బ్రిటిష్ పార్లమెంట్ లో తెలంగాణా రాష్ట్ర రెండవ ఆవిర్భావ దినోత్సవ  వేడుకలు 
 
    - ముఖ్య అతిధులుగా  బ్రిటిష్ ఎంపీలు, భారత హై కమీషన్ ప్రతినిధి
    - మొట్ట మొదటి సారి బ్రిటిష్ పార్లిమెంట్ లో తెలంగాణా ఆవిర్భావ వేడుకలు
 
తెలంగాణా ఎన్నారై ఫోరం(TeNF)  ఆద్వర్యం లో లండన్ లోని "బ్రిటిష్ పార్లమెంట్" లో తెలంగాణా రాష్ట్ర 2 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మరియు తెలంగాణా ఎన్నారై ఫోరం 4 వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా స్థానిక బ్రిటన్ ఎంపీ లు వీరేంద్ర శర్మ గారు, సీమా మల్హోత్రా, రూప హక్ మరియు ఇండియన్ హై కమీషన్ ప్రతినిది ఆశీష్ శర్మ హాజరైన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమానికి  యు.కే నలుమూలల నుండి ప్రవాస తెలంగాణా బిడ్డలు మరియు ఇతర ప్రవాస సంఘాల ప్రతినిధులు హాజరైన వారిలో ఉన్నారు.
ఇవెంట్స్ ఇన్‌ఛార్జ్ నగేష్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన కార్యక్రమం లో ముందుగా తెలంగాణా అమరవీరులకి మరియు ప్రొ. జయశంకర్ గారికి నివాల్లర్పించి  రెండు  నిమిషాలు మౌనం పాటించడం జరిగింది.
తరువాత తెలంగాణా రాష్ట్రీయ గీతం "జయ జయ హే తెలంగాణా" తో కార్యక్రమం ముందుకు సాగింది. ఎన్నో త్యాగాల తో సాదించుకున్న తెలంగాణా రాష్ట్రం, గత రెండు సంవత్సరాలుగా తెలంగాణా ప్రబుత్వం  సాధించిన విజాయాల తో  కూడిన వీడియో ని ప్రదర్శించడం జరిగింది, ముఖ్యంగా ఇటీవల తెలంగాణా ఐటి మంత్రి కే. టీ. ఆర్ గారు హైద్రాబాద్ లో ఆపిల్ సంస్థ డెవెలప్‌మెంట్ సెంటర్ ఆవిర్భావం సందర్భం గా చేసిన ప్రసంగం హాజరైన అతిదులంత ప్రశంసించడం విశేషం.
  2nd Telangana formation day in British parliament (1) 2nd Telangana formation day in British parliament (1) 2nd Telangana formation day in British parliament (2) 2nd Telangana formation day in British parliament (2) 2nd Telangana formation day in British parliament (3) 2nd Telangana formation day in British parliament (4) 2nd Telangana formation day in British parliament (5)
బ్రిటన్ ఎంపీ వీరేంద్ర శర్మ మాట్లాడుతూ .... తెలంగాణా సంస్కృతి ని ప్రపంచానికి చాటి  చెప్పటమే కాకుండా, తెలంగాణా రాష్ట్రాన్ని ప్రపంచ వేదికల్లో పరిచయం చేయడానికి తెలంగాణా ఎన్నారై ఫోరం చేస్తున్న కృషి చాలా గొప్ప గా ఉందని, ఖండాతారల్లో ఉన్నప్పటికీ ప్రవాస  బారతీయులుగా మనమంతా కలిసి మన సంస్కృతి - సంప్రదాయాలను కాపాడుకోవాలని తెలిపారు. బ్రిటన్ ఎంపీ సీమా మల్హోత్రా మాట్లాడుతూ ..తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం లో పాల్గొనడం సంతోషం గా ఉందని, కొత్త రాష్ట్రం అయినప్పటికీ బారత దేశం లో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని తెలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణా ఎన్నారై ఫోరం బాద్యత గల తెలంగాణా సంస్థ గా యు.కే లో చేస్తున్న ప్రతి కార్యక్రమం గొప్ప గా  నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలిపారు.
ఎంపీ రూప హక్ మాట్లాడుతూ, ఒక ప్రవాస తెలంగాణా సంస్థ గా తెలంగాణా ఎన్నారై ఫోరం కేవలం సాంస్కృతిక కార్యక్రమాలకే  పరిమితం కాకుండా, రాష్ట్ర అబివృద్ది లో తమ వంతు బాద్యత నిర్వహించడం, ఎన్నో సేవా  కార్యక్రమాలు చేయడం చాలా స్పూర్తినిస్తుందన్నారు . బారత హై కమీషన్ ప్రతినిధి ఆశీష్ పటేల్ మాట్లాడుతూ ... రాష్ట్ర ఆవిర్భావం తరువాత యు. కే లో  ఎన్నో ప్రవాస తెలంగాణా సంస్థల నుండి నేడు మాకు వివిధ కార్యక్రమాల ఆహ్వానాలు అందుతున్నాయని, కానీ ఉద్యమ సమయం లో తెలంగాణా రాష్ట్రాన్ని కోరుతూ తెలంగాణా ఎన్నారై ఫోరం ఎన్నో నిరసన కార్యక్రమాలు చేసి మాకిచ్చిన పిటీషన్లు ఎక్కువ అని, రాష్ట్ర ఆవిర్భావం లో వీరి క్రియా శీలక పాత్ర  గొప్పదని ప్రశంసించారు. అబివృద్ది  లో బారత దేశం లో తెలంగాణా రాష్ట్రం ముందు వరసలో ఉందని తెలిపారు.
తెలంగాణా ఎన్నారై ఫోరం వ్యవస్థాపక సభ్యులు మరియు ఎన్నారై టి. ఆర్. యస్ అద్యక్షులు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ...ముందుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణా బిడ్డలకు, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాంక్షలు తెలిపి.
ఉద్యమ సమయం లో లండన్ వీదుల్లో "జై తెలంగాణా  " అంటూ ఎన్నో పోరాటాలు చేసిన మేము, ఈరోజు చారిత్రాత్మక  బ్రిటిష్ పార్లమెంట్ లో తెలంగాణా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం ఎంతో గర్వంగా ఉందని, ఎన్నో త్యాగాలతో సాదించిన  రాష్ట్రానికి ఒక నాటి ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి అయి, రాష్ట్రాన్ని బంగారు తెలంగాణా వైపు తీసుకెళ్తున్న తీరు గొప్పగా ఉందని కే. సీ. ఆర్ గారిని ప్రశంసించారు. రెండు సంవత్సరాల్లో వివిద శాఖల్లో జరిగిన అభివృద్దిని వీడియో రూపం  లో  ప్రదర్శించి సభకు వివరించారు.
బాద్యత గల సంస్థ గా తెలంగాణా ఎన్నారై ఫోరం కేవలం సంబరాలకు మాత్రమే పరిమితం కాకుండా, నాటి ఉద్యం నుండి నేటి పునర్నిర్మాణం వరకు చేస్తున్న ప్రతి కార్యక్రమానికి సహకరించి బాగస్వాములైన సభ్యులకు, ఇతర మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణా ఎన్నారై ఫోరం అద్యక్షుడు సిక్క చంద్రశేఖర్ మాట్లాడుతూ.... ఈరోజు తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం తో పాటు సంస్థ 4 వ వార్షికోత్సవం బ్రిటిష్ పార్లమెంట్ లో  జరుపుకోవడం గర్వంగా ఉందన్నారు.
ముందుగా 4 సంవత్సరాల్లో సంస్థ చేసిన కార్యక్రమాల వీడియో ని సభకు ప్రదర్శించి వివరించారు.
ప్రపంచ వ్యాప్తంగా ఎవరు కూడా తెలంగాణా ఎన్నారై ఫోరం లా క్రియాశీలకంగా రోడ్డు పై వచ్చి తెలంగాణా రాష్ట్ర సాధన కోసం ఉద్యమాలు చెయ్యలేదని, ఆ ఘనత గౌరవం కేవలం యు. కే లో నివసించే ప్రవాస తెలంగాణా బిడ్డలకే దక్కుతుందని తెలిపారు.
తెలంగాణా పునర్నిర్మాణం లో బాగంగా ఇదే పార్లమెంట్ లో తెలంగాణా ఎంపీ ల తో, ఇతర ప్రభుత్వ ప్రతినిధుల తో " బిజినెస్ మీట్" లు నిర్వహించామని, క్షేత్ర స్థాయిలో తెలంగాణా ప్రజల సంక్షేమం కోసం  సేవా కార్యక్రమాలు చేశామని తెలిపారు. చివరిగా, హాజరైన అతిదులు మరియు సభ్యుల తో రెండు సంవత్సరాల  తెలంగాణా రాష్ట్ర  స్వయం పాలన పై చర్చ నిర్వహించారు తరువాత  పార్లమెంట్ ఆవరణ లో సభ్యులంతా కలిసి కేక్ కట్ చేసిసంబరాలు జరుపుకున్నారు.
తెలంగాణా ఎన్నారై ఫోరం వ్యవస్థాపక సభ్యులు మరియు ఎన్నారై టి. ఆర్. యస్ అద్యక్షులు అనిల్ కూర్మాచలం, అద్యక్షులు సిక్క చంద్రశేఖర్ గౌడ్, ఉపాద్యక్షులు పవిత్ర రెడ్డి కంది, ఇవెంట్స్ ఇన్‌ఛార్జ్ నగేష్ రెడ్డి కాసర్ల, హెడ్  ఆఫ్  అడ్వైసరీ బోర్డ్ ఉదయ్ నాగరాజు, ప్రదానకార్యదర్శి ప్రవీణ్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి రత్నాకర్ కడు దుల, కల్చరల్ సెక్రటరీ శ్వేతా రెడ్డి , సబ్యులు గొలి తిరుపతి,  నవీన్ రెడ్డి, ప్రమోద్ అంతటి, వెంకట్ రెడ్డి, నరేశ్ కుమార్, స్వాతి, రేకుల విక్రమ్ రెడ్డి, సత్య , రాజేష్ వర్మ,  శ్రీకాంత్ జెల్ల, స్వామి ఆశ, సురేష్,శ్రీనివాస్ ,వర్ల్డ్ తమిళ్ సంఘం అధ్యక్షుడు జేకబ్ రవిబాలన్,   తెలంగాణా ఐ టి జాక్ ఛైర్మన్ వెంకట్ రెడ్డి, జెట్ యు.కే ప్రెసిడెంట్ విష్ణు వర్ధన్ రెడ్డి మరియు  సీనియర్ తెలుగు  టి. వి  నటి ప్రీతి నిగమ్( కుటుంబ సభ్యుల తో) ,  తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు.