ఇర్వింగ్, టెక్సాస్: పీపుల్స్ మీడియా సమన్వయంతో డల్లాస్ చాప్టర్ ఆఫ్ నాట్స్ నిర్వహించిన అనూప్ రూబెన్స్ సంగీత కోలాహలం కేక పుట్టించింది. ఇక ఈటీవీ జబర్దస్త్ టీమ్ పండించిన నవ్వులు పువ్వులు నవ్వుల లోకంలోకి తీసుకెళ్లాయి. మాట్లాడే బొమ్మ, స్కిట్స్,  మరెన్నో హాస్యభరితమైన ప్రదర్శనలు వచ్చిన వారికి నవ్వుల విందును అందించాయి. ఈ కార్యక్రమానికి సుమారు 1200 మందికి పైగా హాజరయ్యారు. డల్లాస్ లోని ఇర్విన్ హై స్కూల్ ఆడిటోరియంలో జులై 18న నిర్వహించిన ఈ కార్యక్రమాలు విజయవంతమయ్యాయి.

 

ఇక అనూప్ రూబెన్స్ సంగీత హోరుతో అప్పటి వరకు ఉన్న వాతావరణం మారిపోయింది. అనూప్ రూబెన్స్ బీట్స్ ప్రతి ఒక్కర్ని ఉర్రూతలూగించింది. బీట్ పడడం ఆలస్యం చూడ్డానికి వచ్చిన వారు కాస్తా స్టెప్పులేయడం మొదలుపెట్టారు. టెంపర్, గోపాల గోపాల, గుండె జారి గల్లంతయ్యిందే వంటి సూపర్ హిట్ పాటలు వచ్చినప్పుడు కుర్చీని అంటిపెట్టుకుని ఉన్న వారంతా స్టేజ్ మీద కు వెళ్లి మరీ ఆర్టిస్టులతో డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు. కొందరైతే సింగర్స్ గా మారిపోయారు పెదం కదిపారు కూడా. ముఖ్యంగా లైవ్ ఆర్కెస్ట్రా కావడం, సినీరంగంలోని ప్రముఖ సింగర్స్ పాడడంతో కార్యక్రమం లైవ్లీగా సాగింది. పైగా ఇలాంటి ఒక ప్రోగ్రామ్ డల్లాస్ లో నిర్వహించడం ఇదే మొదటిసారి. ఈ సంగీత విభావరిలో మరో హైలెట్ ఏంటంటే 20 మంది పిల్లలు కలిసి మనం సినిమాలోని కనిపెంచిన అనే పాటను పాడడం. స్వయంగా అనూప్ రూబెన్స్ చిన్నారులకు శిక్షణ ఇచ్చి మరీ పాడించడం జరిగింది.

Anup Rubens Musical Concert (1) Anup Rubens Musical Concert (2) Anup Rubens Musical Concert (3)

సుమారు నాలుగు గంటల పాటు మ్యూజికల్ షో జరిగింది. ప్రేక్షకులు పాట అయిపోగానే మరో పాట అంటూ కోరడంతో మొత్తంమీద 30కి పైగా పాటలు పాడారు. మొత్తానికి స్థానిక వ్యాపారవేత్తలు, ఉత్సాహవంతులు, నాట్స్ మద్దతుదారులతో ఈ ఈవెంట్ ఘనంగా ముగిసింది. యువ మీడియా, దేశీ ప్లాజా, టీవీ9, టీవీ5 మీడియా సహకారాన్ని అందించాయి. ఇక ఈ కార్యక్రమం కోసం హైదరాబాద్ హౌస్ వెరైటీ రుచులను  తయారుచేసింది.

 

త్వరలోనే నాట్స్, పీపుల్ మీడియా కలిసి పాడుతా తీయగా సెమీ ఫైనల్స్ నిర్వహించబోతున్నాయి. ఆగస్ట్ 8,9న డల్లాస్ లోని మకార్తుర్ హై స్కూల్ లో ఫైనల్స్ జరగబోతున్నాయి.