శ్రీనివాస్ చంద్ర, శ్రీమతి మంగ వాసం, శ్రీ మూర్తి కలగోని, శ్రీ గణేశ్ తెరాల, ట్రస్టీలు శ్రీ సురేశ్ కైరోజు, శ్రీ వేనుగోపాల్ రెడ్డి ఏళ్ళ, శ్రీ కిరణ్ కుమార్ కామిశెట్టి మరియు శ్రీ నవీన్ ఆకుల ,   ఫౌండర్లు  శ్రీ కోటేశ్వరరావు చిత్తలూరి,  శ్రీ చంద్ర స్వర్గం, శ్రీ దేవేందర్ రెడ్డి గుజ్జుల, శ్రీ రాజేశ్వర్ ఈద, అథీక్ పాష , శ్రీ ప్రభాకర్ కంబాలపల్లి, కలీముద్దిన్, శ్రీ వేణుగోపాల్ రోకండ్ల, శ్రీ సంతోష్ గజవాడ, శ్రీ నవీన్ సూదిరెడ్డి, శ్రీ ప్రకాశ్ రెడ్డి చిట్యాల పాల్గొన్నారు.

ఈ సంక్రాంతి సంబరాలలో పిల్లలకు భోగిపండ్ల కార్యక్రమముతో ఆశీర్వదించారు మరియు సంస్థ నిర్వహించిన ముగ్గుల పోటీలలో మొదటి బహుమతి శ్రీమతి అనుపమ పబ్బ గారు గెలుచుకున్నారు. ఈ సందర్బంగా సాంస్కృతిక కార్యదర్షి శ్రీమతి దీప గజవాడ మరియు ఉపాధ్యక్షులు శ్రీ విజయకుమార్ తిరుమలాపురం ఆద్వర్యంలో మూడు గంటలపాటు చక్కటి సాంస్కృతిక కార్యక్రమములను నిర్వహించగా సభా సమయం మొత్తానికి ఆంకర్లుగా కుమారి మేఘ స్వర్గం మరియు శ్రీమతి హారిక నిర్వహించారు.

ఈ సందర్బంగా తెలుగు తిధి లతో కూడిన టోరొంటో సమయముతో అసోషియేషన్ 2019 క్యాలెండరును ఆవిష్కరించారు.

ఈ ఉత్సవాలలో తెలంగాణ కెనడా సంఘం అత్యంత రుచికరమైన భోజనాలను ఏర్పాటు చేసింది. చివరగా అధ్యక్షులు శ్రీ రమేశ్ మునుకుంట్ల వందన సమర్పణతో బతుకమ్మ ఉత్సవాలు ముగిసాయి.

తెలుగు అలయన్స్అఫ్ కెనడా (తాకా) రంగ రంగ వైభోగంగా సంక్రాంతి సంబరాలు, చింగస్కీ సెకండరీ స్కూల్, భ్రాంప్టెన్, కెనడా లో జనవరి 19, 2019 న జరుపు కొన్నారు. ఈ సంబరాలను -30 డిగ్రీల చలిలో కూడా తెలుగు వారందరు వచ్చి  వేడుకలను విజయవంతం చేసారు. తాకా కార్యదర్శి నాగేంద్ర హంసాల ఆహ్వానించగా, కల్పనా మోటూరి, రజని లయం, ముంతాజ్ బేగం,సుష్మ, మరియు అర్చన గార్లు దీప ప్రజ్వలన చేయగా సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. తాకా వారు కార్యక్రమానికి వచ్చిన చిన్నపిల్లలకు డైరెక్టర్స్ దీపా సాయిరామ్ మరియు వాణి జయంత్ భోగి పళ్ళ కార్యక్రమమును  మంగళ వాయిద్యాల మద్య ముత్తయిదుల చే ఆశీర్వదింప చేసారు. తాకా కార్యవర్గం సంక్రాంతి పండుగ మీద వ్యాస రచన పోటీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

 

తాకా అద్యక్షులు శ్రీ అరుణ్ లయం గారు సంక్రాంతి  మరియు  తెలుగు సంస్కృతి  గురించి  సభికులను ఉద్దేశించి ప్రసంగించారు మరియు ఈ సంవత్సరపు దాతలను సభకు పరిచయం చేసారు. ఈ సంబరాలలో తాకా పూర్వ అద్యక్షులు శ్రీ చారి సామంతపూడి మరియు శ్రీ గంగాధర్ సుఖవాసి ప్రత్యేకంగా టొరోంటొ ఘడియలుతో చేపించబడిన  తెలుగు క్యాలెండర్నిఆవిష్కరించారు. ఈ సంబరాలలో  తాకా  సాంస్కృతిక కార్యదర్శి దీప సాయిరాం మరియు వాణి జయంత్ ఆధ్వర్యం లో దాదాపు 20  సాంస్కృతిక  కార్యక్రమాలు  తోటి  తెలుగు వారితో  నాటికలు, సినిమా డాన్సులు, పాటలు ఆరు గంటల పాటు ఎంతో ఉత్సాహమంతమైన వాతావరణం లో ప్రదర్శించ బడ్డాయి. అచ్చ తెలుగు వంటకాలు మరియు అరిసెలతో తాకా వారు భోజనాలని ఏర్పరిచారు.                                                              

ఎంతో అద్భుతంగా చేపట్టి మరియు విజయవంతం చేసిన ఫుడ్ కమిటీ శ్రీ సురేష్ కూన, సాంస్కృతిక కమిటి దీప సాయిరాం మరియు వాణి జయంత్, క్యాలెండర్ కమిటీ శ్రీ  గంగాధర్ సుఖవాసి మరియు ఉపాధ్యక్షులు దుగ్గిన రామచంద్రరావు , తాకా కోశాధికారి కల్పనా మోటూరిలను,రిజిస్ట్రేషన్ కమిటీ సభ్యుడు రాఘవ్ అల్లం లను   తాకా అద్యక్షులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇతర ట్రస్టీ సభ్యులు శ్రీబాషా షేక్, శ్రీ రాంబాబు కల్లూరిని, శ్రీ కిరణ్ కాకర్లపూడి, ఇతర వ్యవస్థాపక సభ్యులు శ్రీ శ్రీనాథ్ కుందూరు, శ్రీ రమేష్ మునుకుంట్ల గార్లు పాల్గొని కార్యవర్గానికి ఎంతో సహకరించారు. తాకా కమిటీలు ఈ సంక్రాంతి సంబరాలను  ఎంతో శ్రమకోర్చి కెనడా లోని  తెలుగు వారి కోసం  ఏర్పాటు చేసారు. చివరిగా అందరికి  ధన్యవాదాలు చెపుతూ జనగణమన  జాతీయ గీతంతో  కార్యక్రమాలు  ముగించారు.

0 680

తెలంగాణ కెనడా సంఘం ఆధ్వర్యంలో 13  అక్టోబరు 2018 శనివారం రోజున కెనడా దేశం గ్రేటర్ టోరొంటో లోని  లింకన్ అలక్జెండర్ పాఠశాల ఆడిటోరియంలో 800 మందికి పైగా ప్రవాస తెలంగాణా వాసులు  పాల్గొని బతుకమ్మ ఉత్సవాలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. మహిళలు సాంప్ర దాయ దుస్తులతో బతుకమ్మ ఆటలు ఆడుతు పాటలు పాడుకొన్నారు.  సంఘం ఆద్వర్యంలో  మరియు తెలంగాణ ఏర్పాటు తర్వాత ఐదవ  బతుకమ్మ కావడంతో అందరు కూడ పండుగను  అత్యంత సంబురంగా జరుపుకున్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ కెనడా సంఘం ఆద్వర్యంలో మంచి రుచికరమైన భొజనాలు ఏర్పాటు చేసారు. ఈ పండుగ సంబురాలు తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ కోటేశ్వర రావు చిత్తలూరి ఆధ్వర్యంలో జరుగగా తెలంగాణ కెనడా అసోసియేషన్ ఫౌండేషన్ కమీటీ అధ్యక్షులు శ్రీ దేవెందర్ రెడ్డి గుజ్జుల, ట్రుస్టీ బోర్డు అధ్యక్షులు శ్రీ ప్రభాకర్ కంబాలపల్లి, ఉపాధ్యక్షులు శ్రీ రాజేశ్వర్ ఈద, కార్యదర్షి శ్రీమతి రాధిక బెజ్జంకి, కోషాధికారి శ్రీ సంతోష్ గజవాడ, సాంస్కృతిక కార్యదర్షి శ్రీ విజయ్ కుమార్ తిరుమలాపురం, డైరక్టర్లు శ్రీ శ్రీనివాస్ మన్నెం,  శ్రీమతి భారతి కైరొజు, శ్రీ మురళి కాందివనం,  ట్రుస్టీ సభ్యులు శ్రీ శ్రీనివాసు తిరునగరి, శ్రీ సమ్మయ్య వాసం, అథీక్ పాష, ఫౌండర్లు శ్రీ రమేశ్ మునుకుంట్ల, శ్రీ చంద్ర స్వర్గం, శ్రీనాధ్ రెడ్డి కుందూరి, శ్రీ అఖిలేశ్ బెజ్జంకి, కలీముద్దిన్, శ్రీ వేణుగోపాల్ రోకండ్ల,  శ్రీ హరి రావుల్  పాల్గొన్నారు.

2018-20 కి ఎన్నికైన నూతన కమీటీలను ఈ పండుగ వేడుకలలో ప్రకటించి పరిచయం చేసారు. నూతన అధ్యక్షులుగా శ్రీ రమేశ్ మునుకుంట్ల, ఉపాధ్యక్షులుగా శ్రీ విజయకుమార్ తిరుమలాపురం, కార్యదర్శిగా శ్రీ శ్రీనివాస్ మన్నెం, సాంస్కృతిక కార్యదర్శిగా శ్రీమతి దీప గజవాడ, కోషాధికారిగా శ్రీ దామోదర్ రెడ్డి మాది, డైరక్టర్లుగా శ్రీ మనోహర్ భొగా, శ్రీ  శ్రీనివాస్ చంద్ర, శ్రీమతి మంగ వాసం, శ్రీ మూర్తి కలగోని, శ్రీ గణేశ్ తెరల, ట్రుస్టీ బోర్డు అధ్యక్షునిగా శ్రీ హరి రావుల్, ట్రస్టీలుగా శ్రీ సురేశ్ కైరోజు, శ్రీ వేనుగోపాల్ రెడ్డి ఏళ్ళ, శ్రీ కిరన్ కుమార్ కామిశెట్టి మరియు శ్రీ నవీన్ ఆకుల

ఈ సందర్భంగా ఈ సంవత్సరపు ఉత్తమ బతుకమ్మలకు ప్రైజులను అందజేశారు. బతుకమ్మలను ప్రక్కనేగల హంబర్ నదిలో నిమజ్జనం చేసి సాంప్రదాయ బద్దంగా తయరు చేసుకొని వచ్చిన ఫలహారాలను ఆరగించారు. మహిళలు గౌరమ్మ పసుపు కుంకుమలను పంచుకున్నారు. చివరగా  ఉపాధ్యక్షులు శ్రీ రాజేశ్వర్ ఈద మరియు శ్రీ విజయకుమార్ తిరుమలాపురం సాంస్కృతిక కార్యదర్శి  వందన సమర్పణతో బతుకమ్మ ఉత్సవాలు ముగిసాయి.

తెలుగు అలయన్స్అఫ్ కెనడా (తాకా) రంగ రంగ వైభోగంగా సంక్రాంతి సంబరాలు కెనడా, మిస్స్సిసాగా లోని గ్లెన్ ఫారెస్ట్ సెకండరీ స్కూల్ లో  జనవరి 13, 2018 న జరుపు కొన్నారు. ఈ సంబరాలలో దాదాపు 1000 మందికి పైగా తెలుగు వారు -25 డిగ్రీ ల చలి వాతావరణము లో కూడా వచ్చి  వేడుకలను విజయవంతం చేసారు. తాకా కార్యదర్శి శ్రీ నాగేంద్ర హంసాల, శ్రీమతి మీనా ముల్పూరి, శ్రీమతి వాణి జయంతి, శ్రీమతి ముంతాజ్ షేక్ ని ఆహ్వానించగా, వారు దీప ప్రజ్వలన చేయగా సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. తాకా వారు కార్యక్రమానికి వచ్చిన చిన్నపిల్లలకు దీపా సాయిరామ్ మరియు శ్రీమతి వాణి జయంతి గారి ఆధ్వర్యం లో భోగి పళ్ళతో మంగళ వాయిద్యాల మద్యన వారిని ఆశీర్వదించారు. అరుణ్ కుమార్ లయం గారి ఆధ్వర్యం లో వివిధ రకమైన బొమ్మలతో ఆకర్షిణీయంగా బొమ్మల కొలువును ఏర్పరిచారు.  ఈ సంబరాలలో తాకా ఉపాద్యక్షులు శ్రీ దుగ్గిన రామచంద్రరావు ఆద్వర్యంలో ప్రత్యేకంగా  టొరోంటొ ఘడియలుతో చేపించబడిన  తెలుగు క్యాలెండర్ని పూర్వ అధ్యక్షులు చారి సమాంతపూడి, మరియు గంగాధర్ సుఖవాసి గార్ల చే ఆవిష్కరించారు. ఈ సంబరాలలో  దాదాపు 25  సాంస్కృతిక  కార్యక్రమాలు  తోటి  తెలుగు వారితో  నాటికలు, కూచిపూడి , భారత నాట్య, సినిమా మరియు సినీ పాటలతో    ఆరు గంటల  పాటు ప్రదర్శించ బడ్డాయి. విక్రమ్ కొండతాశుల, శ్రీనివాస్ బొగా డి , మల్లేశ్వరి  వ్యాఖ్యాతలు గా  వ్యవహరించారు. అచ్చ తెలుగు వంటకాలు మరియు అరిసెలతో తాకా వారు భోజనాలని ఏర్పరిచారు.

తాకా కార్య వర్గం, పూర్వ కార్యవర్గం అధ్యక్షులు చారి సమాంతపూడి గారి ని వారి సేవని కొనియాడుతూ శాలువాతో సత్కరించి మెమెంటో అందచేశారు. ఈకార్య క్రమంలో తానా కెనడా ఉపాద్యాయులు లక్ష్మీనారాయణ సూరపనేని గారు ఇతర కార్యవర్గ సభ్యులకు  బహుమతులు అందచేశారు. అధ్యక్షులు అరుణ్ కుమార్ సంక్రాంతి ముఖ్య దాత వెంకట్ పెరుగు గారికి మెమెంటో అందచేశారు. తాకా కార్యవర్గం ముగ్గుల పోటీలు మరియు ఇతర లక్కీడ్రాల విజేతలకు బహుమతులు అందచేశారు.

 తాకా  సాంస్కృతిక కార్యదర్శి  శ్రీమతి దీపా సాయిరామ్ మరియు శ్రీమతి వాణి జయంతి ఆధ్వర్యం లో  సాంస్కృతిక  కార్యక్రమాలు ఎంతో ఉత్సాహమంతమైన వాతావరణం లో జరపపడ్డాయి. అద్యక్షులు శ్రీ అరుణ్ కుమార్ లయం గారు సంక్రాంతి  మరియు  తెలుగు సంస్కృతి  గురించి  సభికులను ఉద్దేశించి ప్రసంగించారు. కెనడా లోని తెలుగు చిన్నారులు మరియు యువతీ యువకులతో ప్రదర్శించబడిన అష్టదిగ్గజాలు మరియు నృత్య ప్రదర్శన సభికులను ఎంతో ఆకట్టుకున్నది.  సురేష్ నిట్టల , ధీరజ్ బర్ల , సంధ్య గార్ల సుస్వరధ్వని , డాన్స్ మంత్ర  వారిలో ఫాషన్ షో  మరియు ఎన్నో ఇతర కార్యక్రమాలు దాదాపు ఆరుగంటలు సేపు ప్రేక్షకులను ఉర్రూతలుగించాయి.

ఎంతో అద్భుతంగా చేపట్టి మరియు విజయవంతం చేసిన ఫుడ్ కమిటీ శ్రీ సురేష్  కూన మరియు శ్రీమతి కల్పన గారి ని ,డెకరేషన్ కమిటీ శ్రీ నాగేంద్ర హంసల మరియు రఘు అల్లం గారి ని, సాంస్కృతిక కమిటి దీపా సాయిరామ్ మరియు వాణి  జయంతి ను, క్యాలెండర్ కమిటీ  గంగాధర్ సుఖవాసి మరియు రామచంద్రరావు దుగ్గినను, రిజిస్ట్రేషన్ కమిటీ శ్రీమతి కల్పన మోటూరి, శ్రీ రఘు అల్లం మరియు రాంబాబు కల్లూరి గార్లను తాకా అద్యక్షులు అభినందించారు. ఈ కార్యక్రమం లో ట్రస్టీ సభ్యులు శ్రీబాషా షేక్, శ్రీ రాంబాబు కల్లూరి, కిరణ్ కాకర్లపూడి, ఆర్నాల్డ్ మద్దెలపూడి మరియు ట్రస్టీ ఛైర్మన్  శ్రీ లోకేష్ చిల్లకూరు, వ్యవస్థాపక సభ్యులు శ్రీ శ్రీనాథ్ కుందూరు, శ్రీ చారి  సమాంతపూడి  మరియు శ్రీ గంగాధర్ సుఖవాసి పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. చివరిగా అందరికి  ధన్యవాదాలు చెపుతూ జనగణమన  జాతీయ గీతంతో  కార్యక్రమాలు ముగించారు. 

తెలుగు అలయెన్సెస్ ఆఫ్ కెనడా (తాకా) ఆద్వర్యంలో అక్టోబరు 21వ తేది 2017 శనివారం రోజున మిస్సిస్సాగ నగరంలోని పోర్ట్ క్రెడిట్ సెకండరీ స్కూల్లో సుమారు 1000 పైగా  తెలుగు వారు పాల్గొనగా దీపావళి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ఈ వేడుక అచ్చ తెలుగు సాంప్రదాయ పద్దతులతో దాదాపు 5 గంటలపాటు వివిద సాంస్కృతిక కార్యక్రమాలతొ సభికులను అలరించాయి. ఈ స౦దర్బ౦లో 25 కి  పైగా చక్కటి సా౦స్కృతిక  కార్యక్రమాలు తాకా  ఆద్వర్య౦లో జరుగగా ఇ౦దులో కెనడా స్థానిక  తెలుగువారు  పాల్గొన్నారు. తాకా వారు చక్కటి రుచికరమైన తెలుగు భోజన౦ ఏర్పాటు చేశారు.

 

తాకా  కార్యదర్శి శ్రీ లోకేష్ చిల్లకూరు ఆహ్వానించగా, శ్రీమతి  జ్యోతి సామంతపూడి, శ్రీమతి మీనా ముల్పూరి , శ్రీమతి ధనలక్ష్మి  మునుకుంట్ల , శ్రీమతి కల్పన మోటూరి మరియు శ్రీమతి సరస్వతి కొండబత్తిని గార్లు  జ్యోతి ప్రజ్వలన  చేసారు. ఇండియా మరియు కెనడా జాతీయ గీతాలతో  సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.  ఈ దీపావళి  వేడుకలలో దాదాపు వంద మంది టొరంటోలో నివసిస్తున్న చిన్నారులు, యువత మరియు పెద్దలు  వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ వేడుకలో కూచిపూడి, భరతనాట్యం , కథాకళి , జానపద, సినిమా గీతాలు, నృత్యా లు, మరియు నాటికలు చిన్నపిల్లల నుండి పెద్దల వరుకు పాల్గొని ప్రేక్షకులను వారి ప్రతిభ సామర్థ్యాలతో ఉర్రుతలూగించారు.  సాంస్కృతిక కార్యక్రమాలన్నింటిని శ్రీ అరుణ్ కుమార్ లయం మరియు శ్రీమతి దీప సాయిరాం గార్ల పర్యవేక్షణ లో నిర్వహించబడినాయి. కుమారి కీర్తి సుఖవాసి మరియు సందీప్ లయం వ్యాఖ్యాతలగా  వ్యవహరించారు. 

 

తాకా అధ్యక్షులు హనుమంతాచారి సామంతపూడి సభికులను ఆహ్వానించిఈ రెండు సంవత్సరములో తాకా చేసిన కార్యక్రమాలను వివరి౦చారు, తాకా అత్యధిక జీవిత సభ్యుల గల సంస్థగా , అత్యధిక ధాతలున్న సంస్థగాఅత్యధిక కార్యక్రమాలు జరుపుతున్న సంస్థగా కెనడాలో తెలుగు స౦స్కృతిసా౦ప్రదాయలను ము౦దుతరాల వారలకు అందిస్తున్నట్లు వివరించారు.  ఈ కార్యక్రమంలో దాదాపు 25 సంవత్సరాలనుండి కెనడాలో తెలుగు వారికీ సేవ చేస్తూ, 3 వ సారి తానా కెనడా రీజినల్ వైస్ ప్రెసిడెంట్ గా వున్న శ్రీ లక్ష్మీనారాయణ సూరపనేని గారిని తాకా కార్యవర్గం ఘనంగా దుశ్శాలువతో సత్కరించారు. శ్రీ సూరపనేని గారు తాకా దీపావళి కార్యక్రమ దాతలు శ్రీ రాధాకృష్ణ గూడూరు, ప్రసాద్ ఓడూరి  మరియు శ్రీమతి వైశాలి శ్రీధర్ గార్లకు జ్ఞాపికలు అందచేశారు. 

 

 ఈ వేడుకను ఎంతో అద్భుతం గా చేపట్టి మరియు విజయవంతం చేసిన కోశాధికారి శ్రీ భానుప్రకాష్ పొతకమూరిని, ఫుడ్ కమిటీ ఇంచార్జి శ్రీమతి కల్పన మోటూరిని, కల్చరల్ ఇంచార్జి  శ్రీమతి దీపా సాయిరాంనియూత్ డైరెక్టర్ కుమారి కీర్తి సుఖవాసినిఫౌండర్స్ చైర్మన్ శ్రీ రమేష్ మునుకుంట్లనుట్రస్టీ సభ్యులు శ్రీమతి మీనా ముల్పూరిని , శ్రీమతి వైశాలి శ్రీధర్ ను , శ్రీ బాషా షేక్ ను , మరియు శ్రీ వీరాంజనేయులు కోటను  తాకా అధ్యక్షులు అభినందించారు. తాకా వ్యవస్థాపక సభ్యులు శ్రీ  శ్రీనాథ్ కుందూరు, శ్రీ రామచంద్రరావు దుగ్గినమరియు మాజి అధ్యక్షులు శ్రీ గంగాధర్ సుఖవాసి, మునాఫ్ అబ్దుల్  గార్లు  వేడుకను పర్యవేక్షించారు.  ఈ కార్యక్రమములో పాల్గొన్న చిన్నారులందరికి బహుమతులు ప్రదాన౦ చేసారు.  ఈ కార్యక్రమంలో తాకాఅధ్యక్షులు  ఈ క్రింది నూతన కార్యవర్గాలను (2017-2019) సభకు పరిచయము చేసి, తాకా పోషక కర్తలకు, తాకా సభ్యులకు మరియు వాలంటీర్లందరికి  వేడుక విజయవంతము చేసినందులకు ధన్యవాదములు తెలియచేసారు. 

Executive Committee

అధ్యక్షులు: శ్రీ అరుణ్ కుమార్ లయం 

ఉపాధ్యక్షులు: శ్రీ రామచంద్రరావు దుగ్గిన 

జనరల్ సెక్రటరీ: శ్రీ నాగేంద్ర హంసాల 

కోశాధికారి: శ్రీమతి కల్పన మోటూరి 

కల్చరల్ సెక్రటరీ: శ్రీమతి దీప సాయిరాం

డైరెక్టర్: శ్రీ సురేష్ కుమార్ కూన 

డైరెక్టర్: శ్రీ రాఘవకుమార్  అల్లం 

డైరెక్టర్: శ్రీమతి వాణి జయంత్ 

Board of Trustees:

ఛైర్మన్ : శ్రీ లోకేష్ చిల్లకూరు 

ట్రస్టీ సబ్యులు : శ్రీ బాష షేక్

                       : శ్రీ రాంబాబు కల్లూరు 

                       : శ్రీ కిరణ్ కాకర్లపూడి 

                       : శ్రీ ఆర్నాల్డ్ రామానుజులు మద్దెల 

Founders Chairman: శ్రీ మునాఫ్ అబ్దుల్ 

 

తెలంగాణ కెనడా సంఘం (Telangana Canada Association –TCA) ఆద్వ్యర్యంలో తేది  జూన్ 3  2017 శనివారం రోజున మిస్సిస్సౌగలోని పోర్టుక్రెడిట్  సెకండరీ పాఠశాల ఆడిటోరియంలో  తెలంగాణ కెనడా ధూంధాం పేరుతో తెలంగాణ ఆవిర్బావాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సంబురాల్లో దాదాపు 500 పైగా కెనడా తెలంగాణ వాసులు పాల్గొని విజయవంతం చేసారు.

 

మొదటగా కార్యదర్శి శ్రీమతి రాధిక బెజ్జంకి గారు అందరికి ఆహ్వానం పలికారు అధ్యక్షులు శ్రీ కోటేశ్వరరావు చిత్తలూరి గారు సభ ప్రారంబానికి జెండా ఊపగా జ్యోతి ప్రజ్వలన తో కార్యక్రమాలను ప్రారంభించారు. ఫౌండేషన్ కమిటి అధ్యక్షులు శ్రీ దేవేందర్ రెడ్ది గుజ్జుల  గారు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి సభకువిచ్చేసిన వారందరితో మౌనం పాటింప చేసిన తర్వాత ఉత్సవాలను ప్రారంభించారు.

 

ఈ కార్యక్రమానికి ముఖ్యఅథితిగా  కెనడాలో భారత ప్రభుత్వ ఉప రాయబారి  మరియు తెలంగాణ జాగృతి ఉత్తర అమెరికా అధ్యక్షులు శ్రీ శ్రీధర్ భండారు గారు విచ్చెసి నూతన తెలంగాణ నిర్మాణంలో కెనడా లోని తెలంగాణ ప్రవాసులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

 

తెలంగాణ కెనడా సంఘం ఫౌండర్ శ్రీ రమేశ్ మునుకుంట్ల గారు తెలంగాణ జాగృతి కెనడాకు ప్రధమ అధ్యక్షులుగా నియమింపబడినందులకు శ్రీ రమేశ్ మునుకుంట్ల గారిని & శ్రీమతి ధనలక్ష్మి మునుకుంట్ల గారిని కమీటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.

 

ఈ వేడుక లు కల్చరల్  సెక్రటరీ శ్రీ విజయకుమార్ తిరుమలాపురం గారి ఆద్వైర్యంలో  ఎన్నోవివిద సాంస్క్రుతిక కార్యక్రమాలతొ దాదాపు 6 గంటలపాటు సభికులను అలరించాయి.  పోతరాజు వేషంలో శ్రీ గిరిధర్ క్రొవిడి గార్లు అద్బుతమైన లష్కర్ బోనాల ఊరేగింపు మరియూ పీరీల ప్రదర్శన సభికులందర్ని విషేషంగా ఆకర్సించాయి.

 

ఈ కార్యక్రమాలన్నీ స్తానిక తెలంగాణ వారు చక్కటి తెలంగాణ భాని లో ప్రదర్శించటం విశేషం. సభికులందరికి  తెలంగాణ కెనడా అసోసియేషన్  రుచికరమైన తెలంగాణ  వంటకాలతో  భోజనాలు  ఏర్పాటు చేశారు

ఈ సంబురాలను తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ కోటేశ్వరరావు చిత్తలూరి  గారి ఆధ్వర్యంలో జరుగగా, ట్తస్టీ అధ్యక్షులు శ్రీ ప్రభాకర్ కంభాలపల్లి , ఫౌండేషన్ కమిటి అధ్యక్షులు శ్రీ దేవేందర్ రెడ్ది గుజ్జుల, ఉపాధ్యక్షులు శ్రీ రాజేశ్వర్ ఈద, సెక్రటరీ శ్రీమతి రాధిక బెజ్జంకి , కల్చరల్  సెక్రటరీ శ్రీ విజయకుమార్ తిరుమలాపురం , ట్రెజరర్ శ్రీ సంతోష్ గజవాడ మరియు డైరక్టర్లు శ్రీ శ్రీనివాస్ మన్నెం, శ్రీ దామోదర్ రెడ్ది మాది, శ్రీ మురళి కాందివనం, శ్రీమతి భారతి కైరోజు, శ్రీ మల్లికార్జున్ మదపు, ట్రుస్టీలు శ్రీ సమ్మయ్య వాసం, శ్రీ శ్రీనివాస్ తిరునగరి, ఫౌండర్లు శ్రీ రమేశ్ మునుకుంట్ల, శ్రీ చంద్ర స్వర్గం, శ్రీ నవీన్ రెడ్ది సూదిరెడ్ది,  శ్రీ హరి రావుల, శ్రీ అఖిలేశ్ బెజ్జంకి, శ్రీ వేణు రోకండ్ల మరియు  ఇతర వాలంటీర్సు సహకారంతో నిర్వహిం చారు.

ఈ కార్యక్రమానికి వ్యాక్యాతలుగా శ్రీమతి స్నిగ్ద గుల్లపల్లి, మనస్విణి బెజ్జంకి, ఐశ్వర్య ఈద మరియు మేఘ స్వర్గం లు వ్యవహరించారు.

 

ఆఖరున ఉపాధ్యక్షులు శ్రీ రాజేశ్వర్ ఈద  గారు వందన సమర్పణతో కార్యక్రమాలు ముగిసాయి.

తెలుగు అలయెన్సెస్ ఆఫ్ కెనడా (తాకా) వారి ఆధ్వర్యములో ఏప్రిల్ 1 వ తేదిన శనివారం మిస్సిసాగా నగరంలోని  పోర్ట్ క్రెడిట్ సెకండరీ స్కూల్ లో ఉగాది వేడుకలు దాదాపు 1100 మందికి పైగా తోటి తెలుగు వారి తో కన్నుల పండుగ గా జరిగాయి. ఈ వేడుక  సాంస్కృతిక  కమిటీ శ్రీ  అరుణ్ లయం, మరియు శ్రీమతి దీప సాయిరాం  ఆద్వర్యం లో అచ్చ తెనుగు సాంప్రదాయ పద్ధతులతో దాదాపు 6 గంటలు పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల తో సభికులను అలరించాయి. పండిట్ శ్రీ సూర్యనారాయణ అద్దేపల్లి గారు హేవళంబి నామ సంవత్సర పంచాంగ శ్రవణం చేయగా, శ్రీమతి లక్ష్మి దుగ్గిన గారు ఉగాది పచ్చడి అందరికి అందచేశారు.

taca_ug_barat taca_ug_deepika taca_ug_janapadam taca_ug_laka taca_ug_lavakusa taca_ug_mla

తాకా  కార్యదర్శి శ్రీ లోకేష్ చిలుకూరు గారు  ఆహ్వానించగా,  శ్రీమతి లక్ష్మి దుగ్గిన, శ్రీమతి దీప సాయిరాం, శ్రీమతి గాయత్రి , శ్రీమతి వైశాలి శ్రీధర్ , మరియు  శ్రీమతి కల్పన మోటూరి గార్లు జ్యోతి ప్రజ్వలన చేయగా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉగాది వేడుకలలో దాదాపు వంద మంది టొరంటోలో నివసిస్తున్న చిన్నారులు, యువత మరియు పెద్దలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ వేడుకలో కూచిపూడి, భరత నాట్యం, కథాకళి , జానపద, సినిమా గీతాలు, నృత్యాలు, మరియు నాటికలు చిన్న పిల్లల నుండి పెద్దల వరుకు పాల్గొని ప్రేక్షకులను వారి ప్రతిభ సామర్ధ్యాలతో ఉర్రుతలూగించారు. ఈ  కార్యక్రమానికి మిస్సిసాగా M.P.P దీపిక దామెర్ల గారు మరియు టొరంటో  వైస్ కాన్సుల్  జనరల్ ఉష వెంకటేశం  గార్లు ముఖ్య అతిధిగా హజరయ్యరు.  తాకా  అద్యక్షులు  శ్రీ హనుమంతాచారి సామంతపూడి గారు  తాకా పురస్కారముల ప్రాస్తవ్యాన్ని, తాకా వ్యవస్తాపకతను, ఆవశ్యకతను మరియు భవిష్యత్తు ప్రణాళికను  వివరించారు. తాకా  వారు  ఉగాది వేడుకల సందర్బంగా  గ్రేటర్ టొరంటో ఏరియాలో బారతీయ బాషలు, సంస్కృతి, విద్య, క్రీడలు, సంఘ సేవ మొదలగు విషయాల లో సేవ చేస్తున్న మంత్రి వర్యులు శ్రీమతి దీపికా దామెర్ల, శ్రీమతి వినయ్ దేవిశెట్టి (క్రీడలు), శ్రీమతి నళిని దేవినేని (తెలుగు బాష), మరియు శ్రీమతి అనురాధ పెంట (తెలుగు బాష ) గార్ల ను ఈ సంవత్సరపు తెలుగు పురస్కారములుతో తాకా అద్యక్షులు  శ్రీ హనుమంతాచారి సామంతపూడి , ఫౌండేషన్ చైర్మన్ శ్రీ రమేష్ మునుకుంట్ల, బోర్డు అఫ్ ట్రస్టీ చైర్మన్ శ్రీ అరుణ్కుమార్ లయం, వ్యవస్థాపక సభ్యుదు శ్రీ రామచంద్ర రావు దుగ్గిన  సత్కరించారు. తాకా ట్రస్టీ సభ్యులు శ్రీ బాష షేక్, శ్రీమతి వైశాలి శ్రీధర్, కోశాధికారి శ్రీ భాను పోతకమూరి గార్లు, డైరెక్టర్స్  శ్రీమతి కల్పన  మోటూరి, శ్రీ నాగేంద్ర హంసాల సాంస్కృతిక కార్యక్రమాల లో పాల్గొన్న వారికి, మరియు మార్చిలో జరిగిన తాకా ఆటల పోటీల లో పాల్గొన్న వారికీ బహుమతులు అంద చేసారు.  తాకా వేడుకను మరియు క్రీడల పోటీల ను జరుపటకు ఆర్హిక సహాయం చేసిన జయశ్రీ కన్నన్ మరియు రావు బొప్పన గార్ల ను శ్రీ లక్ష్మినారాయణ సూరాపనేని గారు జ్ఞాన దీపికాలు అంద చేసారు. తాకా వారు ప్రత్యేకంగా తయారు చేపించిన పిండివంటలతో  ఉగాది విందుని ఏర్పాటు చేసారు. తాకా వ్యవస్థాపక సభ్యుడు శ్రీ రవి వారణాసి అధ్వర్యం లో ఏర్పడిన తాకా కొత్త వెబ్ సైట్ ను ఈకార్యక్రమం లో విడుదల చేసారు.

taca_ug_red taca_ug_trophies taca_ug_voni taca_ugad_kids taca_ugad_white taca-ug_deepa_grp

ఈ వేడుకను ఎంతో అద్భుతం గా చేపట్టి మరియు విజయవంతము చేసిన తాకా కోశాధికారి శ్రీ భాను పోతకమూరిని, ఫుడ్ కమిటీ ఇంచార్జి శ్రీమతి కల్పనా మోటూరిని మరియు శ్రీ వీరాంజనేయులు కోటను , కల్చరల్ ఇంచార్జి శ్రీమతి దీప సాయిరాంని, వాలంటీర్స్ ఇంచార్జి  శ్రీ నాగేంద్ర హంసల ను తాకా అద్యక్షులు అభినందించారు. ఈ కార్యక్రమం లో తాకా  వ్యవస్థాపక సభ్యులు శ్రీ శ్రీనాథ్ కుందూరి , శ్రీ గంగాధర్ సుఖవాసి, శ్రీ రామచంద్ర రావు దుగ్గిన లు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.  చివరిగా అందరికి ధన్యవాదాలు చెపుతూ జనగణమన జాతీయగీతంతో కార్యక్రమాన్ని ముగించారు.

0 1053

ugadi-2017-celebrations-in-vancouver-canada-by-vataవాంకోవర్ ఏరియా తెలుగు అసోసియేషన్ (వాటా) ఉగాది వేడుకలు శనివారం ఏప్రిల్ 1, 2017 జరగనున్నాయి అని సభ్యులందరకు  తెలియచేయడానికి సంతోషిస్తున్నాము. వాటా కమ్యూనిటీ సభ్యులు అందరూ తెలుగు నూతన సంవత్సరం జరుపుకునేందుకు, పాత స్నేహితులను కలుసుకునేందుకు, కొత్త పరిచయాలు చేసుకునేందుకు మరియు సాంస్కృతిక ప్రదర్శనలు చూసి ఇంకా రుచికరమైన తెలుగు వంటలు రుచి చూసి ఆనందించడానికి ఇది ఒక మంచి అవకాశం.

మీరు కార్యక్రమములో ఏదైనా ప్రదర్శన ఇవ్వాలి అనుకున్నా లేదా నిర్వహణలో సహయం చెయ్యాలనుకున్నా, దయచేసి  శుభా (778-387-0096) / మధు (778-316-9036)  గారికి ఫోను గాని[email protected] కి ఈమెయిల్ గాని చేయ్యండి

ప్రతి సంవత్సరంలాగనే ఈసారి కూడా మీరు పెద్ద సంఖ్యలో ఉగాది ఉత్సవాలలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విన్నవించుకుంటున్నాము.

 

0 1087

తెలుగు అలయన్స్అఫ్ కెనడా (తాకా) రంగ రంగ వైభోగంగా సంక్రాంతి సంబరాలు, పోర్ట్ క్రెడిట్ సెకండరీ స్కూల్, మిస్స్సిసాగా, కెనడా లో జనవరి 21, 2017 న జరుపు కొన్నారు. ఈ సంబరాలలో దాదాపు 600 మంది తెలుగు వారు చలి వాతావరణము లో కూడా వచ్చి  వేడుకలను విజయవంతం చేసారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిధి గా  ఆంటారియో  మంత్రి వర్యులు దీపికా దామెర్ల గారు విచ్ఛేసారు. తాకా సాంస్కృతిక కార్యదర్శి శ్రీమతి దీపా సాయిరాం ఆహ్వానించగా, శ్రీమతి లక్ష్మి దుగ్గిన, శ్రీమతి కాశీ అన్నపూర్ణేశ్వరి, శ్రీమతి జ్యోత్స్నా గోనేపల్లి, శ్రీమతి ముంతాజ్ భేగ్, మరియు శ్రీమతి ప్రమీల యరమాసు గార్లు దీప ప్రజ్వలన చేయగా సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. తాకా వారు కార్యక్రమానికి వచ్చిన చిన్నపిల్లలకు డైరెక్టర్స్ దీపా సాయిరామ్ మరియు శ్రీమతి కల్పన మోటూరి గార్లు భోగి పళ్ళ కార్యక్రమమును  మంగళ వాయిద్యాల మద్య ముత్తయిదుల చే ఆశీర్వదింప చేసారు. తాకా కార్యవర్గం వివిధ రకమైన బొమ్మలతో ఆకర్షిణీయంగా బొమ్మల కొలువును ఏర్పరిచారు. ట్రస్టీ సభ్యులు శ్రీమతి మీనా ముల్పూరి ఆద్వర్యంలో తాకా ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంబరాలలో  శ్రీ తాకా వ్యవస్థాపక చైర్మన్ శ్రీ రమేష్ మునుకుంట్ల  ముఖ్య అతిధి ని పరిచయము చేయగా, తాకా అద్యక్షులు శ్రీ చారి సామంతపూడి ప్రత్యేకంగా టొరోంటొ ఘడియలుతో చేపించబడిన  తెలుగు క్యాలెండర్ని ముఖ్య అతిధి దీపికా దామెర్ల తో ఆవిష్కరించారు.  ఈ సంబరాలలో  తాకా  సాంస్కృతిక కార్యదర్శి దీప సాయిరాం మరియు ట్రస్టీ చైర్మన్ శ్రీ అరుణ్ కుమార్ లయం ఆధ్వర్యం లో దాదాపు 20  సాంస్కృతిక  కార్యక్రమాలు  తోటి  తెలుగు వారితో  నాటికలు, సినిమా డాన్సులు, పాటలు ఆరు గంటల పాటు ఎంతో ఉత్సాహమంతమైన వాతావరణం లో ప్రదర్శించ బడ్డాయి. అచ్చ తెలుగు వంటకాలు మరియు అరిసెలతో తాకా వారు భోజనాలని ఏర్పరిచారు.  శ్రీమతి అపర్ణ రామభోట్ల, మరియు యుతిక నల్లారి లు ఈ కార్యక్రమానికి  వ్యాఖ్యాతలు గా వ్యవహారించారు. తాకా అద్యక్షులు శ్రీ చారి సామంతపూడి గారు సంక్రాంతి  మరియు  తెలుగు సంస్కృతి  గురించి  సభికులను ఉద్దేశించి ప్రసంగించారు మరియు ఈ సంవత్సరపు దాతలను సభకు పరిచయం చేసారు. కెనడా లోని మనబడి తెలుగు చిన్నారులు మరియు యువతీ యువకులతో ప్రదర్శించబడిన పద్య నాటిక సతీ సావిత్రి, కాల యంత్రము, మరియు ఇతర భరత నాట్య నృత్య ప్రదర్శనలు మరియు ఎన్నో ఇతర కార్యక్రమాలు దాదాపు ఐదు గంటలు సేపు ప్రేక్షకులను ఉర్రూతలుగించాయి.

2017-taca-sankranthi-celebrations-in-canada-1 2017-taca-sankranthi-celebrations-in-canada-2 2017-taca-sankranthi-celebrations-in-canada-3 2017-taca-sankranthi-celebrations-in-canada-4 2017-taca-sankranthi-celebrations-in-canada-5 2017-taca-sankranthi-celebrations-in-canada-6 2017-taca-sankranthi-celebrations-in-canada-7 2017-taca-sankranthi-celebrations-in-canada-8 2017-taca-sankranthi-celebrations-in-canada-9 2017-taca-sankranthi-celebrations-in-canada-10

sank_13 2017-taca-sankranthi-celebrations-in-canada-11

తాకా వ్యవస్థాపక సభ్యులు శ్రీ గంగాధర్ సుఖవాసి ఆహ్వానించగా, తాకా అధ్యక్షులు మరియు కార్యవర్గం టొరంటో లోని, ప్రముఖ వేద పండితుడు మరియు ఎన్నో వందల మందికి ఉచితముగా వేద విద్య ను నేర్పిస్తున్న పండిట్ శ్రీ రమేష్ నటరాజన్ మరియు వారి సతీమణి శ్రీమతి  గాయత్రి  ఐయ్యర్ గార్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో వారి శిష్యులు శ్రీ వెన్నమనేని గంగాధర్, శ్రీమతి మీనా మూల్పూరి, శ్రీమతి వినోద, శ్రీమతి జ్యోతి, శ్రీమతి శశికళ ,శ్రీమతి భారతి, శ్రీమతి శాంతి,శ్రీమతి ఇందిర, మరియు ఇతరులు పాల్గొన్నారు.

 

 

ఎంతో అద్భుతంగా చేపట్టి మరియు విజయవంతం చేసిన ఫుడ్ కమిటీ శ్రీమతి కల్పన మోటూరి, ముగ్గుల పోటీల ఇంచార్జి ట్రస్టీ సభ్యులు శ్రీమతి మీనా ముల్పూరిని, సాంస్కృతిక కమిటి దీప సాయిరాం మరియు శ్రీ అరుణ్ కుమార్ ను, క్యాలెండర్ కమిటీ శ్రీ  గంగాధర్ సుఖవాసి మరియు ఉపాధ్యక్షులు శ్రీ బాచిన శ్రీనివాసు ను, తాకా కార్యదర్శి మరియు రిజిస్ట్రేషన్ కమిటీ శ్రీ లోకేష్ చిలకూరులను, స్టేజి కమిటీ కుమారి కీర్తి సుఖవాసి లను, తాకా అద్యక్షులుఅభినందించారు. ఈ కార్యక్రమంలో ఇతర ట్రస్టీ సభ్యులు శ్రీబాషా షేక్, శ్రీ వీరాంజనేయులు కోట ను, ఇతర వ్యవస్థాపక సభ్యులు శ్రీ శ్రీనాథ్ కుందూరు, శ్రీ మునాఫ్ అబ్దుల్, మరియు శ్రీ రామచంద్రరావు దుగ్గిన గార్లు పాల్గొని కార్యవర్గానికి ఎంతో సహకరించారు. తాకా కమిటీలు ఈ సంక్రాంతి సంబరాలను  ఎంతో శ్రమకోర్చి కెనడా లోని  తెలుగు వారి కోసం  ఏర్పాటు చేసారు. చివరిగా అందరికి  ధన్యవాదాలు చెపుతూ జనగణమన  జాతీయ గీతంతో  కార్యక్రమాలు  ముగించారు

తెలంగాణ కెనడా సంఘం Telangana Canada Association (TCA) అద్వ్యర్యంలో  తేది 14 జనవరి  2017 శనివారం రోజున మిస్సిస్సౌగ నగరంలోని గ్లెన్ ఫారెస్టు సెకండరీ   సెకండరీ పాఠశాల ఆడిటోరియంలో  తెలంగాణ కెనడా తీన్మార్ సంక్రాంతి సాంస్కృతిక   ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు.

ఈ సంబురాల్లో  దాదాపు 400 పైగా కెనడా తెలంగాణ వాసులు పాల్గొని విజయవంతం చేసారు. మొదటగా తెలంగాణ అమరవీరులకు శ్రద్దాంజలి ఘటించిన తర్వాత ఉత్సవాలను ప్రారంభించారు.

 

ఈ వేడుకలో ఎన్నోవివిద సాంస్క్రుతిక కార్యక్రమాలతో దాదాపు 4 గంటలపాటు సభికులను అలరించాయి. సంక్రాంతి పండుగ విషిష్టతను తెలిపే రూపకం  ప్రద ర్శించిన తీరు సభికులందరిని విపరీతంగా ఆకర్షించాయి.

telangana-2017-teenmar-sankranthi-celebrations-1 telangana-2017-teenmar-sankranthi-celebrations-2 telangana-2017-teenmar-sankranthi-celebrations-3 telangana-2017-teenmar-sankranthi-celebrations-4

పిల్లలకు భొగిపల్లు, బొమ్మలకొలువు మరియు మహిళలకు పసుపుకుంకుమ పంచారు.  ఈ కార్యక్రమాలన్నీ స్థానిక తెలంగాణ వారు  ప్రదర్శించటం విశేషం. సభికులందరికి  తెలంగాణ కెనడా అసోసియేషన్  రుచికరమైన శాఖాహార వంటకాలతో భోజనాలు ఏర్పాటు చేశారు

ఈ సంబురాలను తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ కోటెశ్వరరావు చిత్తలూరి గారి ఆధ్వర్యంలో జరుగగా, ట్తస్టీ అధ్యక్షులు  శ్రీ ప్రభాకర్ కంబాలపల్లి, ఉపాధ్యక్షులు శ్రీ రాజేశ్వర్ ఈద , సెక్రటరీ శ్రీమతి రాధిక బెజ్జంకి , కల్చరల్  సెక్రటరీ శ్రీ విజయ కుమార్ తిరుమలాపురం, ట్రెజరర్ శ్రీ సంతోష్ గజవాడ ,  డైరక్టర్లు శ్రీ శ్రీనివాస్ మన్నెం, శ్రీ మురళి కాందివనం, శ్రీ దామొదర్ రెడ్డి మాది, శ్రీ మల్లిఖార్జున్ మదపు, శ్రీమతి భారతి కైరోజు మరియు  ట్రుస్టీలు సయ్యద్ అతీక్  పాషా, శ్రీ సమ్మయ్య వాసం లతో పాటు

వ్యవస్తాపక సభ్యలు శ్రీ రమేశ్ మునుకుంట్ల, శ్రీ చంద్ర స్వర్గం, శ్రీ  కుందూరి శ్రీనాధ్, శ్రీ హరి రావుల మరియు శ్రీ వేణు రోకండ్ల పాల్గొన్నారు

ఈ సభలో TCA 2017 టొరొంటో టైములో చక్కటి తెలుగు క్యాలెండరును ఆవిష్కరించారు

 

ఆఖరున ఉపాధ్యక్షులు శ్రీ రాజేశ్వర్ ఈద  వందన సమర్పణతో కార్యక్రమాలు ముగిసాయి.

SOCIAL

3,873FansLike
8FollowersFollow

SPECIALS

SHORT FILMS